1, ఫిబ్రవరి 2017, బుధవారం

సమస్య - 2270 (సరములు జీవులకుఁ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సరములు జీవులకుఁ గడు నసహ్యము లయ్యెన్"
లేదా...
"సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్"

49 కామెంట్‌లు:

  1. సరసమ్మగు ధరలోనను
    "పరిమళ" యను భవనము గొని పండుగ జేయన్
    సరిహద్దునగల కలుషిత
    సరములు జీవులకుఁ గడు నసహ్యము లయ్యెన్

    సరము = కొలను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శ్రీ శంకరయ్య గారికి శుభోదయం. చాలా సంతోషం.

      తొలగించండి
  2. కురవగ వానలు జోరుగ
    పురమున భవనములు మునిగె పూర్తిగ జలమున్
    గరళమగు మురుగు కలిసిన
    సరములు జీవులకుఁ గడు నసహ్యము లయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పుట్టంరాజు సునీల్ బాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. తరుణమ్మది గ్రీష్మంబున
    తరువులు తలవాల్చగ తమ తావులయందే
    కరములు చాచిన తపనుని
    సరములు జీవులకు గడు నసహ్యంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  4. సరములు జీవులకు గడు నసహ్యములయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం సీతాదేవి గారూ,
      గ్రీష్మాదిత్యుని గమనాలను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  5. వరమై వచ్చె ప్రకృతి సుఖ
    కరమై, భువినిన్ జిలేబి కాలుష్యంబు
    న్నరులొన రింపగ మన పరి
    సరములు జీవులకుఁ గడు నసహ్యము లయ్యెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      కలుషిత పరిసరాలను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. కరుణించిన దైవమనగ
    వరమీయగ జగతి కిన్ని వసతుల నిచ్చెన్
    నరజాతికి కనుగానక పరి
    సరములు జీవులకుఁ గడు నసహ్యము లయ్యెన్

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    వరసంస్కృతి చెలువారగ
    ధర జెల్లును విహిత వాక్కు దానను శాంతుల్
    విరియును, కనకము, ముత్యపు
    సరములు జీవులకు గడు నసహ్యములయ్యెన్
    (వాగ్భూషణమ్ భూషణమ్)
    కరములు పాదయుగ్మములకౌ శ్రమ,వాడుక తగ్గె యంత్రపున్
    ఒరవడి మిక్కుటంబగుట నోపిక జచ్చుట జాడ్య పుంజముల్
    బరువడి నావరించుటను భైరవులయ్యిరి యోగవిద్య స
    త్సరములు సర్వ జీవులకసహ్యములయ్యెను దుర్నిరీక్షతన్!
    (సరములు॥ముక్కు గాలులు ,ప్రాణాయామాదులు;భైరవులు॥భయయానక రసము గలవారు,భయకంపితులు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. సరసత వచ్చెనల్లదెగొ చక్కనిదౌ రధససప్తమీ శుభా
    భరణమునై దివాకరుని వైభవ దీధితి చూప చెల్వుగన్
    ధరణిని వేడి హెచ్చగుట తథ్యము వేగమె రాగలట్టి వా
    సరములు సర్వజీవులకసహ్యములయ్యెను దుర్నిరీక్ష్యతన్

    (వాసరము=దినము)

    రిప్లయితొలగించండి
  9. ధరనిట మనదరి నమరుచు
    వరమగుచును వరలు సరసి వాగులు వంకల్
    వరుసగ కలుషితమవ పరి
    సరములు జీవులకు గడు నసహ్యము
    లయ్యెన్!

    రిప్లయితొలగించండి
  10. ………………………………………………………

    గు రు మూ ర్తి ఆ చా రి

    ''''''''''''''''''''''''''''''''''''''''''

    సరములు , శుభ్ర౦ బౌ పరి

    సరములు , స్వఛ్ఛపవనోపసరములు ,

    . . . వలయున్

    నరులకు | కలుషపదార్థ వి

    సరములు > జీవులకు కడు నసహ్యము

    . . . . లయ్యెన్


    { ఉపసరము = నిర౦తర గమనము

    విసరము = వ్యాపి౦చుట

    స్వచ్ఛపవన + ఉపసరము = స్వచ్ఛమగు

    గాలి యొక్క నిర౦తర గమనము

    కలుషపదార్థవిసరము = కలుషితపదార్థములు

    వ్యాప్తిజె౦దుట }

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. గురుభాషితములు నిజపితృ
      సుర మోక్షద కార్య తతుల సువ్యక్తములుం
      బరమ శమదంపు టధివా
      సరములు జీవులకుఁ గడు నసహ్యము లయ్యెన్!

      [అధివాసరము = శ్రాద్ధ దినమునకు పూర్వ దివసమునఁ జేయు నుపవాసము)


      పరిజన బంధు మిత్రగణ వందిత నేతల భాషణమ్ములన్
      తరతమ భేద రోదనల తర్జన భర్జన రాజకీయు లా
      గురురవ దుర్భరమ్ములు నకుంఠిత కాలపరంప రానువ
      త్సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్!

      [అనువత్సరము = అయిదేండ్ల వత్సర చక్రములో నాల్గవ సంవత్సరము]

      “యురుములఁ బోలు మ్రోతల ననూహ్యపుఁ గాల పరంప రానువ”
      అను యీమూడవ పాదమును శకట రేఫ శంకతో సవరించితిని.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  12. ఇరవగునుగా దె దలపగ
    సరములు జీవులకు, గడు నసహ్యము లయ్యెన్
    మురికిని గూడిన నవియగు
    సరములలో దానమాడ జబ్బుల వలనన్

    రిప్లయితొలగించండి
  13. నిరతము వాహనములపై
    కరమగు మైకమ్ములోన కర్కశమతితో
    మరణములను గొనువారి ప్ర
    సరములు జీవులకు గడునసహ్యములయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. శ్రీ పంచమి సందర్భంగా శ్రీ శారదాంబకు ప్రపత్తి!

    కంజదళాయత నేత్రీ
    కంజముఖవిహారిణి వర కామిత దాత్రీ
    మంజుల భాషిణి మానిని
    యంజలిదె గొనుమ యవగుణ హారిణి యమ్మా!

    రిప్లయితొలగించండి
  15. విరివిగ నవినీతిని కల
    వరముగ నిరుపేదరికము వ్యాధుల గాంచన్
    వరముగ నాయుశ్శత వ
    త్సరములు జీవులకు గడు నసహ్యము లయ్యెన్

    రిప్లయితొలగించండి
  16. ఇరవగుగాదెయయ్యవియధేఛ్ఛగవేమరుసంచరించగన్
    సరములుసర్వజీవులకసహ్యములయ్యెనుదుర్నీక్ష్యతన్
    మురికినిగూడినట్టివిసమూలముశుభ్రముజేయగోరుచో
    నరయదమంతదామికసహాయముజేసికొనంగనొప్పగున్

    రిప్లయితొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరుషమ్మునైన వాతా
    వరణమ్మొనగూర్చు జుండు వాయువులన్నిన్
    పురణించగ నుండెడి పరి
    సరములు జీవులకు గడు నసహ్యములయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "గూర్చుచుండు వాయువులెల్లన్" అనండి.

      తొలగించండి
  18. మురుగు జలముగల కాల్వలు
    మెరుగుపరచ బడక కలుష మీరోజులలో
    వురమున నిలువగ పలు పరి
    సరములు జీవులకుఁ గడు నసహ్యము లయ్యెన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    తండ్రి మాటకు యెదురాడు ధైర్య ముడుగ
    తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి
    తండ్రి యాపయి వరమీయ తనయుడైన
    పరశు రాముడు తల్లినే మరలగోరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  19. నరకము పొందినారు నర నాధులు చేసిన నోట్ల రద్దుచే
    ధర నిరుపేద లందరును దాచిన సొమ్మును బ్యాంకులోపలన్
    తరచుగ పంక్తిలో నిలచి తథ్యము పొందగ వచ్చె నేడు , వే
    సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్

    రిప్లయితొలగించండి
  20. భరియింపరానికంపుయు,
    పరివేధించు మశకములు ప్రబలిన వాతా
    వరణము, ప్రదూషితపు పరి
    సరములు, జీవులకు కడు నసహ్యము లయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కంపును' అనండి.

      తొలగించండి
  21. .వరమగు పరిసర శుబ్రత
    మరణము నేదరికి జేర్చు మరచిన?రోగాల్
    స్థిరపడు|వలదన మన యవ
    సరములు జీవులకుగడునసహ్యము లయ్యెన్|
    2.పరిసరశుబ్రతల్ బెరుగుబంధము నందున సూక్ష్మజీవికిన్
    మరణము సంభవించు| ననుమానము చేతను సంతు సౌఖ్యతల్
    విరివిగ తగ్గిపోవునని వీధులు చెత్తయుకుళ్ళు లేని కీ
    సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్|

    రిప్లయితొలగించండి
  22. తరువుల నరుకుచు నటనే
    పరిశ్రమల బెట్టిరాయె ప్రగతుల పేరన్
    పెరిగెను కాలుష్యము పరి
    సరములు జీవులకు గడు నసహ్యము లయ్యెన్


    పురములు పట్టణమ్మనక భూరి పరిశ్రమలెన్నియో భువిన్
    పెరుగగ వ్యర్థముల్ వదలె పెచ్చుగ కల్మష మయ్యెనే జలా
    వరణము మానవా వినుడు ప్రాణము నిల్పెడు జీవధారయౌ
    సరములు జీవులకసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్

    రిప్లయితొలగించండి
  23. సరదాకని మొదలిడెడున్
    సిరి మ్రింగెడు దురలవాట్లఁ జిక్కిన వారల్
    మరగిన బలహీనఁపుటవ
    సరములు జీవులకుఁ గడు నసహ్యములయ్యెన్

    రిప్లయితొలగించండి
  24. సరసపు మాటలాడకను చప్పుడు చేయక తిన్చునెప్పుడున్
    బురదల నీరమొల్లుచును ముచ్చటి కాలుని వాహనమ్ముగా
    జరుగక దారినీయకను చంపుచు కారుల హైద్రబాదు కా
    సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్

    రిప్లయితొలగించండి