తే.గీ:కుశలవులు చేయు యుద్ధము కుశలవులకు బ్రాణసంకటమంచు,శ్రీ రామునకును గ్రోధకారణ మను సీత క్షోభ తీరి రణము ముదమిడె సీతకు రామునకును” (ఈ యుద్ధం సీతారాములు కలవటానికి కారణం కనుక.)
చం:ఘన మగు నస్త్రశస్త్రముల జ్ఞానము లేకయు బండ రాళ్ళతో డను,తరుశాఖలన్ దలపడన్ కపి వీరులు రాజభక్తితో మనమున రామభక్తి యొక మంత్రముగాగ నితోథికమ్మె యౌ రణమది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్” (శస్త్రాస్త్ర పరిజ్ఞానం ఉన్న మానవరాక్షసవీరుల యుద్ధం కంటే అవి లేని కోతులు తమ రాజభక్తి తో అనగా సుగ్రీవుని పట్ల భక్తితో, రామభక్తితో చేసిన యుద్ధం గొప్పది కదా!)
కాదనరాముఁడువనికిని
రిప్లయితొలగించండివాదనఁజేసెగనవనిజరాజసమొప్పన్
పోదమురమ్మనిపిలువగ
భేదముముదమొసగెరామభూసుతకచటన్
రాముపెడ్లముకచటన్
తొలగించండిరావణుడు మోసగించియు రామవిభుని
రిప్లయితొలగించండియపహరించెను జానకి నసుర ప్రభువు
రాము డాతని యుద్ధాన రాల్చె నేల
రణము ముదమిడె సీతకు రామునకును
వనమునీతోడువత్తుగావందితముగ
రిప్లయితొలగించండికలసినడువంగనేర్తుగాకలతవలదు
వాదమీరీతిసేయంగవారిజాక్షి
రణమదిగూర్చెరామునకున్
తేటగీతి
రిప్లయితొలగించండివీడక రమారమణులతో ప్రీతిగ తన
యంశనంపు శివుడనఁగ హనుమగగని
ధర్మసంరక్షణార్థము ధరణి నవత
రణము ముదమిడె సీతకు రామునకును
చంపకమాల
ప్రణుతుల ధర్మవిగ్రహము రాముడనంగను సాధ్విసీతగన్
గుణయుతులై ధరాస్థలిని కూడ రమారమణుల్ ప్రశస్తమై
ఫణిధరునంశయున్ తమకు పాటిగ తోడ్పడ నాంజనేయ తా
రణమది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్
పెండ్లి జరిపిన తదుపరి బెడద పడుచు
రిప్లయితొలగించండినియమముగ నత్తవారుండు నిలయమునకు
బంపుచు జనకుడొసగిన పసిడి యాభ
రణము ముదమిడె సీతకు రామునకును
ప్రణయని జానకీ సతిని రాముని
రిప్లయితొలగించండిభార్యను మోసగించి రా
వణుడను రాక్షసాధముడు పావని
సీతను దొంగిలించగా
రణమున రామచంద్రుడును రావణు
జంపెను వాని యొక్క మా
రణమది గూర్చె మోదమును రాము
నకున్ ధరణీ ప్రసూతికిన్
రిప్లయితొలగించండికాముకుడగుచు చెరపట్టె ఖలుడటంచు
వాని యంతమ్ము గోరెనా వనిత సీత
సింధువును దాటి దనుజులతో చేసినట్టి
రణము ముదమిడె సీతకు రామునకును.
హనుమకు తెల్పెనప్పుడె మహాబలశాలి పరాక్రమమ్ముతో
ననకుని యూచమట్టుగొని యాలిని చేగొనినప్పుడే కదా
ఘనుడని మెచ్చునీజగతి కాంతుని యంచు వచించె కాదుటే
రణమది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్.
తే॥ రావణు చెరను దుఃఖము గ్రమ్మి సీత
రిప్లయితొలగించండిబ్రదుకు భారమై చనుచుండ రాముడటకు
రాగ రావణుఁ వధఁగను యోగమరసి
రణము ముదమిడె సీతకు రామునకును
చం॥ గుణవతి సీత దుఃఖమును క్షోభను బొందుచు సాగ లంకలో
ఝణఝణ మ్రోగు సవ్వడిని సైన్యము తోడను రాఘవుండటుల్
రణమును జేయ వచ్చె రిపు రావణుఁ ద్రుంచఁగ సీత రక్షకై
రణమది గూర్చె మోదమును రామునకున్ జనకాత్మ కయ్యెడన్
క్షణమయినను శంకించక కానకరిగె
రిప్లయితొలగించండిప్రణయిని యగు జానకి తన భర్తవెంట
గణుతి కెక్కిన మారుతి ఘనత సంస్మ
రణము ముదమిడె సీతకు రామునకును
ప్రణయిని చేరెకాననము భర్తను వీడనిదౌచు రామ ర
క్షణమున క్షేమమేననుచు జానకి సాగెను రామభద్రతన్
గుణవతి సీత సల్పెగద కోరి యరణ్యవిహారమే యవా
రణమది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్
వానరులు సహాయ పడగా బ వర మందు
రిప్లయితొలగించండిపోరు స లి పెను రాముడు ఘో ర ముగను
రాక్ష సు ల నెల్ల గూ ల్చ గా రావ ణు ని మ
రణ ము ముదమిడె సీత కు రాము నకును
అనఘుఁడు జానకీ రమణుఁడాలినిఁ గానక కాననమ్మునన్
రిప్లయితొలగించండిజనె కపిసేనతో గలిసి చయ్యన వారిధి దాటి లంకకున్
రణమొనరించి భీమముగ రావణు గూల్చెను రాఘవుండు మా
రణమది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్
ఇడుమలకు నోర్చి వసియింప నడవు లందు
రిప్లయితొలగించండిజానకీరాము లింక లక్ష్మణుఁడును గల
కంఠి నపహరింపఁగ దశకంఠ సంహ
రణము ముద మిడె సీతకు రామునకును
రణ తల దుర్జయుండు నగు రావణు నంతము దాపురింప స
ద్గుణుఁ డనుజుండు నుండ దరిఁ గూరిమిఁ దోడుగ సంతతమ్ము ధా
రుణిఁ జరియింప గోత్రములలోఁ దమి నూతన వాల్క వస్త్ర ధా
రణ మది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్
రామ సీతనుఁ గూడఁగ రాఘవుండు
రిప్లయితొలగించండివారధినిఁగట్టి వార్ధిపై జేరె లంక
రణమునందున జచ్చెను రావణుఁడు మ
రణము ముదమిడె సీతకు రామునకును
తే.గీ:కుశలవులు చేయు యుద్ధము కుశలవులకు
రిప్లయితొలగించండిబ్రాణసంకటమంచు,శ్రీ రామునకును
గ్రోధకారణ మను సీత క్షోభ తీరి
రణము ముదమిడె సీతకు రామునకును”
(ఈ యుద్ధం సీతారాములు కలవటానికి కారణం కనుక.)
చం:రణమున రాక్షసాళియును, రావణుడున్ నశియింప మాతృభూ
రిప్లయితొలగించండిమిని, తన వారి జేరుటకు మించిన మోదము తోడ వచ్చు రా
మునకు నయోధ్యవాసు లిడు ముచ్చట గొల్పెడు స్వాగతంపు తో
రణమది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్”
చం:ఘన మగు నస్త్రశస్త్రముల జ్ఞానము లేకయు బండ రాళ్ళతో
రిప్లయితొలగించండిడను,తరుశాఖలన్ దలపడన్ కపి వీరులు రాజభక్తితో
మనమున రామభక్తి యొక మంత్రముగాగ నితోథికమ్మె యౌ
రణమది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్”
(శస్త్రాస్త్ర పరిజ్ఞానం ఉన్న మానవరాక్షసవీరుల యుద్ధం కంటే అవి లేని కోతులు తమ రాజభక్తి తో అనగా సుగ్రీవుని పట్ల భక్తితో, రామభక్తితో చేసిన యుద్ధం గొప్పది కదా!)
క్షణమున క్షావిభుత్వ మొక కాంత నెపమ్మున జార నైన, ధా
రిప్లయితొలగించండిరుణి గహనాంతరస్థలము రుద్రమహాప్రియు వాసమైనఁ బో,
తృణముగ నెంచ భోగముల, దీపిత ధర్మసురక్షణైక కా
రణమది గూర్చె మోదమును రామునకున్ ధరణీప్రసూతికిన్
పెండ్లి సమయాన జనకుఁడు ప్రీతి తోడ
రిప్లయితొలగించండిక్రొత్త దంపతి నలుగుర కునిడె బసిడి
వరుని కానుక గనిడిన పసిడి యాభ
రణము ముదమిడె సీతకు రామునకును
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కపులతో రామ లక్ష్మణుల్ కడలి దాటి
లంక యందున ఘోరమౌ రణము చేసి
రావణుని సంహరించగ, రాక్షసుని మ
రణము ముదమిడె సీతకు రామునకును.