10, జూన్ 2024, సోమవారం

సమస్య - 4788

11-6-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శస్త్రసన్యాసముం జేసి జయమునందె”
(లేదా...)
“శస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి జయమున్ సాధించె యుద్ధంబునన్”

19 కామెంట్‌లు:

 1. సమస్య : శస్త్రసన్యాసముం జేసి జయమునందె

  తనువునేచెడు అస్త్రశస్త్రమ్ము లేల
  జనుల మనముల గెలవంగ జయముగాదె
  శాంతి పరిఢవిల్లనశోక చక్రవర్తి
  శస్త్రసన్యాసముం జేసి జయమునందె

  రిప్లయితొలగించండి
 2. కోపమస్త్రముగ సతితో కొట్టులాడ
  నిత్యమపజయ మొందుట నేర్చి , యతడు
  కోలుకొనగ దలంచి యా కోపమనెడి
  శస్త్రసన్యాసముం జేసి జయమునందె

  రిప్లయితొలగించండి
 3. తేటగీతి
  భరత స్వాతంత్య్ర సంగ్రామ పర్వమందు
  జాతిపితగ గాంధీ యహింసా పథమున
  సత్యమాచరించియు భౌతికత్వము గల
  శస్త్రసన్యాసముం జేసి జయమునందె!

  శార్దూలవిక్రీడితము
  శస్త్రభ్యాసము నేర్వకున్న దిగుచున్ స్వాతంత్య్ర సంగ్రామమున్
  వస్త్రాడంబరమన్నదే విడుచుచున్ వ్యాపింపగా జేయుచున్
  శాస్త్రోక్తంపు టహింస సత్యములనే చాలంచు ప్రాచీనమౌ
  శాస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి జయమున్ సాధించె యుద్ధంబునన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యతి దోషము నివారించి...

   తేటగీతి
   భరత స్వాతంత్య్ర సంగ్రామ పర్వమందు
   జాతిపితగ గాంధీ యహింసా పథమున
   సత్యమాచరించి పుడమి సంప్రదాయ
   శస్త్రసన్యాసముం జేసి జయమునందె!

   తొలగించండి
  2. వృత్తము మొదటి పాదములో సవరణ:

   శస్త్రభ్యాసము సేయకున్న

   తొలగించండి
 4. దేశ భక్తిని గల్గిన ధీయు తుండు
  టంగుటూరి ప్ర కాశము ఖంగు దినక
  నెదురు నిలిచియు దొర లకు నెదను జూపి
  శ స్ట్ర సన్యా సము జేసి జయము నo దె

  రిప్లయితొలగించండి
 5. శాంత్యహింసలె పదునైన శస్త్రములుగ
  దేశ స్వాతంత్ర్య సమరాన దీమసముగ
  గాంధి సత్యాగ్రహమ్మునే గడన చేసి
  శస్త్రసన్యాసముం జేసి జయమునందె

  రిప్లయితొలగించండి

 6. తొల్లి శత్రుసేనను గాంచి దొమ్మిలోన
  బంధు జాలమున్ దునుముట పాపమనుచు
  వలదు విజయమటంచును పార్థుడపుడు
  శస్త్రసన్యాసముం జేసి జయమునందె.


  అస్త్రాలెన్నియొ కల్గినట్టి నరుడా సేనలన్ గాంచగా
  నిస్త్రాణమ్మది యావరించి గురువుల్ నేస్తతాలు వారంచు తా
  నస్త్త్రమ్ముల్ ధరియించి చంపనని తానాతేరున్ వీడుచున్
  శాస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి జయమున్ సాధించె యుద్ధంబునన్.

  రిప్లయితొలగించండి
 7. డా బల్లూరి ఉమాదేవి

  బందు మిత్రాదులను చంపి బ్రతుకు టేల
  యనుచుదుఃఖముతోఢనాయర్జునుఃడు
  శస్త్ర సన్యాసముం జేసి జయమునందె
  శౌరిసారథ్యమువహింపసమరమందు

  రిప్లయితొలగించండి
 8. తే॥ గాంధి భారతావని దాస్య బంధములను
  ద్రుంచఁగ నహింస ఆయుధమంచుఁ జనుచు
  భరతదేశ స్వరాజ్యముఁ బడసెనిటుల
  శస్త్ర సన్యాసముంజేసి జయమునందె

  మ॥ అస్త్రమ్ముల్ తనకేలనంచు జనులన్ యైక్యమ్ముగాఁ జేయుచున్
  శస్త్రమ్మన్న నహింస యంచుఁ జనుచున్ సాధించ స్వాతంత్ర్యమున్
  శాస్త్రమ్మంచును గాంధి సాయమునటుల్ స్తంభించి సాధించెగా
  శస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి జయమున్ సాధించె యుద్ధంబునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. స్వాతంత్ర్యము ఫోన్లో బాగానే వస్తున్నదండి. కంప్యూటర్లో రామటము లేదు

   తొలగించండి
 9. శస్త్రాస్త్రమ్ములు లేవు యున్నదొకటే శాంతమ్ము మా బాపుకున్
  నిస్త్రాణమ్మొనరించె తెల్లదొరలన్ నిగ్గారు పంతమ్ముతో
  వస్త్రమ్మొక్కటి దాల్చి దేశ ప్రజకున్ ప్రాప్తించ స్వాతంత్య్రమే
  శస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి జయమున్ సాధించె యుద్ధంబునన్

  రిప్లయితొలగించండి
 10. సతి నపహరింప నాతడు సల్పెఁ బోరు
  వాని ధాటికి శత్రువు వైదొలంగె
  శస్త్ర సన్యాసముం జేసి, జయమునందె
  ప్రాణనాథుడు వైరిపై భార్య మెచ్చ

  ఆస్త్రీరుచ్యుడు సల్పె ఘోర రణమున్ యర్ధాంగినిన్ బ్రోవగా
  వస్త్రాలే చినుగంగ పోరు తలమున్ వైదొల్గెనా శత్రువే
  శాస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి, జయమున్ సాధించె యుద్ధంబునన్
  శాస్త్రాలన్ దగఁ నేర్వకున్న విభుడే సంతోషమేపారగా

  రిప్లయితొలగించండి
 11. భారత సమరావని లోన ఫల్గునుండు
  సవ్యసాచి సరస నపుంసకుని నా శి
  ఖండి వీక్షించి గంగా సుతుండు నిలువ
  శస్త్ర సన్యాసముం జేసి జయము నందె


  శాస్త్రవ్రాత విరోధ మేర్పడఁగ నిశ్శంకన్ వచింపంగ స
  ర్వాస్త్రాచార్య సుతాంత వార్త ద్విరదవ్యాజంబునం గంకుఁడే
  నిస్త్రాణుం డయి పుత్ర శోకమునఁ దా నిల్వంగ ద్రోణుం డహో
  శస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి జయమున్ సాధించె యుద్ధంబునన్

  రిప్లయితొలగించండి
 12. తే.గీ:ఆయుధము దాల్చ,చేతనౌ నట్టి దేదొ,
  సాయ మొనరింతు నని పార్థ సారథి యయి
  చక్రి యని లోన ధర్మపక్షమున నిలచి
  శస్త్రసన్యాసముం జేసి జయమునందె”

  రిప్లయితొలగించండి
 13. శా:శస్త్రాస్త్రమ్ముల విద్యలందు ఘనతన్ సాధించి,ద్యూతమ్మునన్
  నిస్త్రాణ స్థితి పాండవాళి తల వంచెన్ ద్రౌపదిన్ బట్టి ని
  ర్వస్త్రన్ జేసెడు దౌష్ట్యమున్ సయిచి,శౌర్యమ్మున్ తగన్ దాచియున్
  శస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి జయమున్ సాధించె యుద్ధంబునన్
  (పాండవసమూహం ద్యూతం లో శస్త్రాలని పక్కన పెట్టి, దుర్మార్గాన్ని సహించి యుద్ధం లో జయించింది. )

  రిప్లయితొలగించండి
 14. ఆంగ్ల ప్రభువుల సంకెళ్ళ బారినుండి
  బంధ నిర్వ్రతి కొఱకునై గాంధితాత
  శాంతి యుతముగఁబోరాడి యంతిమముగ
  శస్త్రసన్యాసముం జేసి జయమునందె

  రిప్లయితొలగించండి
 15. శస్త్రాస్త్రంబుల విద్య నేర్వగ వలెన్ సంపూర్ణ భావంబుతో
  శస్త్రాస్త్రంబులు రెండుఁజూడఁగ మహా సంక్లిష్ట మౌవిద్యయే
  శస్త్రాస్త్రంబుల జోలికేగక యనిన్ సాధించె మాహాత్ముఁడే
  శస్త్రాస్త్రమ్ములఁ బాఱవైచి జయమున్ సాధించె యుద్ధంబునన్”

  రిప్లయితొలగించండి
 16. ఆయుధాస్త్రములను బట్టి యాంగ్ల దొరల
  దరుము వలెనంచు కొందరు వదరుచున్న
  శాంతి కాముకుడగుగాంధి సత్యమెరిగి
  శస్త్రసన్యాసముం జేసి జయమునందె

  రిప్లయితొలగించండి