8, జూన్ 2024, శనివారం

సమస్య - 4786

9-6-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్ణకఠోరములు సుమ్ము కన్నడ కవితల్”
(లేదా...)
“కర్ణకఠోరపద్యములు గన్నడ దేశమునందు విన్పడున్”

14 కామెంట్‌లు:

  1. కం:
    వర్ణములు నలుబదేడై
    కర్ణానందమని పించు కన్నడ మదియున్
    జీర్ణించు కొనని వారికి
    కర్ణకఠోరములు సుమ్ము కన్నడ కవితల్.

    రిప్లయితొలగించండి

  2. కర్ణోపేతంబే యా
    కర్ణించి వినంగ మేటి కైతలె యైనన్
    గర్ణాటక మెరుగనిచో
    కర్ణకఠోరములు సుమ్ము కన్నడ కైతల్.

    రిప్లయితొలగించండి
  3. అర్ణవఘోషయాయనగనందములేకనునీమమెంచకన్
    చూర్ణముజేసిభాషనటసోద్యముజూచెదరన్నదమ్ములున్
    వర్ణములెంచకే యతికివైనముతోడుతకావ్యమల్లగా
    కర్ణకఠోరపద్యములుకన్నడదేశమునందువిన్పడున్

    రిప్లయితొలగించండి
  4. కర్ణ ములకు విన సొంపై
    కర్ణాటక వారి కదియ కస్తూరి గ యై
    వర్ణి o ప గ నన వ చ్చు నె
    కర్ణ కఠో రములు సు మ్ము కన్నడ కవిత ల్?

    రిప్లయితొలగించండి
  5. కందం
    ఆర్ణవమన వాజ్ఞ్మయమున్
    బూర్ణమొనర భాషలన్ని ముఖ్యమ్మగు న
    భ్యర్ణపు భాషేర్ష్యకునకు
    కర్ణకఠోరములు సుమ్ము కన్నడ కవితల్


    ఉత్పలమాల
    ఆర్ణవమౌచు వాజ్ఞ్మయము హ్లాదము గూర్రఁగ జాతికంత సం
    పూర్ణమొనర్చు లోకమున ముచ్చట చేసెడు భాషలెన్నొ! య
    భ్యర్ణపు భాష వేరయిన హార్దము సూపని యీర్ష్యకుండనన్
    కర్ణకఠోరపద్యములు గన్నడ దేశమునందు విన్పడున్!

    రిప్లయితొలగించండి
  6. కం॥ పూర్ణ కవితా మధురిమను
    గర్ణములకు నొసఁగు హాయి కన్నడ కవితల్
    పూర్ణముగ, నెవఁడు పలికెనొ
    కర్ణకఠోరములు సుమ్ము కన్నడ కవితల్

    ఉ॥ వర్ణములైన నేర్వకను బాలిశుఁ డొక్కఁడు పల్కెనిట్టులన్
    గర్ణకఠోర పద్యములు గన్నడ దేశము నందు విన్పడున్
    బూర్ణ కవిత్వ మాధురినిఁ బ్రాభవ మెందుచు నష్టపండితుల్
    స్వర్ణము నింపి కైతలను సర్వులు మెచ్చఁ బ్రశస్తిఁ బొందిరే

    జ్ఞానపీఠ ప్రశస్తి పొందిన కన్నడ కవులు

    కుప్పళ్ళి వెంకటప్ప పుట్టప్ప (కువెంపు), దత్తాత్రేయ రామచంద్ర బెంద్రే (దరా బెంద్రే) (కవితలు పాటలు పద్యాలు) వినాయక కృష్ణ గోకాక్ (epic poetry) (వీరి వద్ద నేను పనిచేసానండి, వారికి నేను అప్పట్లో బాగా గుర్తు) శివరామ కారంత, యు ఆర్ అనంతమూర్తి (నవలలకు వీరిద్దరికి మంచి పేరు వచ్చిందండి), మాస్తి వెంకటేశం అయ్యంగార్ (చిన్న కథలు), గిరీష్ కార్నాడ్, చంద్రశేఖర కంబార.

    కన్నడిగులు ప్రాచుర్యం పొందిన కవులకు చాలా మన్నన నిస్తారండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. త్రిపది షట్పది నాకు తెలిసినంతవరకు కన్నడ భాషకే పరితమైన పద్యరీతులండి.

      తొలగించండి
  7. కర్ణాకర్ణమపూర్వము
    కర్ణాటకమున రచనలు కనుగొనగా సం
    పూర్ణ రసగుళికలందురు
    కర్ణకఠోరములు సుమ్ము కన్నడ కవితల్

    కర్ణములందు నింపుగద కన్నడ కైతలు నిర్జరంబునే
    వర్ణన పూర్ణమైయలరు వాఙ్మయమందురు ప్రాజ్ణులెల్లరున్
    స్వర్ణముఁ బోలు కైతలవి సత్తువ చాటగ లోకమందునన్
    కర్ణకఠోరపద్యములు గన్నడ దేశమునందు విన్పడున్

    [కఠోరము = పరిపక్వము]

    రిప్లయితొలగించండి
  8. నిర్ణయము నెంచి జూడగ
    తూర్ణమున తెలుగు కవితలు దొని లే కుండన్
    అర్ణవము ఘోష రీతీగ
    కర్ణకఠోరములు సుమ్ము కన్నడ కవితల్”

    రిప్లయితొలగించండి
  9. వర్ణనలు మనోహరములు
    కర్ణములకువిందు గూర్చు కమ్మని కవితల్
    నిర్ణయమిది కావెన్నఁడు
    కర్ణకఠోరములు సుమ్ము కన్నడ కవితల్

    రిప్లయితొలగించండి
  10. కర్ణములందు తేనియలు క్రన్ననపాఱును, సాహితీ ప్రభల్
    వర్ణనలందు కాననగు, వన్నెల కన్నడ కైతలందు సం
    పూర్ణముగా కనంబడును పోఁడిమి, యెట్లననొప్పు నేస్తమా
    కర్ణకఠోరపద్యములు గన్నడ దేశమునందు విన్పడున్

    రిప్లయితొలగించండి
  11. కం:కర్ణములే పని చేయని,
    వర్ణన కందని బధిరుడు పఠియించి యిటుల్
    వర్ణించె "తెలుగె గొప్పది
    కర్ణకఠోరములు సుమ్ము కన్నడకవితల్"
    (కర్ణకఠోరం అని చెవిటి వాడు అనటమే ఒక హాస్యం. )

    రిప్లయితొలగించండి
  12. ఉ:కర్ణుని పద్యముల్ చదువ కమ్మని శైలిని నుండె గాని, నీ
    నిర్ణయ మేల కన్నడిగు నిల్పెను గాయకుగా విచిత్రమై
    చూర్ణము జేయు నీత డతి సుందరపద్యము, లంత నాగునా
    కర్ణకఠోరపద్యములు గన్నడ దేశమునందు విన్పడున్”
    (సినిమాలో, లేక నాటకం లో కర్ణుడి పాత్ర లో పద్యాలు అందం గా రాసారు కానీ గాయకుణ్ని కన్నడిగుణ్ని పెట్టారు. వాడు పద్యాలని కర్ణకఠోరం చేస్తాడు .అంతటితో ఆగక ఆ పద్యాలు కర్నాటకరాష్ట్రం లో కూడా వినిపిస్తుంటాయి. )

    రిప్లయితొలగించండి
  13. తూర్ణ మొసంగు ముదము సం
    కీర్ణము లెల్ల దిశ లందుఁ గీర్తన చయముల్
    స్వర్ణ నిభమ్ములు గార్దభ
    కర్ణ కఠోరములు సుమ్ము కన్నడ కవితల్


    అర్ణవ మంత లోఁ తయిన యట్టివి భావము నెంచి చూడ లేఁ
    బర్ణము లాని నట్టి పిక వర్యము సిగ్గిలఁ జాలినట్టివే
    వర్ణన కంద నేర వవి పాడిన కా వవి యాలకింపుమా
    కర్ణ! కఠోరపద్యములు గన్నడ దేశము నందు విన్పడున్

    రిప్లయితొలగించండి