1, డిసెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3561

2-12-2020 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్”

(లేదా…)

“శివపూజం బొనరింపకున్న నలుగున్ శ్రీకాంతుఁ డెల్లప్పుడున్”

66 కామెంట్‌లు:

  1. మ||
    అవతారంబులనెత్తి చుట్టరికమందాపద్విశేషంబులన్
    కవనంబున్, హవనంబు స్మార్థపథసద్గంధప్రమాణంబునన్
    నివశించన్ పరమాత్మరూపమునసందేహంబదేమున్నదో?
    శివపూజంబొనరింపకున్ననలుగున్ శ్రీకాంతుడెల్లప్పుడున్

    రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    శివమౌ తీరున వైష్ణవుల్ మరువకే శ్రీకాంతునున్ లక్ష్మినిన్
    కవిరో! శ్రద్ధను భామలే చనుచు భల్ కార్తీక మాసమ్మునన్
    రవి వారమ్మున పోవుచున్ మురియుచున్ రమ్యంపు కాశీననున్
    శివపూజం బొనరింపకున్న నలుగున్ శ్రీకాంతుఁ డెల్లప్పుడున్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కార్తీకము
      కార్తీకము : పురుషోత్తమ కవీయము అను శబ్దరూపప్రబోధకనిఘంటుత్రితయము (నాదెళ్ల పురుషోత్తమ కవి) 1918

      అన్యరూపదీపిక:

      శబ్దము: కార్తికము
      రూపాంతరము: కార్తీకము, కార్తికికము
      టీకా: ఒక మాసము

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాశీననున్'కు బదులుగా 'వారాణసిన్' అనవచ్చు కదా?

      తొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శివమది కలుగదు
    శివపూజను జేయకున్న; శ్రీహరి యలుగున్
    సవురును జూపని భక్తిని
    పొవడక సాగెడి మనుజుల పోడిమి గనుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో ఒక గణం తక్కువయింది. "కలుగదు మనకున్" అందామా?

      తొలగించండి
  4. శివకేశవులొకటైనపు
    డెవరైననునాగ్రహింతురిలలో నెరుగన్
    కవనము లోన నుతించుచు
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్!!

    రిప్లయితొలగించండి
  5. శివబంటై స్వామి ఘనత
    చెవులబడినదంత శౌరి చెప్పగదలచెన్
    శివసాన్నిధ్యము గోరుచు
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏 సవరించగ రెండవ పాదం:

      చెవులనిలుచునట్టు శౌరి చెప్పగదలచెన్

      తొలగించండి
    2. శివుని తపజపములబడయ
      నవకాశము తగినరీతి నమరిన జాలున్
      భవజలధినిదాట! నెటుల
      శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్ ??

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'శివబంబై..' ?

      తొలగించండి
  6. అవకాశము చేజార్చక
    శివపూజలు సలుపమేలు శ్రీకరమగుగా!
    భవదీయులునెపమెంచుచు
    శివపూజలుసేయకున్న శ్రీహరియలుగున్.
    ---------------------------
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి

  7. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వైష్ణవులు శైవులు పోరాడి కొట్లాడుకునే రోజులున్నవట:

    "అవమానమ్మును శైవులన్ పఱపుచున్ హ్లాదమ్మునన్ వైష్ణవుల్
    చెవినిన్ బెట్టక పార్వతిన్ శివునినిన్ చేదస్తమౌ కీర్తనల్
    కవిరో! కుమ్ముచు కోడిమాంసమునహో కార్తీక మాసమ్మునన్
    శివపూజం బొనరింపకున్న నలుగున్ శ్రీకాంతుఁ డెల్లప్పుడున్..."

    😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. బోనసు సరదా పూరణ:

      భవనమ్మందున నోరుగల్లు నగరిన్ పండంగ వే నోములే
      లవలేశమ్మును శంకనున్ గొనకయే లాలించుచున్ సూనుకున్
      కవిగా శంకరు నామమున్ నిలుపగన్ కందింటినిన్ వైష్ణవుల్
      శివపూజం బొనరింపకున్న నలుగున్ శ్రీకాంతుఁ డెల్లప్పుడున్...

      తొలగించండి
  8. భవనాశంబొనరించును
    ప్రవిమలశివనామమననరామునిమనమం
    దవిరళముగకొనసాగును
    శివపూజను జేయకున్న శ్రీ హరి యలుగున్


    భవవేదంబనెదివ్యవాఙ్మయములోభక్తాళిసౌభాగ్యమా
    శివసాయుజ్యమునర్చనాంజలులతోశ్రేయంబు,దౌర్భాగ్యమౌ
    *“శివపూజం బొనరింపకున్న; నలుగున్ శ్రీకాంతుఁ డెల్లప్పుడున్”*
    శివభక్తాళినిధర్మతత్పరులదూషింపంగశిక్షించినన్

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శివమున్ గల్గదు భక్తితో నిరతమున్ చెన్నైన పొంకమ్మునన్
    శివపూజంబొనరింపకున్న; నలుగున్ శ్రీకాంతుడెల్లప్పుడున్
    సవురున్ జూపని రీతినిన్ చెలగుచున్ సంకీర్తనల్ జేయకున్
    పవిదేలేని విరాళినిన్ కొలుచుచున్ పారాడు వారిన్ గనన్.

    రిప్లయితొలగించండి
  10. శివునికి హరికి న భేదమ
    ని వచించి రనియెడు మాట నిజమై యుండన్
    దవిలియు కార్తీక మ్మున
    శివ పూజను జేయ కున్న శ్రీహరి యలుగు న్

    రిప్లయితొలగించండి
  11. రాజసూయ యాగానంతరము శ్రీకృష్ణపరమాత్మకు అగ్రపూజచేయు ధర్మజునితో శిశుపాలుఁడు :

    కందం
    నవనీతము దొంగిలుచున్
    బువుఁబోడుల కెగయ నగ్ర పూజార్హుండే?
    స్తవనీయుండగునే? శివ!
    శివ! పూజనుఁ జేయకున్న శ్రీహరి యలుగున్!

    మత్తేభవిక్రీడితము
    నవనీతాదుల దొంగిలించి తరుణీ స్నానాల వీక్షించియున్
    బువుబోడిన్ రధమందు రాక్షసమునన్ బొందంగ సన్మార్గుడే?
    యవతారంబిదె! యగ్రపూజలనగా నర్హుండె? తుచ్ఛుండు! హే!
    శివ! పూజం బొనరింపకున్న నలుగున్ శ్రీకాంతుడెల్లప్పుడున్! !

    రిప్లయితొలగించండి
  12. కందము
    ++++++++++
    నవకాయపిండివంటలు
    శివశివశివరాత్రినాడు శేషములేకన్
    భవదీయులు భుజియించుచు
    శివపూజలుసేయకున్న శ్రీహరియలుగున్.
    ---------------------------
    రావెల పురుషోత్తమరావు


    రిప్లయితొలగించండి
  13. శివునికి నర్థాంగి తనువు
    న వామ భాగమున వెల్గు నారాయణి ! ఆ
    శివుడు దన బావ యగుటను
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్!

    రిప్లయితొలగించండి
  14. శివ హృదయము విష్ణుమయము
    నివసించును హరిమనమున నీలగళుండే
    భవనాశక కార్తికమున
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్

    స్తవనీయంబగు కాశిఖండమను సత్కావ్యంపు నిర్మాతయై
    దివమున్ రాత్రియు నీశ్వరార్చనను
    హృద్దేశ్యంబు సిద్ధించెడిన్
    కవిసామ్రాట్టగు కొండవీటికవి మోక్షంబిచ్చు కార్తీకమున్
    శివపూజం బొనరింపకున్న నలుగున్ శ్రీకాంతు డెల్లప్పుడున్

    శ్రీకాంతుడు = శ్రీనాథుడు
    ఈశ్వరార్చన కళాశీలుడు

    రిప్లయితొలగించండి
  15. నా పూరణ ప్రయత్నం

    స్తవనీయుడుతానెప్పుడు
    వ్యవధానములేకయుండివ్యాప్తినిజెందెన్
    ప్రవిమళమగుభక్తినితా
    శివపూజనుజేయకున్నశ్రీహరియలుగున్

    రిప్లయితొలగించండి
  16. శివుడు జపించును రాముని,
    వ్యవధానము జిక్కగ రఘువరుఁడభిరూపున్
    వివరణలేలా నిజమిది
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్.

    రిప్లయితొలగించండి
  17. సమస్య :
    శివపూజం బొనరించకున్న నలుగున్
    శ్రీకాంతు డెల్లప్పుడున్

    ( హరిహరనాథస్వామి భక్తుడైన తిక్కనార్యుడు తన శిష్యుడు లేఖకుడునైన గురునాథునితో )
    మత్తేభవిక్రీడితము
    ............................

    శివుడంచున్ ఘనకేశవుం డనుచు మీ
    చింతల్ సమాప్తంబగున్
    ధవులిర్వుర్ మిము గాంచగా ; జననమే
    ధన్యంబు గాకుండునే ?
    శివు డల్గున్ హరిపూజ సేయమికి ; నీ
    శీర్షంబునే వంచుచున్
    శివపూజం బొనరించకున్న నలుగున్
    శ్రీకాంతు డెల్లప్పుడున్ .

    రిప్లయితొలగించండి


  18. ఎవరండీ చెప్పిరిలా
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్?
    తవరిటువంటి ప్రచారము
    ల వలదు చేయ కవి శంకరార్య పలికితిన్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. శివునికిపూజసలుప కే
    శవునకు యిష్టము,హరికికి జరుపప్రీతిన్
    శివునకు,లేదయె భేదము,
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కేశవునకు నిష్టము, హరికిని జరుపగ ప్రీతిన్..' అనండి.

      తొలగించండి
  20. మైలవరపు వారి పూరణ

    శివుడే విష్ణువు., విష్ణువే శివుడగున్, చిత్తంబు శైవంబు మా...
    ధవచిత్తంబగు స్థూలదృష్టిఁగన భేదంబట్లు కన్పట్టు., మా..
    ధవపూజంబొనరింపకున్న శివుడున్., దద్భావసద్భక్తితో
    శివపూజంబొనరింపకున్ననలుగున్ శ్రీకాంతుడెల్లప్పుడున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  21. సవనంబీబ్రహ్మాండము
    శివకేశవక్రీడగఁదెలిసినమాయేగా
    చివరకునిరువురునోకటియె
    శివపూజసేయకున్నశ్రీహరియలుగున్

    రిప్లయితొలగించండి
  22. అవతార పురుషు డతడే
    భవభయ హరుడంచు నమ్మి వదలక సేవిం
    పవలయు, నామాట వినక
    శివ! పూజను సేయకున్న శ్రీహరి యలుగున్.

    రిప్లయితొలగించండి
  23. భవ బంధమ్ములశాశ్వతమ్ములనుచున్ భక్తాగ్రగణ్యుల్ సదా
    ప్రవచించేరది సత్యమే, నిరతమా ప్రాగ్వంశునిన్ గొల్చినన్
    భవహారమ్మగు భోగలాలసునివై పద్మాక్షునిన్ మర్చుచున్
    శివ! పూజంబొనరింపకున్న నలుగున్ శ్రీకాంతు డెల్లప్పుడున్.

    రిప్లయితొలగించండి
  24. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన

    సమస్య

    శివ పూజనుఁ జేయకున్న శ్రీ హరి యలుగున్

    నా పూరణ

    శివలింగప్రతిష్టితమును
    జవమున రామావతార సమయమునందున్
    స్తవముల రామేశ్వరమున
    శివ పూజనుఁజేయకున్న శ్రీ హరి యలుగున్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి


  25. శివకేశవులొక్కటనగ
    జవమున నర్చింప రండు సంతోషముతో
    నవనిని కార్తీ కమ్మున
    *శివ పూజలు చేయకున్న శ్రీహరి యలుగున్.*

    భువనము లందున శ్రీహరి
    శివుడును స్థితిలయలు విడక చేసెడి వారే
    శివమిడు కార్తీక మ్మున
    *శివపూజలు చేయకున్న శ్రీహరి యలుగున్*

    రిప్లయితొలగించండి
  26. శివునకు కేశవునకు నెడఁ
    జివురింపగ నీయకోయి చిత్తములో మా
    ధవుఁడే ఘనుఁడని కుమతిని
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్.

    రిప్లయితొలగించండి
  27. శివ కేశవు లొక్కటియే
    వివిధములగు పూజలన్ని వేడుక తోడ
    న్దవిలి  చేయగ వలయున్   
    “శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్ ”

    రిప్లయితొలగించండి
  28. శివ కేశవులకుఁ గలదే
    శివ! శివ! భేదం బెడందఁ జింతన సేయన్
    శివు నెన్నఁడు నిందించకు
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్


    భువి దేవుళ్లట నిర్వికారులు నరుల్ పూజించినన్ లేక యు
    న్న వివేకమ్మును వీడి వారిఁ గని యానందింతురే నిత్యమున్
    సవిశేషమ్ము గణింత్రు చేష్టలను వాచాలత్వమే యిట్లనన్
    శివపూజం బొనరింపకున్న నలుగున్ శ్రీకాంతుఁ డెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
  29. శివశివ యేమని యంటిరి
    శివపూజనుజేయకున్న శ్రీహరియలుగున్ ?
    శివుడునుహరియునునొకరని
    యవగతమేయైనయెడల యలుగుటయెటులౌ

    రిప్లయితొలగించండి
  30. శివుడేహరి హరిశివుడే
    భవభయహరులిర్వురిలనుభావింపంగన్
    శివధిక్కారముసలుపగ
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్

    రిప్లయితొలగించండి
  31. శివుడేవిష్ణువువిష్ణువేశివుడునైసేవాదులందంగగా
    శివపూజంబొనరింపకున్న నలుగున్ శ్రీకాంతుండెల్లప్పుడున్
    నవహేళంబుగనిట్లుగానుడువ భోహాస్యాంస్పదంబౌనుగా
    కవితా!నీవిటుమాటలాడకుము నీకైతెత్తుబ్రాసాదమున్

    రిప్లయితొలగించండి
  32. ఉమాదేవి గారి పూరణలు బహు భేష్....
    వైష్ణవకోణంలో.....మరోటి....
    కం.
    హవనం బారాధనము
    త్సవములు, నైవేద్య మన్న దానాదులఁ కే
    శవునకు నీగతి నిడు, శివ!
    శివ! పూజలు సేయకున్న శ్రీహరి యలుగున్!

    రిప్లయితొలగించండి
  33. మ:

    ఎవరేమందురునాదిదేవులొకరే యేరూపమున్ గాంచినన్
    శివుడే విష్ణువు విష్ణువే శివుడు కాశీలో వరంబొందగన్
    భువిలో కార్తిక మాసమున్ గలియు సంపూజ్యమ్ము గా నెంచనై
    శివపూజంబొనరింపకున్న నలుగున్ శ్రీకాంతు డెల్లప్పుడున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  34. శివ కేశవులకు భేదము
    లవలేశంబైన లేదు రాజా వినుమా
    శివుఁడలుగును హరిని మరువ
    శివపూజను జేయకున్న శ్రీహరి యలుగున్

    రిప్లయితొలగించండి
  35. కందము:
    ++++++++
    శివుడేడని ప్రశ్నించకు
    శివుడన సర్వమ్మునతని సిరియే సుమ్మా!
    భవుడని గణనము నిడకన్
    శివపూజను జేయకున్న శ్రీహరియలుగున్
    ++++++++++++++++++
    రావెల పురుషోత్తమ రావు

    రిప్లయితొలగించండి
  36. స్తవనీయంబులు శౌరి లీలలవి ప్రస్తావింప నాశ్చర్యమౌ
    భవమున్ సార్థకమొంద జేయ మదిలో భావించి సద్బుద్ధితో
    భువిలో పేదల కై శ్రమించుచును, సమ్మోదమ్ముతో పొందగా
    శివ, పూజంబొనరింపకున్న నలుగున్ శ్రీకాంతు డెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
  37. శివుడేదాతయటంచు,నమ్ముదురులే శీఘ్రమ్ముగా భక్తితో
    శివుడజ్ఞానపు ధ్వంసియేననుచునా ,శిష్టుల్ భువిన్ బల్కగా
    శివునిన్ గాదను వైష్ణవాగ్రణులు ,నేశీర్షమ్మునన్ నిల్పకన్
    శివపూజంబొనరింపకున్న నలుగున్ ,శ్రీకాంతుడెల్లప్పుడున్
    ++++++++++++++++
    రావెల పురుషోత్తమ రావు

    రిప్లయితొలగించండి