28, జూన్ 2024, శుక్రవారం

సమస్య - 4805

29-6-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీరామునిఁ బొగడఁ దగును స్త్రీలోలుఁడుగన్”
(లేదా...)
“స్త్రీలోలుండగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

37 కామెంట్‌లు:

  1. ఆరామముధర్మమునకు
    నీరాజనమొందెనతనినీతినియమముల్
    కారణములేనివాక్యము:
    శ్రీరామునిఁ బొగడఁ దగును స్త్రీలోలుఁడుగన్

    రిప్లయితొలగించండి
  2. నేరమునెంచనివాడుగ
    శ్రీరామునిపొగడదగును, స్త్రీలోలుడుగన్
    భారమునయ్యెగరావణు
    డీరీతినినిందమోసెనీశ్వరునాజ్ఞన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    చేరగ నగ్ని పునీతగఁ
    గారడవులకంపె నిందఁ గాంచిన వాడై
    మీరెనె విరహాగ్నికి? నే
    శ్రీరామునిఁ బొగడఁ దగును స్త్రీలోలుఁడుగన్?


    శార్దూలవిక్రీడితము
    శీలంబగ్ని పునీతగన్ మెరయ నా సీతామహాసాధ్వినే
    ప్రేలన్ నిందలఁ గానలన్ బనిచెనే! ప్రేమాగ్నికిన్ లొంగెనే?
    ఫాలాక్షుండె తపించు దైవమన, స్త్రీవాంఛన్ దశాస్యుండుఁ దా
    స్త్రీలోలుండగు, వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్

    రిప్లయితొలగించండి
  4. గోలన్దెచ్చినవాడురావణుడునీఘోరంపుకార్యంబుతో
    స్త్రీలోలుండగు, వీరరాఘవునికీర్తింపన్దగున్పండితుల్
    మేలెంచెన్గదతానుశూర్పణఖనామెన్జూచిమోహింపకన్
    ఈలోకంబునరాముగాథయిదియేకేల్మోడ్చిదీవింపుడీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మోహింపక' అన్నది కళ. "మోహింపకే యీలోకంబున..." అనండి.

      తొలగించండి
    2. సవరిస్తానండికృతజ్ఞతలుగురువుగారు

      తొలగించండి
  5. స్త్రీలన్నన్ కడు పేర్మి జూపునెపుఁడున్ శ్రీరామచంద్రుండు కాం
    తాలోలుండనఁ బాడికాదు కలలో తానెన్నడున్ స్త్రీలపై
    లోలత్వంబును జూపలేదు ఘన శీలుండాతఁ డెట్లందువో
    స్త్రీలోలుండగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్?

    రిప్లయితొలగించండి
  6. దారను కానక మిగుల వి
    చారించి సతికొరకై విషధి దాటుచు వై
    రారోహమ్మును చేసిన
    శ్రీరామునిఁ బొగడఁ దగును స్త్రీలోలుఁడుగన్.

    (లోలుడు= ప్రేమించువాడు)


    ఆలోచింపక సీతకోరెనని తానా యేణికై వెళ్ళగా
    నా లోలాక్షిని దీవిరాయుడపుడే యంకింపగా నంత కా
    కోలగ్రీవుని భక్తుడౌ దనుజునిన్ గూల్చెన్ గదా కాంచగన్
    స్త్రీలోలుండగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్.

    రిప్లయితొలగించండి
  7. ఆరావణు నెదిరించిన
    శ్రీరామునిఁ బొగడఁ దగును ; స్త్రీలోలుఁడుగన్
    యా రక్కసి దశకంఠుని
    గోరపడనగు గిలుబాడె కోమలి సీతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లోలుడుగన్ + ఆ' అన్నపుడు యడాగమం రాదు. "స్త్రీలోలుడుగా నా రక్కసి" అనండి.

      తొలగించండి
  8. కం॥ పారావారముఁ జేర్చఁగ
    శ్రీరామనిఁ బొగడఁ దగును, స్త్రీలోలుఁడుగన్
    నేరమ్ములఁజేసి తుదకు
    నారావణుఁడు మరణించె ననఘుఁ గరములన్

    శా॥ ఆలోచించక రావణాసురుఁడు మోహావేశ సంబద్ధుఁడై
    చాలానేరములట్లు కోమలులపై సారించ దుష్టుండునై
    స్త్రీలోలుండగు, వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్
    మ్రోలన్ నిల్చి సదా సమాదరముతోఁ బూజించి సద్భక్తినిన్

    రిప్లయితొలగించండి
  9. కాలాంతమ్ముసమీపమైనతలపే; కారుణ్యధాముండు మా
    శ్రీలక్ష్మీపతి; రాముడున్; నిరతి, నిష్ఠేప్రాణమైమెట్టె గా
    ఆలోచించినపాపమే అగుసుమీఅర్ధమ్ములేదిందుగా:
    స్త్రీలోలుండగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్

    రిప్లయితొలగించండి
  10. క్రూరుండై తన సతినే
    దూరము చేసిన సకటుని తునుమాడుటకై
    వారధి కట్టిన వాడౌ
    శ్రీరామునిఁ బొగడఁ దగును స్త్రీలోలుఁడుగన్

    ఆలోచించినఁ స్పష్టమౌను సతిపై వ్యామోహమే మెండు మా
    యాలేడిన్ దన సీతకోర నతడే యద్దాని వెన్నంటెనే
    వాలింజంపిన కౌసలేయుడనినన్ బ్రాణంబు సీతేగదా
    స్త్రీ లోలుండగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్

    [ స్త్రీ = భార్య ]

    రిప్లయితొలగించండి
  11. కం:మా రాముని బొగడేదవో?
    ఊరక దిట్టెదవొ చెప్పుమోయి, పొసగునే
    యీ రీతి పద్యపాదము
    శ్రీరామునిఁ బొగడఁ దగును స్త్రీలోలునిగన్”
    (రాముడు స్త్రీ లోలుడు అంటే అది తిట్టు.అది వ్రాసి మళ్లీ పొగడదగును అనట మేమిటి?నువ్వు పొగడ దలుచుకున్నావా?తిట్ట దలుచుకున్నావా?అని ఎదురు ప్రశ్న.)

    రిప్లయితొలగించండి
  12. శా:స్త్రీలన్ ముక్తుల జేయునా మథుర భక్తిన్ దెల్పు తత్త్వమ్ము లో
    స్త్రీలోలత్వము జూపు మాధవుని గీర్తింపన్ దగున్ బండితుల్
    క్ష్మాలో సాంఘికధర్మమున్ దెలుపు కాంక్షన్ బల్క బూనంగ స్వ
    స్త్రీలోలుండగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్”
    (శ్రీకృష్ణావతారం తాత్త్వికము. దానిలో మథురభక్తి కూడా ఉంది. రాముడిది వ్యవస్థాధర్మం. స్త్రీలోలునిగా కనిపించే కృష్ణుణ్ని ఒకందుకు పొగిడితే రాముణ్ని మరొకందుకు పొగడాలి. రెండూ భిన్నం కనుక పాదాలలో కించిత్ భేదం సామ్యం వాడాను. )

    రిప్లయితొలగించండి
  13. ఆరాధన భావము తో
    శ్రీ రాముని బొగడ దగును :: స్ర్టీ లోలుని గన్
    పోరాముని రావణు నిన్
    ధారుణి దెగ డ దగు వాని దారుణ ములకు న్

    రిప్లయితొలగించండి
  14. తోరపు టాధారమ్ముల
    రారాజులఁ గాంచ రామ రావణు లందున్
    ధారుణి రావణు, వీడఁగ
    శ్రీరామునిఁ, బొగడఁ దగును స్త్రీలోలుఁడుగన్


    ఆలోకించిన భూతలమ్మునను నిత్యం బేకపత్నీ వ్రతై
    కాలేశ స్థిర మానసుం డసమ ధర్మాత్ముండు విఖ్యాత స
    త్యాలంకారుఁడు సద్ధనుర్ధరుఁ డయోధ్యా పట్టణేశుండు స్వ
    స్త్రీ లోలుం డగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగుం బండితుల్

    రిప్లయితొలగించండి
  15. మారీచాదులజంపిన
    *"శ్రీరామునిఁ బొగడఁ దగును స్త్రీలోలుఁడుగన్”*
    పేరును బడసెను జగతిన
    ధారుణిసుత నపహరించి. దశకంఠుడుతా





    రిప్లయితొలగించండి
  16. కారణజన్ముండగు నా
    శ్రీరామునిఁ బొగడఁ దగును, స్త్రీలోలుఁడుగన్
    క్రూరాత్ముండగు రావణు
    నేరీతిగ సజ్జనునిగ నెంచెదరిలలో?

    రిప్లయితొలగించండి
  17. మీరని ధర్మము వానిగ
    శ్రీరామునిఁ బొగడఁ దగును, స్త్రీలోలుఁడుగన్
    శ్రీరామునిపై నిందను
    నేరమెయౌవేయమనకు నిక్కము సుమ్మీ

    రిప్లయితొలగించండి
  18. స్త్రీలోలుండగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ బండితుల్”
    నీలా! యేమిది నీచమైనది మహానీచాతి నీచంబుగా
    నేలా పల్కుచు నుంటివిట్టుల?మనో నైజంబుఁగోల్పోతివే!
    బోలామాటలు బల్కకెప్పుఁడు సుమా భూమండలంబెక్కడన్

    రిప్లయితొలగించండి
  19. లోలత్వంబది యుండునెల్లరకు నాలోకించి భూపాలనం
    బాలోచించి పరిష్కరించిన సమన్యాయంబుఁ జేయంగ లో
    పాలున్నన్ బ్రజనేలు రాజునిల దైవంబందురట్లే యా
    స్త్రీ లోలుండగు వీరరాఘవునిఁ గీర్తింపన్ దగున్ పండితుల్

    రిప్లయితొలగించండి