11, డిసెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3571

12-12-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు”

(లేదా…)

“వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే”

79 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    మోదము మీర ప్యారిసున ముగ్ధలు వీరులు మందుగొట్టుచున్
    నాదము జేసి డప్పులను నందము నొందుచు నాట్యమాడుచున్
    వాదము లెల్ల వీడుచును పండుగ జేయుచు ఫ్రెంచివారిదౌ
    వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే...

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. 12-12-2020

      “వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే”


      ఖేదమొసంగుకోవిడుసుఖింపగమూతులముద్దులాడుచున్
      మోదముతోడకౌగిలిడముప్పుకరోన కుదించునాయువున్
      సాదరమంచుచేతులనుసాచినముంచునువైరసంచుని
      ర్వేదమె
      సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే

      గాదిరాజు మధుసూదన రాజు

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మోదము మీర చేరుచును ముద్దులు గొల్పెడి బీచిలందునన్
    జూదము లాడుచున్ తనరి జుత్తులు పట్టుచు క్యాసినోలనున్
    ఖేదము లెల్ల వీడుచును కేకలు వేయుచు కామశాస్త్రపున్
    వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే...

    వేదము : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
    n.
    1. knowledge;

    రిప్లయితొలగించండి
  4. పాండిచెర్రి లో ఫ్రెంచు కాలనీ ఉన్న మాట వాస్తవము. నాకు స్వయంగా తెలిసిన ఫ్రెంచు వాళ్ళు ఇంకా అక్కడ శ్రీ అరవిందాశ్రమంలో ఉన్నారు.. ఆయన వెలుగు లో శ్రీ మాత (Mirra Alfassa) నడువడిలో సాధన చేస్తూనే ఉన్నారు

    ఉ||
    పాదము మోపి భారతము పాండిచెరిన్ జనె ఫ్రాన్సు నుండి సం
    వాదము మాత మీర యట వాసిగ శ్రీ అరవిందదర్శనా
    హ్లాదముజెంది యార్షపథయానము జేయగ సత్యమే గదా
    వేదమె సద్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్ల జాటిరే

    రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి


  5. ఇచ్చిన ఆటవెలది పాదమెక్కడే?


    హరి! వేదమే ప్రమాణమ
    నిరి ఫ్రెంచి జనులు! తెలుసుకొని మసలు కొనవ
    య్య! రవంతైనను సంస్కృత
    మరయగ చూపించు కృషిని మన్నన దక్కు‌న్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఛందఃక్రీడా పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇచ్చింది తేటగీతి పాదం.

      తొలగించండి
  6. వాదములేని వాస్తవము భారత భూమిని నెల్లవారికిన్
    వేదమె సత్ప్రమాణమని; ఫ్రెంచి జనుల్ జగమెల్ల చాటిరే
    మాదకపుం ద్రవంబులను మత్తున జోగుచు జూదమాడుచున్
    మోదము నందుటే బ్రతుకు మూల్యమటంచును నాట్యమాడుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భరతభూమిని జేరిన పశ్చిమంపు
      దేశవాసు లెందరొ తమదిశను మార్చి
      వేదమే ప్రమాణమనిరి, ఫ్రెంచిజనులు
      కూడ గారవింతురు దాని గూర్మిమీర

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!
      🙏🙏🙏

      తొలగించండి
  7. విస్త్రుతముగ ప్రచారమై వేగిరమున
    వేదమెఱిగిన వారలు విషదపర్చ
    తెలుసు కొన్నట్టి విషయాల తీరు గనియు
    వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు!!

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    వేదములు జ్ఞానభాండముల్ మేదిని యని
    సంస్కృతమునేర్చ నెంచి నౌత్సాహికులుగ
    ఫిల్లియోజటుపొత్తముల్ వెల్లివిరయ
    వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు!

    ఉత్పలమాల
    మోదిగ ఫిల్లియోజటు సమున్నత సంస్కృత భాషనెంచియున్
    మేదిని జ్ఞానభాండమని మిన్నఁగ నేర్చియు వ్రాసెపొత్తముల్
    సోదన జేయు సంస్థలట సొంపుఁగ గూరఁగఁ దీర కోవిదుల్
    వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      "మేదిని నని.." అనండి.

      తొలగించండి
    2. _/\_ధన్యోస్మి గురుదేవా_/\_

      సవరించిన పూరణ:

      తేటగీతి
      వేదములు జ్ఞానభాండముల్ మేదిని నని
      సంస్కృతమునేర్చ నెంచి నౌత్సాహికులుగ
      ఫిల్లియోజటుపొత్తముల్ వెల్లివిరయ
      వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు!

      తొలగించండి
  9. జగతి జనులను శాసించు శాస్త్ర మగుచు
    ధర్మ పద్ధతు లందలి మర్మములను
    దెల్పు టకు మూల మై వెల్గు దివ్య మైన
    వేదమే ప్రమాణ మనిరి ఫ్రెంచి జనులు

    రిప్లయితొలగించండి

  10. భగవానుని దీవెన క్ర
    మ్మగ వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్
    జగమెల్లఁ జాటిరే రమ
    ణ గురువుల‌ మదిని తలచుచు నను నిత్యమ్మున్!

    రిప్లయితొలగించండి
  11. జీవుసద్గతికినిచేరువౌయుండుగా
    దివ్యద్రుష్టిమునియుతెలియఁజెప్పె
    నేటికాలమందుమేటియైనిలచెరా
    వేదమేప్రమాణమనిరిఫ్రెంచిజనులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యాపాదం తేటగీతి అయితే మీరు ఆటవెలది వ్రాసారు. నా సవరణ...
      జీవులను సద్గతికిని జేర్చనుండ
      దివ్యదృష్టితో మౌనియు దెలియ జెప్పె
      నేటి కాలమ్ములో నిల్చె మేటి యగుచు
      వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు.

      తొలగించండి
  12. వేద మంత్రము వలదని పెళ్లి జేయ
    భారతీయులు పాశ్యాత్య పధ్ధతనుచు
    ఉంగరము మార్చుకొనుటయే వొప్పుకొన(గ
    వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వొప్పుకొనగ' ... వువూవొవో లతో మొదలయ్యే తెలుగు పదాలు లేవు. "...యొప్పుకొనగ" అనండి.

      తొలగించండి
  13. వాదములెన్నిఁజేసిననుపారముముట్టగదారిఁజూపుచున్
    కాదనలేనిసత్యమునుఖండితపద్ధతిబోధసేయుచున్
    మాదనుభ్రాంతిలోఁబడినమానవజాతికిమేలుకోల్పుగా
    వేదమెసత్ప్రమాణమనిఫ్రెంచిజనుల్జగమెల్లఁజాటిరే

    రిప్లయితొలగించండి
  14. స్వేచ్ఛసోదరసమభావ స్వేదమొప్ప
    తిరుగుబాటురీతులనుర్వి తెలిపివారు
    మంచిరీతులమన్నించి నెంచినేర్చి
    వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు

    (స్వేచ్ఛ సమానత్వం సోదరభావం
    ఫ్రెంచి తిరుగుబాటు నినాదము - దీన్ని
    మొదటి రెండు పాదాలలోని బంధించ
    యత్నించాను ) 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భావ స్వేద' మన్నపుడు 'వ' గురువై గణభంగం. "మన్నించి యెంచి..." అని ఉండాలి.

      తొలగించండి
    2. 🙏 ధన్యవాదాలు.
      సరిదిద్ది వ్రాయగా:

      స్వేచ్ఛసోదరత్వసమతస్వేదమొప్ప
      తిరుగుబాటురీతులనుర్వితెలిపివారు
      మంచిరీతులమన్నించియెంచినేర్చి
      వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు

      తొలగించండి
  15. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

    *“వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు”*
    (లేదా…)
    *“వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే”*

    నా పూరణ

    ఉత్పలమాల

    వేదము పూజ్యనీయమగు పెద్దలు జెప్పిరి సర్వశాస్త్రముల్
    సాధన చేయగావలయు చక్కని యోగము మార్గమౌనటుల్
    మోదము తోడనేర్చి యిక మోక్షముఁ బొందగ సమ్మతంబుగన్
    వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁజాటిరే

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పూజ్యనీయమని' అనండి.. అన్వయం బాగుంటుంది.

      తొలగించండి
  16. సమస్య :
    వేదమె సత్ప్రమాణమని
    ఫ్రెంచిజనుల్ జగమెల్ల జాటిరే

    ( పాండిచెరి ఆశ్రమంలో చతుర్వేదసార పరిపూర్ణులైన ఫ్రాన్సు దేశీయులు చేసిన పని )

    ఉత్పలమాల
    ...................

    ఆదరమొప్ప పాండిచెరి
    యాశ్రమమందున భారతీయమౌ
    వేదము లన్నియున్ జదివి
    వేదన దీరగ జ్ఞానభాండమున్
    మోదముతోడ దాల్చి తమ
    ముగ్ధత స్నిగ్ధత చిందులాడగా
    వేదమె సత్ప్రమాణమని
    ఫ్రెంచిజనుల్ జగమెల్ల జాటిరే !!

    రిప్లయితొలగించండి

  17. వేద శాస్త్రము లెల్లయు విస్తృతముగ
    నధ్యయనమును చేయుచు నాదరమున
    భరత దేశము నందలి ప్రజల వోలె
    *వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు*

    రిప్లయితొలగించండి
  18. వేదమె నాదమై జగతి విస్తృతమై నినదించె బిట్టు, నా
    మోదము నందె, మానవుల మూసిన కన్నులుఁ జూడ జాలె, ఋ
    ష్యాదులు లోకబోధకులునై ప్రవచించిన జ్ఞానవిత్తమౌ
    వేదమె, సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే!.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  19. 12.12.2020
    అందరికీ నమస్సులు🙏

    _*“వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే”*_

    నా పూరణ ప్రయత్నం..

    *ఉ*

    వాదన లేల దప్పనుచు వైభవ మంతయు నెంచినట్లుగన్
    మోదము జూడగన్ దెలియు ముచ్చట గొల్పెడి సత్యవాక్కులున్
    శోధన చేయగా దెలిసె చోద్యము గాదిటు బల్కగా తగున్
    *“వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  20. మునులును చరిత్ర కారులు ఘనులగు చదు
    వరులు చెప్పిన మాటలు వాస్తవమని
    విశ్వ జనులొప్పు కొనఁ గాంచి విధియె లేక
    వేదమే ప్రమాణ మనిరి ఫ్రెంచి జనులు

    రిప్లయితొలగించండి
  21. వాదన మానుమంటి నిక భాషలు సంస్కృతు లందు గాంచగా
    భేదము లున్ననేమి కృత విద్యులు చెప్పెడు సత్యవాక్యముల్
    కాదని చెప్పలేక నను కంప్యులమాటల నాలకించుచున్
    వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచిజనుల్ జగమెల్లఁ జాటిరే

    రిప్లయితొలగించండి
  22. వాదన మానుమంటి నిక భాషలు సంస్కృతు లందు గాంచగా
    భేదము లున్ననేమి కృత విద్యులు చెప్పెడు సత్యవాక్యముల్
    కాదని చెప్పలేక నను కంప్యులమాటల నాలకించుచున్
    వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచిజనుల్ జగమెల్లఁ జాటిరే

    రిప్లయితొలగించండి
  23. వేదమేప్రమాణమనిరి ఫ్రెంచిజనులు
    ఫ్రెంచివారితో బాటుగపృధివినిగల
    యన్నిదేశములకుగద యరయవినుము
    వేదమేకాకయికయేదిలేదుకొలత

    రిప్లయితొలగించండి
  24. వేదపుసారమున్ దెలిసి వీడినశంకలప్రోద్బలంబుతో
    వేదమెసత్ప్రమాణమని ఫ్రెంచిజనుల్ జగమెల్లచాటిరే
    వేదముమూలకారణము విద్యలునేర్వగనెల్లవారికిన్
    వాదనలేనిమార్గమునుభాసిలజేయును లోకమంతకున్

    రిప్లయితొలగించండి
  25. ఉ:

    శోధన చేయగా శ్రుతులు చోద్యము మీర గ్రహింప సత్యమున్
    సాధన మాచరించి నిక శాశ్వత రీతిని మేలునొందనై
    బోధన పాఠమై నిలిపి బుద్ధిని గూర్చగ నెంచి పట్టుగన్
    వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్ల జాటిరే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  26. చావుపుట్టుకలాత్మకు లేవటంచు
    దేహమునువీడి మరియొక దేహమునకు
    నాత్మజేరును పొందుచు నాశ్రయంబు
    వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు

    రిప్లయితొలగించండి
  27. వేదము భారతీయుల పవిత్ర పటుత్వ మహత్వ తత్త్వమై
    నాద నినాద హ్లాద మనునాదము స్రష్టలు ద్రష్టలున్ మహా
    సాధకు లైన యోగి జన సాధ్య మనంత మమేయ సారమే
    వేద మపౌరుషేయమని ప్రీతి గ్రహించి తరించి నించుచున్
    *“వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే”*

    రిప్లయితొలగించండి
  28. వేదములందు లేనిదిక వేరెటలేదని విశ్వసించుచున్
    వేదములభ్యసించుటకు వేడుక సేయుదురెల్ల వార లా
    వేదనదీర్చి దీమసముఁబెంచు నుపాయము జూపగా మహిన్
    వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే

    రిప్లయితొలగించండి
  29. ఆదము ఈవులన్ దలచి హ్లాదము నొందెడు నేసుభక్తులే
    మేదిని వర్తకమ్మనుచు మేరలు దాటుచు చేరిరిండియా
    కాదనలేక సత్యమును కాలిడినంతనె
    పాండిచేరినిన్
    వేదము సత్ప్రమాణమని ఫ్రెంచిజనుల్ జగమెల్లజాటిరే

    రిప్లయితొలగించండి
  30. వీరు వా రన నేమి యీ తీరుగ నిట
    వారును నరులే కద భువిఁ గారణములు
    సూపఁ గాదన వా రెట్టు లోపఁ గలరు
    వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు


    కాదన నేల మా కెఱుక కాకయె యున్న విశేష మిద్ది యీ
    మేదిని నిన్ను నమ్ముదుము మిత్రమ యన్న వచింప మెచ్చుచున్
    వాదము లేల వృత్త మిది పన్నుగ సర్వము నీ వెఱింగినన్
    వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే

    [వేదమె = తెలిసినదే]

    రిప్లయితొలగించండి
  31. వాదము లెల్లజర్గె నట బాధలబాపగ శోధనమ్మునన్
    మోదమునందగా ను మును ముందున ముద్దుగ బల్కిరే యిటన్
    ఆదరణీయమేననుచు యక్కున జేర్చి సమాదరించగా
    వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఆదరణీయమే యనుచు నక్కున జేర్చి..." అనండి.

      తొలగించండి

  32. ఙ్ఞాన సోపాన పథిగ సుఙ్ఞానమొసగి
    శోధనామృతఫలముల బోధజేసి
    ముక్తిసాధనాక్రమమున శక్తినొసగ
    వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు!



    ఙ్ఞాన సోపాన పథిగ సుఙ్ఞానమొసగి
    శోధనామృతఫలముల బోధజేసి
    ముక్తిసాధనాక్రమమున శక్తినొసగ
    వేదమే ప్రమాణమనిరి ఫ్రెంచి జనులు!






    రిప్లయితొలగించండి
  33. మోదము తోడనే ర్చిరట ముందుగ భాగవ తాదిగ్రం థముల్
    వేదము లెల్లయున్ చదివి విద్యల సారమె రుంగుచున్ సదా
    వాదముచేసితేల్చిరిటు వాసిగ నన్నిటి యందుచూ డగా
    *“వేదమె సత్ప్రమాణమని ఫ్రెంచి జనుల్ జగమెల్లఁ జాటిరే”*

    రిప్లయితొలగించండి