26, డిసెంబర్ 2020, శనివారం

సమస్య - 3586

27-12-2020 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అక్రమసంబంధ మధికయశమును దెచ్చున్”

(లేదా…)

“అక్రమమైన సంగడ మనంత యశమ్మును దెచ్చు నెప్పుడున్”

60 కామెంట్‌లు:

  1. సక్రమరీతిసంతుగనశక్యముగామినికుంతిదేవియే
    శక్రునితోడనర్జునునిసౌరునిచేతయుధిష్ఠురున్మహా
    విక్రముడైనశీఘ్రునకుభీమునిబొందెను పాండునానతిన్
    *“యక్రమమైన సంగడ మనంతయశమ్మును దెచ్చు నెప్పుడున్”*

    రిప్లయితొలగించండి
  2. విక్రమాదిత్యవరమునను
    సక్రమజన్మమునెఱుగనిసంకటమయ్యున్
    చక్రముఁద్రిప్పెనుకర్ణుఁడు
    అక్రమసంబంధమదికయశమునుదెచ్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. సక్రమజన్మమునెఱుగనిశక్తియులేకన్అనవచ్చునుగదా

      తొలగించండి
  3. చక్రము ద్రిప్పెను కర్ణుడు
    సక్రమ జన్మము నెరుగని సాహస పరుడై
    వక్రపు రాజును చేరెను
    అక్రమ సంబంధ మధిక యశమును దెచ్చు న్

    రిప్లయితొలగించండి
  4. ధర్మరాజు తో శ్రీకృష్ణ పరమాత్మను నిందిస్తూ శిశుపాలుఁడు :

    కందం
    చక్రికి స్త్రీలోలునికిన్
    సక్రమమే యగ్రపూజ! చాలించుమొకో!
    వక్రత రాధను మరిగిన
    నక్రమసంబంధ మధికయశమును దెచ్చెన్! !

    ఉత్పలమాల
    విక్రముఁడంచు నంద సుతుఁ బేర్మిని దెచ్చితె యగ్రపూజకున్
    సక్రమమౌనె? ధర్మజ! విచారము కాదొకొ! వెన్నదొంగ యీ
    చక్రికి వేల గోపికలు సందిట జిక్కిన రాధఁ గూడెనే!
    యక్రమమైన సంగడ మనంత యశమ్మును దెచ్చు నెప్పుడున్!!

    రిప్లయితొలగించండి
  5. చక్రియుసోయగానతనుచానగమారెనుమోహనంబుగా
    వక్రపుబుద్ధిరాక్షసులువంకరఁజూపులవెంటనంటగా
    సక్రమదేవతాగణముసాయమునందిరివిష్ణుమాయతో
    అక్రమమైనసంగడమఖండయశమ్మునుదెచ్చునెప్పుడున్

    రిప్లయితొలగించండి
  6. చక్రము దిప్పుచు కర్ణుని
    విక్రముడని రాజుసేసి పేర్మినిజాటెన్
    వక్రపుమతి రారాజుకు
    నక్రమ సంబంధ మధిక యశమును దెచ్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మహానటి సావిత్రి తలంపుతో 😢🙏

      శుక్రుని మాయలోబడుచు సుందరి
      మారుటి పెండ్లియాడెనే
      చక్రముదిప్పగా నతడు సంపద నాశము, చావుదెచ్చె నా
      యక్రమమైన సంగడ; మనంత యశమ్ము దెచ్చునెప్పుడున్
      చక్రిసమక్షమున్ జరుగు సక్రమమైన వివాహమే యిలన్

      శుక్రుడు = Venus శృంగారాధిదేవత

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి
  7. ఆక్రుష్టికిలోనయె సతి
    శక్రునితో కూడి తుదకు శైలమ్మైనన్
    చక్రిపదధూళి సోకగ
    అక్రమసంబంధ మధికయశమును దెచ్చెన్

    రిప్లయితొలగించండి
  8. అందరికీ నమస్సులు🙏
    ఉమా

    సక్రమ రీతిలో బదవి సాధ్యము గాదని యడ్డ దారులన్
    చక్రము త్రిప్పనెంచి ఘన సంగతి కోరగ రాజకీయపున్
    వక్రపు పోకడల్ బ్రజల వంచన చేయగ భిన్న పక్షముల్
    *“అక్రమమైన సంగడ మనంతయశమ్మును దెచ్చు నెప్పుడున్”*


    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  9. సక్రమమార్గమందు గల సాధ్వుల గాథలెఱుంగడెవ్వడున్
    శక్రుని మాయలో పడిన చక్కని చుక్క యహల్య రాయియై
    చక్రి పవిత్ర పాదముల స్పర్షయె తెచ్చెను సంప్రతీతియే
    అక్రమమైన సంగడ మనంతయశమ్మును దెచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  10. సక్రమ మార్గము కాదని
    అక్రమ మార్గమె గడించ యన్నిట యందున్
    వక్రపు బుద్ధిన ననుకొనె
    అక్రమసంబంధ మధికయశమును దెచ్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...గడించ నన్నిటియందున్ వక్రపు బుద్ధిని..." అనండి.

      తొలగించండి
  11. మునిభార్య తో గూడి పురదంశు డాయెను గా సహస్రాక్షుడు గా దివి లోన

    మరదలు తో గూడి మర్కట నృపతి యా రాముని చేత మరణము పొంది

    మోక్షము బడసెగా, ముదముతో నర్కుని
    కూడి ఘనతనొందె కుంతి నాడు,

    సత్యవతియు పరాశర మౌని తో కూడి పొందెగా వ్యాసుని‌ ముదము తోడ,

    నక్రమ సంభంధ మదిక యశమును తెచ్చున్ గదా పరికించి చూడ సతము,


    గర్భమును దాల్చితి ననుచు కలత వలదు,

    పెండ్లి కాక నీవు నెల తప్పె నని చింత

    మానగ వలయు సుందరీ మంచి జరుగు

    ననుచు పల్కె నొక‌ విటుడు వనిత తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం ఉత్తరార్ధం చివర గణభంగం. సవరించండి.

      తొలగించండి
  12. విక్రమమున్నదంచు మరి వీగుట మంచిది గాదుగా యిలన్
    నక్రమమైన సంగడ మనంత యశమ్మును దెచ్చు నెప్పుడున్
    వక్రగతుండవన్చు నొక పట్టము కట్టెదరెందరో జనుల్
    సక్రమ మార్గమెంచుకొని చక్కని వాడనిపించుకోవలెన్

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    "అక్రమమయ్య, తాపసివరా! రఘురాముడు బాలుడయ్య, ని...
    ర్వక్రపరాక్రమోద్ధతులఁ బంపెద జన్నము గావ "నన్న., భూ...
    చక్రపతిన్ వశిష్ఠుడనె శాంతతఁ "బంపుము., మౌనివాంఛనీ
    కక్రమమైన, సంగడమనంత యశస్సునుదెచ్చు నెప్పుడున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  14. విక్రమ గలదని వీగకు
    మక్రమసంబంధ మధికయశమును దెచ్చున్
    వక్రగ తుడవని యిలలో ,
    సక్రమ మార్గమె యొసగును జక్కని బిరుదున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విక్రమ' అని ముప్రత్యయం లేకుండా ప్రయోగించారు. "విక్రమము గనుచు వీగకు..." అందామా?

      తొలగించండి


  15. విక్రమ్! చేయును కీడా
    యక్రమసంబంధ మధికయశమును దెచ్చున్
    సక్రమసంబంధముల ప
    రాక్రమమే, మేల్మి నడత రాధనమొసగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. సక్రమమైన పొత్తులును, సర్దుడు లేకను పోరు వేళలన్

    విక్రము సాక్ష్యమున్నిలువ వీరును వారును తిట్టి తిట్టులన్

    సక్రమ సంఖ్య పొందకను సాధన కూడియు పొందె గద్దెలన్

    అక్రమమైన సంగడ మఖండయశమ్మును దెచ్చు నెప్పుడున్

    ....భారతీనాథ్ చెన్నంశెట్టి....

    రిప్లయితొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సక్రమ రీతిని వీడిన
    ప్రక్రమణమ్మది ద్రుపదుని పట్టికి కొడుకుల్
    విక్రాంతులు గల్గుట గన
    అక్రమ సంబంధ మధిక యశమును దెచ్చున్.

    రిప్లయితొలగించండి


  18. "అనుమానమేల కీడే
    గన నక్రమమైన సంగడ మనంత యశ
    మ్మును దెచ్చు నెప్పుడున్ మం
    చిని పెంచెడు మానవత" వచించెను విదుడే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వక్రమ మార్గమున్ కదలి వన్నెలు మీఱుచు యౌవనమ్మునన్
    సక్రమ రీతినిన్ విడిచి సాగుచు వేల్పుల పొందుతోడుతన్
    విక్రమ మేపుగా గలుగు బిడ్డల నొందిన కృష్ణ కెంతయున్
    అక్రమమైనసంగడమఖండయశమ్మునుదెచ్చునెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  20. సమస్య:
    *అక్రమసంబంధ మధికయశమును దెచ్చున్*

    సక్రమ పాలన లేనిచొ
    అక్రమసంబంధ మధికయశమును దెచ్చున్
    చక్రిని నమ్ముచు సతతము
    విక్రములౌ పాండవులిక విజయులు గారే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేనిచొ' అని హ్రస్వాంతంగా ప్రయోగించరాదు.

      తొలగించండి
  21. విక్రముఁడగునా కర్ణుఁడు
    నక్రమసంతానమైన నాకుంతికిలన్
    సక్రమముగ జీవించెను
    అక్రమసంబంధ మధికయశమును దెచ్చున్

    రిప్లయితొలగించండి
  22. విక్రమము నణంచు నెపుడు
    నక్రమ సంబంధ,మధికయశమునుదెచ్చెన్
    వక్రము గాకుండ నెపుడు
    సక్రమమగురీతి పనులు జగతిని చేయన్.

    రిప్లయితొలగించండి
  23. ఉ:

    విక్రముడొక్కరోజు కడు వేగము మీరగ వాహనమ్మునన్
    వక్రమ మార్గమందు చన పట్టిన కావలి శిక్ష యంచనన్
    చక్రము దిప్ప నేర్తునన చప్పున పైబడి జప్తు సేయగా
    నక్రమమైన సంగడ మనంత యశమ్మును దెచ్చు నెప్పు డున్??

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. సక్రోధము నిత్యము భూ
    మ్యాక్రమణంబే పని యని యవనిని నాతం
    డా! క్రూరుఁడు నీచుం డని
    యక్రమ సంబంధ మధిక యశమును దెచ్చున్


    విక్రమ మాజి లోన మది భీతి విహీనము వీర్య మింక న
    న్యాక్రమ ణాహితమ్ము ధర నంచిత దాన గుణమ్ము జాలియున్
    సక్రమ మైన జీవితము సంతత హర్షము వర్జి తోగ్ర దు
    ష్టాక్రమ మైన సంగడ మనంత యశమ్మును దెచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  25. శక్రునికి కలదుగదయా
    యక్రమసంబంధమ,ధికయశమునుదెచ్చున్
    జక్రిని మనసున దలచుచు
    సక్రమమగురీతి బరుల శ్రమలను దీర్చన్

    రిప్లయితొలగించండి
  26. అక్రమమైనసంగడమనంతయశమ్మునుదెచ్చునెప్పుడున్
    వక్రపుమాటలాడగనువక్త్రమునీకిపుడెట్లువచ్చెనే?
    చక్రముద్రిప్పు భావుకుడ!సాటువవచ్చునె?యక్రమంబునన్
    నక్రమమందునన్దొలగునాయువుగీర్తియు నెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  27. సక్రమమార్గమ్మందున
    విక్రముడై నిలువ నెంచ విజయముగనడే
    చక్రమ్మును ద్రిప్పగ నా
    అక్రమసంబంధ మధికయశమును దెచ్చున్!!

    ***సవరణతో... ధన్యవాదములు!

    రిప్లయితొలగించండి
  28. వక్రపు మార్గమున్జనుచు వంతల పాలొనరించు నిశ్చయం
    బక్రమమైన సంగడ మనంత యశమ్మును దెచ్చు నెప్పుడున్
    సక్రమమైన బంధములు సత్ఫలితంబులనిచ్చు గావుతన్
    విక్రముడైన క్రీడికిని వీరుఁడు కర్ణుల భేదమియ్యదే

    రిప్లయితొలగించండి