15, డిసెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3575

16-12-2020 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తేలు గుట్టె బాధ తెలియదింత”

(లేదా…)

“కుడ్యముమీఁది తేలొకనిఁ గుట్టెను బాధ యెఱుంగఁ డింతయున్”

61 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    జాడ్యము లొందగా విరివి జాయయు పుత్రుల కాపురమ్మునన్
    కుడ్యము పైన గోచిగొని కూర్మిని వీడుచు సన్యసించుచున్
    జాడ్యము లన్నిటిన్ గెలిచి జందెము వీడెడి సాధుపుంగవున్
    కుడ్యముమీఁది తేలొకనిఁ గుట్టెను బాధ యెఱుంగఁ డింతయున్...

    రిప్లయితొలగించండి
  2. తేలు కుట్టిన బాధ సంగతి తెలీదుకాని ముందున్న బాధ మాత్రం పోయింది..(Neurotoxin వల్ల నాడ్యవిముక్తి)😉😉


    ఈడ్యవిశేషమున్ వెతుకనీతడు బోయెను యోగవిద్యలో
    నాడ్యవిముక్తుడౌట భువినందున బాధగలుంగ దానికై
    కుడ్యముమీద తేలుగని గ్రుచ్చగ కుట్టెను తృష్ణదీరగన్
    కుడ్యము మీద తేలొకని గుట్టెను బాధనెరుంగడింతయున్

    రోహిత్🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  3. నవ్వుచాటువిషమునరకముఁజూపించు
    పువ్వులన్నికావుపూజకోఱకు
    మనసుబాధమనిషిమరువడుజన్మలో
    తేలుకుట్టెబాధతెలియదింత

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు

    1. ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం)

      కుడ్యము దూకుచున్ కడకు కూరిమి నొందుచు జంద్యమూనుచున్
      నడ్యపు గుంపులన్ విడిచి నందము నొంది యమేఠినందునన్
      కడ్యము కట్టి తొయ్యలిని కమ్మగ గెల్చెడి రిమ్మనందునన్
      కుడ్యముమీఁది తేలొకనిఁ గుట్టెను బాధ యెఱుంగఁ డింతయున్...

      తొలగించండి
    2. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  5. రామ రామ :)

    ఔర! మోహమందు నాభామ కెడ నన్ను
    తేలు గుట్టె బాధ తెలియదింత
    యైన నేమి వింత! హయ్యారె మధువును
    గ్రోలి నట్టి మత్తు గ్రోల గ్రోల !



    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. ప్రియసఖి ణిసిధాత్వర్థము
    కయ! కుడ్యముమీఁది తేలొకనిఁ గుట్టెను బా
    ధ యెఱుంగఁ డింతయున్ చూ
    డయో! యిదెకదా మహిమ పడతి చెంతయ్యో!



    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. పాడ్యమినాడు చౌర్యమును పన్నుగ జేయగ బూనిచోరులే
    కుడ్యముదూకి గేహమున గుట్టుగ దూరగ నెంచియెక్కగా
    కుడ్యముమీద తేలొకని గుట్టెను బాధ
    యెఱుంగ డింతయున్
    జాడ్యము చర్మజన్యమయి సాయము జేసెను చౌర్యమందునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
      కంటిలోని నలుసు కాలిముల్లు
      ఇంటిలోని పోరు యింతింత కాదయా
      తేలుగుట్టె బాధ తెలియదింత
      😊😎

      తొలగించండి
    2. గుండావారి బాటలో 🙏🙏🙏

      ఈడ్యమె పాండునందనుల నీడ్చగ
      కానల మాయద్యూతమున్
      మౌఢ్యము లావెయై మగువమానము
      ద్రుంచగ సాహసించెనే
      జాడ్యము రాజ్యకాంక్షయయి జ్ఞాతుల
      పంతము లాలకించకే
      కుడ్యముమీది తేలొకని గుట్టెను బాధ
      యెఱుంగ డింతయున్

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
      మధ్యలో చెప్పినది నవ్వుకోడానికి బాగుంది.

      తొలగించండి
    4. ధన్యాస్మి గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి
  8. విడ్యమునోటియందునిడివేషముమంచిగఁజూపుచుండుగా
    కుడ్యముమీదిబల్లివలెగోముగచేతలమార్చుచున్వెసన్
    జాడ్యమురాజకీయమదిజారిననీతినినేర్చిరేతగన్
    కుడ్యముమీదితేలోకనిఁగుట్టెనుబాధయెఱుంగడింతయున్

    రిప్లయితొలగించండి
  9. భక్తి యందు మున్గె భగవంతు ధ్యానాన
    తన్మ యత్వమందు తనను మరచి
    బాహ్య స్పర్శ లేక పరవశంబున నుండ
    తేలు గుట్టె బాధ తెలియ డింత

    రిప్లయితొలగించండి
  10. పంట పండి యుండి వరదల పాలయ్యె
    కుండ నిండు కుండె కూలి వాని
    మనసు బాధ జూడ మరువక నుండెనే
    తేలు గుట్టె బాధ తెలియదింత

    రిప్లయితొలగించండి
  11. ఢిల్లీలో ప్రతిపక్షము వారి కామెంట్...

    ఆటవెలది
    రాజధాని లోన రైతన్న లెల్లరు
    తగని చట్టమనుచు పొగులు చున్న
    స్పందనంబులేని జాడ్యాన ప్రభుతకు
    తేలు గుట్టె బాధ తెలియదింత!

    ఉత్పలమాల
    ఈడ్యమె భారతావనిని నిందరురైతులు వీధికెక్కినన్
    మౌఢ్యము వీడి వారలను మన్నన జేసెడు మాటలేదనన్?
    జాడ్యము మేనుఁగప్పినదొ? స్పందన లేదొకొ? హస్తినాపురిన్
    కుడ్యముమీఁది తేలొకనిఁ గుట్టెను బాధ యెఱుంగఁ డింతయున్!

    రిప్లయితొలగించండి
  12. ఇంటి నందు తిట్టు నిల్లాలు భర్తయున్
    ఎదురు తిరుగ లేడు, నెంత ఘనము
    కంటి నుండి నీరు కానిపించగ నుండె
    తేలు గుట్టె బాధ తెలియదింత

    రిప్లయితొలగించండి
  13. కొమరుడేడ్చె నంచు కొనిదెచ్చె నాతడు
    కీలు బొమ్మ లెన్నొ వేలు పోసి
    యందు లోన యున్న యందాల మరబొమ్మ
    తేలు గుట్టె బాధ తెలియదింత

    రిప్లయితొలగించండి
  14. వీడ్యము నోట బెట్టుకుని వేదన చెందుచు వాడు కుష్టనే
    జాడ్యము గల్గినట్టి పరి చారకు వేగము బండుగంచు నా
    పాడ్యమి రోజు గేస్తు పనిపంచగ నూడ్చెడు పాళమందునన్
    కుడ్యముమీఁది తేలొకనిఁ గుట్టెను బాధ యెఱుంగఁ డింతయున్

    రిప్లయితొలగించండి
  15. రాజకీయాల్లో జరిగే అనూహ్య పరిణామాల పై ఈ నా ప్రయత్నము:

    ఉ:

    కుడ్యము పైని పిల్లి వలె గుంపును మార్చ నభీష్ట సిద్ధికై
    కడ్యము గట్టి వేచె నవకాశము కోసము రాజనీతిగన్
    మౌఢ్యము మీర దల్చె నట మంచికి పట్టము గట్ట, చోద్యమున్
    కుడ్యము మీది తేలొకని గుట్టెను, బాధ యెఱుంగ డింతయున్

    గుంపు= రాజకీయ పార్టీ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  16. దొంగపనులుజేసి దొరకిపోయినవేళ
    తప్పుజరిగెననుచు నొప్పుకొనక
    కోర్టుగుమ్మమందు కొలువుదీరినపుడు
    తేలు గుట్టె బాధ తెలియదింత

    మనసువిప్పతాను మాటరాకతలచె
    మగువచెంతచేర మధువెదిక్కు
    మాటబయటరాక మతిబోయినిలచిన
    తేలు గుట్టు బాధ తెలియదింక

    రిప్లయితొలగించండి
  17. ముద్దు లొలుకు నాదు మూడవ మనుమని
    గోర్కె దీర్చ మొన్న గొన్న చిన్ని
    బొమ్మ వృశ్చికమును ముట్టి జూడగనె యా
    తేలు గుట్టె , బాధ తెలియదింత

    రిప్లయితొలగించండి
  18. సమస్య :
    తేలు గుట్టె బాధ తెలియ దింత

    (శకునితో ధర్మరాజు పాచికలాట)

    హద్దు మీరి శకుని యాశ బెట్టుచునుండ
    ధర్మతనయు డొడ్డె దనను గూడ ;
    ద్యూతమనెడి యిట్టి దుష్టమౌ వ్యసనంపు
    దేలు గుట్టె ; బాధ తెలియ దింత .

    రిప్లయితొలగించండి
  19. గుణము తెలిసి మసలు గుణవంతు లెందరో
    తెలుసు కొందు రన్న తేలు విషము,
    విషము కున్న నసలు విఱుగుడు నెఱగంగ
    తేలు గుట్టె బాధ తెలియదింత
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. పాడ్యమిరాత్రివేళ ధనవంతుని యిల్లిది యంచు నాశతో
      కుడ్యము నెక్కి దూకి నిశిఁ గొంపను దూరి ధనమ్ము దోచగా
      నీడ్యచరిత్రచోరులు..., నదేసమయమ్మున నిర్వురందునన్
      కుడ్యము మీఁది తేలొకనిఁ గుట్టెను బాధ యెఱుంగఁ డింతయున్.

      కంజర్లరామాచార్య.

      తొలగించండి
  21. మైలవరపు వారి పూరణ

    జాడ్యవిహీనధీయుతుడు సర్వజగద్ధరిభావభావుకుం...
    డీడ్యతపోభిలాషి రమణేంద్రుడు దీక్ష వహించియుండగా
    కుడ్యమునానఁ దేలొకటి కుట్టెను.,భౌతికదృష్టి లేమిచే
    కుడ్యము మీద తేలొకని గుట్టెను బాధ యెఱుంగ డింతయున్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  22. బోనసు సరదా పూరణ:

    దుర్లభ ప్రాసతో:

    మీడ్యము డోసునన్ గొనుచు మిక్కిలి ప్రీతిని స్కాచివిస్కినిన్
    స్టేడ్యము నందునన్ జనుచు చెంతను రాగను పార్టివర్కరుల్
    పోడ్యమునెక్కి స్పీచినట పోరున గొట్టగ గచ్చిబౌలినిన్
    కుడ్యముమీఁది తేలొకనిఁ గుట్టెను బాధ యెఱుంగఁ డింతయున్...

    రిప్లయితొలగించండి
  23. పెండ్లి యయ్యె నాకు పెద్దలు చేయంగ
    భార్య మవికి రాగ భర్త నైతి
    చీర నగలటంచు చెదపురుగు తొలంచ
    తేలు కుట్టె బాధ తెలియదింత

    రిప్లయితొలగించండి
  24. వాల గోడ మీద బల్లి దాని నరసి
    వేగ వేగ వెన్క కేఁగి దాని
    తోక నంటఁ జేరి తూర్ణమ్ము వాలమ్ముఁ
    దేలు గుట్టె బాధ తెలియ దింత


    పాడ్యమి నుండి డెందమునఁ బన్నుగ నిత్యము మృత్యులోక స
    మ్రాడ్యమ ధర్మరాజును గరమ్ము నుతించి చరించు చుండెనో
    జాడ్యము వచ్చి దేహమునఁ జచ్చెనొ నాడులు విస్మయమ్ముగాఁ
    గుడ్యము మీఁది తే లొకనిఁ గుట్టెను బాధ యెఱుంగఁ డింతయున్

    రిప్లయితొలగించండి
  25. ఆఢ్యుని కాఢ్య రోగము గుణాఢ్యుని కెవ్వడు లేడు వానికా
    జాడ్య మమేయ చింతనను, సద్గతికై జగదంబ సాధనన్
    గడ్య మటంచు నెంచి నరకార్ణవముం గడగంగ జేయ నా
    *“కుడ్యముమీఁది తేలొకనిఁ గుట్టెను బాధ యెఱుంగఁ డింతయున్”*

    రిప్లయితొలగించండి
  26. తేలుగుట్టెబాధ తెలియదింతవరకు
    మత్తుమందునీయ మగతగలుగ
    నేదియెటులయైన నీమత్తుమందులు
    వాడకుండజేయవలయు సుమ్ము

    రిప్లయితొలగించండి
  27. నమ్ముకున్నవారు నట్టేట ముంచిరి
    మనసు పడెడు క్షోభ మరువలేను
    బాధలన్నిట పెనుబాధ వంచన గాదె
    తేలు గుట్టె బాధ తెలియదింత

    రిప్లయితొలగించండి
  28. కుడ్యముమీదితేలొకనిగుట్టెనుబాధయెఱుంగడింతయున్
    కుడ్యముమీదయుండునదికుట్టెడుతేలునుగాదుగాగనన్
    కుడ్యముమీదితేలలదికూరిమితోడనుజేసెజక్కెరన్
    నీడ్యమెయట్లుజేయుటనునెవ్వరినైనను సంతసంబునన్

    రిప్లయితొలగించండి
  29. అందమున్న వనిత నందించ "చూపులు
    సంధిజేయుచుండ" సరసమందు
    తేలుగుట్ట బాధ తెలియదింత " మనిషి
    కుందుచుండె కులుకులందుగాదు!

    రిప్లయితొలగించండి
  30. ఇల్లు శుభ్ర పరచ నెంచిపూనుకొనగ
    తేలు గుట్టె బాధ తెలియ చింత
    మంత్రి వేత్తవచ్చి మంత్రమే వేయగా
    నచ్చెరు వది కలిగె నాత్మ యందు

    రిప్లయితొలగించండి
  31. పేద బాధ పొందు వేదన లందున
    ప్రేమ లేని బ్రతుకు సీమ యందు
    ఊరు చేరలేని దారుల యందున
    తేలు గుట్టె - బాధ తెలియ దింత!





    రిప్లయితొలగించండి