3, డిసెంబర్ 2020, గురువారం

సమస్య - 3563

4-12-2020 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్”

(లేదా…)

“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”

84 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    దినమును రాత్రినిన్ తనరి దిక్కులు తోచక గాలివాననున్
    ఘనముగ నుర్ములున్ పడుచు కన్నులు మూయు తటిత్తులందునన్
    కనగను మబ్బులాదటను క్రమ్మగ నేడిట హైద్రబాదునన్
    దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్...

    రిప్లయితొలగించండి
  2. సూర్యుడు సౌరకుటుంబం ఆవిర్భవించగా కాంతులను జిమ్మి "పెనుచిమ్మచీకటిని మాపాడు"

    చ||
    ఘనతరభాస్వరాగమనకాంతుల సౌరకుటుంబమంతయున్
    జననము బొందగా వెలిగె సంభవమున్ జమమెల్ల జూడ భా
    వనగలుగంగ మాపెనని పారగజేయుచు కాంతి మాపెగా
    దినకరుడుద్భవించి నలుదిక్కులనిం, 'పెనుచిమ్మచీకటిన్'

    రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దిక్కులనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. ఒకవేళ సాధువనుకున్నా తరువాత సరళాదేశం వచ్చి 'బెను..' అవుతుంది.

      తొలగించండి
  3. అందరికీ నమస్సులు🙏

    నా పూరణ ప్రయత్నం..

    (కార్గిల్ యుద్దములో ప్రాణాలొడ్డిన వీర సైనికుని ఉద్దేశించి)

    *కం||*

    వెనుదిరగక తానెప్పడు
    ఘనముగ సరిహద్దునందు కార్గిల్ రణమున్
    మనలను కాపాడి చితిన
    *“దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏🙏

    రిప్లయితొలగించండి
  4. లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పటి సన్నివేశం

    కం.
    తనతమ్ముని స్థితి నెరిగియు
    దినకరుఁ డుదయించి దెసలఁ,దిమిరము నింపెన్
    మనమున రాముని, నప్పుడు
    హనుమంతుడు నగముతోడ నగుపడె నభమున్

    రిప్లయితొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వినకయె నాదు మాటలను ప్రీతిని సూనుడు కోడలమ్మయో
    పనుపగ హైద్రబాదునను పండుగ పూటను మొండిజేయుచున్
    కనులకు కప్పగా నలుపు గ్లాసులు సర్జరి కాటరాక్టునన్
    దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్...

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఘనముగ నాకసమందున
    మినమినలాడుచు వెలుగును మీఱు యుడుపులన్
    కనుమరుగు నొనర్చుచు తా
    దినకరుడుదయించి దెసల తిమిరము నింపెన్.

    రిప్లయితొలగించండి
  7. సని నిడెను భువనమందున్

    దినకరుడుదయించి , దెసల‌ తిమిరము నింపెన్

    యిను డస్తమించి యమవశ

    దినమున సాయంత్రమందు తిప్పల‌నడుమన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సూచించిన సవరణను వాట్సపులో చూడండి.

      తొలగించండి
  8. మనుగడగడగడవణకెను
    పెనుముప్పుగగాలివానఫెళ్లునవిరిసెన్
    కనగామబ్బుగ్రమ్మెను
    దినకరుడుదయంచిదెసలతిమిరమునింపెన్

    రిప్లయితొలగించండి
  9. చంపకమాల:
    ++++++++++++++
    ఘనమగు దేశద్రిమ్మరిగ,గారడిజేయుచు మానవాళికై
    శనిగను దాపురించెనిట,శారదరాత్రులు గూడ లేవనెన్
    దినమునరాత్రియైన, నొక దిక్కును దోచక వైరసుండగా
    దినకరుడుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటుల్


    రిప్లయితొలగించండి
  10. సమస్య
    దినకరు డుద్భవించి నలు
    దిక్కుల నింపెను చిమ్మచీకటిన్

    (శ్రీకృష్ణనిర్యాణవార్తను ధర్మరాజుకు విన్నవిస్తున్న అర్జునుడు )
    ఘనముగ నగ్రజా ! మనకు
    ఖ్యాతిని రాజ్యము నందజేసెనే !
    యనయము దుష్టశిక్షణకు
    నంతయు శక్తిని ధారవోసెనే !
    మనసుల నిండియున్న మన
    మాధవమూర్తియె యస్తమించగా
    దినకరు డుద్భవించి నలుదిక్కుల
    నింపెను చిమ్మచీకటిన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మనసు' సాధువు కాదంటారు. "మనముల నిండి..." అనండి.

      తొలగించండి
  11. కందం

    మునివరుఁడొసగిన వరమున
    మనువుకు మునుపె తరణికి కొమరుని గనియు భీ
    తిని నదిని వదల మగువకు
    దినకరుఁ డుదయించి దెసలఁ తిమిరము నింపెన్

    చంపకమాల

    మునిగొని కుంతి సేవలను, పుత్రునొసంగగ నిష్టదైవముల్,
    దనరుచు మంత్రమౌ వరము రంజిల నీయ పరీక్ష సేయఁగన్
    మనమునఁ దల్చి మంత్రము కుమారిగ భీతిల కర్ణమందునన్
    దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్

    రిప్లయితొలగించండి
  12. మనమందిట్టుల దలచెన్
    దినకరు డుదయించి దెసల దిమిరము జంపెన్
    కునుకుచు నిట్టుల బల్కెన్
    దినకరు డుదయించి దెసల దిమిరము నింపెన్

    పనిగొని రాక్షసాధముల భారము బాపగ ద్వాపరంబునన్
    ఘన చెఱసాలయందునను కంసుని
    జంపెడు నష్టసూనుడై
    కునుకగ ద్వారపాలకులు గోపకులంబున వాసుదేవుడన్
    దినకరు డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్

    రిప్లయితొలగించండి
  13. ఇనుడట క్రుంగినంత భువి నిర్లవి చేరగ లోకులెల్లరుల్
    పనులను మానిరప్పుడు, ద్విపాత్తులు కోరగ దివ్య కాంతులన్
    దినకరు డుద్భవించి నలు దిక్కులనింపె, చిమ్మ చీకటిన్
    దునిమి, కృషీవలుల్ పుడమి దున్నగ సాగిరి కూటకమ్ముతో.

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సనియె పొదగొనెను నభమున
    దినకరుడుదయించి; దెసల తిమిరము నింపెన్
    మినమినలాడెడి చంద్రుడు
    తన మినుకది నమవసమున తగ్గిన వేళన్.

    రిప్లయితొలగించండి
  15. మునిసిపలెన్నిక లందున
    తన గెలుపిక తథ్యమంచు దంభము లాడెన్
    తన కలలు తారుమారయె
    దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్.

    రిప్లయితొలగించండి
  16. అందరికీ నమస్సులు🙏

    ఘనముగ తూర్పునన్ తరణి కాంతులు జిమ్ముచు భాసురంబుగన్
    మనమున జింతలన్ జెరిపి మైత్రిని జూపుచు మేలుకొల్పగా
    నినకుని మ్రింగ దుష్టమది నీసుగ రాహువుపక్రమించగన్
    *“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”*


    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  17. ఘనముగ నోట్లను పొందిన
    జన హృద యము గెల్చి నట్టి సజ్జను డతడే
    మనిగెను గెలిచిన నాడే
    దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్

    రిప్లయితొలగించండి

  18. బోనసు సరదా పూరణ:

    తినగను దోసెలున్ వడలు తియ్యని లడ్డుల, నర్ధరాత్రినిన్
    మనమును తన్వునున్ మరువ మందపు దుప్పటి లాగి కప్పుచున్
    ఘనమగు హైద్రబాదునహ కన్నులు మూయగ;...క్యాలిఫోర్నియన్
    దినకరుఁ డుద్భవించి;...నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్...

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఘనముగ నాకసమ్మున ప్రకాశముతో దిశలెల్ల నెక్కొనెన్
    దినకరుడుద్భవించి; నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్
    మినమినలాడు రేమగడు మించును జాఱ్చు నమాసమందునన్
    తనకళ రూపుమాయువడి తానుగ రిక్కలగూడి పోవుచున్.

    రిప్లయితొలగించండి
  20. మనదేశమున రివాజుగ
    దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్
    ఘనమౌ గ్రహణము పట్టగ ,
    దినమో ఱేయో దెలియని తీరుగ నుండన్

    రిప్లయితొలగించండి
  21. (ఎన్నికల మరుసటి రోజున కాంగ్రెసు పరిస్థితి)

    మనదే రాజ్యము తలపగ
    తనయుడు రాహులు జనులకు తలుచును మేలే
    ఘనముగ తెల్పెను సోనియ
    దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్


    రిప్లయితొలగించండి


  22. అనఘా! పోగొట్టెనయా
    దినకరుఁ డుదయించి, దెసలఁ దిమిరము, నింపెన్
    కనుల మిరిమిట్లు గొల్పుచు
    వినువీధిని వెలుతురున్ పవిత్రత తోడై

    భార్య ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ యిచ్చెను :)
    ఈ వాక్యములో ఏడుస్తున్నదెవరు ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      భార్య - ఏడుస్తూ కూర్చున్న భర్తకు...
      భార్య ఏడుస్తూ - కూర్చున్న భర్తకు...
      అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నదానికి ఈ ప్రశ్న చక్కని ఉదాహరణ.

      తొలగించండి


  23. కందా చంప్స్ :)


    అనఘా ప్రకాశమున్ క్ర
    న్నన దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నిం
    పెను, చిమ్మచీఁకటిన్ ద్రో
    లి నూతనత్వమును నింపి లెస్సగ సుదతీ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. ఘనుడనఘుండుదైత్యకులకైరవబంధువుబుట్టెతారజీ
    వనకశిపాత్మజుండుద్రిదివౌకసకోటికిహ్లాదిహ్లాదుడా
    *“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”*
    మనముననానరద్విషునాధిపునంతముతథ్యమౌటచే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  25. అనయము బంధుమిత్రులను నక్కునజేర్చ భయమ్ముఁ గూర్చె, నిం
    టిని చెరసాలఁ జేసె, వికటించగ స్వాస్థ్యము వెజ్జు చూడ, డా
    దినసరికూలి కూలె నిల, తీవ్రరయప్రసరత్కరోనదు
    ర్దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్.

    దుర్దినకరుడు = దుర్దినమును చేయువాడు.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  26. అనితర సాధ్యుడున్ ఘనుడు యాదవ సూనుడు సర్వదక్షుడై
    పనిగొనె సైంధవున్ దునుమ పాండవ మధ్యమునాత్మ శాంతికై
    ఘనమగు చక్రమున్ విసర గ్రక్కున సూర్యుని మూయ నంతలో
    దినకరు డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్

    రిప్లయితొలగించండి
  27. అనవరతంబు నీ జగతి నంతట రోగము లీతి బాధలున్
    కనులను గాంచుచున్ కుమిలి కష్టములే సహవాసముండగన్
    దినమొక గండమై గడుపు దీనుని జీవనమున్ గనంగ నీ
    దినకరు డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీకటిన్

    రిప్లయితొలగించండి


  28. అనుదినమునుపంచువెలుగు
    దినకరుడుదయించి,దెసలతిమిరము నింపెన్
    మునిమాపునతా మునుగుచు
    జనులికవిశ్రాంతి పొందు సమయమటంచున్

    .

    రిప్లయితొలగించండి
  29. అనవరతము వ్యవధానము
    పనియన్ననుమేలు రేబవలు నొకటౌనా
    మనుజులు దినమును మరచిరె
    దినకరుఁ డుదయించి దెసలఁ తిమిరము నింపెన్ !!

    (వర్క్ ఫ్రం హోం భాదితుల జీవనవిధానం)

    రిప్లయితొలగించండి
  30. మునుకొని పో ద్రోలె జగతి
    దిన కరు డుదయించి దెసల దిమిరము : నింపెన్
    ఘనముగ మబ్బులు గ్రమ్మగ
    పెను చీకటు లావరించె పేర్మిగ నుర్విన్

    రిప్లయితొలగించండి
  31. ఘనమగు కాంతియె విరిసెను
    దినకరుడుదయించి దెసలఁ, దిమిరము నిండెన్
    మినురతన మస్తమింపగ
    జనులు పడకటిల్లు జేరి శయనింతురికన్

    రిప్లయితొలగించండి
  32. ఘనమాంగ్లమ్ముని యెంచుచు
    తెనుగు జదవనట్టివాడు తిమిరమె యన్నన్
    మినుకని తలచుచు పలికెను
    దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్

    రిప్లయితొలగించండి
  33. ఘనుడగు పద్మనాభుదయ కల్గెను పుత్రుడటంచు ప్రేమతో
    మునుకొని పెంచ వాని కడుమోదముతోడుత, తల్లిదండ్రులన్
    వినయము వీడి దూరుచును వేదన పెట్టగ, తండ్రి పల్కె దు
    ర్దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్

    రిప్లయితొలగించండి
  34. అనయము గాంతిని నింపును
    దినకరుడుదయించిదెసల,దిమిరమునింపెన్
    దినకరుడేగిపడమరకు
    దినకరుడేమూలమార్య!దివికిన్భువికిన్

    రిప్లయితొలగించండి
  35. ఉ:

    ఘనమగు భారతావనిని గంపెడు నాశలు పల్లవించగన్
    కనికర మింత లేక కడు కర్కశ రీతిని తూట పేల్చగన్
    పణముగ బెట్టె ప్రాణములు పాపము గాంధి తలంచ నివ్విధిన్
    దినకరుడుద్భవించి నలు దిక్కుల నింపెను చిమ్మ చీకటిన్

    వై.చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  36. కనివినియెరుగనిరీతిగ
    ననినభిమన్యునిశరములయభ్రముచదలన్
    గనిపరిపంథులుదలచిరి
    దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్

    రిప్లయితొలగించండి
  37. ఘనమగు సూర్యతేజమును గాసిలిబెట్టగలోకమంతకున్

    దినకరుడుద్భవించి నలుదిక్కులనింపెను,చిమ్మచీకటిన్

    దినకరుడస్తమించగను దేజములేకనునింపెనాయెడన్

    దినకరుడేగదా భువికిదీప్తిని,జీవనమిచ్చురత్నమౌ

    రిప్లయితొలగించండి
  38. ఇనకుల భూషణు నా రా
    ముని వని కంపు మన మోహమున దశరథ రా
    జున కత్తరి నక్కసమున
    దినకరుఁ డుదయించి దెసలఁ దిమిరము నింపెన్


    దిన దిన ముప్పతిల్లఁ బగ తీవ్ర తరమ్ముగ సూర్య చంద్రులన్
    ఘనముగ నొవ్వఁ జేయుటయె కార్యముగా నెదఁ దల్చు రాహువే
    కనలి కరమ్ము నాకమున గ్రక్కున రాహువు గ్రస్త నిష్ప్రభా
    దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను జిమ్మచీఁకటిన్

    రిప్లయితొలగించండి
  39. కనుమరుగయ్యెను సూర్యుడు
    కనగను నింగిన గ్రహణము కనువిందయ్యెన్
    వెనుకబడె వెలుగు తూర్పున
    దినకరు డుదయించి దెసల తిమిరము నింపెన్

    రిప్లయితొలగించండి
  40. ధనువునుజేతబూనితనదాయలనుక్కడగించుచున్ సుయో
    ధనునిమనంబునందునవెతన్ గలిగించుసుభద్ర సూనునిన్
    కనుగొనిధార్తరాష్ట్రుడునుకర్ణుడునాదిగయోధులొక్కటై
    పెనగొని తమ్మిమొగ్గరము పేర్చివధించిరి వానినంతటన్
    దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్

    రిప్లయితొలగించండి
  41. కను మదె పూర్వశైలమున కాంచన వర్ణ సుశోభలన్ భళా
    దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను; చిమ్మచీఁకటిన్
    ,వెనుమరలంగ జేసె దన వేల వెలుంగుల వాడి తూపులన్;
    జనుల మనంబులన్ వెలిగి జాడ్యములన్ దొలగించు బూనికన్

    రిప్లయితొలగించండి
  42. ఘనుడనఘుండుదైత్యకులకైరవబంధువుబుట్టెతారజీ
    వనకశిపాత్మజుండుద్రిదివౌకసకోటికిహ్లాదిహ్లాదుడా
    *“దినకరుఁ డుద్భవించి నలుదిక్కుల నింపెను చిమ్మచీఁకటిన్”*
    దనుజ కుమారు లోజులకు దైవము శ్రీహరి యంచు జాటుచున్

    రిప్లయితొలగించండి
  43. కనకకశిపుండువరముల
    గొనిదైవమునేనటంచుగొల్వగజాటిం
    చిననువిభేదించెసుతుడు
    దినకరుఁడుదయించిదెసలఁదిమిరము నింపెన్

    రిప్లయితొలగించండి
  44. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

    దొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడియె
    (లేదా)
    దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడే

    నా పూరణ

    తే.గీ.

    గుట్టుచప్పుడు లేకుండ గుంభనముగ
    లంకె బిందెలఁ ద్రవ్వగా రాత్రిపూట
    రవ్వ చడిలేక వచ్చిరి రాజ భటులు
    దొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడెను


    చంపక మాల

    వరుసకు బావ యౌటన వివాహముఁ జేసుకొనంగ జాలితో,
    తరుణికి నమ్మనాన్నలు గతంబగుటన్ యిరువుండ్రు సోదరీ
    వరులనుగూడ బాధ్యతఁ వివాహముఁ జేసుకొనంగ భారమై
    దొరికెను లంకె బిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడే

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి