చంపకమాల మెలకువలన్నియున్ గురువు మిన్నగ నేర్ప విరాజమానుఁడై చెలఁగుచు మించి పూర్వ కృత చిత్రవిచిత్ర కవిత్వరీతులన్ నలువకు రాణి సత్కృపయె నాలుక పై తగ నాట్యమాడఁగన్ దలఁచినతోడనే శతవధానము నర్భకుఁడైనఁ జేయుఁగా!
చం॥ వలచిన వెంటనే పడతి పల్కున కాంచఁగ నీ నిజాయితీ సలుపఁగ నావశ్యమ్ము శ్రమ సాధన నిత్యము నీవిధంబుగన్ దలఁచినతోడనే శతవధానము నర్భకుఁడైన జేయుగా యలసట లేక యన్న ఘన హాస్యపు పల్కులటంచు నవ్వరే!
అయ్యా! మొదటి కందం సమస్యలో చిన్న ఛందోదోషం వచ్చింది. పొరపాటు ఎవరి కైనా సహజమే కానీ పూరణ కర్తలు కొంత సవరించి పూరిస్తే బాగుంటుంది. "అవధానము జేయ గల్గు నర్భకు డైనన్"లేక "అవధానము జేయ గలుగు నర్భకు డైనన్"అని మార్చి పూరించ వలసినది గా విజ్ఞప్తి.
చం:పలువురు బాల పండితులు,పద్యకవిత్వము నందు దిట్టలై, లలితము, బ్రౌఢ మైన గతులం దవధానము లెన్నొ చేయ ,వా రల గడు ప్రేమ జూపి కవి రాజులు మెచ్చగ,నట్టి దృశ్యముల్ తలఁచినతోడనే శతవధానము నర్భకుఁడైనఁ జేయుఁగా”
కవనమునందునఘటికుడు
రిప్లయితొలగించండినవకంబందుచుయువకుడునాదిత్యుడునై
సవనమునందు నకర్తగ
అవథానముజేయగలడర్భకుడైనన్,
అలసటలేకపృచ్ఛకులయందరిపట్లనుశ్రద్ధజూపుచున్
రిప్లయితొలగించండివిలసితభావసంపదల ివిజ్ఞులమానసమందునిల్చుచున్
లలితుడునాదితేయుడువిలాసముజూపునహోవిరించియై
తలచినతోడనెశతవథానమునర్భకుడైనజేయుగా,
ఠవరతణమున్న గురువు సె
రిప్లయితొలగించండిలవుచేసిన చాలు పద్యలక్షణములనే
కవులెల్ల మెచ్చు విధమున
నవధానము చేయగల్గు నర్భకులైనన్.
(అర్భకుడు= బాలుడు).
పలువిధ పద్య రీతులును వ్యాకరణమ్మును వాసి నేర్పుచున్
వలసిన ధారణన్ సులభ పద్ధతులందున తెల్పు ప్రజ్ఞయే
గల గురువుల్ లభించిన సకాలము నందున చాలు కాదుటే
తలఁచినతోడనే శతవధానము నర్భకుఁడైనఁ జేయుఁగా.
కందం
రిప్లయితొలగించండిస్తవనీయులు గురువరులై
వివరమ్ముగ నేర్ప మేటి విద్వత్తున సం
భవమై సరస్వతీ కృప
నవధానముఁ జేయఁగల్గు నర్భకుఁడైనన్!
చంపకమాల
మెలకువలన్నియున్ గురువు మిన్నగ నేర్ప విరాజమానుఁడై
చెలఁగుచు మించి పూర్వ కృత చిత్రవిచిత్ర కవిత్వరీతులన్
నలువకు రాణి సత్కృపయె నాలుక పై తగ నాట్యమాడఁగన్
దలఁచినతోడనే శతవధానము నర్భకుఁడైనఁ జేయుఁగా!
భవుని కృప చేత నేర్చియు
రిప్లయితొలగించండిజవమున కవియైన వాడు చతురు o డ గుచున్
స్తవ నీయo బు గ మెచ్చ గ
నవ ధానము జేయంగల డర్భ కు డైనన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికవి ప్రాజ్ఞుండై చేకొను
తొలగించండినవధానము జనులుమెచ్చ నవనీతలమున్
వివరింపగ స్వప్నములో
నవధానముఁ జేయగల్గు నర్భకుఁడైనన్
పలికిన పల్కులెల్లతన పద్యములై వెలుగొందుచుండగా
తలచిన తోడనే శతవధానమొనర్పగ వచ్చుఁ బ్రాజ్ఞుడే
కలలకు యెల్లలుండవని కల్పన చేయగ స్వప్నమందునన్
దలఁచినతోడనే శతవధానము నర్భకుఁడైనఁ జేయుఁగా
కవితలు నేర్పుగ జెప్పుట
రిప్లయితొలగించండినవలీ హలగ నభ్యసించు నంగజు గనగన్
నవసాయముగ దెలిసెగద
నవధానముఁ జేయం గలఁ డర్భకుఁడైనన్
కం॥ కవితా పాటవమొందక
రిప్లయితొలగించండిచవిగా సాధనఁ బడయక సాధ్యము నగునా
యవధానముఁ జేయ నెటుల
నవధానముఁ జేయఁ గల్గు నర్భకుఁడైనన్
చం॥ వలచిన వెంటనే పడతి పల్కున కాంచఁగ నీ నిజాయితీ
సలుపఁగ నావశ్యమ్ము శ్రమ సాధన నిత్యము నీవిధంబుగన్
దలఁచినతోడనే శతవధానము నర్భకుఁడైన జేయుగా
యలసట లేక యన్న ఘన హాస్యపు పల్కులటంచు నవ్వరే!
చంపకమాలలో చివరి పాదము ఇలా మార్చానండి . మరికొంత మెరుగౌతుందని
తొలగించండి'యలసట లేక యన్న విని హాస్యపు పల్కులటంచు నవ్వరే!'
యువ సినిమా భక్తుడొకఁడు
రిప్లయితొలగించండికవియన మన్నన కొరవడి కార్పణ్యమునన్
అవమానకరముగాయనె
నవధానముఁ జేయఁగల్గు నర్భకుఁడైనన్
అవధానమునకు ధారణ
రిప్లయితొలగించండియవసరము వధాని యెంత యభిజనుడైనన్
యవబాసము ధారణతో
నవధానముఁ జేయ గల్గునర్భకుఁడైనన్
తెలివిడితో మెలంగి కడుతేకువతో తగురీతి యోచనన్
రిప్లయితొలగించండిగలిగిన పండితుండు గమకమ్మున జేయు వధానముల్ సదా
కలిగిన దీవసమ్ము మదిఁ గల్గిన ధారణ పుష్కలమ్ముగా
తలఁచినతోడనే శతవధానము నర్భకుఁడైనఁ జేయుఁగా
అయ్యా! మొదటి కందం సమస్యలో చిన్న ఛందోదోషం వచ్చింది. పొరపాటు ఎవరి కైనా సహజమే కానీ పూరణ కర్తలు కొంత సవరించి పూరిస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండి"అవధానము జేయ గల్గు నర్భకు డైనన్"లేక "అవధానము జేయ గలుగు నర్భకు డైనన్"అని మార్చి పూరించ వలసినది గా విజ్ఞప్తి.
కం:"కవనము దేనికి నీ?"కని
రిప్లయితొలగించండిచివాట్లు పెట్టకయె తండ్రి చేయూత నిడన్,
కవి యౌ గురువు లభించిన
నవధానముఁ జేయ గల్గు నర్భకుఁడైనన్”
చం:పలువురు బాల పండితులు,పద్యకవిత్వము నందు దిట్టలై,
రిప్లయితొలగించండిలలితము, బ్రౌఢ మైన గతులం దవధానము లెన్నొ చేయ ,వా
రల గడు ప్రేమ జూపి కవి రాజులు మెచ్చగ,నట్టి దృశ్యముల్
తలఁచినతోడనే శతవధానము నర్భకుఁడైనఁ జేయుఁగా”
కం:చవట నిషిద్ధ , మ్మింతయు
రిప్లయితొలగించండిచవి లేని సమస్య,వట్టి చచ్చు పదములన్
చవి లేని దత్తపది నిడ
నవధానముఁ జేయ గల్గు నర్భకుఁడైనన్”
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
శ్రవణమ్మును జేయుచు పలు
నవధానమ్ముల మెలకువ లన్నియు నేర్వన్
కవి కడ సాధన చేయగ
నవధానముఁ జేయగల్గు నర్భకుడైనన్.