31, జనవరి 2017, మంగళవారం

సమస్య - 2269 (తల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్ ధర్మాత్ముఁ డెంతేనియున్"
లేదా...
"తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి"

50 కామెంట్‌లు:

 1. చిన్ని కృష్ణునిమ్మా యని చేర దీసి
  చక్కనైన వేషమ్మున చంక నెత్తి
  యమ్మ వోలె స్తనమిడినయా కపటపు
  తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి

  రిప్లయితొలగించండి
 2. తండ్రి యాగ్రహ జ్వాలన తప్పులెంచ
  కింక పరశురాముండట్లు కృతమతియయె
  తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి
  తల్లి బ్రాణముల్ కోరంగ దండ్రిమెచ్చె!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పుట్టంరాజు సునీల్ బాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. తండ్రి మాటను నిల్పుట ధర్మమనుచు
  లక్ష్మణుని తోడ యాగంపు రక్ష కొరకు
  కానలన్ మౌని దరిఁ దాటకన్, సుబాహు
  తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 4. తొల్లిన్తండ్రికి వందనమ్మిడెను మేల్దోదుమ్మిదారిన్గొనెన్,
  తల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్, ధర్మాత్ముఁ డెంతేనియు
  న్నుల్లంబంతయు పొంగ తల్లి యసువుల్నూత్నంబు గావింపగ
  న్నల్లంతన్గురువున్వరమ్ము బడసెన్నా భార్గవుండే, భళా !

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారు: అప్రస్తుత ప్రసంగ మనుకోండి...ఇప్పటికి మీరు దాదాపు ఎన్నివేల కందములు వ్రాసి ఉంటారు?

   తొలగించండి


  2. పానీయంబుల్ద్రావుచు
   వాణిన్మధురిమలు దేల వరసగ లెక్క
   ల్గానటి పద్యములన్నా
   ర్యా నర్తింప యొనరిచితి యత్నంబంతే :)

   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   బుడిబుడి నడకల నడుగిడి
   యెడ మింతయు లేక క్రమమునే తప్పక నె
   ప్పుడు పద్యమ్ముల వ్రాయుచు
   కడు మోదము నిడు వలఁతివి కాదె జిలేబీ!

   తొలగించండి
  4. ఓర్పుతో నేర్పుతో
   శిలలను శిల్పాలుగా చెక్కే శంకరార్యు దయతో జిలేబి గారురచనలో కాజు బర్ఫిగా తయారవుతున్నారు.

   తొలగించండి

  5. శాస్త్రిగారికి శంకరయ్య గారికి రెడ్డి గారికి

   నెనరస్య నెనరః జిలేబీ నామ్న్యా దురద గొంటాకః

   జిలేబి

   తొలగించండి
 5. తండ్రి యాజ్ఞను బాటించె భార్గ వుండు
  తల్లిని జంపి, యశ మందె ధర్మ మూర్తి
  మరల బ్రదికించి యామెను మహిత కెక్కె
  దండ్రి యాజ్ఞను మీరని త నయు డుగను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. సుబ్బారావు గారూ - మొదటిపాదం యతి గమనించండి.

   తొలగించండి
  3. రెడ్డి గారూ,
   ధన్యవాదాలు. నేను గమనించలేదు.
   "పాలనము సేసె పితృనాజ్ఞ భార్గవుండు" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 6. ముష్కరులతోడ నెయ్యమున్ పొసగఁజేసి
  దేశమాత కుపుత్రుడై తిరిగె నొకడు
  తల్లినిం చంపి---యశమందె ధర్మమూర్తి
  దేశమాతకు నసువులఁదీసియిచ్చి.

  రిప్లయితొలగించండి
 7. తండ్రి యానతి తలదాల్చి తనయుడైన
  జామదగ్ని వధించె నాశంక మాని
  మాత రేణుకా దేవిని మహి నొకండె
  తల్లినిన్ జంపి,యశ మందె ధర్మమూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. 'శంకరాభరణం' వాట్సప్ సమూహం పూరణలు.....
  *****
  అంబటి భానుప్రకాశ్ గారి పూరణ.....

  తండ్రి మాటను వినినంత తనయు డప్పు
  డాజ్ఞ పాలించి, పరశువు నాపకుండ,
  పరశురాముడు ధర్మసంపన్ను డగుచు
  "తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి"
  *****
  మంగళంపల్లి పాండురంగ విఠల్ గారి పూరణ....

  తండ్రి జమదగ్ని యాజ్ఞను తలనుదాల్చి
  పితృవాక్యానురక్తుగా పేరునొంది
  పరశురాముండు మారేమి పలుకకుండ
  తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి!
  *****
  బండకాడి అంజయగౌడ్ గారి పూరణ....

  గాధి నందను కోర్కెపై కదలి వచ్చి
  రాక్షసుల సంహరించగ రాముడపుడు
  కయ్యమాడగ వచ్చిన ఘన సుబాహు
  తల్లినింజంపి యశమందె ధర్మమూర్తి.
  *****
  మాడుగుల మురళీధర శర్మ గారి పూరణ....

  తల్లిం జంపిన పర్శురాము కథలున్ దాష్టిక్యమా చెప్పుమా?
  యుల్లంఘించని తండ్రి వాక్కులు సదా యుర్వీజను ల్మెచ్చనా?
  తల్లిన్ దండనచేత తాను నపుడే ధన్యున్ చిరంజీవిగా
  తల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్ ధర్మాత్ముఁ డెంతేనియున్.

  యింటి పరువును తీసిన యింతి యైన
  తల్లి దుశ్చర్య లన్గాంచి ధర్మ నిరతి
  ఆత్మ జుండయ్యు నపనింద బాప నెంచి
  తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి
  *****
  గంగుల ధర్మరాజు గారి పూరణ....

  తండ్రి మాటను పాలిoచి తరలి వెళ్లె
  గాధి సుతువెoట రాముoడు కాననమ్ము
  యాగరక్షణ చేయుచు నా సుబాహు
  తల్లినిoజoపి యశమoదె ధర్మమూర్తి.
  *****
  వడ్త్య నారాయణ గారి పూరణ....

  పరశురాముని సుసుతుడు పావనుండు
  తండ్రి యాఙ్ఞనుపాటించి; తప్పు యనక
  తాను ధర్మముఁయించుక తప్ప కయును
  తల్లి నింజంపి యశమందె ధర్మమూర్తి.
  *****
  MVS శాస్త్రి గారి పూరణ....

  పరశురాముడు సమ్మతి పాలనమును
  చేసెతండ్రియానతి బడసివరమునను
  మాతను సజీవురాలును మరియుజేసి
  తల్లినింజంపి యశమందె ధర్మమూర్తి.
  *****
  మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ....

  తల్లిన్ జంపెను తండ్రిమాటకయి సంతప్తాత్ముడై భార్గవుం..
  డల్లన్ తా బ్రతికించెగా మరల ! యన్యాయమ్ముగా బల్కగా..
  "తల్లిన్ జంపి ప్రశస్తుడయ్యె జగతిన్ ధర్మాత్ముడెంతేనియున్ "
  కల్లల్ కావొకొ యిట్టిమాటలు! ధరన్ దైవమ్ము నా నమ్మయే !!

  రిప్లయితొలగించండి
 9. మంగళంపల్లి పాండురంగ విఠల్ గారి (వాట్సప్) పూరణ....

  తల్లిగా జన్మనిచ్చిన తరువె యరటి!
  తనరు తాంబూల మూలమై దాని ఫలము
  తల్లినింజంపి యశమందె ధర్మమూర్తి
  యనగ పేరొంది వెలిగెనా యరటిపండు!

  రిప్లయితొలగించండి
 10. వల్లంగాదన శాపమిచ్చు గద సంభావించి యీరీతి తా
  యుల్లంబందునఁ దల్లి ప్రాణములు వంశోద్ధారకుం డీయడే
  యుల్లాసాత్ముని జేయ, భార్గవుడు కార్యోత్సాహి పిత్రాజ్ఞ చే
  దల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్ ధర్మాత్ముఁ డెంతేనియున్


  యాగ రక్షణార్థమ్ము సంయమి వరుండు
  కౌశికుని యాజ్ఞ తలదాల్చి గహనమున ద
  శరథ సుతుడు తాటకి సుందవర సతీ మ
  తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "యీరీతిఁ దా। నుల్లంబందునఁ..." అని ఉండాలి కదా!

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అవునండి. పొరపాటున “యు” ని మార్చలేదు. సవరించితిని యిప్పుడు. ధన్యవాదములు.

   తొలగించండి
 11. తండ్రి మాటలనున్ దల దాలిచి తన
  తల్లినిం జంపి, యశమందె ధర్మమూర్తి
  తిరిగి యామెప్రాణమ్మును వరముగఁ గొని
  కురియ సురలు భృగుపతిపై కుసుమములను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మూడవ పాదములో అ – ద్యః లకు (సద్యోగర్భములోని) యతి మైత్రి సాధువేనా తెలుప గోర్తాను.


  హరిలీలల్ తలపంగ శక్యమ విరించ్యాదిత్య సంఘాలకున్
  ధరణీ భారము దీర్ప నెంచి హరి సంధానమ్మ యిగ్గాథయే
  యరయన్ రాధకుఁ గుంతి కర్ణు, రవి సద్యోగర్భ మీయన్ మహా
  పురుషుండే, ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   ఈ సందేహాన్ని మొన్నెప్పుడో వెలిబుచ్చారు. నేను సందిగ్ధంలో పడి కొంత పరిశోధన చేశాను. తృప్తికరమైన సమాధానం దొరకలేదు. ఈ సాయంత్రం వరకు మీకు సరియైన సమాధానం చెప్తాను.

   తొలగించండి
 13. తండ్రి మాటను నిల్పుట ధర్మమనుచు
  లక్ష్మణుని తోడ యాగంపు రక్ష కొరకు
  కానలన్ మౌని దరిఁ దాటకన్, సుబాహు
  తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. నీళ్ళన్ దెచ్చుట కాలసించె నని చండించుచున్ రేణుకన్
  వెళ్ళ౦ గొట్టెనధర్మ చారిణనుచున్ వ్రేయంగ పిత్రాజ్ఞగన్
  దల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్ ధర్మాత్ముఁ డెంతేనియున్
  మళ్ళీ తండ్రి వరమ్మొసంగనడిగెన్ మస్తమ్ము జీవింపగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "నీళ్ళన్ దెచ్చుట కాలసించె నని చండింపంగ నా రేణుకన్" అందామా? 'చారిణి+అనుచున్' అన్నపుడు యడాగమం వస్తుంది. 'మళ్ళీ' అనడం వ్యావహారికం.

   తొలగించండి
  2. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
   నీళ్ళన్ దెచ్చుట కాలసించె నని చండింపంగ నా రేణుకన్
   వెళ్ళ౦ గొట్టెనధర్మశీలి యనుచున్ వ్రేయంగ పిత్రాజ్ఞగన్
   తల్లి౦ జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్ ధర్మాత్ముఁ డెంతేనియున్
   చెల్లింతున్ మురిపెమ్మనంగ నడిగెన్ శీర్షమ్ముజీవి౦పగన్

   తొలగించండి
 15. నందగోప బాలుండు యానందఘనుడు
  గొల్లజనముల మనముల కొల్లగొట్టి
  తల్లిదండ్రుల యాశలు తల్లడిల్ల
  మామ కంసుని జీర ప్రేమలతికామ
  దల్లినింజంపి యశమొందె ధర్మమూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బాలుండు+ఆనంద..' అన్నపుడు యడాగమం రాదు, సంధి నిత్యం. "నందగోపుని బాలు డానందఘనుడు" అనండి.

   తొలగించండి
 16. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తల్లినింజంపి యశమందె ధర్మమూర్తి
  శౌరియె పరశురాముని సంస్థితమున
  తండ్రి జమదగ్ని యానతి తలను దాల్చి
  తల్లినింబొందె వరమొంది తండ్రి వలన

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. డా.పిట్టా సత్యనారాయణ
  దేశ భక్తుడు పూరు విద్వేషపరుడు
  అంభి, నాగ్రీకు వీరుని కండ నొసగె
  ప్రాణములనొడ్డి రక్షించు బ్రాపు బోవ
  మరణవత్ కృషగాత్రిగా మారె పుడమి
  తల్లినిం జంపి యశమందె ధర్మ మూర్తి!(ధర్మ మూర్తి ,వెటకారముగా)
  చెల్లంజూడ కరాళ కాటకమునన్ జీవించు రైతన్న నా
  వల్లీ లక్ష్మి యుపాసనా బలముచే వాటిల్లె నా బాతు దా
  తల్లౌ దానికి గ్రుడ్డు పిల్లయ సుమీ,దర్శించ బంగారమై
  చెల్లెన్ రోజుకు నొక్కటొక్కటి గనన్ క్షేమంపు నా పక్షినిన్
  తల్లిం జంపి ప్రసిద్ధుడయ్యె జగతిన్ ధర్మాత్ముడెంతేనియున్(ధర్మాత్ముడు,వెటకార భావంగా)
  (పూరు, పురుషోత్తముడు భా.దే.చరిత్ర అంశంగా.గ్రీకువీరుడు, అలెగ్జాండరు.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 18. .చెల్లెన్ జేసెను భార్గవున్ డిలను సచ్చీలంబు దీపింపగన్
  నుల్లాసంబున తండ్రిమాట విని నుద్రేకాన నుత్సాహియై
  కల్లోలంబును కానుపించకనె లక్ష్యంబెంచిరౌద్రమ్మునన్
  తల్లింజంపి ప్రసిద్దుడయ్యె| జగతిన్ ధర్మాత్ము డెంతేనియున్|
  2.కల్ల కపటాన పూతన తల్లిలాగ
  విషపు పాలివ్వనెంచ? వివేక మందు
  బాల కృష్ణుడుగమనించి నేలగూల్చె|
  తల్లిని జంపి యశమందె ధర్మ మూర్తి|

  రిప్లయితొలగించండి
 19. ఉల్లాసమ్మున పిల్లవాండ్రకు పురాణోక్తమ్ములన్ జెప్పుచు
  న్నుల్లంఘింపక దండ్రివాక్యములవే యుత్కృష్టమంచున్ గదా
  తల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్ ధర్మాత్ముఁ డెంతేనియున్
  తల్లిన్ భిక్షగ గోరెనా పిదప సద్ధర్మమ్ము నే చాటుచున్
  పిల్లల్ మెచ్చిరి యాలకించుచును సంప్రీతిన్ మహోత్సాహులై

  రిప్లయితొలగించండి
 20. ఉల్లంబొల్లగతా ప్రధాని పదవి న్నోడింప నెహ్రూని భల్...
  కొల్లంగొట్టుచు తుర్కుహృత్తులను తా కొండాడి యల్లానహో...
  చిల్లుల్ గొట్టుచు మాతృభూమినికిహా! చీల్చించి చెండాడుచున్
  తల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్ ధర్మాత్ముఁ డెంతేనియున్!

  రిప్లయితొలగించండి