12, డిసెంబర్ 2020, శనివారం

సమస్య - 3572

13-12-2020 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చిన్ని చీమ కన్ను చేరెఁడంత”

(లేదా…)

“చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే”

77 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


"శ్రీ రాముని దయ చేతను..."

సరదా పూరణ:

కవయిత్రి సీతాదేవికి అంకితం:

కన్నులు పెద్దగా తెరచి గాభర నొందక కైపదమ్ములన్
చిన్నది నాదు చెల్లియహ చెన్నుగ పూరణలిచ్చి నవ్వుచున్
పన్నుగ శంకరాభరణ ప్రాంగణ మందున చేరి వ్రాయగా
చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే...

Rohit Audipudi Venkata చెప్పారు...

ఉ||
విన్నున సూర్యబింబమగు పెద్దది, జూచిన చిన్నగా గనున్
నిన్నటి రాత్రి చిన్నదగు నృత్యగతుల్ గను ప్రేమజంటకున్,
భిన్నము దృష్టికోణములభీష్టములన్ గని పోవు! నట్లగున్
చిన్నది చీమ లోచనము చేరెడు నోరు సురంగమార్గమే

ఆదిపూడి రోహిత్ శర్మ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻

BMahalakshmi చెప్పారు...

అండపిండమందునతిసూక్ష్మమైయుండు
తన్నుగానకుండదాగియుండు
దివ్యమైనయట్టితిరువేంగడాతండు
చిన్నిచీమకన్నుచేరెడంత

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

చెన్నుగ టీవినందు భళి చేరుచు కోడలి రూపునందునన్
మున్నెపుడున్ గనంగవిధి పూర్తిగ వీడుచు నాటపాటలన్
తన్నగ రాజుగారినహ దారుణ రీతిన మేఠినందునన్
చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
చిక్కఁ బోకుమయ్య చింతకెన్నడు నీవు
తిన్నఁగానె దాని దృష్టిఁ బెంచి
త్రుంచు! మేల్కొనుమయ! తొల్దొల్తఁ గుట్టు నా
చిన్ని చీమ కన్ను చేరెఁడంత! !

ఉత్పలమాల
చిన్నఁగ బుట్టి లోన నిను చింతయె గూల్చఁగ జూచు భూతమై
యెన్నడు లొంగ బోకుమయ యింగితమందున మూలకారణం
బెన్నుచు వీడుమా విజయ వీటికిఁ జేరఁగఁ, దొల్త చింతయే
చిన్నది! చీమ! లోచనము చేరెఁడు నోరు సురంగ మార్గమే!

sitharamayya solasa చెప్పారు...

ఎక్కడెక్కడిదియొ నేరి తెచ్చుకొనుచు
నొక్కదాని వెనుక నొక్కటిగనె
బారు దీరి నడచు , వరుస తప్పదెపుడు
చిన్ని చీమ కన్ను చేరెఁడంత

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


బోనసు సరదా పూరణ:

దున్నుచు చిన్న కాళ్ళుగొని దూరుచు చిన్నగ నేలనుండి భల్
పన్నుగ చేరి మిత్రులను బారులు బారుల రీతి జొచ్చుచున్
మిన్నగ దూరి స్తంభముల మ్రింగుచు మెక్కెడు తెల్ల తోలుదౌ
చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే...

అజ్ఞాత చెప్పారు...

అందరికీ నమస్సులు🙏
ఉ.మా

కన్నుల జూడ లేని క్రిమి కంటక మయ్యెను మట్టు పెట్టగా
పిన్నలు బెద్దలన్ విడక భీతిని గొల్పగ ముట్ట నంటుచున్
భిన్నము దీని వేషములు భీకర రూపము గాదె చూడగన్
*“చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే”*

*వాణిశ్రీ నైనాల, విజయవాడ*

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


* మున్నెపుడున్ గనన్ విధిని

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ఆధునిక ము నందు అత్యంత విజ్ఞాన
పరి కరంబు వలన వస్తువులను
పెద్ద గాను దోచు వింత గా నయ్యెడ
చిన్ని చీమ కన్ను చేరె దంత

ఆచార్య లక్ష్మణ పెద్దింటి చెప్పారు...

శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః

పంచదారపలుకు వదల పూజనుచేసి
మందిరమ్ము మూయ మరు నిముషమె
చేర చోటులేదు చేరెనెటులొ!యరెరె!
చిన్న చీమ!కన్ను చేరెఁడంత

మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.

chandrashekhar yelisetty చెప్పారు...

ఉ:

మన్నిక మీర గోపికల మాటలు తోడుత మార్చనెంచనై
వెన్నుడి జూచి నేరుగను వేరిమి గూర్చగ మన్నటంచనన్
తిన్నగ నోరు దెర్వ మన తేరగ తల్లికి జూపె విశ్వమున్
చిన్నది చీమ లోచనము చేరెడు నోరు సురంగ మార్గమే

వై. చంద్రశేఖర్

BMahalakshmi చెప్పారు...

పన్నుగకాంతిరేఖయదిభాసిలఁజేయునుజీవకోటినిన్
ఉన్నదిలేనియట్టులనునుండునుమాయయెకప్పియుండగా
మన్ననఁజేయకున్ననదిమార్కోనునెంతటివానినైనఁదా
చిన్నదిచీమలోచనముచేరెడునోరుసురంగమార్గమే

seethadevi gurram చెప్పారు...

పంచదార పలుకు పడినంతనె నిముస
మాలసించ కుండ యడుగుబెట్టు
మనిషి కన్ను కనని మైక్రానుల గనెడి
చిన్నచీమ కన్ను చేరెడంత

బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ

మన్నును నోటితోకఱచి మానుగ గట్టగ మేడలెన్నియో
తిన్నగ పాములేయచట తీరుగజేరుచు
బుస్సుబుస్సనన్
దన్నును గోలుపోవకయె దండుగ నేర్పడి గూల్చసర్పమున్
చిన్నది చీమ, లోచనము చేరెడు, నోరు సురంగ మార్గమే

Bapatla Venkateswara sai చెప్పారు...

చిన్ని చీమ కన్ను చేరెఁడంతగజేసి
కుట్టగానె బాధ కునుకు వేళ,
ప్రణయ కాల మందు పట్టె మంచము మీద
నరుని చేయి తగిలి నలిగి పోగ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వంటయింటిలోని కంటికి కనరాని
మారుమూల పంచదార భరిణ
చీమకంటికెటుల చిక్కెనో దైవమా
చిన్ని చీమ కన్ను చేరెఁడంత

విరించి చెప్పారు...

వెంగళప్ప తోడ విజ్ఞత వీడుచు
నతిశయోక్తులెన్నొ యతడు చెప్పె
నక్కతోక జూడ నలుబది మూరలు
చిన్నచీమకన్ను చేరెఁడంత

విరించి చెప్పారు...

అన్నము కూడదంచు తిననంచును పిల్లడు బెట్టు సేయగా
పిన్నియె చెప్పసాగె నొక వింతకథన్ పసివాడికీ విధిన్
వెన్నెల రాత్రి కుంజరము విందుకు పిల్వగ వచ్చె మిత్రుడే
చిన్నది చీమ, లోచనము చేరెడు నోరు సురంగ మార్గమే.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చిన్నది రూపమందుగన చీమ యమాయక జీవికాదు యే
చిన్న పదార్థమైన సడిచేయక కన్గొని ముచ్చిలించుచున్
కన్నమునందు దాచుకొను కష్టము సైచుచు పట్టువీడకన్
చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

సమస్య :
చిన్నది చీమ లోచనము
చేరెడు నోరు సురంగమార్గమే

( అల్పబుద్ధి మంథర అనల్పబుద్ధి కైకను ప్రభావితం చేసినతీరు )

ఉత్పలమాల
...................

అన్నులమిన్న కేకయ కు
లాంగన చెంతకు చేరుకొన్నదే !
గున్నది దాసి యైన ఒక
గూనిది మంథర క్రుళ్లుమోతుదై ;
మున్ను వరమ్ములన్ మగని
ముచ్చట మీరగ గోరుమంచనెన్ ;
జిన్నది చీమ ; లోచనము
చేరెడు ; నోరు సురంగమార్గమే .

ఆదిభట్ల సత్యనారాయణ చెప్పారు...

ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

*“చిన్ని చీమ కన్ను చేరెఁడంత”*
(లేదా…)
*“చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే”*

నా పూరణ

ఆటవెలది

చీమ బొమ్మ గీయఁ జెప్పగా టీచరు
చెట్టుఁ బుట్టఁ దిరిగి చీమఁ దెచ్చి
భూత యద్ద మందుఁ బోడిమిఁ జూడగా
చిన్ని చీమ కన్ను చేర డంత

ఉత్పలమాల

అన్నను వేడియుండెనొక యన్నుల మిన్న కుతూహలం బునన్

పున్నెముగల్గు నీకు నొక బొమ్మను గీయుము! చీమ చిత్రమే!

అన్నయు భూతయద్దమున నచ్చటి చీమను చూచినంతనే

చిన్నది చీమలోచనము చేరెడు నోరు సురంగమార్గమే

ఆదిభట్ల సత్యనారాయణ

Zilebi చెప్పారు...



చిన్ని చీమ కుట్టె చిమచిమ మంటాయె
చిన్ని చీమ కన్ను చేరెఁడంత
చిన్ని చీమ వింత చెప్ప నెవ్వారి త
రమగు శంకరాభరణ కవీశ!


జిలేబి

Zilebi చెప్పారు...



కిసుమీసు పైన దాని మ
నసు! చిన్నది చీమ! లోచనము చేరెఁడు! నో
రు సురంగమార్గమే! వెస
ముసురుకొనుచు పైన తిరిగె మోహము తోడై!


జిలేబి

కంజర్ల రామాచార్య. చెప్పారు...

ఎన్నగ మేటి జ్ఞానమది యేమని చెప్పఁ దరమ్ము మానవుం
డున్నది భూమిపై కను నధోజగదూర్ధ్వజగద్రహస్యముల్
దిన్నను తూమెడోగిరముఁ దీరవు తత్క్షుధ లేమి చోద్యమో!
చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే.

కంజర్ల రామాచార్య

కంది శంకరయ్య చెప్పారు...

మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చిన్నగా గనున్'? "పెద్దది, చిన్నగ జూడ తోచెడిన్" అంటే ఎలా ఉంటుంది?

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఉ. మా లో మొదటి పాదంలో గూల్చఁగ బదులు మ్రింగఁగ అని చదువుకొన ప్రార్థన.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ ఛందఃక్రీడా పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

chandrashekhar yelisetty చెప్పారు...

ధన్యవాదములు

కంజర్ల రామాచార్య. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంజర్ల రామాచార్య. చెప్పారు...

🙏నమస్కారములండీ ధన్యవాదములతో

రామాచార్య

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురువర్యా! నమస్సులు! 🙏🙏🙏

ఉదయ భాస్కర్ చెప్పారు...

చీమయెంచిజూడచిన్నదైతోచును
పెద్ద బరువుమోయు పదిలముగను
సూక్ష్మబుద్ధితోడ సురసముగనిపెట్టు
చిన్ని చీమ కన్ను చేరెఁడంత

చిన్నికృష్ణుడపుడు పిన్నవాడేగదా
ప్రేమతోడజేసెపెద్దపనులు
సూక్ష్మబుద్ధియున్న సుఖములరయవచ్చు
చిన్ని చీమ కన్ను చేరెఁడంత

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

subbarao చెప్పారు...

మన్నుమిన్నునేలు మహితుని సేవించు
నాంజనేయుడంత యగుచుకుఱుచ
సీతజాడవెదకె శ్రీలంకయందున
చిన్నిచీమకన్ను చేరెడంత

Zilebi చెప్పారు...



శ్యామలీయం వారి కా మింటు -


"చేరెడంత అనరాదండీ. చేరు క్రియాపదం. ఎడు మానార్ధకం. సరైన ప్రయోగం చారెడంత అన్నది.ఇక్కడ చార అన్నది అరచేతి కొలత. చారెడు అంటే అరచేతిలో పట్టెడునంత అని."


ఇట్లు
అక్కడిదిక్కడదిక్కడిదక్కడ
జిలేబి

ఆదిభట్ల సత్యనారాయణ చెప్పారు...

ధన్యవాదములు

నమస్కారములు

🙏🙏

BMahalakshmi చెప్పారు...

ధన్యవాదములండిగురువుగారు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అవ్వ లోక మెల్ల వ్యాపించె వీక్షించి
వింత కీటకమ్ము పంత మూని
ప్రజలఁ దాకి వేగ భక్షించె దయ వీడి
చిన్ని చీమ కన్ను చేరెఁడంత


కన్న! తలంచు మింక మదిఁ గమ్మిఁక బుద్ధి గలట్టి వానిగాఁ
దన్నిన రాల దొక్కటియు దమ్మిడి వింతగఁ గాంచఁ జేతి లో
నున్నది చిన్నినాణె మట యూహలు మాత్రము దాటు కోటలం
జిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

చేర ఎఁడు = చేరెఁడు. సాధువే. చేర = ఇంచుక వంచఁబడినచేయి, ఎఁడు = పరిమాణార్థకము.
ఇక్కడ సంధి నిత్యము.
11.
అంద్వవగాగమంబులం దప్ప నపదాదిస్వరంబు పరంబగునపు డచ్చునకు సంధి యగు.
మూర + ఎఁడు = మూరెఁడు
వీసె + ఎఁడు = వీసెఁడు
అర్థ + ఇంచు = అర్థించు
నిర్జి + ఇంచు = నిర్జించు
అంద్వవగాగమంబులు పరంబగునపుడు యథాసంభవముగా గ్రహించునది.
రాములందు - రాములయందు, హరియందు, ఎనిమిదవది - ఎనిమిదియవది.

చేరు కాదని గ్రహించఁ దగును.

subbarao చెప్పారు...

మిన్నగురూపముంగలిగి మేదినినంతను నాక్రమించునై
బన్నుగరామచంద్రునకు బంటుగనుండుచు సీతజాడకై
మిన్నునబోవుచున్ నడుమ మీరినలంకిణినోటచిన్నగౌన్
చిన్నదిచీమ,లోచనముచారెడు,నోరుసురంగ మార్గమే

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

ఎన్నడునైనవిన్నదియునెన్నడునైననురెండుకళ్లతో
గన్నదికాదుబ్రహ్మమనగాగడుబెద్దదిజీవులందునన్
*“జిన్నది చీమ ,లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే”*
యెన్న సదాశయాక్షి మఱి యెన్నగ నాశయె యాస్యమౌ గదా

BULUSU V S MURTY చెప్పారు...

కన్న కొడుకు చూడ చిన్నవాడే యౌను
తండ్రి దుర్గుణములు తనకు లేవు
భయము లేక నిలిచె భక్తియె రక్షగా
చిన్న చీమ కన్ను చేరెడంత

ఆచార్య లక్ష్మణ పెద్దింటి చెప్పారు...

శ్రీమాత్రేనమః /శ్రీగురుభ్యోనమః

మిన్నగ కట్టినాడొకడు మేడను నేదియు దూరనట్లుగన్

చెన్నలరార,చెంత గలచీమల పుట్టను
చూడకుండగన్!

చిన్నది చీమ!లోచనము చేరెఁడు!నోరు
సురంగమార్గమే!

దున్నుచు మేడమూలనది దూరెను
మొత్తము మేడగూల్చెనే!!!

మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

నిఘంటు శోధనలో మానార్థంలో చేర శబ్దమే ఉన్నది. చార శబ్దానికి వేరే అర్థాలిచ్చారు. కనుక చేరెడు అనడం సాధువే.
"చిచ్చున వెచ్చి పొట్ట కొక చేరెఁడు గంజియు లేక యాఁకటం జచ్చియుఁ జావ మించుక విషంబయినం గొని" (కొఱవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక)
'చారెడంత' అన్నది వ్యావహారికం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

కంది శంకరయ్య చెప్పారు...

సోదరుడు - సోదరి అన్నట్లు నారదుడు - నారది అనవచ్చునేమో?