16, జూన్ 2024, ఆదివారం

సమస్య - 4793

17-6-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంఖధ్వానము వినఁబడె శ్వానం బార్వన్”
(లేదా...)
“శంఖధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్”

18 కామెంట్‌లు:

  1. లంఖిణిరాక్షసిలంకవి
    శృంఖలగాగనుతలపడెసంగరమందున్
    వంకరదీర్చెనుహనుమయు
    శంఖధ్వానమువినబడెశ్వానంబర్వన్

    రిప్లయితొలగించండి
  2. శంఖంబేయదిచక్రమేదిగనగాశ్యాముండుతోడెంచకన్
    శంకన్నుండినభద్రరక్షకొఱకైసౌమ్యుండుపర్వెత్తెనే
    శృంఖల్వీడుచుముక్తినందెనహహాశోభాకృతిన్భక్తుడే
    శంఖధ్వానమువిన్పడెన్పృథులమైశ్వానంబుబిట్టుర్వగన్

    రిప్లయితొలగించండి

  3. పంకజ ముఖి కోరెననుచు
    నంకిలి లెక్కించకుండ నందున దిగగా
    సంకము లభించె నూదగ
    శంఖధ్వానము వినఁబడె శ్వానం బార్వన్.


    వంకన్ నీరది యింకిపోగ నట ఖట్వారూఢుడౌ వానికిన్
    పంకంబందు లభించె నయ్యె నొక యబ్జమ్మంచు మోదమ్ముతో
    కైంకర్యమ్మును జేయ భర్గునకు శంఖానాదమున్ జేయ నా
    శంఖధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్.

    రిప్లయితొలగించండి
  4. కందం
    వీంఖ నెఱుంగక తిరుగ వి
    శృంఖలముగ కుక్క నంగ చెల్లిన వాడున్
    న్యుంఖపు ననుకరణఁ బడయ
    శంఖధ్వానము వినఁబడె శ్వానం బార్వన్!

    శార్దూలవిక్రీడితము
    వీంఖన్ దప్పి పరిభ్రమించఁగ స్వయంప్రేరేపణన్ రేగుచున్
    శృంఖల్లేవను బోకడన్, శునకమంచెంచంగఁ బెద్దల్, గసిన్
    న్యుంఖమ్మై పొగడంగ ధ్వన్యనుకృతిన్ యోగ్యుండుగన్ నిల్చినన్
    శంఖధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్

    రిప్లయితొలగించండి
  5. పుంఖములకు పుష్కరమున
    శంఖధ్వానము వినఁబడె; శ్వానం బార్వన్
    రింఖారవమేళనమున
    శంఖారవమే వినబడె సర్వజనులకున్

    పుంఖాలే భువనాన త్రిప్పుడుగొనన్ బూరించిరే శంఖముల్
    శంఖధ్వానము విన్పడెన్ బృథులమై; శ్వానంబు బిట్టార్వఁగన్
    గంఖాణంబుల గిట్టలందు నడరెన్ గగ్గోలుగా తీవ్రమౌ
    రింఖారావము యుద్ధభూమి నెనయన్ రెట్టించెనే ధ్వానముల్

    రిప్లయితొలగించండి

  6. శఃఖము నూది మొదలిడిరి
    రింఖను జేయగ , నది బహు లెస్సగ నుండన్
    మంఖున వచ్చుచు నుండగ
    శంఖధ్వానము వినఁబడె శ్వానం బార్వన్

    రింఖ = నృత్యము
    మంఖు = తొందరపాటు

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. కం॥ మంఖున్ గదనముఁ గోర వి
      శృంఖలముగ శత్రువులను జెండ విజయుఁడే
      ప్రేంఖణముగ వేపి తిరుగ
      శంఖధ్వానము వినఁబడె శ్వానంబర్వన్

      శా॥ మంఖున్ గయ్యముఁ గోరఁ గౌరవులటుల్ మన్నించకన్ బెద్దలన్
      శంఖారావముఁ జేసి పార్థుడటులన్ సారించి గాండీవమున్
      బుంఖాపుంఖముగాను జెండగను సంమోదంబుగా క్షాణినిన్
      శంఖాధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్

      మంఖు తొందరపాటు
      ప్రేంఖఖణము పర్యటనము పరిభ్రమించునది

      క్షమించాలి రాత్రి నేను శ్వానము ను శ్వాసము అని చదివినాను.

      కురుక్షేత్రమున రాత్రిపూట కుక్క అరుస్తుండగా శంఖనాదము వలె వినిపించిందని పూరించానండి. తప్పొప్పులు విజ్ఞులకే తెలియాలి మరి.

      తొలగించండి
  8. శంఖము శునకపు రూ పై
    శృ o ఖ లము గ సడిని సేయ చెవులకు సోక న్
    మంఖు గ నొక్కండి ట్ల నె
    శంఖ ధ్వానము విన బ డె శ్వా నం బా ర్వ న్

    రిప్లయితొలగించండి
  9. పుంఖమ్ముల్ గగనంబునందెగురగన్ భూమిన్ రణోత్సాహియై
    వింఖమ్ముల్ ధ్వని మిన్నునంటఁగడు నుద్వేగంబుగా వీరునిన్
    శంఖధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్
    మంఖున్ బోరెనవక్ర విక్రముడుగా మల్లన్న యుద్ధమ్మునన్

    రిప్లయితొలగించండి
  10. శంఖధ్వానముఁ జేసి బిచ్చమడుగున్ సన్యాసి మావాడలన్
    పుంఖించున్ పలు గ్రామసింహములవే మూకుమ్మడై యాదినం
    బున్ ఖద్యోతుడు వాడినుండు తరుణంబున్ బంధువర్గంబుకున్
    శంఖధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వగన్

    రిప్లయితొలగించండి
  11. కం:శంఖము నూదగ గుడిన వి
    శృంఖల మోదమ్ము తోడ జేసె శునకమున్
    శంఖసమశ్రుతి రవమును
    శంఖధ్వానము వినఁబడె శ్వానం బార్వన్”
    (గుడిలొ శంఖం ఊదగా ఒక కుక్క ఉత్సాహం పొంది దానికి సమశ్రుతి లో మొరిగింది. అది మళ్లీ శంఖధ్వానం లాగా వినబడింది. )

    రిప్లయితొలగించండి
  12. పుంఖమ్ములు సెలరేఁగెను
    రింఖా ఘట్టనము లెల్ల రేఁగె భృశముగం
    బుంఖానుపుంఖముగ నిల
    శంఖధ్వానము వినఁబడె శ్వానం బార్వన్


    రింఖా సంయుత వాద్య ఘోషముల ధాత్రీ చక్ర మల్లాడఁగా
    వింఖవ్రాత నిపీడనమ్ముల వెసన్ విశ్వమ్ము కంపింపఁగాఁ
    బుంఖాపుంఖ నరార్త రావముల నంభోధుల్ చలింపంగ నీ
    శంఖధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్

    [రింఖ = గుఱ్ఱపు డెక్క, నృత్యము; వింఖము= గుఱ్ఱపు డెక్క; పుంఖము=డేగ]

    రిప్లయితొలగించండి
  13. శా:శంఖ మ్మూదగ సాయి నాథు గుడిలో,సద్భక్తుడైనట్టి యా
    జంఖానున్ తన శంఖ మూద కడు విశ్వాసమ్ముతో, మోద మం
    దన్ ఖాద్యమ్ముల భక్తితో నరచె ఖాన్ దాదా సృగాలమ్మునున్
    శంఖధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్
    (సాయి బాబా గుడిలో శంఖం ఊదగా ఆజం ఖాన్ అనే భక్తుడు ఊదాడు. అది ఐతే ప్రసాదం దొరుకుతుందనే సంతోషం తో అతని కుక్క అరిచింది. అదీ శంఖనాదం లాగే ఉంది. సాయి బాబా భక్తులు కుక్కని గౌరవిస్తారు.)

    రిప్లయితొలగించండి
  14. శృంఖలముల చెఱ వీడగ
    రింఖంబులుమిన్నుముట్టె రేవడి సభలోన్
    బుంఖాను పుంఖ రవమున
    శంఖధ్వానము వినఁబడె శ్వానం బార్వన్”

    రిప్లయితొలగించండి
  15. శంఖా నాదముఁజేయ భక్తుఁడు తమిన్ సైయంచు భక్తాళియున్
    రింఖా కేళిని సంత సంబున రతిన్ రేవాడు భాగ్యంబునాన్
    బుంఖా లేభువినంత భీకరముగాఁ బూరించ వేగంబుగా
    శంఖధ్వానము విన్పడెన్ బృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్

    రిప్లయితొలగించండి
  16. పుంఖమ్ములు చదలఁ దిరుగ
    వింఖపు శబ్దములఁ గలిసి వీనులవిందై
    మంఖుగ సలిపెడు యోధుని
    శంఖధ్వానము వినఁబడె శ్వానం బార్వన్

    పుంఖము=డేగ; వింఖము=గుఱ్ఱపుడెక్క
    మంఖు= తొందరపాటు

    రిప్లయితొలగించండి