24, జూన్ 2024, సోమవారం

సమస్య - 4801

25-6-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై”
(లేదా...)
“శృంగేరిన్ గని రోసె నొక్క సతి రాశీభూతవాగ్దేవియై”

17 కామెంట్‌లు:

  1. భంగపడియెశంకరుడును
    అంగనభారతివిషయమునవలోకింపన్
    వంగెనుగాదేవాదన
    శృంగేరినిరోసెనొక్కచెలివాక్సతియై

    రిప్లయితొలగించండి
  2. కందం
    హంగుగ పాండిత్య మొదవ
    రంగమున శతావధాని రంజిలజేయున్
    బొంగార రమ్ము రమ్మన
    శృంగేరిని, రోసె నొక్క చెలి వాక్సతియై!

    శార్దూలవిక్రీడితము
    సింగారమ్మగు పాండితీ ప్రభలతో చెన్నొందు 'నాదిత్యుడే'
    రంగమ్మందు శతావధానిగదగన్ రంజించు రారండహో!
    పొంగారన్ నిపుణత్వమున్ దెలియుచున్ ముందుండ రమ్మంచనన్
    శృంగేరిన్ గని, రోసె నొక్క సతి రాశీభూతవాగ్దేవియై!

    రిప్లయితొలగించండి
  3. బంగారు నగలను తొడిగి
    శృంగ గిరి సమీపమునకు చేరిరి కాంతల్
    దొంగలు వాటిని దోచగ
    శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై

    రిప్లయితొలగించండి

  4. భంగపడెను కవయిత్రియె
    శృంగారమొలుకు సమస్య శృంగేరిని వా
    డంగవలదంచు తెలుపన్
    శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై.


    సింగారమ్మగు సాహితీ సభలకై శృంగేరి కేతెంచుచున్
    శృంగారమ్మును తెల్పుచుండెడి సమస్యన్ భామ తానివ్వగా
    శృంగారమ్ము నిషేధమంచు విబుధుల్ చెప్పంగ నాలించి యా
    శృంగేరిన్ గని రోసె నొక్క సతి రాశీభూతవాగ్దేవియై.

    రిప్లయితొలగించండి
  5. కం॥ పొంగారు కవిత్వపటిమ
    నింగినిఁ దాకుచు విరియఁగ నియమము నిష్ఠన్
    జెంగున నవధాన పగిది
    శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై

    శా॥ నింగిన్ దాకు కవిత్వ మాధురి యటుల్ నిష్ఠాగరిష్ఠంబుగన్
    బొంగారంగ వధాన రూపున నభూత్పూర్వంబుగన్ బ్రీతినిన్
    రంగారంగ జనాళి ముగ్ధతను సంప్రాప్తించి సారించుచున్
    శృంగేరిన్ గని రోసె నొక్కసతి రాశీభూత వాగ్దేవియై

    రిప్లయితొలగించండి
  6. చంగున సాహిత్య సభకు
    శృంగేరీపీఠమునకు చేరిన వనితే
    వెంగలులౌ భక్తుల గని
    శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై

    శృంగారాన్విత సాహితీ సభలకై శృంగేరి కేతెంచినన్
    బొంగుల్వారెడు దోహలమ్ము మదిలో పోకార్చు సందోహమున్
    శృంగేరిన్ దిలకించుచున్న సిసులన్ బృందాల సమ్మోహమున్
    శృంగేరిన్ గని రోసె నొక్క సతి రాశీభూతవాగ్దేవియై

    రిప్లయితొలగించండి
  7. కంగారుపడి యెడఁద గం
    ధాంగప్రతిమ నరయంగ నాత్రము తోడన్
    బంగారు బొమ్మ సరసను
    శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై


    భంగాంగద్యుతి నుండ స్వీయ ప్రతిమన్ భగ్నాంతరం గార్తయై
    గంగా తోయ సమాన నిర్మల జలాగారమ్మునౌ రాజ దు
    త్తుం గాభంగ తరంగ జాల విలసత్తుంగైకభద్రా తటిన్
    శృంగేరిన్గని రోసె నొక్క సతి రాశీభూత వాగ్దేవియై

    రిప్లయితొలగించండి
  8. నింగిని దాకెడు విధముగ
    పొంగుచు నవధా న మందు పొల్పగు కవితల్
    భంగము జేసె డి నయ్యె డ
    శృంగే రిని రోసె నొక్క చెలి వాక్స తి యై

    రిప్లయితొలగించండి
  9. కం:రంగ డొకడె వేదము వే
    దాంగములన్ సత్య మనుచు నద్వైతము జూ
    డన్ గిట్టని పాండితి తో
    శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై”
    (ఆమె పాండిత్యం లో వాక్సతి కానీ అద్వైతం గిట్టదు కనుక శృంగేరి అంటే ద్వేషం.)

    రిప్లయితొలగించండి
  10. శా:రంగౌ పాండితి గల్గి,తత్త్వవిద యై రాణించుచున్ సాహితీ
    రంగ మ్మందున సాంఘికస్పృహయె ధర్మమ్మంచు భావించుచున్ ,
    పొంగుల్ వారు శతావధానసుథ తో మోదమ్ములన్ బొందు నా
    శృంగేరిన్ గని రోసె నొక్క సతి రాశీభూతవాగ్దేవియై
    (ఆమె పండితురాలే కానీ సాహిత్యం లో సామాజికస్పృహ ముఖ్య మని భావిస్తుంది. ఈ భావం కలవారు అవధానాల పట్ల కొంత వ్యతిరేకత కలిగి ఉంటారు. అలాగే అవధానం నడుస్తున్న శృంగేరి పట్ల విముఖత పొందింది. )

    రిప్లయితొలగించండి
  11. శృంగేరిపీఠమన్నను
    శృంగాటముసకల శాస్త్రకృతవిద్యులకున్
    క్రుంగఁగ గతవైభవమిట
    శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై

    రిప్లయితొలగించండి
  12. శృంగాటమ్ముగ వేదపండితులకున్ శృంగేరి యొప్పారగా
    శృంగేరీ నగరంబునందు నెపుడున్ చెల్వొందె విద్వత్సభల్
    పొంగెన్ కావ్యసుధల్, గతించె నకటా పోగాలమాసన్నమై
    శృంగేరిన్ గని రోసె నొక్క సతి రాశీభూతవాగ్దేవియై

    రిప్లయితొలగించండి
  13. అంగాంగపు వందనములు
    శృంగేరికిఁజేయఁజూచి చేతలు లేకన్
    భంగమును దట్టు కొనమిని
    శృంగేరిని రోసె నొక్క చెలి వాక్సతియై

    రిప్లయితొలగించండి
  14. అంగాంగంబులు గూర్చి నొక్కటి యనన్భా వాంతరాళంబునన్
    మంగా దేవిని గూర్చి ప్రార్ధన దఱిన్ మారాడ నీకుండగా
    భంగంబొందిన యింతి చింతను గడున్ బాధాంధ కారంబునన్
    శృంగేరిన్ గని రోసె నొక్క సతి రాశీభూతవాగ్దేవియై

    రిప్లయితొలగించండి
  15. శృంగేరీ మఠమందు నుత్సవములన్ సేయంగ నేర్పాట్లలో
    భాగంబిచ్చిరి పెక్కు సేవకులకున్ వైభోగముల్మీరినన్
    కంగారై యచటన్నదానమున కంగాళీని తొల్తొల్లిగన్
    శృంగేరిన్ గనిరోసె నొక్కసతి రాశీభూతవాగ్దేవియై

    రిప్లయితొలగించండి