5, డిసెంబర్ 2024, గురువారం

సమస్య - 4963

6-12-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వప్నంబున హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్”
(లేదా...)
“స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై”

16 కామెంట్‌లు:


  1. స్వప్నముల పైన శోధన
    స్వప్నికుడను వాడు సలిపి చనమరి తోడన్
    స్వప్నములు నిజమని తెలుప
    స్వప్నంబున హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్.

    *(హరి=పాము)*


    స్వప్నము లన్న కల్లయను భావన వీడుమటంచు మిత్రుడున్
    స్వప్నము పైన శోధనలు చక్కగ చేసిన శాస్త్రవేత్తయౌ
    స్వప్నికశర్మ చెప్ప విని స్వప్నకుమారుడు రాత్రి నిద్ర లో
    స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై.

    *(విష్ణువు = అగ్ని)*

    రిప్లయితొలగించండి
  2. కందం
    స్వాప్నికులు మానవులు, న
    స్వప్నులు దేవతలనంగఁ జదివితినయ్యా!
    స్వప్నావస్థ విడుము, యే
    స్వప్నంబున హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్?

    ఉత్పలమాల
    స్వాప్నికులన్న మానవులు, శాస్త్రము దెల్పఁగ నేర్చితయ్య న
    స్వప్నులు వేల్పులన్ బగిది, సందియమేలొకొ? వాస్తవమ్మిదే!
    స్వప్నమునందునన్ మునిగి వాగుచునుంటివొ? కాకయున్న నే
    స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై!

    రిప్లయితొలగించండి
  3. స్వప్నమనగ నది కలయే
    స్వప్నమున కనబడు వింత సంగతు లెన్నో
    స్వప్నము నిజమెవరి కయిన
    స్వప్నంబున హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్

    రిప్లయితొలగించండి
  4. స్వప్నానుభూతిఁ గొన న
    స్వప్నులగు చిరాయువులకు సాధ్యంబగునా
    స్వప్నావస్థ హితునిదే
    స్వప్నంబున హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్

    స్వప్నము మానవాళికిడు సాధ్యము కానివి పొందు మార్గమే
    స్వప్నములేని వేల్పుల కసాధ్యము కాదొకొ దీనిభాగ్యమే
    స్వప్నముఁ గాంచె నాహితుడు శంభుఁడు నిన్నటి రాత్రి నిద్రలో
    స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై

    రిప్లయితొలగించండి
  5. స్వప్ననుఁ జేరి కామమున శంభుడు బల్కె తెగించి "నీవె నా
    స్వప్నమునందు సుందరివి సమ్మతిఁ దెల్పుము లేచి పోవగా"

    స్వప్న వచించె "విష్ణువుకు భర్తకుఁ జెప్పెద నిద్ది యంచు" దు
    స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై!!

    రిప్లయితొలగించండి
  6. కం.
    స్వప్నంబులు నిజమగునా
    స్వప్నములధికముగవచ్చు శంభుకు నిదురన్
    స్వప్నంబని తలపోయక
    స్వప్నంబున హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్
    (హరి=సింహము)

    రిప్లయితొలగించండి
  7. స్వప్నమునందు గాంచినవి సత్యముగా తలబోసి జీవిదు
    స్స్వప్నము గాంచినంత కడు వ్యాకులపాటునుబొంద సాజమే
    స్వప్నము గాంచె నిద్దురను శంభుడు తానొక రక్కసుండుగా
    స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై

    రిప్లయితొలగించండి
  8. కం॥ స్వప్నము ననుదినముఁ గనుట
    స్వప్నము నందె బ్రదుకుటయు శంభుని మోజై
    స్వప్నము వికటించఁ గలఁచు
    స్వప్నంబున హరినిఁ గాంచి శంభుడు వడఁకెన్

    హరి యముడు

    ఉ॥ స్వప్నముఁ గాంచి మిత్రులగు శంభుఁడు విష్ణువుఁ జర్చఁ జేయఁగా
    స్వప్నపు రీతులన్నియును బ్రాయకమేఁ జిరు కిన్క చొప్పడన్
    స్వప్నముఁ గూర్చి వాదనల శత్రువులౌచు సఖుల్ చరించ దు
    స్స్వప్నము లోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై

    పై పూరణలలో శంభుడు విష్ణువు మానవులండి
    నాకు ప్న రెండవ అక్షరముగా సంస్కృత తెలుగు పదములు కనపడ లేదండి ధూప్నా ఒకటే కనిపించింది.

    రిప్లయితొలగించండి
  9. స్వప్నము లుండవు సురలకు
    స్వప్నంబుల గూర్చి పలుకుట సరి కాదు గదా
    స్వప్న ము లే లే క యెచట
    స్వప్నంబు న హరి ని గాంచి శం భు డు వడ కెన్

    రిప్లయితొలగించండి
  10. కం:ఆప్నుండై హరి కృప తా
    వ్యాప్నత తో వెల్గు హరిని ప్రహ్లాదుడు సు
    స్వప్నము వలె గన నొక పరి
    స్వప్నంబున హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్”
    (ఆప్న=పొందు.వ్యాప్న= వ్యాపించిన. విష్ణువు అంటే వ్యాపకుడు.నరహరి రూపాన్ని ప్రహ్లాదుడు సంతోషం గా చూసాడు కానీ శివుడే,ఆ రూపాన్ని స్వప్నం లో చూసి భయ పడ్డాడు అనే అతిశయోక్తి. ఒకే పదం వాడకుండా పూరించాలి అనే ప్రయత్నం.తప్పొప్పులు
    పరిశీలించవలసినది.ఉదా:- బ్రహ్మవి దాప్నోతి పరం.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:ఆప్నత జెంది విష్ణు కృప నర్భక భక్తుడు విశ్వ మంతటన్
    వ్యాప్నత నొందు కేశవుని యాకృతి గాంచి తరించి తంచు సు
    స్వప్నము వోలె గాంచ సురవంద్యుడు ,రుద్రుడు నయ్యు వింతగా
    స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై”

    రిప్లయితొలగించండి
  12. స్వప్నాంతం బైనను దా
    స్విప్న తనుండు నయి నడర భీతి యెడఁద లో
    నప్ను శిరుఁడు సతి తోడుత,
    స్వప్నంబున, హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్

    [హరి = సింహము; అప్ను = జలము]


    తృప్నువు గాక స్వీయ సు సతీ సహితమ్మున నుంటి నక్కటా
    క్షిప్ను లలామ యౌ ననుచు క్షిప్రము పార్వతి నేరి నంతటన్
    స్విప్న శరీరుఁడై యెఱిఁగి విశ్వవిమోహన మోహినీ సతిన్
    స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై

    [తృప్నువు = తృప్తిశీలుఁడు; క్షిప్ను లలామ = మిక్కిలి తిరస్కరించు సతి; స్విప్నము = చెమట తోఁ గూడినది]

    రిప్లయితొలగించండి
  13. స్వప్నము లనునవి కల్లలు
    స్వప్నములుగవచ్చుచుండుఁబలురకములుగాన్
    స్వప్నపు భాగమె యీయది
    స్వప్నంబున హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్

    రిప్లయితొలగించండి
  14. స్వప్నము నానెఱుంగుమిఁక సత్యము కాదది కల్లయేయనిన్
    స్వప్నము వచ్చుచుండునట పల్విధ రూపము గా జనాళికిన్
    స్వప్నపు భాగమే యనుచు పండితు లెల్లరు సెప్పె దీనినిన్
    స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై

    రిప్లయితొలగించండి