7-6-2024 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా”(లేదా...)“పరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్”
సిరివీడంగనువిష్ణువేతుదకుతాతేజంబుగోల్పోయెగావర శ్రీ లక్ష్మినిచూచుకైవెదకెగావేద్యుండుకాడెన్నడున్తిరువేంకన్నగశోభతోనిలచెలేశ్రీశుండుగాకొండపైపరతంత్రుండురహించుదీనజనకల్పద్రుప్రభావోన్నతిన్
అరయన్కర్ణుడుమిత్రుడువిరిసెన్సభలోతనదగుభేదములేకన్ఒరిగెన్కలననుపోరుచుపరతంత్రుడుదీనకల్పపాదపముగదా
కందంధరపై కోదండపతియెనిరతము గని ధర్మరక్ష నృపుడై యేలన్వరమై సద్ధర్మమునకుఁబరతంత్రుడు! దీనకల్పపాదపము గదా!మత్తేభవిక్రీడితముధరపై హర్యవతారుడై వెలయ కోదండాన ధర్మాత్ముఁడైవర శ్రీరాముడు యాగరక్షనిడ విశ్వామిత్ర సన్మౌనికేనిరతమ్మార్తులఁ గావ రాజ్యమున సంధింపంగ ధర్మానికౌపరతంత్రుండు! రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్!
నిరతము జీవిక కొరకైపరితాపమునొందు పేదవారల నెలమిన్పరిరక్షించెడు సేవాపరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
హరియే నిత్యము సత్యమునిరతము సేవించు వారి నెయ్యము వాడే సురవంద్యుండాశ్రిత జనపరతంత్రుఁడు, దీనకల్పపాదపము గదా.హరియే సత్యము నిత్యమై దనుజ సంహారమ్ము నేజేయుచున్ శరణంబంచును వేడు శిష్టులకిలన్ సర్వంబు తానౌచు నీధరణిన్ ధర్మము నిల్పు వాడతడె పద్మాక్షుండు, భక్తాళికిన్ బరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్.
పరమోదాత్త గుణాఢ్యుడై నిరతమాపన్నుల్ ముదంబొందగాపరితాపోన్మథనమ్మొనర్చుటకు సంభాలించు పుణ్యాత్ముడైపరిరక్షించెడు సద్గుణాన్వితుఁడెపో భావింపగా నెమ్మికిన్పరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్
పరుల కెటుల జేయగలుగుపరతంత్రుఁడు ; దీనకల్పపాదపము గదాజరుగగలదెచ్చ టైననునిరంతరము సొంత శిష్టి నెరపుచునుండన్
సరియగు రీతిని సేవలునిరతము ప్రజల దరిఁ జేర్చు నిస్వార్థుండేస్మరణీయుడు గాదె ప్రజాపరతంత్రుఁడు దీనకల్పపాదపము గదాసరియౌ రీతిని సేవకై తలపులే సంగ్రామమున్ సల్పగాకరుణాపూరిత మానసుండు మదిలో కర్తవ్యమున్ నిల్పగానిరపేక్షుండు సదా సమాజ హితుడౌ నిస్వార్థ నేతే ప్రజాపరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్
హరి హరి హరి యనినంతనెసరగున నేతెంచి బ్రోచె సామోద్భవమున్కరివరదుండాశ్రితజనపరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా
నిరతము ధర్మా త్ముండై తర తమ భేద ములు మాని తాత్విక వర్తుం డరుదగు రీతిగ సేవా పర తంత్రు డు దీన కల్ప పాద పము గదా
కం॥ నిరతము సాయముఁ గోరఁగఁబరతంత్రుఁడు, దీనకల్పపాదపము గదాయరసి జనుల హితము సతతముపరిపాలనఁ గనుచుఁ జనెడి ప్రభువు ధరణిలోమ॥ అరయంగానటు సర్వదా పరుల సాహాయంబు నర్థించఁగన్బరతంత్రుండు, రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్గరుణా సాగరుఁ డౌచు సర్వజన రక్షాభావనా తప్తుఁడైధరలో వర్తిలు పాలకుండిల యధార్థంబున్ నివేదించఁగన్
కం:దరి జేరక యధికారమ్మరులకు నెన్నికల దక్కె నహము విడచి యాపరులకె మ్రొక్కుము, కొన్నిటపరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా”(పరతంత్రుడు అంటే శత్రుపక్షం వాడు అనే అర్థం లో వాడాను.అధికారం పోయినప్పుడు అధికారంలో ఉన్నవాడికి శరణు అంటే కష్టాల నుంచి బైటపడవచ్చు.)
మ:"వరమో ?శాపమొ? జన్మ" మంచు మది విశ్వాసమ్ము గోల్పోయి, తత్త్వరహస్యమ్ము నెరుంగ లేని సఖుడా ప్రార్థింపుమా మ్రొక్కి మద్గురునిన్ !తత్కృప జ్ఞాన మిచ్చు వెతలన్ ద్రుంచున్,పరబ్రహ్మకున్బరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్.(జీవితలక్ష్యం, పరమార్థం తెలియక బాధపడే ఒక సాధకునికి మరొక సాధకుడు తన గురువుని ఆశ్రయించ మని చెపుతున్నట్లు.)
కరుణా రసార్ద్ర హృదయుఁడు నిరతామల చిత్తుఁడు ఘన నిష్ఠాత్ముండున్ నరలోక నిత్య సేవా పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదాకరుణాంతఃకరణైక మండితుఁడు నిష్కాముండు లోకోపకారి రుజా హీనుఁడు దీన రక్షకుఁడు నై హృద్యంబుగా సంతతం బరవిందాక్ష విలోల మానసుఁడు సమ్యగ్దేవతా చింతనా పరతంత్రుండు రహించు దీన జన కల్పద్రుప్రభావోన్నతిన్
ధరణినహరువిల్విరుచుచధరణిజనువివాహమాడిదశరథసుతుడున్స్థిరముగు సద్ధర్మమునకు పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా”*
సిరివీడంగనువిష్ణువేతుదకుతాతేజంబుగోల్పోయెగా
రిప్లయితొలగించండివర శ్రీ లక్ష్మినిచూచుకైవెదకెగావేద్యుండుకాడెన్నడున్
తిరువేంకన్నగశోభతోనిలచెలేశ్రీశుండుగాకొండపై
పరతంత్రుండురహించుదీనజనకల్పద్రుప్రభావోన్నతిన్
అరయన్కర్ణుడుమిత్రుడు
రిప్లయితొలగించండివిరిసెన్సభలోతనదగుభేదములేకన్
ఒరిగెన్కలననుపోరుచు
పరతంత్రుడుదీనకల్పపాదపముగదా
కందం
రిప్లయితొలగించండిధరపై కోదండపతియె
నిరతము గని ధర్మరక్ష నృపుడై యేలన్
వరమై సద్ధర్మమునకుఁ
బరతంత్రుడు! దీనకల్పపాదపము గదా!
మత్తేభవిక్రీడితము
ధరపై హర్యవతారుడై వెలయ కోదండాన ధర్మాత్ముఁడై
వర శ్రీరాముడు యాగరక్షనిడ విశ్వామిత్ర సన్మౌనికే
నిరతమ్మార్తులఁ గావ రాజ్యమున సంధింపంగ ధర్మానికౌ
పరతంత్రుండు! రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్!
నిరతము జీవిక కొరకై
రిప్లయితొలగించండిపరితాపమునొందు పేదవారల నెలమిన్
పరిరక్షించెడు సేవా
పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహరియే నిత్యము సత్యము
రిప్లయితొలగించండినిరతము సేవించు వారి నెయ్యము వాడే
సురవంద్యుండాశ్రిత జన
పరతంత్రుఁడు, దీనకల్పపాదపము గదా.
హరియే సత్యము నిత్యమై దనుజ సంహారమ్ము నేజేయుచున్
శరణంబంచును వేడు శిష్టులకిలన్ సర్వంబు తానౌచు నీ
ధరణిన్ ధర్మము నిల్పు వాడతడె పద్మాక్షుండు, భక్తాళికిన్
బరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్.
పరమోదాత్త గుణాఢ్యుడై నిరతమాపన్నుల్ ముదంబొందగా
రిప్లయితొలగించండిపరితాపోన్మథనమ్మొనర్చుటకు సంభాలించు పుణ్యాత్ముడై
పరిరక్షించెడు సద్గుణాన్వితుఁడెపో భావింపగా నెమ్మికిన్
పరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్
పరుల కెటుల జేయగలుగు
రిప్లయితొలగించండిపరతంత్రుఁడు ; దీనకల్పపాదపము గదా
జరుగగలదెచ్చ టైనను
నిరంతరము సొంత శిష్టి నెరపుచునుండన్
సరియగు రీతిని సేవలు
రిప్లయితొలగించండినిరతము ప్రజల దరిఁ జేర్చు నిస్వార్థుండే
స్మరణీయుడు గాదె ప్రజా
పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా
సరియౌ రీతిని సేవకై తలపులే సంగ్రామమున్ సల్పగా
కరుణాపూరిత మానసుండు మదిలో కర్తవ్యమున్ నిల్పగా
నిరపేక్షుండు సదా సమాజ హితుడౌ నిస్వార్థ నేతే ప్రజా
పరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహరి హరి హరి యనినంతనె
రిప్లయితొలగించండిసరగున నేతెంచి బ్రోచె సామోద్భవమున్
కరివరదుండాశ్రితజన
పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా
నిరతము ధర్మా త్ముండై
రిప్లయితొలగించండితర తమ భేద ములు మాని తాత్విక వర్తుం
డరుదగు రీతిగ సేవా
పర తంత్రు డు దీన కల్ప పాద పము గదా
కం॥ నిరతము సాయముఁ గోరఁగఁ
రిప్లయితొలగించండిబరతంత్రుఁడు, దీనకల్పపాదపము గదా
యరసి జనుల హితము సతతము
పరిపాలనఁ గనుచుఁ జనెడి ప్రభువు ధరణిలో
మ॥ అరయంగానటు సర్వదా పరుల సాహాయంబు నర్థించఁగన్
బరతంత్రుండు, రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్
గరుణా సాగరుఁ డౌచు సర్వజన రక్షాభావనా తప్తుఁడై
ధరలో వర్తిలు పాలకుండిల యధార్థంబున్ నివేదించఁగన్
కం:దరి జేరక యధికార
రిప్లయితొలగించండిమ్మరులకు నెన్నికల దక్కె నహము విడచి యా
పరులకె మ్రొక్కుము, కొన్నిట
పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా”
(పరతంత్రుడు అంటే శత్రుపక్షం వాడు అనే అర్థం లో వాడాను.అధికారం పోయినప్పుడు అధికారంలో ఉన్నవాడికి శరణు అంటే కష్టాల నుంచి బైటపడవచ్చు.)
మ:"వరమో ?శాపమొ? జన్మ" మంచు మది విశ్వాసమ్ము గోల్పోయి, త
రిప్లయితొలగించండిత్త్వరహస్యమ్ము నెరుంగ లేని సఖుడా ప్రార్థింపుమా మ్రొక్కి మ
ద్గురునిన్ !తత్కృప జ్ఞాన మిచ్చు వెతలన్ ద్రుంచున్,పరబ్రహ్మకున్
బరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్.
(జీవితలక్ష్యం, పరమార్థం తెలియక బాధపడే ఒక సాధకునికి మరొక సాధకుడు తన గురువుని ఆశ్రయించ మని చెపుతున్నట్లు.)
కరుణా రసార్ద్ర హృదయుఁడు
రిప్లయితొలగించండినిరతామల చిత్తుఁడు ఘన నిష్ఠాత్ముండున్
నరలోక నిత్య సేవా
పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా
కరుణాంతఃకరణైక మండితుఁడు నిష్కాముండు లోకోపకా
రి రుజా హీనుఁడు దీన రక్షకుఁడు నై హృద్యంబుగా సంతతం
బరవిందాక్ష విలోల మానసుఁడు సమ్యగ్దేవతా చింతనా
పరతంత్రుండు రహించు దీన జన కల్పద్రుప్రభావోన్నతిన్
రిప్లయితొలగించండిధరణినహరువిల్విరుచుచ
ధరణిజనువివాహమాడిదశరథసుతుడున్
స్థిరముగు సద్ధర్మమునకు
పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా”*