9, ఫిబ్రవరి 2022, బుధవారం

సమస్య - 3987

10-2-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మగని సిగలోన పువ్వుల మాలఁ దుఱిమె”
(లేదా...)
“లోకులు మెచ్చ భర్త సిగలోఁ దుఱిమెన్ సతి పుష్పమాలికన్”

36 కామెంట్‌లు:

  1. తేటగీతి
    దూరదేశాన కొలువున దార వీడి
    బ్రతుకు భారమ్ము మోయఁగ వెతలబడియుఁ
    జేరు వచ్చెనని సతి, రంజింపఁ జేయ
    మగని, సిగలోన పువ్వుల మాలఁ దుఱిమె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి
      అన్న సేవను తరియించి మన్ననఁగొని
      తిరిగి వచ్చిన లక్ష్మణు తేరఁ జూచి
      యూర్మిల కనులననురాగమూర గాంచి
      మగని, సిగలోన పువ్వుల మాలఁ దుఱిమె!

      ఉత్పలమాల
      శ్రీకరమూర్తి రామునకు సేవలు సేయఁగ కాననమ్ములన్
      జేకుఱి మీదటన్ దిరిగి చేరఁగ నూర్మిళ, లక్ష్మణాఖ్యునిన్
      వేకువ నిద్రలేచినటు విచ్చిన కన్నుల నింపి భేషనన్
      లోకులు, మెచ్చ భర్త, సిగలోఁ దుఱిమెన్ సతి పుష్పమాలికన్!

      తొలగించండి
    2. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. నటుని గా మారి వేషము నాటకము న
    నంద మగు మగువ గ నైన నాలు జూచి
    మురిసి పోవుచు దనియుచు మోద మంది
    మగని సిగ లోన పువ్వుల మాల దురిమె

    రిప్లయితొలగించండి


  3. పండుగ యని పురమునుండి వచ్చినట్టి

    పౌత్రురాలు తన జడను ఫల్యములను

    ముడవ లేదనటంచును ముద్ది యా కొ

    మ గని సిగలోన పువ్వుల మాలఁ దురిమె.

    రిప్లయితొలగించండి
  4. సగమీవుగదరసాంబా
    తగవిదినీకుుసుమములదండనుదాల్చన్
    రగడెందుకనుచుగౌరియు
    మగనిసిగలోనపువ్వులమాలదురిమె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యాపాదం తేటగీతి అయితే మీరు కందం వ్రాసారు. సవరించండి.

      తొలగించండి
    2. సగముతనయందుముఱియుచుసంగమింప
      సాంబుడయ్యెనుజూడగసతియుపతియు
      ముచ్చటయ్యెనుమగువకుముడినిజూడ
      మగనిసిగలోనపువ్వులమాలదుఱిమె

      తొలగించండి
  5. చీర‌ కుచ్చిళ్ళు సరిచేసి చెంప పైన

    ముంగురులు తిప్పి తిలకము‌ ముఖము పైన

    పెట్టి ద్రుపద తనయ మురిపెముగ తనదు

    మగని‌ సిగలోన‌ పువ్వుల‌ మాల‌ దురిమె


    నర్తన శాలకు‌ పంపునపుడు వలలునికి ద్రౌపది వేషము వేయు సందర్భము

    రిప్లయితొలగించండి
  6. ఆటవెలది

    తాను కోరి నట్టి చీని చీనాంబర
    పైడి నగలు నీయఁబరవశించి
    మగువ మెచ్చి //మగని,సిగలోన పువ్వుల
    మాలఁదుఱిమె //కాము కేళిఁదేల్చె.

    రిప్లయితొలగించండి
  7. భార్య కోసము తెచ్చెను వల్లభుండు
    మత్తుగొలిపెడు జాజుల మాలనేడు
    దానితావి నాసికమును తాక నాయ
    మగని సిగలోన పువ్వుల మాలఁ దుఱిమె

    రిప్లయితొలగించండి
  8. ఆకెయుధర్మబద్ధగనునాలిగనుండెనురాజుకొల్వునన్
    తాగనెనర్జునున్తగినతాల్మినిధీరుబృహన్నలంచుగా
    పాగలపట్టుచీరలనుపౌరుషమెట్టులదాగెనోయనన్
    లోకులుమెచ్చభర్తసిగలోదుఱిమెన్సతిపుష్పమాలికన్

    రిప్లయితొలగించండి

  9. పోకిరి కీచకుండనిక మోసము తోడ వధింపనెంచుచున్

    జీకటి వేళనేగెదను చేడియరూపముఁ నృత్యశాలకున్

    గోకను గట్టుమంచనగ కోమలి వేషము వేసి కాంచినన్

    లోకులు మెచ్చ భర్త సిగలో దుఱిమెన్ సతి పుష్పమాలికన్.

    రిప్లయితొలగించండి
  10. కోవిడడరగ భయపడి క్షురిని దరి
    కేగి రెండు వత్సరములు హెచ్చి యుండ
    బెరిగిన తల కుంతలముల బ్రేయసి గని
    మగని సిగలోన పువ్వుల మాలఁ దుఱిమె

    రిప్లయితొలగించండి
  11. ఆకృతి స్త్రీలపాత్రలకు నచ్చుగ నొప్పెడు పూరుషుండు,తా
    నే,కమనీయరూపమున నెవ్వరు గుర్తును పట్టకుండగా
    వాకిట నిల్వ పేరటపు వాయనముంగొన,బొట్టువెట్టియున్
    లోకులు మెచ్చభర్త సిగలోఁదుఱిమెన్ సతి పుష్పమాలికన్.

    రిప్లయితొలగించండి
  12. నిండు యవ్వనమందున నీరజాక్షి
    మగని యెడబాటు విరహాగ్ని రగులజేసె
    మరలిగీముకు వచ్చెడు మగని నాయ
    మ గని సిగలోన పువ్వుల మాలఁ దుఱిమె

    రిప్లయితొలగించండి
  13. పోకిరి యైన కీచకుడు పొందును కోరుచు వెంబడించగా
    తాకు ప్రయత్నచిత్తుడయి, ద్రౌపది తెల్పగ, చంపనెంచగా
    భీకరమైన కోపమున భీముడు, చీరను చుట్టి యింపుగా
    లోకులు మెచ్చ భర్త సిగలోఁ దుఱిమెన్ సతి పుష్పమాలికన్

    రిప్లయితొలగించండి
  14. ప్రేమ యినుమడించ గభార్య బ్రీతి ,దనదు
    మగని సిగలోన పువ్వులమాల దుఱిమె
    మునుల జుట్టును బోలుచు ముడులు వడగ
    దాను సరిజేసె బాపిడి గానుపించ

    రిప్లయితొలగించండి
  15. కార్య సాధక లౌదురు కాంత లెంచఁ
    గాంతుఁ డే రీతి శాంతించుఁ గాంత కెఱుక
    కాంతున కొసంగఁ గాంతులు కాంచి కాంత
    మగని సిగలోనఁ బువ్వుల మాలఁ దుఱిమె


    వాకిటఁ బ్రొద్దు పోక కయి బంధులు ముచ్చట లాడు చుండఁగాఁ
    జీఁకటి కాక మున్న యిలు సేరఁగఁ గాంతుఁడు సూచి కాంతయే
    వీఁకను బూర్ణ చంద్ర ముఖి భీత మృగాంబక క్రమ్మఱంగ నా
    లోకులు మెచ్చ భర్త సిగలోఁ దుఱిమెన్ సతి పుష్పమాలికన్

    రిప్లయితొలగించండి
  16. ఆకుల రాజ్యలక్ష్మి తన యాయన జుట్టును జూచి మెచ్చుచున్
    లోకులు మెచ్చ భర్తసిగలో దుఱిమెన్ సతి పుష్పమాలికన్
    నాకులపు వారలందఱును నాశను బెంచుదు రయ్య గావుతన్
    నీకలికాలమందె యిటులెన్నియొ జర్గును వింత గాదులే

    రిప్లయితొలగించండి
  17. చేకొని పూలమాల సతి చిత్తము రంజిల
    వేసి పూవులన్
    లోకలు మెచ్చ భర్త సిగలోదురమెన్ , సతి
    పూలమాలనున్
    మేకొని కూర్మతోడ బతి మిక్కిలి మెచ్చగ
    గంబుకమ్మున
    న్నాకలకంఠివేసె నది యద్భుతమౌ ఘన
    షష్టిపూర్తియే!

    రిప్లయితొలగించండి
  18. దుష్ట కీచకా ధమునట దునుమనెంచి
    వెలదిరూపముతోడను భీముడుండ
    చూచి ద్రౌపదిమురియుచు సొగసుగా ను
    మగని సిగలోనపువ్వులమాలదుఱిమె

    రిప్లయితొలగించండి