మ:నరసింహుండు ప్రథాని కాగ తమ పన్నాగమ్ములే పారవం చరివర్గ మ్మిటు రచ్చ జేసె"నవురా!అన్యాయమే ,పేరుకే నరసింహుం డితడున్న దేశమునకే నాశమ్ము,మా కర్మ చే నరసింహాకృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్” (పి.వి.నరసింహారావు గారు ప్రథాని గా ఉండగా ఆయనంటే గిట్టని వాళ్లు ఇలా భయం వ్యాపింప జేసిన విషయం. పేరు నరసింహుడు కానీ ఆయన కలిపురుషుడు అన్నట్టు.)
తేటగీతి
రిప్లయితొలగించండిచెలఁగ మ్లేచ్ఛులు కనక కశిపులనంగ
భరతదేశ ప్రహ్లాదుల కరుణఁ గావ
పాలెగాడన నుయ్యాలవాడను హరి
నారసింహుఁడై కలి పుట్టె నరులు బెదర!
మత్తేభవిక్రీడితము
పరదేశస్థులు దైత్యులై భరత భూభాగాన ప్రహ్లాదులన్
నిరతమ్మున్ బరపీడనన్ వగచగన్ దీరెంచ నారాయణుం
డురకల్ వేసెడు పాలెగాడనగనా యుయ్యాలవాడన్ దగన్
నరసింహాకృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్!
మంచిచెడులకుపోరునమాధవుండు
రిప్లయితొలగించండిలోకమందునజనియించులోలుడగుచు
చంపునీరీతి చెదలనుజనులుమెచ్చ
నారసింహుడైకలిపుట్టెనరులుబెదర
తే॥ సృష్టి నియమము మరచి నికృష్టులుగను
రిప్లయితొలగించండినరులు పరఁగుచుండు విధము నరసి ధరను
బుద్ధిఁ గరపఁ గుజనులకు యోద్ధ యగుచు
నారసింహుఁడై కలిపుట్టె నరులు బెదర
మ॥ పరఁగన్ ధాత్రిని మానవాళి యటు సంభావించకన్ ధర్మమున్
నిరతంబిట్టులు దుష్టులై ప్రకృతినే నిర్జీవ మొందించుచున్
ధరలోఁ దీరుగ ధర్మరక్షణను సంధానించ నుద్యుక్తుఁడై
నరసింహాకృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్
శ్రీశంకరయ్య గారు సూచించినవిధంగా మత్తేభము 1 పాదమునందు “మానవాళియటు సంభావించకే” యని మార్చినానండి
తొలగించండియుగ యుగమున ధర్మమును కాయుట కొరకయి
రిప్లయితొలగించండి.సత్యయుగమునందున దిగె చక్రపాణి
నారసింహుఁడై ; కలి పుట్టె నరులు బెదర
యనుచు చెప్పుకొందురు భావినందనువుగ
తరుగన్జాలనిపాపపంకిలముసాతంబున్జనాకర్షమై
రిప్లయితొలగించండివిరయన్జేసెడిభైరవాకృతినినాభీలంబుగానాల్కలన్
మెఱసెనిఖడ్గముకల్కిహస్తమునతామేల్కొల్పధర్మంబునే
నరసింహాృతినుద్భవించెకలినానాభీతులన్గూర్చగన్
రిప్లయితొలగించండిధారుణిన్ ధర్మము నిలుప శూరుడైన
గరుడ వాహనుడు హిరణ్య కశ్యపుడను
ఖలుని సంహరింపగ నెంచి కంబమందు
నారసింహుఁడై కలి పుట్టె , నరులు బెదర.
(కలి=శూరుడు)
దురితుండౌచును స్వార్థమే పెరుగగా దుష్కృత్యముల్ మెండుగా
సిరులన్ బొందుటె లక్ష్యమై సలుపుచున్ ఛీత్కారముల్ బొందినన్
ధరణిన్ వాడిక మారబోడు కద రక్తాంధస్సుడాతండిలన్
నరసింహాకృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్.
కలియుగంబును వర్ణించు కవివరుడను
రిప్లయితొలగించండిచిత్తవృత్తితో వ్రాసెన్ బ్రసిద్ధుడు కవి
నారసింహుఁడై, కలి పుట్టె నరులు బెదర
నల్లకల్లోలమై జనుల్ తల్లడిల్ల
వరపుత్రుండన నొప్పు నట్టి కవిగా వాగ్దేవి సామ్ముఖ్యమున్
బరమానందము కూర్చునట్టి విధమున్ ప్రత్యేకమౌ రీతినిన్
విరచింపన్ సమకట్టినావు కృతినే విద్వత్కవీంద్రుండవై
నరసింహా! కృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్
కలి యుగా న న ధర్మము కాలు మోప
రిప్లయితొలగించండిపెరిగె దుర్మార్గ ములు పెక్కు భీక రము గ
వాని నరి కట్ట శ్రీహరి వసుధ వెలసె
నార సింహు డై కలి పుట్టె నరులు బెద ర
కృష్ణ నిర్యాణము నవలోకించి సంభ్ర
రిప్లయితొలగించండిమించి పీడల నొసగంగ మించి సతము
ద్వాప రాంతమం దుగ్రుఁడై ధర్షణమున
నారసింహుఁడై కలి పుట్టె నరులు బెదర
[కలి = కలి పురుషుఁడు]
నర లోకమ్మున దుష్ట శిక్షణకు సంతప్త ప్రజానీకముం
బరిపాలింపఁగ ధర్మ బద్ధముగ సంభావింప నాకౌకసుల్
ధరలోఁ బుట్టు నతండె మున్నిల మహా స్తంభంబునం దెవ్వఁ డా
నరసింహాకృతి నుద్భవించెఁ గలి నా నాభీతులం గూర్పఁగన్
[కలి = శూరుఁడు, ఇక్కడ కల్కి; నానా + అభీతులం = నా నాభీతులం]
ఘాతుకము లొనరించు కిరాతకులను
రిప్లయితొలగించండిరూపుమాపఁగ భువిఁగల్కి రూపమందు
హరియె ధర్మసంస్థాపన జరుప బూని
నారసింహుఁడై కలి పుట్టె నరులు బెదర
తే.గీ:నాడు ప్రహ్లాదు గావగ నరహరి యయి
రిప్లయితొలగించండిపృథ్వికిన్ వచ్చు శ్రీమహావిష్ణు విపుడు
మరల రాడే యధర్మమ్ము మాన్పు కొరకు
నారసింహుఁడై? కలి పుట్టె నరులు బెదర”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినరలోకంబున హింస పెచ్చరిలి నానా రీతులన్ ధర్మమే
రిప్లయితొలగించండివిరతంబై జనపాళి జీవనము నిర్వీర్యంబునై సొక్కగా
వరదుండౌ హరి ఘాతుకమ్ము లణచన్ వైకుంఠమున్ వీడి తా
నరసింహాకృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమ:నరసింహుండు ప్రథాని కాగ తమ పన్నాగమ్ములే పారవం
రిప్లయితొలగించండిచరివర్గ మ్మిటు రచ్చ జేసె"నవురా!అన్యాయమే ,పేరుకే
నరసింహుం డితడున్న దేశమునకే నాశమ్ము,మా కర్మ చే
నరసింహాకృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్”
(పి.వి.నరసింహారావు గారు ప్రథాని గా ఉండగా ఆయనంటే గిట్టని వాళ్లు ఇలా భయం వ్యాపింప జేసిన విషయం. పేరు నరసింహుడు కానీ ఆయన కలిపురుషుడు అన్నట్టు.)
భక్త దాసుఁడు గాఁబేరు వడయు కతన
రిప్లయితొలగించండిరక్షఁజేయగ నెంచియే రవము తోడ
భక్త ప్రహ్లాదుఁగాపాడ భవ్యముగను
నారసింహుఁడై కలి పుట్టె నరులు బెదర
చిరకాలంబును నుండియున్ దనకు దాసేవానుసంధానమున్
రిప్లయితొలగించండిగరముంజేయగ సంతసిల్లుచును సాక్షాత్కార మీయంగ నౌ
నరసింహాకృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్
బరమామోదముఁజెందునట్లుగను నాప్రహ్లాదుడెందంబిలన్
మ.
రిప్లయితొలగించండికరవాలంబునునెత్తి శంకరుఁ గనెన్ గాపాలికుండక్కరన్
శిరమున్ ద్రుంచుటఁ బద్మపాదుడు మదిన్ సేవించఁ జొచ్చెన్ మెయిన్
*నరసింహాకృతి నుద్భవించెఁ గలి నానాభీతులం గూర్చఁగన్*
మొరలాలించుఁ గరావలంబ నుతిచే మ్రొక్కంగ లక్ష్మీశునిన్.
... డా. అయ్యలసోమయాజుల సుబ్బారావు.
రిప్లయితొలగించండిభక్తుడైన ప్రహ్లాదుని ప్రార్థన విని
క్రూరుడైన హిరణ్యాక్షు గూల్చివేయ
స్తంభమున భక్తు గాపాడ తక్షణంబె
నారసింహుఁడై కలి పుట్టె, నరులు బెదర