24, డిసెంబర్ 2020, గురువారం

సమస్య - 3584

25-12-2020 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్”

(లేదా…)

“క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్”

75 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


"శ్రీ రాముని దయ చేతను..."

సరదా పూరణ:

ముస్ముసి నవ్వులన్ గొనుచు ముగ్ధల తోడుత డాన్సుజేయుచున్
మెస్మరిజమ్మిదే యనుచు మెండుగ మెక్కుచు కోడి మాంసమున్
కిస్మిసు వేసి పాయసము, కేకల తోడుత విస్కి త్రాగుచున్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్...

సాయిబులు = sahebs (british rulers)

కృష్ణుడు = రామకృష్ణ పరమహంస జీససు క్రైస్తును "జేసు కృష్ణుడు" అనేవారు

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


శుభరాత్రి!

seethadevi gurram చెప్పారు...

స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః

విస్మయమౌ వాక్యమ్మిది
క్రిస్మసు దినమున దురకల కృష్ణుని పూజల్?!
భస్మమగుటయే మేలగు
నస్మన్మమతము నితరము హానిని
గూర్చున్

BMahalakshmi చెప్పారు...

విస్మయమందగనేటికి
భస్మముగాగనుమతములుభాసురజగతిన్
రశ్మినినింపగజరిగెను
క్రిస్మసుదినమునతురకలక్రుష్ణునిపూజల్

Zilebi చెప్పారు...



"ఉస్మానూ కృష్ణయ్యా"
ఇస్మాయిలు బిలిచె "రండి యింటికి నేడే
క్రిస్మసు పండగ గృహమున"
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్!


మెర్రీ క్రిస్మస్
ప్రభువు మిమ్ము లెల్లరిని చల్లగ చూచు గాక!
ఆమెన్!


జిలేబి

విరించి చెప్పారు...

డిస్మసు జేయగ మతిజెడి
భస్మముఁ దనువంత దాల్చి పరమాత్ముని నా
మస్మరణ మాని వాడనె
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్

seethadevi gurram చెప్పారు...

క్రమముగా

భస్మము జేయపాపమును బాలుడు
జన్మము నొందెనెప్పుడో
కిస్మిసు పచ్చకప్పురపు ఖీరును రాతిరి గ్రోలునెవ్వరో
సుస్మితులై వ్రజాంగనలు జోకను శ్రావణ మందు బ్రహ్మమౌ
క్రిస్మసునాడు; సాయిబులు; కృష్ణుని పూజ లొనర్తురెల్లడల్

ఆదిభట్ల సత్యనారాయణ చెప్పారు...

సత్యభామ శ్రీ కృష్ణునితో యిట్లనుచున్నది

కందము
తస్మద్వాల్లభ్యంబులు
నస్మత్తనూ విభవము నంబుజనాభా
విస్మయముగ విఫలమగుట
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్

ఆదిభట్ల సత్యనారాయణ

pks kumar చెప్పారు...

ఈ నాటి శంకరా భరణము వారి‌ సమస్య


క్రిస్మసు దినమున దురకల కృష్ణుని పూజల్

ఇచ్చిన పాదము కందము

నా పూరణ తేటగీతిలో


క్రీస్తును కొలుచు నెప్పడు క్రైసవ జను

లెల్లరు తెలుపుము, బురఖా‌ లిచట దాల్చు

సంప్ర దాయంబు నెవరిదో? సత్య భామ

పరిణయం బాడె నెవరిని? భక్తు లెపుడు

కీడు బాపచేయునదేమి?
క్రిస్మసు దిన

మున, దురకల, కృష్ణుని, పూజలన్మనసు బెట్టి

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

విస్మయ మౌ గద వినుటకు
క్రిస్మసు దినమున దురకలు కృష్ణుని పూజల్
సుస్మితు లౌదురు లోకులు
తస్మాత్ జాగ్రత్త లండ్రు దైవజ్ఞు లిలన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
క్రిస్మస్ ముక్కోటి కలిసి
విస్మయమన నొక్క నాడె ప్రియముగ రాగా
రస్మిన్ పెంజారులనఁగ
గ్రిస్మస్ దినమున దురకల కృష్ణుని పూజల్

(రస్మి = ఆచార సంబంధమైనది)

ఉత్పలమాల
క్రిస్మసు 'ముక్తి' పర్వములు రెండు మతమ్ముల ముఖ్యపండుగల్
విస్మయ మందగన్ గలిసి వేడుక నొక్కదినాన వచ్చినన్
రస్మిని దూదినేకెడు కులస్తులు ద్వైతులనంగ సాయబుల్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్

విరించి చెప్పారు...

భస్మము దేహమంతయును పాముకు వచ్చివాడనెన్
క్రిస్మసు నాడు పెద్దలకు కేలుల మోడ్చి నమస్కరించుచున్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
విస్మయ మందనేల సురభిన్ గొని వాగిన పిచ్చి మాటలే.

BMahalakshmi చెప్పారు...

భస్మముగాగదుర్మతముభాసిలఁజేయగమానవాళినిన్
విస్మయమందగాభువినివీచెనుచల్లనిగాలులేవనిన్
క్రిస్మసుమహ్మదేలయనిక్రీడగతాల్మినిబూనియాడుచున్
క్రిస్మసునాడుసాయబులుక్రుష్ణునిపూజయోనర్తురెల్లెడన్

Zilebi చెప్పారు...



ఇలలో సంభ్రమముగ బా
బులు క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూ
జ లొనర్తు రెల్లెడన్? పు
వ్వులెట్టిరి గదా చెవిని కవులకు కవివరా!


జిలేబి

Bapatla Venkateswara sai చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

సమస్య :
క్రిస్మసు నాడు సాయబులు
కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్


( నాకు వచ్చిన కల )

విస్మయమయ్యె స్నేహితుడ !
వింతగు స్వప్నము వచ్చె నమ్ముమా ;
అస్మతు లోకమందెదియొ
యాత్మసుఖంకరదృశ్యభాగ్య మా
కస్మిక మద్భుతంబుగను
గాంచితి ; జాగృతజాతి గంటినే !
క్రిస్మసునాడు సాయబులు
కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్ !!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


మైలవరపు వారి పూరణ
విస్మయమంద లోకమున వేదన గూర్చె కరోన., దానిచే
సుస్మితభావనల్ చెరిగె., శోకము శేషమునయ్యె., నెవ్వరో
యస్మదపాయమున్ దొలగ నౌషధమౌ హరిపూజనంబనన్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని బూజనొనర్తురెల్లెడన్ !
!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

Bapatla Venkateswara sai చెప్పారు...

తస్మాత్! గురువులు దినమని
విస్మయమౌనిది హలీము వేడిగ నిచ్చెన్
కిస్మిసు,కేకుని ( గలిపియు
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్

Rohit Audipudi Venkata చెప్పారు...

ముగ్గురు వివిధమతస్తులైన స్త్రీలు నస్మ, నమీత, నాన్సి లోకకల్యాణంకోసం బూని చేసుకున్నారు క్రిస్మస్

ఉ||
విస్మయమొందు పండుగిది వీనుల విందుగనెల్లరున్ గనన్
సుస్మితమౌట మానవులు సూక్ష్మముగా పరికించినంతటన్
నస్మ నమీత నాన్సి యను నాయికలెల్లరు బూని జేయగన్
క్రిస్మసు నాడు సాయబులు కృష్ణునిపూజలొనర్తురెల్లెడున్

రోహిత్

chandrashekhar yelisetty చెప్పారు...

కృష్ణుడు అందరిలో ఒకడు గా ఈ నా ప్రయత్నము:

ఉ:

కిస్మతు పండెనో యనుచు కృష్ణుడు పాడుతు గెంతులేయగన్
రస్మియె మూలమై తనరె రాతిరి వేళన మద్యపానమున్
భస్మము చేతమన్న పరిభాష గ్రహించగ గూడె స్నేహితుల్
క్రిస్మసు నాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్

రస్మి=రాబడి

వై. చంద్రశేఖర్

sitharamayya solasa చెప్పారు...

అస్మత్సమస్య యిదియే
“క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్”
విస్మయమొందకు డిదిగని
యస్మద్విధులకిది నిత్యమలవా టెగదా !

అస్మద్విధుఁడు = మనబోఁటివాఁడు

Yajnesh చెప్పారు...

సమస్య:
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్

విస్మయమొంద మేరి యను బేలకు నేసయ బుట్టె యెన్నడో?
దస్ముని గొల్వనేరక ముదమ్మున సల్పు నమాజులెవ్వరో?
అస్మిత భావనల్ విడిచి హైందవు లెల్లరు గొల్తురెవ్వనిన్
క్రిస్మసునాడు; సాయబులు; కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్.

దస్ముడు-అగ్నిహోత్రుడు
అస్మిత- అహంకారం

sitharamayya solasa చెప్పారు...

భస్మము చేసిరీదినము పాత పరంపరలెన్నియో మరిన్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
విస్మయ మొందకుం డు , మును పెద్దలు సూచన జేసిరే గదా
విస్మృతి నొందుమీకతను పెద్దగ నెంచిన నేమి మేలగున్

కంజర్ల రామాచార్య. చెప్పారు...

అస్మితమందువేల? తగ దట్లుగఁ దల్చుట వాస్తవమ్మె, యే
విస్మయకారికాదది వివేకులకున్ సహనైకదైవచి
త్తోస్మి' వచించువారికి మతోన్మదబుద్ధులు కాని వారికిన్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్.

నిన్నటి పూరణ..

మలమలమాడు నెండలొగిఁ బమ్మినచోఁ దపియింతువేని యే
కలతయొ బుట్టెనేని నయగారములొల్కు లతాంగి పొందుకై
తలకుదు వేని జేరు వనితం గొని శీతనగమ్ము, సౌఖ్యమున్
చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో.

అస్మిత=అహంకృతి

కంజర్ల రామాచార్య.

Haranath Rao Chennamsetty చెప్పారు...

విస్మయమొంది విందుకును వేడుక చర్చికి రాగ పండగౌ

క్రిస్మసునాడు సాయబులు:; కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్

కశ్మల భావమింతయును కానక ప్రీతిగ వీరు వారలున్

విస్మయమొందితిన్, కలన, భిన్నతనేకత కాన రాగ, నే

...భారతీనాథ్ చెన్నంశెట్టి....

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

విస్మయమొందమేరియనుబేలకుబుత్రుడుబుట్టెనెప్పుడో?
కిస్మిసుజేర్చిపాయసముక్షేమమొసంగగబంచుదెవ్వరో?
సుస్మితునందచందములసూరిమురారికిశ్రావణంబునన్
*“క్రిస్మసునాడు ;సాయబులు; కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్”*

Haranath Rao Chennamsetty చెప్పారు...

భస్మము బంగరగుననగ

విస్మయమైన విన వచ్చు :; వివరము చూడన్

విస్మయముకు విశ్మయమౌ

క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్”

...భారతీనాథ్ చెన్నంశెట్టి...

శంకర్జీ డబ్బీకార్ చెప్పారు...

కశ్మలమూడ్చమేరియనుకన్యకునెన్నడుబుట్టెనేసుడే?
యస్మితమంచనల్లనుమహమ్మదునెవ్వరుగొల్తురో?మహా
విస్మయమందబాలకునివెన్నునిమార్గశిరానగోదకున్
క్రిస్మసునాడు;సాయబులు;గృష్ణుని పూజలొనర్తురెల్లెడన్

ఉదయ భాస్కర్ చెప్పారు...

కిస్మతు రెండు మతములకు
విస్మయమీరోజు పర్వదినమై నప్పన్
కస్మలమేలేని ప్రజల్
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

విస్మయమేల చేసెదరు వేడుకతోడను క్రైస్తవుల్ యిలన్
వస్మతు బాపుమంచునట పస్తులు నుండుచు పర్వమొప్పుగా
భస్మము దాల్చుశైవులును బాయక శ్రావణ మాసమందునన్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్

A.Satyanarayana Reddy చెప్పారు...

రస్మిని ఖర్చుచేయుచును రంజిలు చుందురు క్రీస్తు భక్తులే
విస్మయ మొందగా ప్రజలు ప్రీతిని నిప్పుల సాగునెవ్వరో?
సుస్మితమైన మోములను చొక్కుచు హిందువు లేమి చేతురో?
క్రిస్మసునాడు, సాయబులు, కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'డిస్మిసు' టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"... నస్మద్దేహవిభవమ్ము..." అనండి. (రెండవ గణంగా జగణం వేయరాదు)

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కొలుతు రెవ్వరు..' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పెట్టిరి'ని 'ఎట్టిరి' అన్నారు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏

కంది శంకరయ్య చెప్పారు...

మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాడుచు.. వేళను...' అనండి

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ హాస్యస్ఫోరకంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం ?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'క్రైస్తవుల్ భువిన్' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

chandrashekhar yelisetty చెప్పారు...

ధన్యవాదములు, మార్పు చేస్తాను

ఆదిభట్ల సత్యనారాయణ చెప్పారు...








సత్యభామ శ్రీ కృష్ణునితో యిట్లనుచున్నది

కందము. (సరి చేసి)
తస్మద్వాల్లభ్యంబులు
నస్మద్దేహ విభవమ్ము నంబుజనాభా
విస్మయముగ విఫలమగుట
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్

ఆదిభట్ల సత్యనారాయణ

subbarao చెప్పారు...

విస్మయమనియనిపించును
క్రిస్మసుదినమున దురకలకృష్ణునిపూజల్
భస్మముధరించువారలు
కశ్మములులేకయుండి ఘటియించెగదే

BMahalakshmi చెప్పారు...

మనోహరమైనపూరణ, గురువుగారికివందనములు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

క్రిస్మస్సేకాదశియును
కిస్మిసు ద్రాక్షలునుబోలు కృష్ణుడు క్రీస్తున్
మెస్మరిజముతలపించును
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

భస్మాసుర నిభ రా జనె
విస్మయముగ నివ్విధమ్ము వెఱ్ఱి ప్రణిధులే,
యస్మద్బోధన నాపుమ
క్రిస్మసు దినమునఁ, దురకల, కృష్ణుని పూజల్

సస్మిత సుంద రానన ప్రశాంత మనమ్మున నాలకించుమా
విస్మయ మేల స్వప్నమున వింతలు చిత్రమె యివ్విధమ్మునన్
భస్మము ఫాల మందు నిడి బ్రాహ్మణ సంతతి పల్క మంత్రముల్
క్రిస్మసునాఁడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్

subbarao చెప్పారు...

క్రిస్మసునాడుసాయిబులుకృష్ణుని పూజలొనర్తు రెల్లెడన్
విస్మయమాయెనే?సరళ! పెద్దగనచ్చెరువందబోకుమా
క్రిస్మసువంటిపండుగలు గృష్ణునిపూజలనెవ్వరైననున్
కశ్మలమొందకుండగను గమ్మనిభక్తిని జేయగానగున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

విస్మయమొందె మానసము వేడుకగా జనులెల్ల నొక్కటై
క్రిస్మసు పర్వమందుతమ క్షేమము గోరుచు క్రీస్తు పూజలన్
రశ్ములునింపి కన్నులను రంజిలజేతురదేమి వింతయో
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

Subbarao Ayyalasomayajula చెప్పారు...

ఉ.

అస్మిత భావమున్ విడువ యామిని చందమె జీవకోటికిన్
రస్మిని బొందగా జనులు రాగము మోహనమై నివర్తి యా
కస్మిత సామరస్యతను కానగు వేల్పులె పంచభూతముల్
క్రిస్మసునాడు, సాయబులు, కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్.

రస్మి = రాబడి
రాగము = ఈర్ష్య
మోహనము = మైకము
నివర్తి = నివృత్తి, removing

..... అయ్యలసోమయాజుల సుబ్బారావు.

Haranath Rao Chennamsetty చెప్పారు...

ధన్యవాదములండీ

Haranath Rao Chennamsetty చెప్పారు...

ధన్యవాదములండీ
3వ పాదము. “ విశ్మయమునకును వింత” గా చదువుకొన వినతి

Sreedhara Rao Machavolu చెప్పారు...

"కిస్మిసు జీడిపప్పులును క్షీరపు టన్నము కూడినట్లుగా
భస్మమొనర్చి వాసి, ప్రజ భాసిలగా నిల యెట్టులౌ"ననన్
విస్మయ మంద మిత్రుడనె "భిన్న మతమ్ముల భావమొక్కటై
క్రిస్మసు నాడు సాయిబులు కృష్ణుని పూజలొనర్తు రెల్లెడన్"
-మాచవోలు శ్రీధరరావు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

విస్మయమేల?చేసెదరు వేడుకతోడను క్రైస్తవుల్ భువిన్
వస్మతు బాపుమంచునట పస్తులు నుండుచు పర్వమొప్పుగా
భస్మము దాల్చుశైవులును బాయక శ్రావణ మాసమందునన్
*క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్*