1, మార్చి 2022, మంగళవారం

సమస్య - 4007

2-3-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మానవుం డసుర సమానుఁడయ్యె”
(లేదా...)
“మానవుఁ డయ్యె దానవ సమానుఁ డటంచు బుధుల్ దలంతురే”

43 కామెంట్‌లు:

  1. సామ్యవాదజగతిసౌమ్యతకలబోయు
    దేశమిటులహింసదేహియనియె
    కలనకామితంబుగౌరవమందంగ
    మానవుండసురసమానుడయ్యె

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    నేను నా సుఖమ్మె నేనెంచ వలెనంచు
    స్వార్థ చిత్తమెసఁగి సాటివానిఁ
    గూల్చి పైకివచ్చు కుటిలత్వమేపార
    మానవుం డసుర సమానుఁడయ్యె

    ఉత్పలమాల
    కానక యన్యులన్ సుఖము గావలె మాకని స్వార్థచిత్తులై
    హాని దలంచి దోపిడికి నర్రులు సాచి పరస్పరమ్ముగన్
    బ్రాణ విహీను జేయుటకునైనఁ దెగించెడు నిర్దయత్వమై
    మానవుఁ డయ్యె దానవ సమానుఁ డటంచు బుధుల్ దలంతురే!

    రిప్లయితొలగించండి
  3. వేనకువేలుగాజనులువేదనశాంతినిపోరుసల్పుచున్
    పూనికగూల్చివైచిరిగబూర్జువరాజులదుష్టపాలనన్
    కానకపూర్వగాథలనుఘాటుననేడిదెహింసబూనిరే
    మానవుడయ్యెదానవసమానుడటంచుబుధుల్దలంతురే

    రిప్లయితొలగించండి
  4. మానియు ధర్మమార్గమును మానవతన్
    విడనాడి మొత్తమున్
    మానసమందు ప్రేమ యను మాత్రము లేకను స్వార్థబుద్ధితో
    జానల జెర్చుచున్ జనుల జంపుచు హిం
    సల పాలొనర్చుచున్
    మానవు డయ్యె దానవ సమానుడటంచు
    బుధుల్ దలంతురే

    రిప్లయితొలగించండి
  5. అన్ని వేళలందు నతనిని బరికించ
    కామ నిరతుడనుచు గాంచి యుండ
    కాంతల యలజడిని గని కోప గించిన
    మానవుం డసుర సమానుడయ్యె

    రిప్లయితొలగించండి
  6. మంచి చెడును తాను మహిలోన నెంచ క
    నీతి బాహ్యు డగుచు నెగడు వాడు
    భీతి విడిచి మెలగి విఱ్ఱ వీగుచు నుండు
    మానవుo డసుర సమాను డయ్యె

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    మానవత్వంబుతోడను మసలు కొనుచు
    సాటి వారికిఁదోడ్పడు జనులు కలరు
    వ్యసనములకును బానిసై పరిధి దాట
    గానె//మానవుండసుర సమానుఁడయ్యె.

    రిప్లయితొలగించండి
  8. దానదయాగుణంబు పరదార సహోదర భావనంబు,వి
    జ్ఞాన వికాసముంగలిగి సన్నుతిఁగాంచినవాఁడె గొప్పగా
    మానవుఁడయ్యె,దానవ సమానుఁడటంచు బుధుల్ తలంతురే
    మానవ లక్షణాలుగన మచ్చునకైనను లేని మూర్ఖునిన్.

    రిప్లయితొలగించండి
  9. మంచితనము మృగ్యమయ్యెమనుజులందు
    వంచకులవె రోజు లెంచిచూడ
    స్వార్థమనెడు వింత జబ్బుతోభువియందు
    మానవుం డసుర సమానుఁడయ్యె

    రిప్లయితొలగించండి
  10. మానవునిగపుట్టి మానవత నశించి
    పొరుగువారిపైన పోరుసల్పి
    ప్రాణముల్ హరించె పాపాత్ముడౌ 'పుతిన్'
    మానవుం డసుర సమానుఁడయ్యె

    రిప్లయితొలగించండి
  11. మున్ను బలముతోడదన్నుగవేటాడి
    పచ్చిమాంసమపుడుమెచ్చినాడు,
    నాగరికుడునేడునభమునుముద్దాడి
    మానవుం డసుర సమానుఁడయ్యె
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  12. మానవిహీనులీ భువిని మాన్యులుగా వితతమ్ము నొందగా
    మానవజాతి గౌరవము మంటలపాలయి మ్రగ్గుచుండె స
    మ్మానము ధూర్తులొందగనమాయకులున్ వెసనంబు నొందగన్
    మానవుఁ డయ్యె దానవ సమానుఁ డటంచు బుధుల్ దలంతురే

    రిప్లయితొలగించండి
  13. దానవ నిచయమ్ము ధాత్రి మాయము కాఁగ
    రాక్షసాలి గుణము రగులు కొనఁగ
    నంతరంగముల నరాలికిఁ గన నేఁడు
    మానవుం డసుర సమానుఁడయ్యె


    దాన గుణమ్ము మృగ్యము ప్రధానము విత్తము సంతతమ్ము సం
    తాన సమస్త బాంధవ వితాన విశేష పురోభివృద్ధియే
    మానస మందు నెన్నఁ బర మార్థముగా నర కోటి నిక్కమే
    మానవుఁ డయ్యె దానవ సమానుఁ డటంచు బుధుల్ దలంతురే

    రిప్లయితొలగించండి

  14. తానిటనన్నిటన్ బహువి
    ధంబుల మేటియటంచు నిత్యమున్
    మానవ బంధముల్విడచి
    మాన్యతవీడి యవాంఛితమ్ములౌ
    న్యూనతగూర్చు కర్మలను
    నొచ్చు విధంబున సంచరించగన్
    మానవుఁ డయ్యె దానవ స
    మానుఁ డటంచు బుధుల్ దలంతురే!

    రిప్లయితొలగించండి
  15. దయయనునది లేక దాష్టికమునుదోడ
    బాధ గలుగ జేయు పామరుడగు
    మానవుండసుర సమానుడయ్యె నుగద
    రక్ష జేయ వలెను బ్రాణులనిల


    రిప్లయితొలగించండి
  16. ఆటవెలది
    అమెరికాధిపతియు ,ఆ రూసు నేతయున్
    మంచిమాట వినుట మాని యుండ
    ఉక్రెయిను జనతకు నురిని బిగించగ
    మానవుండసుర సమాను డయ్యె.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  17. కానగ ధర్మమై కృతయుగంబదినిల్పెను నాల్గుఁబాదముల్
    బూనగమూడుఁబాదములుముందుకుసాగగ రెండునైజనన్
    దీనమునొక్కఁబాదమనధీదితుడయ్యియుఁ గల్కిరూపుడీ
    మానవుఁ డయ్యె దానవ సమానుఁ డటంచు బుధుల్ దలంతురే

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  18. పానము జేయుచున్మదిర బాధలు వెట్టగ బాటసారులన్
    మానవుడయ్యె దానవసమానుడటంచు బుధుల్ దలంతురే
    మానవ జన్మకున్ధరను మాన్యత నొందగ బ్రాణికోటికిన్
    బానము లొడ్డియైననిక బాధలు లేమిగ జేయనొప్పగున్

    రిప్లయితొలగించండి
  19. ఆశదోషమన్న యానందపడుటకు
    ఇంటపెద్దవారు యిష్టపడగ
    పరులహింస యందె వరలెడి తత్వాన
    మానవుండసుర సమానుడయ్యె

    రిప్లయితొలగించండి

  20. వస్తు మార్పిడి యను పద్ధతిన్ విడనాడ
    ధనము సృష్టి జేసి ధరణి యందు
    దానిపొందగోరి మానవత్వము వీడి
    మానవుండసుర సమానుడయ్యె


    ప్రాణము కన్న వాజజమె వాసియటంచు దలంచి దానికై

    హీనమహీనమంచనక హెచ్చు ధనమ్ము గడింప నెంచుచున్

    బోనిడి మానవత్వమును మూర్ఖులు సల్పుచు పాపకృత్యముల్

    మానవుఁడయ్యె దానవ సమానుఁ డటంచు బుధుల్ దలంతురే.

    రిప్లయితొలగించండి
  21. నీతి నియమములను నీటను కలుపుచు
    మంచి యనెడి మాట మరచి పోయి
    వెలదులు కనిపించ వెకిలిగా చూచుచు
    *మానవుం డసుర సమానుఁడయ్యె*


    మరొక పూరణ

    మానవుడైజనించియిలమంచిని గాలికివీడుచున్ సదా
    హీనములైనకృత్యములనెన్నియొ చేయుచు నుచ్ఛనీ చముల్
    మానసమందుతల్చకను మానక క్రూరపు బుద్ధులెప్పుడున్
    *మానవుఁ డయ్యె దానవ సమానుఁ డటంచు బుధుల్ దలంతురే*


    రిప్లయితొలగించండి