2, జూన్ 2024, ఆదివారం

దత్తపది - 209

3-6-2024 (సోమవారం)
కారము - కారము - కారము - కారము
'కారము' పదాన్ని నాలుగు పాదాలలో ప్రయోగిస్తూ
ఉత్తమ గృహిణిని గురించి
కందం కాని ఉత్పలమాల కాని చెప్పండి.

18 కామెంట్‌లు:

 1. ఆకారములక్ష్మియనగ
  సాకారముగాగగౌరిసమతనుగనగా
  ఏకారములేనిగృహిణి
  ప్రాకారముగృహముకంతరాజిలురమయై

  రిప్లయితొలగించండి
 2. కందం
  పతికెంతో సహకారము
  సుతులకు మమకారము మదిఁ జూపుజననిగన్
  హితమను పరోపకారము
  జతపడ నుత్తమ గృహిణిగ సాకారమగున్

  ఉత్పలమాల
  గారము సూపి భర్త సహకారమునొందఁగ వెంటనుండుచున్
  గారెలఁబోలు తీపి మమకారము సంతుకు జూపుమాతగన్
  భూరి పరోరకారము నపూర్వమనంగ సమాజసేవ సా
  కారము సేసెడున్ గృహిణిఁ గాంచగ నుత్తమురాలిగన్ దగున్

  రిప్లయితొలగించండి
 3. కం.
  వీరి యలంకారమది వి
  కారముగా నుండబోదు కలకాలము నోం
  కారమును జపించుచు మమ
  కారము పెంచు కొనెదరిల కైవల్యముపై.

  ఉ.మా.
  భారమటంచు బాధ్యతలపై మమకారము వీడబోరహం
  కారము లేక పెద్దలకు గారవమిచ్చుటె వారికిచ్చు స
  త్కారమటంచు నెంచుచును కల్మష మించుక లేని వార లోం
  కారమునే స్మరింత్రు కలకాలము ముక్తిని గోరు వారలై.

  రిప్లయితొలగించండి
 4. కారముతో పచనము మమ
  కారముతో వడ్డన పలు కార్యములే సా
  కారము కాగ దురహం
  కారము లేని పరిగృహ్య కాంతామణియౌ

  కారము వైచివండు నయగారపు మాటల కూడువెట్టి సం
  స్కారము నేర్పు పిల్లలకు కారముతో తనవారి కార్య సా
  కారము సల్పుచుండు మమకారము నెప్పుడు పంచిపెట్టి శ్రీ
  కారము చుట్టు గాదె తన కాపుర మందున తీపినింపగా

  రిప్లయితొలగించండి
 5. ఉత్పలమాల:
  కాంతునకందజేయు సహకారము, జీవిత సంవిభాగిగా
  కాంత తలంచి భర్తకుపకారము జేయుట కుద్యమించు యే
  కాంతమునందు గూడ వెటకారములాడక ధర్మపత్నిగా
  నింతి తలంచి నాధునిపయిన్ మమకారము జూపు నిచ్చలున్

  రిప్లయితొలగించండి
 6. కం॥ సహకారమునిడి బాధ్యత
  లిహమున స్వీకారమనచు నిల్లాలు చనన్
  మహిని మమకారముఁ గనుచు
  మహోపకారమగుఁ బతికి మన్నన వెలయున్

  మరొక పూరణ అండి

  ఉ॥ కమ్మగ సామరస్య మమకారము లొప్పఁగఁ దోడునీడగన్
  గ్రమ్మగ బాధలెన్నొ యుపకారముఁ జేయచు వెన్నుదన్నునై
  గమ్మున భర్తకట్లు సహకారముఁ గాంచుచు సంచరించుచున్
  నెమ్మదిఁ గాంచెడిన్ గృహిణి నిచ్చ వికారము లేని సాధ్వియౌ

  నిచ్చ నిత్యము
  నేను బెంగళూరులో జరిగిన బహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానములో కారము 4 పాదాలలో అన్యార్థములో భారతార్థముతో నచ్చిన ఛందమన్నానండి. వారు తేటగీతిలో పూరించారండి

  రిప్లయితొలగించండి
 7. మొదట సుతకు మమకారము,
  పొదలు కొనంగ నుడికారము నెరుక పరచున్,
  పిదప పతీ స్వీకారము
  పొదలించి , పురిటి వికారముకలుగ మాన్పున్

  సుత = కూతురు
  పొదలుకొను = పెరుఁగు
  నుడికారము = మాటచమత్కారము
  పొదలించు = కావించు
  వికారము = వ్యాధి

  రిప్లయితొలగించండి
 8. కూతలలో దిక్కారము
  చేతలలో జూపరెట్టి చీత్కారములన్
  భూతలమున మమకారపు
  మాతగ సాకారమెందు మహిళామణులున్

  రిప్లయితొలగించండి
 9. పతికి సహ కార మిడుచు ను
  సతతము మమ కార ము నను సంతు ను బెంచు న్
  చతురత నుప కార ముతో
  సతు లందు న మేటి పొందు సత్కా ర మునే

  రిప్లయితొలగించండి
 10. కందం:
  అపకారము దలబెట్టక
  నుపకారము సల్పుచుండు నువిద పతికి తా
  నుపచారములను చేయుచు
  నెపుడున్ మమకారముగల యింతిగ మసలున్

  రిప్లయితొలగించండి
 11. ఉ:కారము వద్దటంచనక,కమ్మని మామిడి పండు ముట్ట ఝాం
  కారము జేయకుండ,చవి కల్పని కూరలు పెట్టకుండ, ఛీ
  త్కారము జేయకుండ కడు కమ్మని నేతిని , నాకు నచ్చు స
  త్కారము తోడ నన్న మిడు గా!సతి నా యెడ నన్నపూర్ణ యై.

  రిప్లయితొలగించండి
 12. 2)ఉ: కారము ముట్టనీక,నథికమ్మగు తీపి భుజించ నీక,హుం
  కారము జేసి యుప్పు నథికమ్ముగ వాడగ, నేయి గోర నా
  కారము స్థూల మౌ ననుచు,కష్టము నొక్కని కేల యంచు సం
  స్కారము తోడ పథ్యమును కమ్మగ తాను నొనర్చు సాధ్వి యై

  (తాను తింటూ భర్తకి పథ్య మనటానికి బాధ పడి తాను కూడా పథ్యం పాటిస్తోంది ఈ పతివ్రత. ఆ త్యాగానికి భర్త సంతోషిస్తున్నాడు.)

  రిప్లయితొలగించండి
 13. గారవ మొప్ప నిత్య సహకారము భర్త కొసంగి స్వీయ సం
  స్కారము సాటిచెప్పి మమకారము సంతతి కెల్లఁ బంచి ని
  ష్కారణ మెన్నఁ డల్గక వికారము నంద కెడంద సుంత స
  త్కారము లంది యింపుగ సతమ్ము సతీమణు లుండ మేలగున్

  రిప్లయితొలగించండి
 14. ఆకారంబును జూడగ
  శ్రీకారముఁ జుట్టినట్లు చెలువముఁదోడన్
  హ్రీంకారపు నామముతో
  సాకారముఁజేసికొనెను సతతము బ్రదుకున్

  రిప్లయితొలగించండి

 15. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  సంతుకిడుచు మమకారం
  బెంతయు సహకారమిడుచు ప్రియమగు
  పతికిన్
  సుంతయు పరోపకారము
  సంతతమున్ జేయు గృహిణిదె సంస్కార
  మగున్.


  రిప్లయితొలగించండి
 16. ఉ.

  కారము కొద్దిగా రుచిగ కమ్మగ బువ్వను వండు భార్య, యా
  కారము దీర్చిదిద్ది మమకారముతో బతి నాదరించి, శ్రీ
  కారము జుట్టి పిల్లలకు కైతలు శాస్త్రము బోధ చేసి, హుం
  కారము లేక, భక్తి నుపకారము జేయగ కార్యసిద్ధియౌ.

  రిప్లయితొలగించండి