కం:చతురుండై భాషణముల, సతులన్ మెచ్చుచును, కొన్ని సందర్భములన్ వ్యతిరేకతను నటించుచు సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా” (భార్యల పట్ల ప్రేమ ఉన్నా కొన్ని సార్లు వ్యతిరేకతని కూడా నటించాలి. అప్పుడే వాళ్లు లెక్క చేస్తారు.)
చం:"అతివల పెద్ద బావ" యను నాఖ్యను బొందియు, లౌక్య మెంచుచున్ సతియును దాను నెచ్చటికి సాగిన నిగ్రహ మొంది,చక్కనౌ నతివల,నర్థనగ్నలను, హాస్యము లాడెడు స్నేహ శీల లౌ నతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ” (అతివల పెద్ద బావ= ఎప్పుడూ ఆడవాళ్ల తో మాట్లాడా లని,స్నేహం చెయ్యాలని చూసే వాడికి ఆడాళ్లలో పెద్ద బావ అనే బిరుదు ఇచ్చే వాళ్లు మన పెద్దలు. )
కందం
రిప్లయితొలగించండివ్రతముగ షట్కర్మలతో
సతి మురిపింపఁగఁ దనరుచు సర్వము తనతో
పతి నాతిచరామి యను, న
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా!
చంపకమాల
వ్రతముగ నారుకర్మల సపర్యలు సేయుచు భర్త మానసం
బతులిత రీతి దోచి సతి భాగ్యమనంగను జిక్కినంతటవ్
నతగుణశీలతో మెదలి నాతిచరామిని, వారకాంతలౌ
యతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఅతి గుణవతి సతియుండగ
రిప్లయితొలగించండిమతి హీనుడు పరుగులిడును
మగువలకొరకున్
మతిమంతుడు నిజముగ పర
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచతురత జూపుచు వరుసగు
లతకూనల జేరుచు కడు లాలిత్యపు స
మ్మతి జూపనేమి భోగపు
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా.
శ్రుతిలయ తప్పనట్టి కడు సుస్వర రాగము నాలకించి తా
నతిశయ మందు వాడు, వరుసైన పడంతుల గాంచి నంతనే
చతురత తోడ వాసి సరసమ్ముల నాడిననేమి శూలలౌ
యతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిడా బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిసతతముసంసారమ్మును
సతితో చేయుచు బడయుచు సంతానమ్మున్
మతిలో సైతమ్మునుపర
సతులను రోసెడి జనుడు రసజ్ఞుండు గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం॥ పతులకు రాముఁడు ధరణిని
రిప్లయితొలగించండిసతతము నాదర్శకమగు సభ్యత కాతఁడే
ప్రతినిధి యొకసతియని పర
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా
చం॥ పతులకు రాముఁడద్దమనిఁ బ్రాజ్ఞులు తెల్పిరి సాదరమ్ముగన్
సతతము నట్లు వర్తిలుట సభ్యత సంస్కృతి భారతావనిన్
బ్రతినిధి యౌచు సంస్కృతికి రమ్యతఁ గాంచుచు నెల్లవేళలా
యతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపతనము గాని విధమ్ము న
రిప్లయితొలగించండిమతి మంతుడు గా మెలగుచు మాన్యుం డ గుచు న్
వెత లను గూర్చె డు వేశ్యా
సతులను రోసెడు జనుడు ర సజ్ను o డు గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికృతులను నేర్పించుటకయి
రిప్లయితొలగించండిశతవిధముల నుద్యమమును సలిపిన గూడన్
మతిలేని వారు మసలు వ
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా
రసజ్ఞుఁడు = పండితుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇతరము మాని భార్య మది నెప్పుడు వీడక నుండువాడు నం
రిప్లయితొలగించండిచిత దయతోడ నిష్కపట చిత్తుడు నై చరియింపుచుండి, వా
రతుల దురంతకృత్యముల, లంపట మందున ముంచువారునౌ
నతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచతురత చూపెడి తత్వము
రిప్లయితొలగించండిసతతము భార్యామణులకు చక్కని మగడై
నతులిత స్త్రీలోలుండై
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా
[రోయు = వెదకు]
చతురత చూపికోమలుల చక్కని చూపులఁ జిక్కునట్లుగా
సతతము సంచరించి సుమ శల్యములే విడు నెల్లవేళలన్
అతులిత సుందరాంగనల కై తపియించి సదా కురూపులౌ
యతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండివిత తాహ్లాద రుచిర హా
రిప్లయితొలగించండిస్య తర వినోదమ్ము లెట్టి సౌఖ్యమ్ములు సం
తతము కఱ వైన యట్టి వ
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా
గతులను నర్థ ధర్మములు కామము లెన్ని గ్రహింప నొప్పు భూ
త తతుల మిన్నయై పరఁగు ధార్మిక పూరుష కోటి కిద్ధరం
బతితుల దుష్ట చిత్తుల నవాంఛిత మర్త్యుల దార కన్యలౌ
యతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁ డనఁగా రసజ్ఞుఁడౌ
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం:చతురుండై భాషణముల,
రిప్లయితొలగించండిసతులన్ మెచ్చుచును, కొన్ని సందర్భములన్
వ్యతిరేకతను నటించుచు
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా”
(భార్యల పట్ల ప్రేమ ఉన్నా కొన్ని సార్లు వ్యతిరేకతని కూడా నటించాలి. అప్పుడే వాళ్లు లెక్క చేస్తారు.)
కం:సతి నొకతె గూడి యుండగ
రిప్లయితొలగించండినతి సౌఖ్యము నామె యొసగ నా సమయమునం
దితర సతుల మెచ్చక,యా
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా”
చం:"అతివల పెద్ద బావ" యను నాఖ్యను బొందియు, లౌక్య మెంచుచున్
రిప్లయితొలగించండిసతియును దాను నెచ్చటికి సాగిన నిగ్రహ మొంది,చక్కనౌ
నతివల,నర్థనగ్నలను, హాస్యము లాడెడు స్నేహ శీల లౌ
నతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ”
(అతివల పెద్ద బావ= ఎప్పుడూ ఆడవాళ్ల తో మాట్లాడా లని,స్నేహం చెయ్యాలని చూసే వాడికి ఆడాళ్లలో పెద్ద బావ అనే బిరుదు ఇచ్చే వాళ్లు మన పెద్దలు. )
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిచం.
రిప్లయితొలగించండిప్రతిమలఁ జెక్కు శిల్పులకు ప్రాఁబడు నింద్రియసన్నికర్షమున్
యతులకు కేరడమ్ము, కొమ నంటుట, భాగవతుల్ విరాళిచే,
సతులను నిచ్చగించు ముని సత్వముఁ జేకొన ధన్యుడే గదా
*అతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ.*
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసతిని వినా పరసతులను
రిప్లయితొలగించండికుతుకముగా చూడకెపుఁడు కుత్సిత దృష్టిన్
సతతము నిర్మలుఁడై పర
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా
సతినెడబాయకన్ సతము శర్మము గూర్చుచు యోగ క్షేమముల్
రిప్లయితొలగించండిహితమునుఁగోరు వల్లభుఁడు హేయముగా పరదార సౌఖ్యమున్
కుతుకముగా తలంపక నకుంఠితదీక్షను బూని యన్యులౌ
యతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ
పతియే దైవంబనుచును
రిప్లయితొలగించండిసతతముఁదాసేవఁజేయుసాధ్వీమణికిన్
మితిమీరుచుఁదిరుగెడు పర
సతులను రోసెడి జనుఁడె రసజ్ఞుండు గదా
అతివలఁ గాంచినన్ విముఖుఁడై చనువాఁడనఁగా రసజ్ఞుఁడౌ”
రిప్లయితొలగించండిసతులను జూడగావలపు సాకునజేరుచుమాయమాటలన్
సతతమునమ్మజేయుచును సారెకుసారెకు తాక దేహమున్
బతనమునొందుఁదప్పకను బండరినాధుని గోప మంటకున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
అతులిత ప్రేమను జూపుచు
సతతము సాయమొనరించి సంసారమునన్
సతియే జీవితమని పర
సతులను రోసెడి జనుడె రసజ్ఞుండు గదా!