5, డిసెంబర్ 2020, శనివారం

సమస్య - 3565

6-12-2020 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సహదేవుఁడు సీతనుఁ గని సంతోషించెన్”

(లేదా…)

“సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా”

81 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    సహదేవుండను శంకరాభరణపున్ ఛందంపు శాస్త్రజ్ఞుడే
    మహలున్ వీడుచు తీరుగన్ కడపనున్ మైకంపు స్వప్నమ్మునన్
    మహినిన్ మేలగు సింహపూరు జనగన్ మర్యాదలన్ పొందగన్
    సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా...

    సింహపురము = (గుఱ్ఱం సీతా దేవి గారి) నెల్లూరు

    రిప్లయితొలగించండి
  2. సహపాటినిగని ముదమున
    సహవాసముజేయనెంచి సన్నిహితంబున్
    విహితంబగు నని యెంచిన
    సహదేవుఁడు సీతనుఁ గని సంతోషించెన్!!

    ***సహదేవుడు,సీత స్నేహితులు.

    రిప్లయితొలగించండి
  3. అహరహమువెన్నునంటుచు
    పహరాగాయగననుజుఁడుభ్రాతకుతోడై
    తహతహలాడగవదినయు
    సహదేవుడుసీతనుగనిసంతోషించెన్
    సహదేవుడు,-దేవునితోగూడినవాడు

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దహినిన్ గ్రోలుచు కోడలిన్ పొగడుచున్ ధారాళపున్ పల్కులన్
    రహినిన్ జూడగ రాత్రినిన్ ముదమునన్ వ్రాయంగ నే పూరణన్
    వహవా! శంకర! కందివర్యులహహా! వైనంపు ప్రాబ్లమ్మునన్
    “సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా!"

    ప్రాబ్లము = సమస్య

    రిప్లయితొలగించండి
  5. పుష్పకవిమానములోని సీతారాములు....

    కం.
    అహ! రావణు గూలె మహిని
    నహివల్లభుసఖుడు గెలిచె నందరుమెచ్చన్
    వహనంబు లోని "సర్వం
    సహదేవుఁడు" సీతనుఁ గని సంతోషించెన్

    సర్వంసహదేవుడు = రాజు (రాముడు)

    రిప్లయితొలగించండి


  6. స్కూల్ మేట్స్ ఇరవై సంవత్సరాల తరువాయి మీటింగ్ :)


    బహుశా యిరువది పైబడి
    న హాయనములు గడిచెనొ తనను గాంచి సుమీ !
    మహదానందము గాంచెను
    సహదేవుఁడు, సీతనుఁ గని సంతోషించెన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. సహనము తో సఖి కోసము
    తహతహ లాడుచు వెదికెడు తన కొక చోటన్
    గృహమందు నున్న నయ్యెడ
    సహదేవుడు సీతను గని సంతోషించెన్

    రిప్లయితొలగించండి
  8. సహచరి యగుపడక జడిసి
    విహితుడు కలవర పడుచును వెదుకుట కొరకై
    గహనము జని యట చతురుడు
    సహదేవుఁడు సీతనుఁ గని సంతోషించెన్.

    రిప్లయితొలగించండి

  9. బోనసు సరదా పూరణ:

    సహదేవుండను గొల్లడే వలయుచున్ జాణమ్మ సీతక్కనున్
    మొహమాటమ్మును వీడుచున్ కలియగన్ మోదంపు గాదమ్ముకున్
    ప్రహరీ గోడను గంతగన్ పొడుపునన్ పైకమ్మునున్ పొందగన్
    సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా...

    మొహమాటము = మొగమాటము (మా నెల్లూరి యాసలో)

    రిప్లయితొలగించండి
  10. కందం
    సహనమ్మున పతి'దేవుని'
    దహన పరీక్ష గెలిచి వడి ధరణిజ రాగన్
    మహితాత్ము లక్ష్మణునితో
    సహ, 'దేవుఁడు' సీతనుఁ గని సంతోషించెన్

    మత్తేభవిక్రీడితము
    సహనమ్మందున తల్లిమించినదినై సౌశీల్యమొప్పారగన్
    దహనుండున్ గుణశీలగన్ బలికి భూనాథార్పితన్ జేయగన్
    మహితమ్మై పతి' దేవు' నిన్ మురిసి సంభావించ సౌమిత్రితో
    సహ, 'దేవుండు' ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'మించినదియై...'

      తొలగించండి
    2. _/\_ధన్యోస్మి గురుదేవా_/\_

      సవరించిన పూరణ:
      మత్తేభవిక్రీడితము
      సహనమ్మందున తల్లిమించినదియై సౌశీల్యమొప్పారగన్
      దహనుండున్ గుణశీలగన్ బలికి భూనాథార్పితన్ జేయగన్
      మహితమ్మై పతి' దేవు' నిన్ మురిసి సంభావించ సౌమిత్రితో
      సహ, 'దేవుండు' ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా!

      తొలగించండి
  11. సీతారాముల అరణ్యవాసము

    ఇహము పరమ్ముల సతికిఁక
    సహజీవనమే సరియని సానువులకు తా
    సహ రాగా రాముడు...నా
    సహదేవుఁడు సీతనుఁ గని సంతోషించెన్.

    సహదేవుడు-కలసి ఆడువాడు (ఆంధ్రభారతి ఉవాచ)

    ప్రత్యుత్తరంతొలగించు

    మ.
    మహినిన్ బత్నికి భర్త తోడిదె గదా మర్త్యాళికిన్ సర్వమున్
    యిహ నే వీడ నిహంబునన్ బరమునన్ యిక్ష్వాకు వంశోత్తమా!
    గహనం బేగిన వత్తునంచు ధరణీకాన్పన్న, నారాముతో
    సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సర్వమున్+ఇహ, పరమునన్+ఇక్ష్వాకు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  12. సమస్య :
    సహదేవుండు ధరాత్మజన్ గని కడున్
    సంతోషమున్ బొందెరా

    ( ఐదు నెలలపాటు ఎన్ సీ సీ ఆఫీసర్ శిక్షణ పొంది ఇంటికి వచ్చిన కాలేజీ లెక్చరర్ సహదేవ్ తన భార్య ధరాత్మజతో )
    మత్తేభవిక్రీడితము
    ...........................

    " అహహా ! ప్రేయసి ! యైదు మాసములవే
    యట్లట్లు గతించెన్ గదే !
    సహనమ్మున్ మెయిదాల్చి నేరుపున నీ
    సంతానమున్ సాకితే !
    యిహ నే ఎన్ సి సి శిక్షణ న్నొసగె " దం
    చింపార నుప్పొంగుచున్
    సహదేవుండు ధరాత్మజన్ గని కడున్
    సంతోషమున్ బొందెరా !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "...యట్లట్టు లేగెన్ గదే..." అందామా?

      తొలగించండి
  13. సహదేవుడు మా ఊరి రైతు

    అహరాదిన వాన కురియ
    దహరుడు వేగమె పొలముకు తరలు టెరుగకన్
    తహతహలాడుచు వెడలిన
    సహదేవుఁడు సీతనుఁ గని సంతోషించెన్

    దహరుడు = తమ్ముడు

    రిప్లయితొలగించండి

  14. * శంకరాభరణం *
    డిసెంబర్ 06, 2020..ఆదివారం

    సమస్య

    “సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా”

    నా పూరణ. మత్తేభ విక్రీడితము
    **** *** ***

    అహమున్ గూడి దశాననుండుఁ గొన నన్యాయమ్ముగా లంకకున్

    మహి పుత్రిన్.., భరతాగ్రజుండు ఘనుడున్ మాన్యుండు శ్రీరాముడే

    రహిఁ గూలార్చెను రావణున్ రణమునన్;లంకాపురమ్మందు నా

    సహ దేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా”


    ( ఇక్కడ సహ=వెలుగు...సహ దేవుండు=వెలుగొందు దైవము..అని అర్ధము )

    రావణుడు సీతను లంకకు ఎత్తుకొనిపోతె..రాముడు వానిని యుద్ధమందు చంపి..ఆ లంకాపంరిలో అశోక వనమందు సీతను గాంచి ఆనందము పొందెను...)

    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  15. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

    సహదేవుడు సీతను గని సంతోషించెన్.
    (లేదా)
    సహదేవుండు ధరాత్మజన్ గని కడు సంతోషమున్ బొందెరా

    నా పూరణ

    కందము

    అహహా నావహ గుఱ్ఱము
    నిహలో నాపిన లవకుశు లినకుల తిలకుల్ ,
    మహనీయ మాత యవనిజ
    సహ , దేవుడు సీతను గని సంతోషించెన్

    మత్తేభము

    బహుసేనాయుత రాఘవుండు కడు ధీబాహా శక్తితో మహా

    వహమందున్ దశకంఠునిన్ దునిమి తీవ్రంబైన తోషమ్ముతో

    మహనీయంబగు రాజసం బలర సన్మానంబునన్ లక్ష్మణున్

    సహ , దేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "అహహా యాగపు గుఱ్ఱము..." అనండి.
      మత్తేభం మొదటి పాదంలో గణభంగం. "ధీబాహా బలుండై మహా.." అందామా?

      తొలగించండి
  16. ఇహమున ద్రౌపది పతియే

    సహదేవుడు,సీతనుగని సంతోషించెన్

    దహనము నొందక బ్రతికెను

    మహిమాన్విత యని తలచుచు మర్కట యోధుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంతోషించెన్' ఏకవచనం, 'యోధుల్' బహువచనం. "మర్కటగణమే" అనండి.

      తొలగించండి


  17. సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందె,రా
    ధ,హయగ్రీవుని చిన్న నాటి కబురుల్ దాష్టీకముల్, ముచ్చటల్
    ప్రహరీ గోడల దూకి మ్రుచ్చుతనముల్! రాదాయె కాలమ్మికన్!
    మహదానందము నొందె స్నేహితులనా మధ్యాహ్న వేళన్ గనన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. సహపాఠిసీతయన్నను
    సహదేవునకమిత ప్రేమ సతతమునామెన్
    వహియించుతలపులందున
    సహదేవుఁడు సీతనుఁ గని సంతోషించెన్

    రిప్లయితొలగించండి


  19. పోచిరాజు కామేశ్వరరావు గారికి,

    మీ శ్రీకృష్ణ సూక్తి సుధాకరము లో శీకృష్ణాయ నమః అంటూ ప్రారంభించినారు. ఈ "శీకృష్ణాయ" అనటంలో ఏదేని నిగూఢత వుందా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు జిలేబి గారు.
      శ్రీకృష్ణపరమాత్ముని భాషితములు కదా భావ వచో దోష నివార ణార్థము శ్రీకృష్ణుని స్మరించి నమస్కరించి ప్రారంభించుట. అంకితమని తలచితిరా? పరమాత్ముని మాటలను పరమాత్మునికే యంకిత మీయ నే నర్హుఁడ నెట్లగుదును? మననము సేసికొనుటకు మాత్రమ యర్హుఁడను.

      తొలగించండి
  20. రిప్లయిలు
    1. మహనీయేశ్వరచాపఖండనకళామాన్యుండు
      శోభాలస
      న్మహిజామానసపద్మబాంధవు డసామాన్యుండు నుద్విగ్నుడై
      యిహలోకాగతదైవమై రఘువరుం డీశానపూజ్యండునై
      బహుళక్రూరగుణాసురాంతకుడు స్త్రీవ్యామోహదుష్కార్యదు
      స్సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. నేనూహించిన పూరణ మీనుండి వచ్చింది. సంతోషం.
      అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. నమస్కారములు మీ విశ్వాసపాత్రడనైనందులకు కృతజ్ఞుడను.

      తొలగించండి
  21. అందరికీ నమస్సులు🙏

    నా పూరణ ప్రయత్నం..

    *కం||*

    ఇహలోకము జూడగ తా
    విహరించుచు నింద్రుడపుడు వేడుక జేయన్
    వహవా! యనుచున్ సతితో
    *“సహ, దేవుఁడు సీతనుఁ గని సంతోషించెన్”*!!

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏😊

    రిప్లయితొలగించండి
  22. (సహదేవుడు- సీత అన్నాచెల్లెళ్లు)

    అహరహ నాటకమందున
    సహవేషమువేయ మేలు ఘనతను బడయన్
    రహిగా నన్నయు చెల్లెలు
    సహదేవుఁడు సీతనుఁ గని సంతోషించెన్

    రిప్లయితొలగించండి
  23. ధన్యవాదములు గురువుగారూ!(సవరించిన పద్యాలు)

    ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

    సహదేవుడు సీతను గని సంతోషించెన్.
    (లేదా)
    సహదేవుండు ధరాత్మజన్ గని కడు సంతోషమున్ బొందెరా

    నా పూరణ

    కందము

    అహహా యాగపు గుఱ్ఱము
    నిహలో నాపిన లవకుశు లినకుల తిలకుల్ ,
    మహనీయ మాత యవనిజ
    సహ , దేవుడు సీతను గని సంతోషించెన్

    మత్తేభము

    బహుసేనాయుత రాఘవుండు కడు ధీబాహా బలుండై మహా

    వహమందున్ దశకంఠునిన్ దునిమి తీవ్రంబైన తోషమ్ముతో

    మహనీయంబగు రాజసం బలర సన్మానంబునన్ లక్ష్మణున్

    సహ , దేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  24. నమస్ససులు.🙏🏻🙏🏻🙏🏻
    మీ సూచనానంతర పూరణము.

    మహినిన్ బత్నికి భర్త తోడిదె గదా మర్త్యాళికిన్ సంతతం
    బిహ నే వీడ నిహంబునన్ బరమునన్ దిక్ష్వాకు వంశోత్తమా!
    గహనంబేగిన సీత వీడదని నాకాకుత్సుతోఁ దాననన్
    సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా.

    రిప్లయితొలగించండి
  25. విహరింపన్ జని వీధిమధ్యమున నా విక్రేతయే యమ్మెడిన్
    కుహనా మద్యము గ్రోలి వాగితివొ సంకోచమ్మె లేకుండగా
    సహి కానట్టి పదమ్ముల్ ఖలుడ చాల్చాలించు నెచ్చోట నే
    సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా?

    రిప్లయితొలగించండి
  26. మైలవరపు వారి పూరణ

    శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవులకు 🙏💐

    కుహనావాదవిహీనధీచతురుడౌ గుండాకులాబ్ధీందుడౌ
    సహదేవుండు నిరంతరమ్ము భగవత్సంబద్ధసాహిత్యవా...
    ఙ్మహితుండై యొకనాటి రేయి కలనమ్మన్ జానకిన్ జూడ.,నీ
    సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  27. బహువిధ ప్రఙ్ఞాశీలుడు
    సహదేవుడు,సీతనుగని సంతోషించెన్
    నహమికగలిగెడురావణు
    నహమునుగడతేర్చిపిదపయగమముక్రిందన్

    రిప్లయితొలగించండి
  28. మహితాత్ముండగువిష్ణువక్కజముగామౌలిన్ధనుష్పాణియై
    యహిరాట్లక్ష్మణుడైసనాతనియయొయ్యారంపువైదేహియై
    ద్రుహిణారాధ్యుడుబుట్టెజూతమనికద్రూజాంగదుండీశితో
    *“సహ,దేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా”*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మౌళి న్ధనుష్పాణియై' ? సనాతనియ ?

      తొలగించండి
  29. సహచరి చన పుట్టింటికి
    సహవాసము లేక చింత సతి విరహమునన్
    సహనము కోల్పోవు తరిని
    సహదేవుడు సీతను గని సంతోషించెన్

    రిప్లయితొలగించండి
  30. 6-12-2020

    కం||

    గృహసీమన్సుఖ నిద్రా

    వహుడైశయనించె గాంచెస్వప్నమున పతీ

    సహితనయోధ్యామాతను

    సహదేవుడు సీతను
    గని సంతోషించెన్

    గాదిరాజు. మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  31. ఇహలో సుఖముగ నుండి క
    లహమ్ములను సైప లేని లలితాత్ముఁడు దా
    ను హలమునఁ బొలము దున్నుచు
    సహదేవుఁడు సీతనుఁ గని సంతోషించెన్

    [సీత = నాఁగటి చాలు]


    సహదేవాఖ్యను వెల్గు నొక్క పురిలో సన్మానవుం డిద్ధరన్
    గృహరాజమ్మును వీడి గోత్రమున కేఁగెన్ వెల్గు లీనంగ నా
    తుహినాంశుండు దివిన్ నిజాగ్రజులు ముందుండన్ శమీవృక్షమున్
    సహదేవుండు ధరాత్మజం గని కడున్ సంతోషమున్ బొందెరా

    [ధరాత్మజ =ఉర్వీరుహము, వృక్షదేవత]

    రిప్లయితొలగించండి
  32. సహదేవుడు, ధరాత్మజ లు ప్రేమికులు. వారిని గూర్చిన ఈ ప్రయత్నము:

    మ:

    బహుశా రాదనుకొంటి దేవలమునన్ పట్టింపుగా నల్కతో
    సహనంబించుక జూపకన్ విసురుగా సాగెన్ గదా కోపమున్
    ప్రహసమ్మించుక మెచ్చకుండె నకటా రాకాసి రంభా యనన్
    సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. బెహరారాముడు పల్కెనిట్లుగనునోవీరాంంజనేయా!గనన్
    సహదేవుండుధరాత్మజన్గనికడున్సంతోషమున్బొందెరా?
    యహహాయేమిదిచేటుమాటలనుబాహాటంబుగాబల్కెదో?
    యహముంగల్గెనె?యేమిచెప్పుమసభాహ్లాదంబుజేకూర్చునే?

    రిప్లయితొలగించండి
  34. ఇహమున్ బుట్టెను శౌరి రామునిగ నాయీశానునిన్ నిత్యమున్
    బహుభక్తిన్ భజియించు రావణుని చంపన్నెంచి భూశాంతికై
    మహితాత్ముండు ధనుస్సు నెత్తి విరువన్, మల్లారి దైత్యారికిన్
    సహ దేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా

    రిప్లయితొలగించండి
  35. బహుచిత్రంబిదిద్వాపరంబునకుసంబంధించివిఖ్యాతుడా
    సహదేవుండుయుధిష్ఠిరానుజుడుపాంచాలీవిభుండెన్ననా
    మహికిన్పట్టియొత్రేతమందురఘురామార్థాంగియేతీరునన్
    *“సహదేవుండు ధరాత్మజన్ గని కడున్ సంతోషమున్ బొందెరా”*?

    రిప్లయితొలగించండి
  36. ----------------------------------------------------
    06-12-2020 - పూరణ

    సహదేవుఁడు సీతనుఁ గని సంతో షించెన్
    ----------------------------------------------------
    కం.
    సహ పాండవుల కడ నెవడు
    సహనంబున హనుమ యేమి సాధించె వడిన్
    యిహ నేమొందెను రాముడు
    సహ దేవుడు సీతను గని సంతో షించెన్
    - గానుగుల
    విజయవాడ
    ----------------------------------------------------

    రిప్లయితొలగించండి
  37. తహతహతో కృష్ణనుగనె
    సహదేవుఁడు ,సీతనుఁ గని సంతోషించెన్
    నహరహమును చింతించిన
    మహిజాపతికన్నులార మానుగ గనుచున్.



    రిప్లయితొలగించండి