11, జూన్ 2024, మంగళవారం

న్యస్తాక్షరి - 86

12-6-2024 (బుధవారం)
విషయం - శారదాస్తుతి
ఛందం - ఉత్పలమాల
1వ పాదం 1వ అక్షరం 'శా'
2వ పాదం 2వ అక్షరం 'ర'
3వ పాదం 10వ అక్షరం 'దాం'
4వ పాదం 17వ అక్షరం 'బ'
(లేదా)
'శా-ర-దాం - బ' ఈ అక్షరాలు పాదాదిలో ఉంచి
ఆటవెలది పద్యం వ్రాయండి.

25 కామెంట్‌లు:

 1. ఉత్పలమాల
  శారద రాత్రులన్ గురియు చల్లని వెన్నెల వేడ్కఁ జిందెడున్
  గైరవిఁ దాల్చియున్ సిగను గమ్మని నీకరుణామృతమ్ము శ్రీ
  దా! రసనాగ్రమున్ దగులఁ, దాండవ మాడ కవిత్వ ధార, శృం
  గేరి మహాపురిన్ వెలసి కీర్తిని గాంచ మదంబ వేడెదన్

  ఆటవెలది
  శాంత సుస్వరూప సత్కృపామృతధార
  రసనపై నొలుకుచు రంజిలంగఁ
  దాండవంబున కవితాసుధ శారదాం
  బ! చిలుకంగఁ గనవె ప్రస్తుతింతు

  రిప్లయితొలగించండి
 2. శారద! నీవెగాగనగ సత్యముబ్రహ్మమునాలుకన్సదా
  ఆరనివిద్యలన్దనియహంసకువాహినివౌచునుందు కే
  దారమున్సాహితిన్సువిశదాంబగగొల్చెదభారతీనినున్
  సారముదెల్పుమామదికిసంగములేనికదంబవాసనన్

  రిప్లయితొలగించండి
 3. శారద వాగ్విశారద విశాల
  సులోచన వేడుచుంటినిన్
  భారము నీదె సుమ్మి కడు భవ్య
  కవిత్వము వ్రాయునట్టు లా
  దారము తల్లిరో!, తవ పదాంబుజ
  సేవ నొనర్తు, జూపుమీ
  భారతి! లేక నీదు కృప వ్రాయగ
  జాలను నా బలమ్ముతో.

  రిప్లయితొలగించండి
 4. శారదనినుగొల్వ చాలదీజన్మంబు
  రసననాట్యమాడురమ్యముగస
  దాంబుదంబుకవితధారగాగురియుమా
  బంధముల్ద్ దొలంగపంచుముక్తి

  రిప్లయితొలగించండి

 5. *ఉ.మా.*
  శారద నీదు దర్శనమె శంకు హరమ్మని విశ్వసించుచున్
  జేరగ వచ్చితిన్ మినుకు చేడియ నీపద దాసదాసినై
  తారకమైననీదగు పదాంబుజముముల్ విడనింక తల్లి నా
  యారడి దీర్చి చేతనము నందగ జేయవె యంబ శీఘ్రమున్.


  ఆ.వె.
  శారదాంబ నిన్నె శరణమంటిని యక్ష
  రమ్మొసగెద వంచు నమ్మి నీ ప
  దాంబుజముల పైన తలవాల్చితిని నీదు
  బగుతుడ దయ గనవె భార మనక.

  రిప్లయితొలగించండి
 6. ఆ॥ శారదాంబ కృపను జ్ఞాన సంపదలిచ్చు
  రసఝరీ కవిత్వ రవము శార
  దాంబ చలువ పడయు తత్పరతనొదవి
  బతముఁ జేసి కొలుతు భవిత మెరయ

  ఉ॥ శారద చంద్రికా ఝరులు సత్త్వము నొందఁగ దారిఁ జూపునే
  బారఁగ జ్ఞాన సంపదలు ప్రార్థనఁ జేయుదు బ్రహ్మకన్యకున్
  ధారగ చిత్తముంచి జగదాంబకు నిత్యము భక్తిఁ గాంచుచున్
  గోరెద జ్ఞాన దానమును గూరిమి తోడను సంబరమ్ముగన్

  సత్త్వము జ్ఞానము నిఘంటువు సహాయమండి
  3వ పాదములో అఖండయతి తప్పలేదండి

  రిప్లయితొలగించండి
 7. శారదాంబ పుణ్య చరణోత్పలములకు
  రవణమెసగు పుష్పరాజితపు ప
  దాంబుజమ్ములకును దాసుడ నేనంటి
  బల్కులమ్మ నీదు పాదశరణు

  రిప్లయితొలగించండి
 8. శారద మాతగా కొలిచి సర్వులు నీదయ కోరుకొందురే
  భారతి యంచు పూజలిడి భాషకు రాణిగ చిత్తగింతురే
  హారతు లిచ్చి నీకర పదాంబుజముల్ తమ కండ్లకద్దరే
  కోరిన విద్యలెల్ల సమకూరగ జేయవె యంబ వేడెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి

  2. శారదాంబ యిమ్ము సంపూర్ణ జ్ఞానమే
   రసములొల్క నాదు రచనలెపుడు
   దాంతినొసగుమమ్మ శాంతి స్వరూపిణి
   బలిమి కూర్చుమమ్మ పలుకుబోడి

   తొలగించండి
 9. శారదాంబ ! నిన్ను సన్నుతించెద నమ్మ
  రమ్య యందు గూడ రమణి శార
  దాంబ తలపుతోడ తరలుచు నుండగ
  బన్నము దరినుండి బాపు మమ్మ

  రిప్లయితొలగించండి
 10. శార దాంబ నీకు శరణమంటిని తల్లి
  రచన పాట వంబు రహి నొసంగి
  దాంతి తోడ నాకు ధర లోన ను తు లందు
  బలిమి కలు గ జేయ వలయు నమ్మ

  రిప్లయితొలగించండి
 11. శారదా సతీ యపార కృపాంబుధీ
  రమ్యవల్లకీ కరాబ్జ శార
  దాంబ సురుచి రాక్ష దామ పుస్తక కీర
  బహు దళ సుమ హస్త భద్ర మొసఁగు

  శారద చంద్రికా సదృశ శాట విరాజిత వల్లకీ కరా
  నీరజ సంభవాంఘ్రి యుగ నిత్య నిమగ్న నిజాంతరింద్రియా
  హార శుకాబ్జ పుస్తక సదాంచిత హస్త చతుష్క శారదా
  సార కవిత్వ పాటవ మొసంగుమ యో జగదంబ భారతీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శారదా సతీ యపార కృపాంబుధీ
   రమ్యవల్లకీ విలాస శార
   దాంబ సురుచి రాక్ష హార పుస్తక కీర
   బహు దళ సుమ హస్త భద్ర మొసఁగు

   తొలగించండి
 12. శారద! పద్మలాంఛన! ప్రసన్నవు గాగదె, నీదు దాసునిన్
  కోరను భోగభాగ్యములఁ గోరను స్వర్గపదంబు, వేడెదన్
  తారణఁ జేయమంచు జగదాంబ భవాబ్ధిఁ దయాప్రపూర్ణవై
  భారము నీదె రమ్మికను భక్తునిఁ బ్రోవ మదంబ చెచ్చెరన్

  రిప్లయితొలగించండి
 13. శారదాంబ మదికి శ్రాంతమొసఁగినన్ను
  రక్షఁ జేయ వేగ రమ్మటంచు
  దాంతమొదవ వేఁడ దయఁజూపఁగ జగదం
  బ నిను శిరము వంచి వినతి జేతు

  రిప్లయితొలగించండి
 14. శారదమాతనిన్ గనిన చాలును జన్మయు ధన్యమౌ గదా
  తీరగు నీదురూపమును తీరుగ జూచిన యంతనే యికన్
  దారిని చూపు దేవతవు దాంతము తోడను వ్రాయు శక్తులన్
  గారముతో నొసంగు హరి గాదిలికోడల సంబరమ్ముతో  శారదాంబ తల్లి సన్నుతించెద నమ్మ
  రయము గాను నొసగు వ్రాయు శక్తి
  దాంతి గుణము నొసగి తరియింప చేయుచు
  బలము భాగ్య మొసగవమ్మ నాకు  రిప్లయితొలగించండి
 15. *శా* రద నిన్ను నిత్యమును సన్నుతి జేయుచు సాగుచుంటి నా
  భా *ర* ము నీదె నిల్చిమది పాండితి నిమ్ము కరమ్ము ప్రేమ నా
  ధారము నీవె కైతల స *దాం* చిత రీతిని వ్రాయ జేసి స
  త్కారములన్ గడింపగ సతమ్ము గణించెద నం *బ* భక్తితో

  రిప్లయితొలగించండి