5, జూన్ 2024, బుధవారం

సమస్య - 4783

6-6-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంతుని నెదిరించి చంప ఘనకార్యమ్మౌ”
(లేదా...)
“ఘనకార్యంబగుఁ గాంతు మార్కొని బలాత్కారమ్మునం జంపినన్”

34 కామెంట్‌లు:

 1. క్రాంతినిజూపెనుసత్యయు
  భ్రాంతినివీడుచుతలపడిభామయునైనన్
  వంతుననరకుని లక్ష్మీ
  కాంతునినెదిరించిచంపఘనకార్యమ్మౌ

  రిప్లయితొలగించండి
 2. తనియన్జాలకనేటిభామలును శాంతంబున్సదావీడుచున్
  చెనఁటుల్వోలెనువర్తనంబుననునిశ్చింతన్మదాక్రాంతలై
  వనకన్పెద్దలధర్మమార్గమునుతావిద్యన్ధనంబెంచుచున్
  ఘనకార్యంబగుఁగాంతుమార్కొనిబలాత్కారంబునన్జంపినన్

  రిప్లయితొలగించండి
 3. రారాజు తో శకుని:

  కందం
  కౌంతేయుల బలమింతని
  పంతముతో రాజ్యమెంచి పంచగఁ జూడన్
  జింతయె! బంధించియు శ్రీ
  కాంతుని నెదిరించి చంప ఘనకార్యమ్మౌ!

  మత్తేభవిక్రీడితము
  వినయంబొల్కుచు నాంబికేయు కడ నిర్విఘ్నంబుగన్ భాగమున్
  ఘననీలాంగుడు రాజ్యమందునిడు నే కౌంతేయ పక్షంబుగన్
  వెనువెంటన్ దగ మేలుకొంచు మనమే విద్రోహి బంధించియున్
  ఘనకార్యంబగుఁ గాంతు మార్కొని బలాత్కారమ్మునం జంపినన్!

  రిప్లయితొలగించండి

 4. సుంతయుమన్నననొసగక
  వంతలుకూర్చుచుసతతముబాధలనిడుచున్
  పంతముబూనినయాభూ
  *"కాంతుని నెదిరించి చంప ఘనకార్యమ్మౌ

  రిప్లయితొలగించండి
 5. *( తారకాసురుని అంతర్మదనం )*

  అంతక హరకొమరుడు న
  న్నంతము జేయగలిగెడి హియానుడతడు, వా
  డెంతటి వీరుడయిన నా
  కాంతుని నెదిరించి చంప ఘనకార్యమ్మౌ.


  తననంత మ్మొనరించగా నొకడు చంద్రాపీడుకున్ వాశికిన్
  తనయుండై జనియించె నందురిట యా దాక్షాయణీ పుత్రు నీ
  క్షణమే చంపుట మేలటంచు నదె సత్కార్యమ్మదే కాంచగా
  ఘనకార్యంబగుఁ గాంతు మార్కొని బలాత్కారమ్మునం జంపినన్.

  రిప్లయితొలగించండి
 6. వనితన్గాంచుచుదుష్టచిత్తుడయితావాంఛించిగొంపోవగన్
  యినవంశుండునుయాదురాత్మునటతానేరీతిగానైననా
  తనిసంహారముచేయనెంచుచునుతాదాక్షిణ్యమున్వీడుగన్
  *“ఘనకార్యంబగుఁ గాంతు మార్కొని బలాత్కారమ్మునం జంపినన్”*

  రిప్లయితొలగించండి
 7. స్వాంతమున నతడు దాయగ
  భ్రాంతి కలిగినంత నతని వధమును దలచన్
  శాంతము వహించు మన్నను
  కాంతుని నెదిరించి చంప ఘనకార్యమ్మౌ

  రిప్లయితొలగించండి
 8. భ్రాంతమ్మున భయశీలుఁడు
  ధ్వాంతము మదినతిశయించ దలఁచు కుమతియై
  శ్రాంతమునొందెడునపుఁడే
  కాంతుని నెదిరించి చంప ఘనకార్యమ్మౌ

  రిప్లయితొలగించండి
 9. పనులందున్ సతినొక్క బానిసగ సంభావించి క్రూరంబుగన్
  తనయౌద్ధత్యముఁ జూపు యాగడము లంతంబొందఁగా జేయగా
  నణుమాత్రంబును శంకబూనక మనంబందున్ కళత్రంబుకున్
  ఘనకార్యంబగుఁ గాంతు మార్కొని బలాత్కారమ్మునం జంపినన్

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   వృత్తం మొదటి పాదంలో గణభంగం. "సుభాషితంబు లెపుడున్" అనండి.

   తొలగించండి
  2. కాంతుని దుష్పరిపాలన
   నంతమొనర్చు కృత నిశ్చయంబున భటుడే
   సుంతయు సందేహించక
   కాంతుని నెదిరించి చంప ఘనకార్యమ్మౌ

   [కాంతుడు = ప్రభువు]

   వినడాతండు సుభాషితంబులెపుడున్ విద్వజ్జనుల్ చెప్పినన్
   దన మూర్ఖంపు తలంపుతో జనులకే దాక్షిణ్య రాహిత్యమున్
   ఘనపీడాకరుడై చెలంగు నెపుడున్, ఖడ్గంబు లేకుండినన్
   ఘనకార్యంబగుఁ గాంతు మార్కొని బలాత్కారమ్మునం జంపినన్

   తొలగించండి
 11. అంతము సేయగ నెంచియు
  పంతము తో మడుగు జేరి పటు తర శక్తి న్
  కౌంతే యుడు కౌ రవ భూ
  కాంతుని నెది రించి చంప ఘన కార్య మ్మౌ

  రిప్లయితొలగించండి
 12. కం॥ముంతకు బానిస యగుచున్
  వింతగ హింసించుచుఁ జన వివిధ పగిదులన్
  బంతముఁ బూని కఠినుఁడై
  కాంతుని నెదిరించి చంప ఘనకార్యమ్మౌ

  మ॥ తనువుల్ మానసముల్ మమైకమగుచున్ ద్రాణంబు నొందంగనే
  మనువుల్ సార్థక మొందు మాన్యతఁ గనున్ మద్యమ్ము జూదమ్మునున్
  ఘనమై భార్యను బాధపెట్టుచును సాగంగాను నిత్యమ్మటుల్
  ఘనకార్యంబగుఁ గాంతు మార్కొని బలత్కారమ్మునం జంపినన్

  అక్కడక్కడ నడుస్తున్న చరిత్రయేనండి

  రిప్లయితొలగించండి
 13. కం:సుంత విను సత్య పలుకుల ,
  కాంతుడు యుద్ధమున బడలగా,రక్కసులన్
  సుంత సహింపక,కాచగ
  కాంతుని, నెదిరించి చంప ఘనకార్యమ్మౌ”
  (అని సత్యభామ శ్రీకృష్ణుడు తో పలికి యుద్ధానికి బయలుదేరినట్లు.)

  రిప్లయితొలగించండి
 14. )మ:వినవే రక్కసి!నిన్ను గట్టుకొని నే వేసారితిన్,భర్త యం
  దున నే జాలియు లేని దాన వెపుడున్ దూషల్, తిరస్కారభా
  షణముల్,దెప్పిడులన్ సహించితి ననున్ జంపన్ విష మ్మీయవే
  ఘనకార్యంబగుఁ గాంతు మార్కొని బలాత్కారమ్మునన్ జంపినన్”
  (అని ఒక మెతక భర్త గయ్యాళి భార్య తో అన్నాడు. )

  రిప్లయితొలగించండి
 15. వింతగఁ దూఱంగఁ దటా
  కాంతరమున సిగ్గు వీడి కయ్యమ్మున దు
  ష్టాంతఃకరణుం గౌరవ
  కాంతుని నెదిరించి చంప ఘన కార్యమ్మౌ


  అనివార్యంబుగ నీ దశాననుని దుష్టాత్మున్ నిరీక్షించి వే
  వనితా లోలుని స్వీయ సౌధమున దర్పం బెల్ల నాశంబు గా
  హనుమంతుండు దలంచె నెమ్మనమునం దత్యంత రోషుండునై
  ఘనకార్యం బగుఁ గాంతు మార్కొని బలాత్కారమ్మునం జంపినన్

  రిప్లయితొలగించండి

 16. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  పంతమున కోడలిని బల
  వంతము చేయగ ప్రయాసపడుచున్న పతిన్
  సుంతయు సహించకయె తన
  కాంతుని నెదిరించి చంప ఘనకార్యమ్మౌ.

  రిప్లయితొలగించండి