(3)మ:ఎవరే నామము బల్క దాని ననుటే యీనాటి ధర్మమ్ము వై ష్ణవుడా! నల్వురి తోడ నేక మగుచున్ నారాయణా యన్న యే యవమానమ్మగు నన్న యట్లు కనగా నా కూటమిన్ జేరి యా శివనామస్మరణమ్ము జేయ దోషమగు గాశీ క్షేత్ర మం దెప్పుడున్. (నలుగురితో నారాయణా అనటం ధర్మం అనే సామెత ఎలాగూ ఉంది కదా! నువ్వు వైష్ణవుడి వైనా ఎందుకో కాశీ వచ్చావు. ఆ సామెత ప్రకారం శివ నామస్మరణ చెయ్యి.అంతా సంతోషిస్తారు. ఇక్కడ దోషము కాదు.తోషము నకు సరళాదేశం గా భావించాలి. )
శివునిదలచుటతప్పుకాశీపురమున
రిప్లయితొలగించండిరామనామముపలుకరాదయోధ్య
మధురమధురంబుగాదుగామాయగ్రమ్మె
చిత్రగతులనునడచుగాచేదునిజము
శివనామస్మరణమ్ముదోషమగుఁగాశీక్షేత్రమందెప్పుడున్
తొలగించండితవనామంబునురాముడా! పలుకనేతావున్గనన్ల్లేము, మా
దవ! కృష్ణానినుగొల్చువారలకునేస్థానంబులేదందువా
కవిసెన్కాఱునుమబ్బులీయవనియీగర్వాంథులన్గావవే
తేటగీతి
రిప్లయితొలగించండిభక్తి వైరాగ్యములతోడ ముక్తినెంచి
విశ్వనాథుని దర్సింప ప్రీతినొసఁగు
పరులనాశమ్ము నాశించి పాపివలెను
శివునిఁ దలఁచుట తప్పు కాశీపురమున!
మత్తేభవిక్రీడితము
స్తవనీయంబగు ముక్తినెంచి శివునిన్ సద్భక్తి వైరాగ్యముల్
జవమే చూపుచు దర్శనమ్ముగొనగన్ సంప్రీతినందించుగా!
నవహీనంపుగుణమ్మునన్ బరులకన్యాయంబు నాశించుచున్
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
చిత్తశుద్ధితో చేసిన శివుని పూజ
రిప్లయితొలగించండిముక్తినొసఁగును ముక్కంటి భక్తులకును
పాప చింతన వీడక భక్తిలేక
శివునిఁ దలఁచుట తప్పు కాశీపురమున
దుష్ట వర్తన గలిగిన దురితు లగుచు
రిప్లయితొలగించండిపరుల వంచించు వారలై పరుగు నట్టి
కుత్సి తాత్ములు చేరియు కూర్మి తోడ
శివుని ద ల చుట తప్పు కాశీ పురమున
అచ్చర నదిని తానము నాచరించి
రిప్లయితొలగించండియుగ్రుని కనుకలి దనుక నొప్పిదమగు
శివునిఁ దలఁచుట ; తప్పు కాశీపురమున
కోరి క నొకటై న విడువ కుండ మనుట
పాప పంకము గడుగగ పాలసుండు
రిప్లయితొలగించండిముక్కు మూసియు గంగలో మునుగ కాని
యాత్మ శుద్ధియు లేక తా ననుదినంబు
శివునిఁ దలఁచుట తప్పు కాశీపురమున!
శివనామామృత పాన మత్తులను కాశీక్షేత్రమం దెన్నడున్
రిప్లయితొలగించండిభవ నాశంకరుఁడైన శంకరుడు సంభావించు మోక్షమ్ముతో
ప్రవిభాసంబగు భక్తి మృగ్యమయి స్వార్థమ్మే శరవ్యమ్ముగా
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
రిప్లయితొలగించండిముక్తి గోరుచు గంగలో మునిగి యచట
కొలువు తీరిన శంకరున్ గొలువ నెంచి
జేరు వారు తలతురు నోరార, కాదు
శివునిఁ దలఁచుట తప్పు , కాశీపురమున.
భువిలో భర్గుడు విశ్వనాథుడగుచున్ మున్నేటి తీరమ్ముకై
ధవళాద్రిన్ విడి చేర వచ్చె నని తా దాసుండ్రనే ప్రోచుచున్
శివమందించెడి వాడటంచు జనులే చేయంగ సద్భక్తితో
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్.
(స్మరణము+ తోషము )
తే॥ మిన్న సద్భక్తి సద్బుద్ధి యెన్నఁ గాను
రిప్లయితొలగించండిభక్తిలేని దుష్టుఁడటుల భవ్యతఁ గన
శివునిఁ దలచుట తప్పు కాశీపురమున
భక్తిఁ గని సజ్జనుఁడు మ్రొక్క ఫలము విరియు
మ॥ భవబాధాదులఁ దీర్చ సజ్జనుఁడు సంభావించి సర్వేశ్వరున్
భువిలోఁ గొల్వఁగ భావనా గరిమతో ముక్తిన్ గనన్ భక్తితో
భవుడానందము తోడఁ బ్రోచుఁగద పాపాత్ముండటుల్ చేయఁగన్
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
అవధూతోత్తమ! ధన్యులైతిరిటు డాయం గంచు విశ్వేశ్వరున్,
రిప్లయితొలగించండిభవబంధమ్ములఁ ద్రుంచి వేయు సతమున్ భద్రమ్ము జేకూర్చు త
చ్ఛివనామస్మరణమ్ము; దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
భవనాశంబగు గంగలో మునగకన్ బ్రాప్తించునే స్వర్గముల్?
జీవితచరమాంకంబున శివుని దర్శ
రిప్లయితొలగించండినార్థమై కాశి కేగుట స్వార్థమగున?
శూన్యమౌ భక్తితో చిత్తశుద్ధి లేక
శివునిఁ దలఁచుట తప్పు కాశీపురమున
జవసత్వమ్ములు పోయి వార్ధకమునన్ చావేశరణ్యంబుగా
భవబంధమ్ములువీడి మోక్షమునకై ప్రామీత్సమాశించినన్
శివసాన్నిధ్యము సాధ్యమన్న తలపే శేషించి వర్జించినన్
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
పార్వతీ పరమేశ్వరు లుర్వి వెలసి
రిప్లయితొలగించండినట్టి పుణ్యతమ పురమ్ము గట్టు పట్టి
నెడఁద భక్తి స్మరింపక యెవ్వ రైన
శివునిఁ దలఁచుట తప్పు కాశీ పురమున
భువి క్షేత్రమ్ముల నెంచి చూచినఁ గడుం బుణ్యప్రదం బైన గౌ
రవ ధామం బిది యీశ్వరాలయము స్వర్గం బేఁగ నౌ ద్వారమే
యవివేకమ్మున నే నరుం డయినఁ జేయం జాలకే నిల్చినన్
శివ నామస్మరణమ్ము దోష మగుఁ గాశీ క్షేత్రమం దెప్పుడున్
శివనామంబుఁ దలంచువారికది యేక్షేమంబు నైశ్వర్యమౌ
రిప్లయితొలగించండిను విచారంబులు దూరమౌనిక భయాందోళించుచున్ కేవలం
శివనామ స్మరణమ్ము దోషమగుఁ గాశీ క్షేత్రమందెప్పుడున్
శివుడున్ శ్రీహరులాశ్రితాళికిని నిశ్చింతమ్మిడున్ కోరగన్
తే.గీ:విఘ్నపతి వీడి, షణ్ముఖున్ వీడి,నంది
రిప్లయితొలగించండినైన తాకక యును,మది నన్న పూర్ణ
యైన యంబను విడి ముఖ్యు డనుచు నొక్క
శివునిఁ దలఁచుట తప్పు కాశీపురమున
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి2)మ:శివుడే ముఖ్య మటంచు విఘ్నపతినిన్ సేవింపమిన్, నంది నై
రిప్లయితొలగించండినవిలోకింపక, షణ్ముఖున్ దలపమిన్, గాశీవిశాలాక్షి య
న్న విశిష్టత నొందు నంబ నెద లోనన్ దల్చకే మ్రొక్కుగా
శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్”
(3)మ:ఎవరే నామము బల్క దాని ననుటే యీనాటి ధర్మమ్ము వై
రిప్లయితొలగించండిష్ణవుడా! నల్వురి తోడ నేక మగుచున్ నారాయణా యన్న యే
యవమానమ్మగు నన్న యట్లు కనగా నా కూటమిన్ జేరి యా
శివనామస్మరణమ్ము జేయ దోషమగు గాశీ క్షేత్ర మం దెప్పుడున్.
(నలుగురితో నారాయణా అనటం ధర్మం అనే సామెత ఎలాగూ ఉంది కదా! నువ్వు వైష్ణవుడి వైనా ఎందుకో కాశీ వచ్చావు. ఆ సామెత ప్రకారం శివ నామస్మరణ చెయ్యి.అంతా సంతోషిస్తారు. ఇక్కడ దోషము కాదు.తోషము నకు సరళాదేశం గా భావించాలి. )
భక్తి శ్రద్ధల తోడను పరమ శివుని
రిప్లయితొలగించండిపూజఁజేయుట మంచిది పుణ్యమబ్బు
బరుల హింసించ కొఱకునై పాపి యగుచు
శివునిఁ దలఁచుట తప్పు కాశీపురమున
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్
రిప్లయితొలగించండిజవటల్ బల్కుదు రట్లుగా జమున! యాషామాసిగానున్నదే?
శివనామ స్మరణమ్ము నీయుకద సచ్ఛీలాదిభావంబులున్ ,
భవబంధంబుల ద్రోసిరాజనుచు మీపాపాలు బోగొట్టునే
పుణ్యకార్యమౌ సతతము పుడమి యందు
రిప్లయితొలగించండి*“శివునిఁ దలఁచుట: తప్పు కాశీపురమున”*
కానిపనులును చేయుట కలను నైన
అట్టిపాపులన్మన్నించడభవుడెపుడు
భువనాధీశ్వరుడౌహరున్ సతముశంభోశంకరాయంచుతా
భువిలోనెంచుచుచేయగావలెయునుప్పొంగంగనెల్లప్పు డున్
*శివనామస్మరణమ్ము; దోషమగు గాశీక్షేత్రమందెప్పుడున్*
నవివేకంబున పార్వతీశుడగుయానందీశునిందించుటన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
ముక్తి నాశించి గంగలో మునుగకుండ
ముందుగా కాలభైరవున్ మ్రొక్కకుండ
పరుల నాశము కోరుచు పాపి యగుచు
శివుని దలచుట తప్పు కాశీపురమున.