13, ఫిబ్రవరి 2022, ఆదివారం

సమస్య - 3991

14-2-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రేమికులకు సంబరము దుర్దినమునాఁడు”
(లేదా...)
“దుర్దినమంచు సంబరముతోఁ జరియింతురు ప్రేయసీప్రియుల్”

39 కామెంట్‌లు:


  1. ఫిబ్రవరి పదునాల్గొక పీడదినము
    మనది కానట్టి సంస్కృతిన్ ఘనమటంచు
    ప్రేమికులరోజుగా జరుపెదరు కాదె
    ప్రేమికులకు సంబరము దుర్దినము నాఁడు.

    రిప్లయితొలగించండి
  2. మనది కానట్టి సంస్కృతిన్ మంచి దనుచు
    నేల పాటింతు రో కదా బేల గాను
    హిందు వు లు సమ్మతించక యిష్టు ల న రె
    "ప్రేమికులకు సంబరము దుర్దినము నాడు "

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. గొల్లవాడు తనకు గొప్పవాడనుచు తా
      తలపోసి వెడలె రథమ్ము‌ నెక్కి

      నీసుత రుక్మిణి,నేను ప్రతి ఘటించ
      నన్నా యశోద తనయుడు భంగ

      పరచిన విషయము మరచి పోజాలనే
      యెంత దుర్దినమ్ము ,చింత నిడిన

      గిట్టిన‌ దినమది‌ , పెట్డవలయునుగా
      శ్రాద్ధము వగచుచు‌ చచ్చె ననుచు

      ప్రేమికులకు‌, సంబరము‌ దుర్దినము నాడు

      జరుప భావ్యమా, పాడియా, పరువు మంట

      కలిపిన సుతకు వేడుకల్ సలుప రాదు

      రూఢిగా నంచు తండ్రితో రుక్మి‌ పలికె


      రుక్మిణి వివాహ దిన‌వేడుకలు జరుపమని‌ భీష్మకుడు‌ అడినపుడు రుక్మి‌ పలికిన‌ పలుకులు

      తొలగించండి
  4. భగ్నప్రేమికుగుర్తుగభాసమయ్యె
    పశ్చిమంబునపరువెత్తెపరువమదిగో
    చిందులేసెనుసంస్క్క్రుతిశివమునెత్తి
    ప్రేమికులకుసంబరముదుర్దినమునాడు

    రిప్లయితొలగించండి
  5. “జూలియా”కు వాలెంటయిన్ చూపు నొసగె
    ప్రేమలేఖను వ్రాసె నీ ప్రియుడనంచు
    వాని నురితీసె రోమను ప్రభువు,నేడు
    ప్రేమికుల సంబరము,దుర్దినము నాడు.

    రిప్లయితొలగించండి

  6. మార్దవమందు గోరెదరు మాన్యులు భారత సాంప్రదాయమున్

    మర్దన సేయబోకుమది మంచిది కాదని వేడుకొంచు వా

    రర్దన సేయ నవ్వుచు నీరర్థకులంచును వారికియ్యదే

    దుర్దినమంచు సంబరముతోఁ జరియింతురు ప్రేయసీ ప్రియుల్.

    రిప్లయితొలగించండి
  7. మర్దనమయ్యెసంస్క్రుతియుమాయలపండుగవిస్తరింపగా
    అర్ధములేనిపోకడలహాయనిరేగిరినాగరీకులున్
    మార్దవమిట్టుబాహిరముమానిసితోడనునాట్యమాడగా
    దుర్దినమంచుసంబరముతోజరియింతురుప్రేయసీప్రియుల్

    రిప్లయితొలగించండి
  8. శిశుపాలుని దీనాలాపన.....

    తేటగీతి
    స్వప్నమయ్యె రుక్మిణిఁ బొందు వాంఛ నాకు,
    నల్లకాకిని ప్రేమించ నుల్లమలర
    రాక్షసమ్మునఁగొనిపోవ రథమునందు
    ప్రేమికులకు సంబరము, దుర్దినమునాఁడు

    ఉత్పలమాల
    వార్ధిని మించు ప్రేమఁగల వానిని నన్ శిశుపాలు నొప్పకే
    సర్దుకు పోయి రుక్మిణియె సాగి వివాహమునందె కాకితో
    గార్దభమైతినే వధువు కాదని వెళ్లగ! నాకు వేదిపై
    దుర్దినమంచు సంబరముతోఁ జరియింతురు ప్రేయసీప్రియుల్!!

    రిప్లయితొలగించండి
  9. నిర్దయతోడ గాముకులు నీచపు దారుల నెంచగోరి, యం
    తర్దధనంబు సేవనము, దారిక భోగపు వేటలందునన్,
    నిర్దళితంబు సేయ దగునీతిఁ చరించెడివారి భీతితో
    దుర్దినమంచు సంబరముతోఁ జరియింతురు ప్రేయసీప్రియుల్.

    రిప్లయితొలగించండి
  10. కర్దమమట్లునంటుకొనెగా మనకిద్ది,విదేశ పాలనా
    దుర్దశతోడ వచ్చినది తొల్లి వధించెను భగ్నప్రేమికున్
    నిర్దయ రోమ్ మహీపతియు నేటికి గుర్తుగ నౌర!చెప్పగా
    దుర్దినమంచు,సంబరముతోఁజరియింతురు ప్రేయసీ
    ప్రియుల్.

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    ప్రేమ యెంత మధురమౌనొ ,పెళ్ళి యనగ
    ప్రేమికులకు సంబరము ,దుర్దినము నాడు
    ప్రేమ విఫలమవగ దారి వేరు లేక
    ఆత్మ హత్యకు పాల్పడి చావ నెంచ.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  12. వత్సరమున కొకదినము పనిగొనిరని
    ప్రేమికులకు సంబరము ;
    దుర్దినము , నాడు
    వేరు దినముల మాదిరి విడువకుండ
    కట్టడలనుంచ మోదము గడచునటుల

    రిప్లయితొలగించండి
  13. ప్రేమ వైవాహ సిధ్ధాంత కాముకుండు
    ప్రేమ సూక్తులు వినిపించి 'రోము'లోన
    మరణ మొందగ జరుగు సంస్మరణ దినము
    ప్రేమికులకు సంబరము దుర్దినమునాఁడు

    రిప్లయితొలగించండి
  14. తల్లి దండ్రుల యనుమతి దనరునెడల
    ప్రేమికులకు సంబరము , దుర్దినము నాడు
    శుభము జేకూరు పనులను జొరవ తోడ
    జేయ గూడదు పనికాదు చేయునెడల

    రిప్లయితొలగించండి
  15. ప్రేమికులయొక్క దినమని రెచ్చిపోయి
    పడుచుజంటలు విచ్చలు పార్కులందు
    పరవశించుచు పెద్దల పరువు దీయు
    ప్రేమికులకు సంబరము దుర్దినమునాఁడు

    రిప్లయితొలగించండి
  16. దుర్దినమైన దానినిక దుర్దశ యంచును నెంచకెప్పుడున్
    దుర్దినమంచు సంబరముతో జరియింతురు ప్రేయసీప్రియుల్
    మర్దన జేయ సంస్కృతిని మాటుననుందురు పార్కులందునన్
    నిర్దయతో డ వారలను నీతిగనుండను జేయటొప్పగున్

    రిప్లయితొలగించండి
  17. కారు మబ్బులె దిక్కుల మూరుచుండ
    జల్లు లెల్లెడ నింపుగఁ బల్లవింప
    వాన లోనఁ జిందులు వేయ మేను లలరఁ
    బ్రేమజనుల సంబరము దుర్దినమునాఁడు

    [ప్రేమికుఁడు గ్రామ్య మని నా యభిప్రాయము]

    దుర్దమ హర్ష దాయకము తోయద దర్శన మెల్లవారికిన్
    మార్దవ సన్మనస్కుఁడు సమంచిత బుద్ధిని వృత్ర దైత్య రా
    ణ్మర్దనుఁ డీయ వర్షము ఘనమ్ముగఁ జిన్కులు రాలు చుండఁగా
    దుర్దిన మంచు సంబరముతోఁ జరియింతురు ప్రేయసీప్రియుల్

    [దుర్దినము = మబ్బుతోఁ గూడిన దినము]

    రిప్లయితొలగించండి
  18. : స్వార్ధము లేక ప్రేయసియె వైనము దెల్పుచు బిల్వనంపగా
    మార్ధవ మొల్కుబల్కుల,సమర్ధత జేయుచు జేర రాడనన్
    దుర్దిన మంచు,సంబరమ్ముతో జరియింతురు ప్రేయసీ ప్రియుల్
    సర్దుకుపోయి నేకమయి సాగెడు జీవన యానకమ్ములో

    రిప్లయితొలగించండి
  19. మర్దన జేతుమంచు పలు మారుల పెద్దలు
    హెచ్చరించినన్
    దుర్దశ పాలు సేయుదురు దుడ్కుతనంబున
    దేశసంస్కృతి
    న్నర్దన చేయు ప్రేమికుల కర్థము కాదిది
    యెంతచెప్పినన్
    దుర్దినమంచు , సంబరముతో జరియింతురు
    ప్రేయసీప్రియుల్

    రిప్లయితొలగించండి
  20. ప్రేమికుల దినము పడుచు పిల్ల లకును
    ప్రేమికులకు సంబరము దుర్దినము నాడు
    ప్రేమ పేరున కూతురు వీడిచనగ
    కన్నవారల కయ్యదె కడుపుకోత

    రిప్లయితొలగించండి