17, జూన్ 2024, సోమవారం

సమస్య - 4794

18-6-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె”
(లేదా...)
“పద్యముఁ బాఁతిపెట్టెనఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే”
https://www.youtube.com/watch?v=iLB2QM07ELo

25 కామెంట్‌లు:

  1. తేటగీతి
    గతమునన్ బాత వృక్షమై ఖ్యాతిఁ గాంచి
    కమ్రపద్యఫలములీయ జ్ఞప్తిఁ గలిగి
    వారసత్వాన విశ్వాన వ్యాప్తిఁ జెందఁ
    బద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      సద్యశమంది పద్యము విశాల ప్రపంచమునందు మేటి నై
      వేద్యము వాణికన్ గతనఁ బ్రీతిగ గూర్చి ప్రసాదమందియున్
      హృద్య యశోవిరాజితమునింపుగ ప్రేక్షక మానసంబులన్
      పద్యముఁ బాఁతిపెట్టెనఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే!

      తొలగించండి
  2. నిండుహృదయంబుతిరమైననేలయనగ
    మేలివిత్తనమనగనుమేదురముగ
    భవితబంగరుబాటయైపంటనీయ
    పద్యమునుగరిమెళ్లయేపాతిపెట్టె

    రిప్లయితొలగించండి
  3. అద్యతనాంధ్రకావ్యములయాగడమెంచినదీర్ఘదర్శియై
    పద్యముపాతిబెట్టెనటపండితుడౌగడిమెళ్లవంశ్యుడే
    విద్యనుమెచ్చగాభవితవిజ్ఞుమనంబునవిత్తనంబుగా
    సద్యశమీయగామనసుసౌరభకావ్యవిశేషసంపదన్

    రిప్లయితొలగించండి
  4. ప్రజ్ఞ పాటవమ్ము గల్గి వాసి కెక్కి
    యాశు పద్యము లల్లు చు నలరు నట్టి
    మేటి యై నుతు లందుచు మించి యెటు ల
    పద్యమును గడి మె ళ్ల యే పాతి పెట్టె?

    రిప్లయితొలగించండి
  5. సాహితీ జగతిని ఘన సాలముగను
    విస్తరింప జేయ దలచి విజ్ఞు లైన
    జనుల హృదయాల లోన నా జాన తెనుగు
    పద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె.


    పద్యమదేల? వ్యర్థమని పామరులెల్లరు పల్కువేళ నా
    పద్యము హృద్యమంచు నది పాదపమట్లుగ విస్తరింపగా
    విద్యలు గల్గినట్టి కృతవిద్యుల గుండెల లోన నేర్పుగా
    పద్యముఁ బాఁతిపెట్టెనఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే.

    రిప్లయితొలగించండి
  6. తే॥ విద్యలందు పద్యము మేటి విషయమునటు
    సూటిగ వివరణ నొసఁగఁ బ్రతిభ తోడ
    ననుచు జనుల హృదయమందు నమరమొందఁ
    బద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె

    ఉ॥ విద్యల మేటి పద్యమనిఁ బ్రీతిగ భావము సూటిగానటుల్
    పద్యము తెల్పునంచునని పండిత వర్యులు దారిచూపఁగన్
    హృద్యముగా మనస్సునను నృత్యముఁ జేయ జనాళిలోసదా
    పద్యముఁ బాతిపెట్టెనఁట పండితుఁడౌ కడిమెళ్ళ వంశ్యుఁడే

    అయ్య మీరుపొందుపరచిన వీడియో లింకు ద్వారా చూసిన పిదపనే తట్టిందండి నాకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉ॥ చివరి పాదము యిలా సవరించానండి
      పద్యముఁ బాతిపెట్టెనఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే

      తొలగించండి
  7. పద్యములల్లి హృద్యముగ పండితలోకము మెచ్చ సత్కవుల్
    సద్యశమొంది నాడు మన సంస్కృతి యున్నతి చాటిరిప్పుఁడా
    పద్యఁపు పూర్వవైభవము పన్నుగ నుల్లములందు వర్ధిలన్
    పద్యముఁ బాఁతిపెట్టెనఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే

    రిప్లయితొలగించండి
  8. గరిమెళ్ళ గారి క్షమాభిక్షతో

    భావమును మించి ఛందస్సు పదిలమనుచు
    ప్రాస కొరకై పదమును పాడు చేసి
    విస్తృతిగ సంధులను కూర్చ , వెగటు పుట్ట
    పద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె

    రిప్లయితొలగించండి
  9. మేటి పండిత పామర మెప్పులంది
    పరిఢ విల్లిన పద్యాలు పాడనెంచి
    కోరు జనులైన తెలుఁగుల గుండెలందు
    పద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె

    పద్యము హృద్యమే ననుచు పండితు లెల్లరుఁ బల్కుచుండగా
    పద్యముఁ బాడు పామరులు పల్లెల వీధులఁ వల్లెవేయగా
    పద్యము భావి సంపదని భావన చేసి తెలుంగు గుండెలో
    పద్యముఁ బాఁతిపెట్టెనఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే

    రిప్లయితొలగించండి
  10. అఖిల పండిత వరుల కాహ్లాద మొసఁగఁ
    దెన్గు వారికి నెల్ల నిధియె యనంగఁ
    జేర్చి లంకె బిందెలలోన స్థిరముగఁ దన
    పద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె


    ఆద్యుఁడు సత్కవీశ్వరుల కారయ నింపగు తెన్గు భాషలో
    హృద్యముగా రచించి జను లెల్లరు మెచ్చఁగ నంచితమ్ముగన్
    విద్యల నంది చక్కఁగను విశ్వ యశస్సుఁ గవిత్వ మేదినిం
    బద్యముఁ బాఁతిపెట్టె నఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే

    [పాఁతి పెట్టె నఁట కనుకఁ బండితుం డౌను.]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములండి. ఇది అర్థముకాకనే కష్టపడుతున్నానండి.

      తొలగించండి
    2. అరసున్న వలన అర్థ భేదముల కిది యుదాహరణ మండి. పండితుఁడౌ కడిమె ళ్ల వంశ్యుఁడే - ఇక్కడ పండితుఁ డగు కడిమెళ్ల యని యర్థ మగును.

      తొలగించండి
  11. పద్య వైభవ మలనాడు పరిఢవిల్ల
    నాటి కవివర్యులెంతేని పాటుబడిరి
    వారి వారసత్వమొడిసి పట్టుకొనుచు
    పద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:పద్యమును వెక్కిరించెడు వచన కవియొ
    కండు వెటకారమున బల్కె "కనుడు! పద్య
    కవిత గొప్పదనెడు తన కవిత యందు
    పద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె”
    (పద్య కవిత్వం గొప్ప దని కడిమెళ్ల కవి అన్నారు కానీ అసలు ఆ పద్యమే గొప్ప పద్యం కాదు. దానిలో నే ఆయన పద్యాన్ని నాశనం చేసా "రని ఒక వచన కవి ఆక్షేపించాడు.)

    రిప్లయితొలగించండి
  13. ఉ:"పద్యము బాతి వేతునని పల్కున దెవ్వడు పిచ్చివాడు?నా
    పద్యము తెల్గు వారి కొక భాగ్యము,వాణికి నిచ్చు నిత్యనై
    వేద్యము,పాతి పెట్టితిమి వీడని పంటగ" నం చెడందలన్
    పద్యముఁ బాఁతిపెట్టెనఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే”
    (కడిమెళ్ల వారు "పద్యమ్ము నెవడురా పాతి పెట్టెద నంచు నున్మాది యై ప్రేలుచున్నవాడు?"అంటూ పద్యం వ్రాసి ఆ పద్యాన్ని హృదయాలలో పాతి పెట్టారు. )

    రిప్లయితొలగించండి
  14. భావ మిసుమంత గానదు పద్యమందు
    యతులు సరియగు చోటున నమడ వౌర
    ప్రాస లుండవు గణముల యూసు లేక
    పద్యమునుఁ గడిమెళ్ళయే పాఁతిపెట్టె.

    రిప్లయితొలగించండి
  15. పద్యము వ్రాయగా వలయు భవ్యత నొందెడునట్లుగాభువిన్
    పద్యపు లక్షణంబులను బాగుగ నేర్వని కారణంబుచే
    పద్యముఁ బాఁతిపెట్టెనఁట పండితుఁడౌఁ గడిమెళ్ళ వంశ్యుఁడే
    విద్యలయందు మేటిదని వేవురుఁ జెప్పగ వింటివే కదా!

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పద్య గొప్పతనము తెలుపగ దలంచి
    పద్యమును గడిమెళ్లయే పాతిపెట్టె
    ప్రజల హృదయమ్ము లందు; విశ్వమున తిరిగి
    పెక్కు నవధానముల్ జేసె విస్తరిలగ.

    రిప్లయితొలగించండి