18, జూన్ 2024, మంగళవారం

సమస్య - 4795

19-6-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విగత్రప్రాణుండు పోరె విమతుల్ వాఱన్”
(లేదా...)
“విగతప్రాణుఁడు పోరు సల్పెను రిపుల్ విభ్రాంతులై పాఱఁగన్”

21 కామెంట్‌లు:

  1. సగమాయుష్షునజన్మమున్గలిగితాశాంతుండుమార్కండుడున్
    జగమానందమనంతమైనిలువనేఝామున్శివానందుడై
    పగతోమృత్యువుకాటువేయనటనేభావంబుజూపింపకే
    విగతప్రాణుడుపోరుసల్పెనురిపుల్విభ్రాంతులైపారగన్

    రిప్లయితొలగించండి

  2. జగడమున త్రెళ్ళ నేమిర
    మగటిమి గలవా డతడభిమన్యుండని తా
    భగభగ మండుచు నపుడా
    విగతప్రాణుండు పోరె విమతుల్ వాఱన్.

    రిప్లయితొలగించండి
  3. పగతుడు దమ యింటి లోనికొలయగ
    మొగము దరి నొక మరబొమ్మ బూన్చగ , దానిన్
    మొగపడి మరలుట నరయగ
    విగత్రప్రాణుండు పోరె విమతుల్ వాఱన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    మగడై యభిమన్యుండని
    దిగఁ గౌరవులు బెదరి కడతేర్చఁ గపటులై
    పొగులు పితఁ గ్రీడిఁ బూనియు
    విగతప్రాణుండు పోరె విమతుల్ వాఱన్!

    మత్తేభవిక్రీడితము
    మగడై యయ్యభిమన్యుఁడున్ జెలఁగి పద్మవ్యూహమున్ ద్రుంచఁగన్
    దిగులొందన్ ధృతరాష్ట సూనుడు వడిన్ ద్రెంచంగ రాధేయుడున్
    బొగులన్ గ్రీడియె తండ్రిగా రగులుచున్ స్ఫూర్త్యాత్ముఁడై పూనుచున్
    విగతప్రాణుఁడు పోరు సల్పెను రిపుల్ విభ్రాంతులై పాఱఁగన్!

    రిప్లయితొలగించండి

  5. జగడమ్మాడుచు తమ్మిమొగ్గరమునన్ శౌర్యమ్ము నే చూపగా
    పగతుండ్రప్పుడు ముట్టుగోలుకొనుచున్ బాలార్చిరే యక్కటా
    సెగలన్ బోలు శరాళి రాల్చుచునటన్ చెండాడు చుండంగ నా
    విగతప్రాణుఁడు, పోరు సల్పెను రిపుల్ విభ్రాంతులై పాఱఁగన్.

    రిప్లయితొలగించండి
  6. కం॥ పగతులభిమన్యును దునుమ
    భగభగ మండుచు విజయుఁడు పగతులఁ ద్రుంచన్
    జగము జళుకఁ దోఁచె నిటుల
    విగత ప్రాణుండు పోరె విమతుల్ వాఱన్

    మ॥ సెగలన్ గ్రక్కుచు శత్రుసేనలను దాఁ జెండంగ ధీమంతుఁడై
    రగులన్ గోపము ఫల్గుణుండటు మహోగ్రంగాను బుత్రున్ వధిం
    చఁగ నొక్కండుగఁ జేసి బాలుఁడనుఁ బ్రస్తావించిరే యెల్లరున్
    విగతప్రాణుఁడు పోరుసల్పెను రిపుల్ విభ్రాంతులై పాఱఁగన్

    (అభిమన్యుని చంపిన తరువాత అర్జునుని ధాటి పెరగడము వలన దానికి పరోక్షముగా అభిమన్యుడే కారణమనే ఉద్దేశముతో వ్రాసానండి)

    రిప్లయితొలగించండి
  7. మగ ధీరుడు క్రీడి సుతుడు
    పగతుర చెండాడె తాను పటు తర శక్తిన్
    దగని విధ ంబు గ దునుమగ
    విగత ప్రాణండు పోరె విమతుల్ వారన్

    రిప్లయితొలగించండి
  8. విగతుండౌ సౌమిత్రికి
    నగణితముగ ప్రాణమొసగె హనుమంతుండే
    మిగులాశ్చర్యకరంబుగ
    విగతప్రాణుండు పోరె విమతుల్ వాఱన్

    విగతాత్ముండయె లక్ష్మణుండు జనులే విభ్రాంతులై చూడగా
    సగుణోపాసకుడైన వాయుసుతుడే సంజీవినిన్ దెచ్చెగా
    మిగులాశ్చర్యకరంబుగాదె రయమున్ మేల్కాంచె సౌమిత్రుడే
    విగతప్రాణుఁడు పోరు సల్పెను రిపుల్ విభ్రాంతులై పాఱఁగన్

    రిప్లయితొలగించండి
  9. పగతులు మూకుమ్మడిగా
    జగడమ్మున బాలయోధుఁ జమరగ బూనన్
    మగటిమితో తుదివరకును
    విగతప్రాణుండు పోరె విమతుల్ వాఱన్

    రిప్లయితొలగించండి
  10. జగడమ్మందున తమ్మిమొగ్గరమునన్ శస్తమ్ముగా బాలుడున్
    సెగలన్ గ్రక్కు శరప్రహారములచే చెండాడగానంతటన్
    పగతుల్ బాలుని చుట్టుముట్టియొకటై పాలార్చఁగా ధీరుడై
    విగతప్రాణుఁడు పోరు సల్పెను రిపుల్ విభ్రాంతులై పాఱఁగన్

    రిప్లయితొలగించండి
  11. జగదేక వీరుఁ డుద్ధతిఁ
    బగతో రణ దుర్జయుండు భండన మందుం
    దెగి పడి యుండ నిజ సఖుఁడు
    విగతప్రాణుండు పోరె విమతుల్ వాఱన్


    విగతత్రాసుఁడు వాయు నందనుఁడు జృంభింపంగఁ బ్రావేల్పు లా
    తొగలం గాంచి చలింప కింత హనుమంతుం డుగ్ర రూపమ్మునం
    దగఁ జంపంగఁ దలంచి నెమ్మదిని దైత్యవ్రాత శస్త్రాస్త్ర ని
    ర్విగతప్రాణుఁడు పోరు సల్పెను రిపుల్ విభ్రాంతులై పాఱఁగన్

    రిప్లయితొలగించండి
  12. జగమాశ్చర్యము వొందగా దపము దా
    సాగించె ఘోరంబుగా
    భగుడున్ దర్శనమిచ్చి కింకరులకున్
    బట్టించె స్వేదంబులున్
    నిగమాధ్యాయుడు బొందినాడసువులన్
    నిండార మార్కండుడున్
    విగత ప్రాణుడు పోరు సల్పెను రిపు
    ల్విభ్రాంతులై పారగా

    రిప్లయితొలగించండి
  13. కం:పగతులు దండెత్తగ, ధా
    టిగ వారి నెదిర్చి వారి టెంకెము నశియిం
    పగ ,యోధుడు భారతభా
    విగతప్రాణుండు పోరె విమతుల్ వాఱన్”
    (అన్నగతప్రాణుడు అన్నట్టు అతను భారతభావిగత ప్రాణుడు. భారతభవిష్తత్తే అతని ప్రాణం.)

    రిప్లయితొలగించండి
  14. తగువీరుండభిమన్యుడాలమున పద్మవ్యూహమున్ జొచ్చి పో
    రగ ధుర్యోధన దుష్టకూటముల దుర్మంత్రంబు కాతండయెన్
    విగతప్రాణుడు, పోరుసల్పె రిపుల్ విభ్రాంతులై పాఱగన్
    నెగలాకాశమునంట పాండవులు పెన్నేరంబుకున్ శిక్షగన్

    రిప్లయితొలగించండి
  15. మ:పగతుల్ దేశము నాక్రమించ గడగన్ వారించి, యా నీచులన్
    దెగటార్చన్ భరతోర్వి సైనికుడు తా దేశావనా దీక్ష నొం
    టిగ బ్రాణమ్ముల నడ్డి పోరెనట వింటే!దేశ సంక్షేమ, భా
    విగతప్రాణుఁడు పోరు సల్పెను రిపుల్ విభ్రాంతులై పాఱఁగన్”

    రిప్లయితొలగించండి
  16. (3)కం:పగవారికి భీకరుడై
    సగము శరీరమ్ము గుళ్ల జడివాన బడన్
    తెగువన్ నిన్నటి యని నీ
    విగతప్రాణుండు పోరె విమతుల్ వాఱన్”
    (ఈ విగత ప్రాణుడు నిన్న ఇలా విజృంభించాడు.)

    రిప్లయితొలగించండి
  17. అగణిత సద్గుణ శీలుఁడు
    విగత్రప్రాణుండు, పోరె విమతుల్ వాఱన్
    నిగమాదిశాస్త్ర విషయము
    మగధీరత వెల్లడించి మనసులు దోచన్

    రిప్లయితొలగించండి