14, డిసెంబర్ 2024, శనివారం

సమస్య - 4972

15-12-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అగును దక్షిణకాశి భద్రాచలమ్మె”
(లేదా...)
“దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును భద్రశైలమే”

19 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఉత్పలమాల
      అక్షయ పుణ్యమున్ స్మరణమందునె ముక్తినొసంగు క్షేత్రమై
      ప్లుక్షికి చిహ్నమై నిలిచె పో, 'యరుణాచల' నామమొప్పగన్
      త్ర్యక్షుని లింగమే గిరిగ ధన్యతనొందగ భక్తకోటికిన్
      దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును భద్ర! శైలమే

      తొలగించండి
    2. తేటగీతి
      స్మరణ మాత్రన ముక్తిని మనకొసంగు
      నగ్నిభూతప్రతీక యీ యరుణగిరియె
      హరుని క్షేత్రమనఁగ మహిమాన్వితమ్ము!
      నగును దక్షిణకాశి., భద్రా! చలమ్మె?

      తొలగించండి
  2. దక్షతఁ గల్గి యజ్ఞమును ధ్వంసముఁ జేసి పరాక్రమంబునన్
    దక్షునిఁ జంపి శంకరుని తాపముఁ దీర్చిన వీరభద్రుడే
    త్ర్యక్షునిఁ గోరె శ్రీగిరి మహత్వముఁ దెల్పగ,బల్కెనిట్టులన్
    "దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును భద్ర!శైలమే"!!

    శ్రీగిరి = శ్రీశైలము

    రిప్లయితొలగించండి
  3. భరత నాడున దక్షిణ భాగమందు
    నిలుచు యేకాంబరేశ్వరు ని గుడి వెలయు
    కంచిపురమున దేవుని గాంచగ , నన
    నగును దక్షిణకాశి ; భద్రాచలమ్మె
    పసగనికపై నయోథ్యగ వాసికెక్కు

    రిప్లయితొలగించండి

  4. పింగళునకు రామునకిల భేదమేది
    ముక్తికొరకంచు తపియించు భక్తజనులు
    దూరభారమనుచు కాశి చేరలేని
    వారు మనమున్ దలచినదే వారణాశి
    యగును, దక్షిణకాశి భద్రాచలమ్మె.

    త్ర్యక్షుడు వేరుకాదు రఘు రాముడె పాపహరుండ్రు వారలే
    మోక్షము గోరువారలకు ముక్తినొసంగెడి యద్రిజాతముల్
    రక్షకులిద్దరొక్కటె పరాకును వీడుచు నమ్మినంతటన్
    దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును భద్రశైలమే.

    రిప్లయితొలగించండి
  5. రమ్యమౌ వీరభద్రుని రాయచోటి
    యగును దక్షిణకాశి; భద్రాచలమ్మె
    రామ భద్రుడు కొలువైన ధామమనగ
    దర్శనీయ మవశ్యము దక్షిణమున

    వీక్షణమే తలంచితిని వేడిమి కన్దొర జాడలెంచుచున్
    రక్షకు వీరభద్రుడటఁ లక్షణమొప్పగ రాయచోటియే
    దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును; భద్రశైలమే
    రక్షకుడైన భద్రునిగ రాముడు నెక్కొను దేవళంబిటన్

    రిప్లయితొలగించండి
  6. కలడు యేకాంబరేశుఁడు కొలువుదీరి
    కాంచిపురమందు గావున నెంచిచూడ
    నగును దక్షిణకాశి, భద్రాచలమ్మె
    దక్షిణాదినయోధ్యగా దనరె నేడు

    రిప్లయితొలగించండి
  7. రక్షణఁజేసి భక్తులను రాజిలు కాంచిపురంబునందునన్
    మోక్షమునిచ్చు దైవమగు పుంగవకేతువు సన్నిధానమే
    దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును, భద్రశైలమే
    వీక్షణమాత్ర నైహికపు వేదనలెల్ల శమింపజేసెడిన్

    రిప్లయితొలగించండి
  8. తే॥ అగును దక్షిణ కాశి భద్రాచలమ్మె
    యనుట యేల విశ్వంభరుఁడైన దైవ
    మయము జగతి యెల్ల వెదుక మనము నిడుచు
    నవని యంతయు కాశిభద్రాచలమ్మె

    ఉ॥ రక్షణనిచ్చు దైవమటు రాజిలు చుండడె విశ్వమంతటా
    లక్షణ మైన జ్ఞానమును లక్ష్యముఁ గాంచని వారె తెల్పరే!
    దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును భద్రశైలమే
    శిక్షణ నొంది చూడుమయ సిద్ధినిఁ బొందఁగ జ్ఞాన దృక్కులన్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:అదుపు లేని యావేశమున్ వదలుకునుము
    శాంతి ధామమైన యరుణా చలమె మనకు
    నగును దక్షిణకాశి భద్రా!చలమ్మె
    శాంతి నొందె శ్రీ రమణుల చరణ మంటి.
    (భద్ర అనేది మనిషి పేరు.ఓ భద్రా చలం గారే రమణ మహర్షి నాశ్రయించి శాంతి పొందారు.నువ్వు కూడా ఆవేశాన్ని వదులుకో.ఇది దక్షిణ కాశి.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:అక్షర రూపుడౌ శివుని యందున నీదగు భక్తికిన్ దగున్
    సాక్షిగ నీ శివాలయము చక్కగ గట్టితి వీవు భావిలో
    దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును భద్ర! శైలమే
    యక్షికి పండుగై వెలయు,నద్భుత మైన ప్రదేశ మియ్యదే.
    (భద్రా! చక్కని శివాలయం ఈ కొండ మీద కట్టావు.ఇది భావి లో దక్షిణ కాశిగా పిలవ బడుతుంది.)

    రిప్లయితొలగించండి
  11. శివుడు వెలసిన క్షేత్రమ్ము శ్రీక రమ్ము
    కాశి వోలెను బేరొంది కమ్ర మగుచు
    నగును దక్షిణ కాశి :: భద్రా చల మ్మె
    రామ మందిర ముండ గా రహిని గాంచె

    రిప్లయితొలగించండి
  12. (3)తే.గీ:"ఏది దక్షిణ కాశిగా నెరుగ బడునొ?"
    యనగ "భద్రాచల"మ్మని యనెద వేమి?
    యెరుగవో యింత యైన కాళేశ్వరమ్మె
    యగును దక్షిణకాశి, భద్రాచలమ్మె?

    రిప్లయితొలగించండి
  13. భక్తి నెదలఁ గొలుచు నట్టి భక్త జనుల
    నెల్ల నిత్యమ్ము కాపాడి యిహము నింకఁ
    బరము నీయ దక్షారామ పట్టణ వర
    మగును దక్షిణకాశి భద్రా చలమ్మె

    [చలమ్మె = ద్వేషమే]


    దక్షిణ గంగ నాఁ బరఁగు ధాత్రిని గౌతమి తన్నదీ తటిన్
    దక్ష పు రోపవాటికను ద్ర్యంబకు భద్ర శిలేద్ధ లింగ రా
    డక్షయ కాంతి వెల్గుచును నంచిత మోక్ష మొసంగ నుండుటన్
    దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును భద్రశైలమే

    [భద్ర శైలము = భద్ర శిల గల క్షేత్రము]

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కనగ శివుని క్షేత్రమ్ము శ్రీకాళహస్తి
    యగును దక్షిణ కాశి; భద్రాచలమ్మె
    దక్షిణ యయోధ్య పేరుతో తనరుచుండె
    రామదాసు నిర్మించిన రాముని గుడి.

    రిప్లయితొలగించండి