14, డిసెంబర్ 2020, సోమవారం

సమస్య - 3574

15-12-2020 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము”

(లేదా…)

“మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్”

82 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


"శ్రీ రాముని దయ చేతను..."

సరదా పూరణ:

కూలగ మైత్రి హృత్తునను కొండొక పూర్వపు మిత్రుడే వడిన్
మేలుగ జేరియాదటను మిక్కిలి వేగమె శత్రులందునన్
కాలుని వేషమున్ గొనుచు కమ్మని మాటల మభ్యపెట్టుచున్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్...

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

కాలము మారిపోవగను కమ్మని చోరుల మైత్రివీడుచున్
కేలున బట్టి సంకెలను కిక్కురు మన్కనె వెంబడించుచున్
పోలిసునందు జేరగను పొంకము మీరగ వృత్తి మార్పగన్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో...

తేటగీతి
పుత్రు నభిమన్యుఁ జంపిన ముఖ్యుఁడైన
కర్ణుని రధమ్ము క్రుంగెను గాంచుమయ్య
రయమె బాణమ్ము సంధించి రాజరాజు
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము


ఉత్పలమాల
ఆలము నందు నీ సుతుని నంతము జేసిన వారినొక్కడై
తేలెను నేడు యుద్ధమున. ,తేరది భూమిని గ్రుంగి చిక్కె నీ
పాలిట యర్జునా! కనుము భాస్కర సూనుఁడు రాజరాజుకున్
మేలును గోరి వచ్చెనట మిత్రుడు! వానిని జంపఁగాఁ దగున్!!

 

విరించి చెప్పారు...

*విభీషణుడు రావణునితో పలికిన మాటలుగా*
***** ****** ****** ***** *** **** **
పరసతిని పట్టి బంధింప భావ్య మదియు
కాదటంచు హితువు చెప్పె కపి వరుండు
మేలు కోరిన హితుని ప్రాణాలు గొనుమ
టంచు నాజ్ఞనిచ్చుట తగదంటి భ్రాత.

యెనిశెట్టి గంగా ప్రసాద్ చెప్పారు...

స్నేహ మునువీడి వైరితో చేయి కలుప
కక్ష గట్టిన వానినే కారణమున
విడువదగునేల నొకనాటి విమలమతిని
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము!!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


బోనసు సరదా పూరణ:

(బహుశః) రాష్ట్రీయ స్వయంసేవక సంఘపు మనోగతము (1947):

కూలగ భారతావనియె కుత్సిత మయ్యెడి కుట్రపన్నుచున్
తేలికగాను రేఖనిడి తీర్చగ కోరిక పాకి జిన్నకున్
వీలుగ నెహ్రుకాదటను వెంటనె వెంటనె మౌంటుబాటెనై
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్...

Bapatla Venkateswara sai చెప్పారు...

ప్రాణ మిత్రుడు వ్రణముతో బాధ బడగ,
వ్యాధి కేమందు లేదనే వైద్యు లంత
బాధ పడలేను మిత్రమా! వాంఛదీర్చు
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము

Zilebi చెప్పారు...



రక్షణ నొసగ దగు గాచి రాధనముగ
మేలుఁ గోరిన హితుని, ప్రాణాలఁ గొనుము
కీడు సేయతలచినచో కింకరుడిని
నీతి సూత్రమిదె జిలేబి నీటుగాను !


జిలేబి

BMahalakshmi చెప్పారు...

సంధిసేయంగయల్లుడుసమతనెంచి
కుటిలమతియయ్యెనాగమ్మగూఢబుద్ధి
మంచిచెడులనుఁజూడకనానతిచ్చె
మేలుఁగోరినహితునిప్రాణాలఁగోనుము

Zilebi చెప్పారు...



"కనలించితివే బింబా
నన! మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వా
నినిఁ జంపఁగాఁ దగున్? నీ
తినివీ డితివే నెలతుక!" తిట్టెను హితుడే!


జిలేబి

విరించి చెప్పారు...

*విభీషణుడు రావణునితో పలికిన మాటలుగా*
***** ****** ****** ***** *** **** **
బాలిశుడేమి కాదిటకు వచ్చిన వానరు డెవ్వడో యనన్
గాలితనూజుడే కద సుగాత్రిని రాముని జేర్చకున్న నీ
యాళి వినాశమౌననుచు నానిలియే వచియించె గాదుటే
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్

BMahalakshmi చెప్పారు...

వీలునుచాలులేకకపటవేషమునెంచుచువావిదప్పుచున్
పాలునుమాకునిమ్మనెనుపాండునిసూనుడుబావనంపుచున్
ఆలముసేయఁబోమునికయాతనిదౌష్ట్యమురాయబారిగా
మేలునుగోరివచ్చెనటమిత్రుడువానినిఁజంపగాఁదగున్

BMahalakshmi చెప్పారు...

చాలులేకనట

seethadevi gurram చెప్పారు...

గేలిని జేయగా సభను కిన్కను బూనుచు రక్షకుండుగా
మేలునుగోరి వచ్చెనట మిత్రుడు, వానిని జంపగాదగున్
మేలును జేసినట్టియెడ మేరలు దాటిన దుష్టభావమున్
దూలగనాడుచున్ దిరిగి దోషము మోపగ ఛేదిపాలుడై

chandrashekhar yelisetty చెప్పారు...

ఉ:

కాలము చెల్లు పెట్టుబడి గంపెడు నాసల గూర్చనంచనన్
మూలము తానెయై సకల భూమము నంతయు కొల్లగొట్టగన్
కీలెఱు గంగ వాతలను క్లేశము దీర విధింప ద్వేషమున్
మేలును గోరి వచ్చెనట! మిత్రుడు వానిని జంపగాదగున్

వై. చంద్రశేఖర్

sitharamayya solasa చెప్పారు...

రాజకీయము నందు స్థిరమగు హితులు
గాని వైరి గాని మనుట గానమెపుడు
సుంత లోనె మనదరికి సూడుకాని
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము

Bapatla Venkateswara sai చెప్పారు...

మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము!
నిధియు దొరుకునునడవిన నీకు నేడు
మంచి జరుగని జెప్పెనే, వంచకుడగు
మారు వేషదారి విరోధి మర్మముగను

seethadevi gurram చెప్పారు...

కేలును జాచుచున్ దిశల కృష్ణుని ఛాయను విస్తరించుచున్
చాలిక చోరులన్ బనుల జక్కగబెట్టగ
ప్రోత్సహించుచున్
కాలునిరూపుగా రజని కాటును వేసెడి
జీవజాళికిన్
మేలునుగోరి వచ్చెనట, మిత్రుడు వానిని జంపగా దగున్

మిత్రుడు = సూర్యుడు

ఉదయ భాస్కర్ చెప్పారు...

అర్థశాస్త్రమునాసక్తి నభ్యసించ
గురువు కౌటిల్యు విశదించె గుప్తనీతి
పాము నీడన మసలుటె పాడి, వైరి
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము

ఉదయ భాస్కర్ చెప్పారు...

మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
అయ్యొ! నీ రీతి పాఠము ఒప్పుగాదు
ఎందుకని చెలికానిని చంపవలయు
మంచి విశదించి సరితోవ నుంచదలచ
నేరమెట్లౌనునదియెంతొ గౌరవమ్ము

ఆవుల చక్రపాణి యాదవ్ చెప్పారు...

సమస్య :-
“మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము”

*తే.గీ**

శివుని నామము తలవని చిన్న వాని
ప్రాణములు తీయగ మనసు బాధ జెందె
నిజము జెప్పిన ప్రహ్లాదుని తన తండ్రి
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము
..................‌‌✍️చక్రి

(సైనికాధికారి భటునితో....)

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

సమస్య :
మేలును గోరి వచ్చెనట
మిత్రుడు వానిని జంపగా దగున్

(నలగామరాజు అల్లుడైన అలరాజు మలిదేవ
రాజు పక్షాన సంధికోసం వస్తే నాయకురాలు నాగమ్మ నరసింగరాజుతో )
ఉత్పలమాల
..................

కాలము దాపురించినది
గా యలరాజుకు దూత కిప్పుడున్ ;
దేలిక నల్లు నగ్రజుడు
త్రెంచుకొనం ; డిక సంధి యైనచో
నేలిక కాగలండతడు ;
నీ కిక దప్పదు కాశికేగుటల్ ;
మేలును గోరి వచ్చెనట
మిత్రుడు ; వానిని జంపగా దగున్ .

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మరచి పోరాద దెన్నడు మంచి గోరి
మేలు గోరిన హితుని : ప్రాణాలు గొనుము
మిత్రుని వలె నటియించుచు శత్రు వౌచు
హానిని తల పెట్టెడు వాని నందు రిలను

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చివరి పాదంలో చివర నదను జూచి అని సవరణ చేయడ మైనది

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మంచి మిత్రులు' సినిమాను గుర్తుకు తెచ్చారు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
"నీ పాలిట నర్జునా!" అని ఉండాలి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ బోనసు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మందు లేదన వైద్యులంత" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...సేయంగ నల్లుడు... జూడక యానతిచ్చె..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం. "...సేయబో మికను నాతని..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంజర్ల రామాచార్య. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"కౌటిల్యుడు దెలిపె.."
"అయ్యొ యీరీతి పాఠము లొప్పు గావు.."

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సమస్యను ఇస్తున్నపుడు నాకు ఈ ఘట్టమే మనసులో మెదిలింది.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణభంగం. "మిత్రుని వలె నటించుచు.." అనండి.

కంజర్ల రామాచార్య. చెప్పారు...

కర్ణుడు దుర్యోధనునితో..

మేలము లాటలా! సుతసమేతముఁ గూల్చగ వచ్చె శౌరి యై
దూళుల నిమ్ముటంచనియె ద్రోహసమంచితబుద్ధిపూర్ణుడై
వ్యాలఫణాంతభీకరమహద్విషకుంభపయోముఖమ్మునై
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు! వానినిఁ జంపఁగాఁ దగున్

కంజర్ల రామాచార్య.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
"ఇమ్మటంచు..." టైపాటు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

_/\_ధన్యోస్మి గురుదేవా_/\_

సవరించిన పూరణ:

ఉత్పలమాల
ఆలము నందు నీ సుతుని నంతము జేసిన వారినొక్కడై
తేలెను నేడు యుద్ధమున. ,తేరది భూమిని గ్రుంగి చిక్కె నీ
పాలిట నర్జునా! కనుము భాస్కర సూనుఁడు రాజరాజుకున్
మేలును గోరి వచ్చెనట మిత్రుడు! వానిని జంపఁగాఁ దగున్!!

chandrashekhar yelisetty చెప్పారు...

ధన్యవాదములు

ఉదయ భాస్కర్ చెప్పారు...

సవరించి 🙏

అర్థశాస్త్రమునాసక్తి నభ్యసించ
గురువు కౌటిల్యుడు తెలిపె కుటిల నీతి
పాము నీడన మసలుటె పాడి, వైరి
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము

🙏 ధన్యవాదాలు

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

కాలుని రూపమై ప్రజల కారడి బెట్టగ శాస్త్రసమ్మతం
బాలన పాలనార్హము నపార ధనంబు బలంబొసంగు పా
పాలను మట్టుబెట్టుననె బాలిశు వంచన శత్రురాజికిన్
*“మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్”*

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

Sistla Sharma చెప్పారు...

కాలము నందునన్ దరిని
కష్టము లందున స్నేహభావపున్
దాలిమి జూపుచున్ మనికి
దారుల వెల్గుల వెల్లువై జన
న్నేలవచింతురీ పగిది -
నిమ్ముగ క్లేశము బాపు మాన్యుడై
మేలును గోరి వచ్చెనఁట
మిత్రుఁడు - "వానినిఁ జంపఁగాఁ దగున్"?!

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కురుపితామహుడాతఁడు కుమతికాదు
వచనబద్ధతఁ కాతండు వశ్యుడయ్యె
యుద్ధనీతిని తలదాల్చి యుద్యమించి
మేలుఁ గోరిన హితుని ప్రాణాలఁ గొనుము

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

కాలము మించిపోయెనని కౌరవవర్గము హ్లాదమందగా
గూలిన పార్థునిన్ బలికె గూరిమి కృష్ణుడు చూడుమర్జునా!
లీలగ సైంధవున్ ., ముగియలేదు దినంబదె, మంచివారికిన్
మేలొనరింపవచ్చెనఁట మిత్రుడు., వానిని జంపగా దగున్!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

seethadevi gurram చెప్పారు...

కర్త నేనను భావమ్ము ఖలునికగును
విస్మరింపుము కర్తృత్వ విధిని నీవు
ధనువు నందుకొమ్ము విజయ! ధర్మమునకు
మేలుగోరిన, హితుని ప్రాణాలు గొనుము!

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

తిన్నయింటికి వాసముల్ లెక్కపెట్టి
హాని చేయగ నెంచెడి వాని పనులు
వాసిగ గమనించుము వాడు వడిగ రిపుల
*మేలు గోరినహితుని ప్రాణాల గొనుము.*

మేలును కూర్చెదన్నిపుడు మీకని తీయని మాటలా డుచున్
కోలనుచేతబట్టుకొని కోరుచు నాశము వైరి కోర్కె పై
మాలనుబట్టివచ్చెగను మానసమందున శత్రుమూ కకున్
*“మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్”*



ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కాలము దాపురించె కురు క్ష్మాస్థలి సంగరమందు కర్ణునిన్
కూలగజేయగా ధరను గొన్మిక కోలను వేయ బాణమున్
జాలము చేయనేలనిక చాలును లాలసతో సుయోధనున్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్

A.Satyanarayana Reddy చెప్పారు...

పాలను బోసి పెంచినను పాము విషమ్మును చిమ్మకుండునే
బేలను హింస పెట్టి కడు భీకర రీతిని సంహరించె పా
పాలఫలమ్మునన్ దొరికె పాలసుడో యధికారి చేతికిన్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్

BMahalakshmi చెప్పారు...

సరిజేసుకుంటాను

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఱాతి నింకఁ జేత ధరించి భీతిచెంద
కించు కేని చిత్తమున భక్షించుఁ గొండ
చిలువ దాని వేగమ్మ, రక్షించ నెంచ
మేలుఁ గోరిన హితుని, ప్రాణాలఁ గొనుము


ఫాలుని యాజ్ఞ తోడుత నవారితపాశధరోగ్ర చిత్తుఁడౌ
కాలుని కెంచఁ గాక మఱి కాయము లిద్ధరఁ గూల్చ శక్యమే
బాలక! యేరికైనఁ బొరపా టగు నివ్విధిఁ బల్క నెన్నఁడున్
మేలును గోరి వచ్చెనఁట మిత్రుఁడు వానినిఁ జంపఁగాఁ దగున్

Eswarappa.k చెప్పారు...

మేలుగోరిన హితుని ప్రాణాలుగొనుము
కాళికాదేవి గుడియందుఖడ్గమెత్తి
" బట్టి విక్రమార్కుని తలబట్టినరుక"!
దేవి ప్రత్యక్ష మైవారి దీప్తి బెంచె!

subbarao చెప్పారు...

ఒడిని చేర్చుకొ నుముప్రీతితోడనెపుడు
మేలుగోరినహితుని,ప్రాణాలగొనుము
కీడుజేసెడుదుర్మార్గు నొడిసిపట్టి
బంధుడైనను నెవరైన వదలవలదు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

అద్భుతమైన పూరణ.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కురుక్ష్మాస్థలి' అన్నపుడు 'రు' గురువై గణభంగం. సవరించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురువర్యా! 🙏🙏🙏

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...

మేలునుగోరివచ్చెనటమిత్రుడు,వానినిజంపగాదగున్
మేలములాడబూనుటనుమేదినిమానుము,మేలుజేయునాత!బాలసుడాతడేనిజముపర్వులువెట్టుచుబోవబోకుమా
కాలమె చంపువానినిక గాచుటయెవ్వరిజేత గాదులే

subbarao చెప్పారు...

1.బ్రీతిబడయమదికి
3.దుర్మార్గునోడజేయు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.