31, డిసెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4989

1-1-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణమే నెయ్యమునుఁ గట్టు రజ్జువగుఁ గదా”
(లేదా...)
“రణమే నెయ్యపు రజ్జువౌను సుఖసామ్రాజ్యాధిపత్యం బిడున్”

18 కామెంట్‌లు:

  1. హిడింబ భీమునితో..

    కందం
    అణువణువున నిను నింపుచు
    ప్రణయంబునఁ దేలియాడ పాండవ! యనివా
    రణమై చెలఁగు మనో ప్రే
    రణమే నెయ్యమునుఁ గట్టు రజ్జువగుఁ గదా!

    మత్తేభవిక్రీడితము
    ఋణమేముంటినొ నీకుమున్పు మదనా! రేగెన్ మనోకాయముల్
    క్షణమైనన్ విరహంబు నోపతరమా! కాంక్షింప భీమా! నినున్
    ప్రణయోద్వేగము తాళకుంటి మగడై పాలించు నీదైన తా
    రణమే నెయ్యపు రజ్జువౌను సుఖసామ్రాజ్యాధిపత్యం బిడున్!

    రిప్లయితొలగించండి

  2. *(తిమ్మరుసు రాయలతో పలికిన పలుకులుగా)*

    సృణితో వియ్యము కుదిరిన
    రణములకిక తావులేదు రాజా! విద్వే
    షణులింటను కట్టెడి తో
    రణమే నెయ్యమునుఁ గట్టు రజ్జువగుఁ గదా.


    హృణినిన్ వీడుచు భక్తిమార్గమున నా యీశుండనే గొల్వగన్
    సృణినైనన్ భగవత్స్వరూపుడనుచున్ స్నేహంబునే చేయుచున్
    మణికంఠున్ గొలువంగ గైకొనెడి నేమాలున్న యాదీక్ష ధా
    రణమే నెయ్యపు రజ్జువౌను సుఖసామ్రాజ్యాధిపత్యం బిడున్.

    రిప్లయితొలగించండి
  3. అణువణువుననాసక్తియు
    కణకణముననిండినంత కవులిచ్చోటన్
    క్షణమునచేసెడుయీపూ
    *“రణమే నెయ్యమునుఁగట్టు రజ్జువగుఁ గదా”*




    రిప్లయితొలగించండి
  4. కం॥ వ్రణమున్ బొందఁగ హృదయము
    తృణమున్ గోరని సహాయ ధీరత్వము స
    ద్గుణమే పడసిననా తా
    రణమే నెయ్యమును గట్టు రజ్జువగుఁ గదా!

    మ॥ వ్రణమున్ బొందఁగ మానసమ్ము తగు సంత్రాణమ్ము సాయమ్మునున్
    దృణమున్ గోరక జేయఁగన్ గనుచు సంతృప్తిన్ మనోల్లాసమున్
    గుణ సంపన్నుఁడుగాఁ జెలంగి ధరలో గోవిందుఁడే మెచ్చు! తా
    రణమే నెయ్యపు రజ్జువౌను సుఖసామ్రాజ్యాధిపత్యం బిడున్

    రిప్లయితొలగించండి
  5. ఒకబావకి మరదలి హితబోధ:
    గుణసంపన్నుడ నౌదు నంచు నిచటన్ గుయ్యాడుటే? నీదు ల
    క్షణజాలంబును దెల్పి మాగృహమునన్ గల్యాణమున్ గోరుమా
    ప్రణయస్పప్నము సత్యమైదనరు బావా! చెప్ప మాంగల్య ధా
    రణమే నెయ్యపు రజ్జువౌను, సుఖసామ్రాజ్యాధిపత్యం బిడున్.

    రిప్లయితొలగించండి
  6. తృణమిక గోవుకు నచ్చక
    పణమే జగతినికపైన పరిపాలించన్
    గూణమిక నెరినుండిన కా
    రణమే నెయ్యమునుఁ గట్టు రజ్జువగుఁ గదా

    రిప్లయితొలగించండి
  7. కణ కణ మున మంచి తనము
    న ణు వణు వున సేవ సల్పు టా శ య ముల తో
    వినయము సదాశ యపు సై
    రణ మే నెయ్యమును గట్టు రజ్జువు గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడు నాల్గు పాదాలలో టా శ యములు స
      ద్గు ణ యుతులై నెగడుచు సై
      రణ మే అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  8. గణనాధాదుల పూజఁ జేసి పిదపన్ గౌరమ్మ యాశీస్సుకై
    ప్రణతుల్ సేసి వివాహమందున తలంబ్రాలం దలందాల్చు ధో
    రణి తాజూపి శుభమ్ముఁ గోరి మనసారా జేయు మాంగల్య ధా
    రణమే నెయ్యపు రజ్జువౌను సుఖసామ్రాజ్యాధిపత్యం బిడున్!!

    రిప్లయితొలగించండి
  9. ప్రణయము స్థిరపడినపుడు ప
    రిణయమ్మిరు జీవితాల ప్రియముగ గలుపున్
    ప్రణుతించగ నెల్లరు తో
    రణమే నెయ్యమునుఁ గట్టు రజ్జువగుఁ గదా

    రిప్లయితొలగించండి
  10. ప్రణయమ్మే యిరుజీవితాల గలుపున్, వర్ధిల్లగన్ బ్రేమయే
    ప్రణవమ్మై రవళించి హృత్కమలముల్ రంజిల్లగా జేయు నా
    ప్రణయమ్మౌ నభినందనీయమది మారన్బెండ్లిగా పచ్చతో
    రణమే నెయ్యపు రజ్జువౌను సుఖసామ్రాజ్యాధిపత్యం బిడున్

    రిప్లయితొలగించండి
  11. (3)కం:గణముల్ నేర్చిన దాదిగ
    గుణించుచున్ శంకరయ్య గురు ప్రశ్నల పూ
    రణ జేయు చుంటి నా పూ
    రణమే నెయ్యమునుఁ గట్టు రజ్జువగుఁ గదా”

    రిప్లయితొలగించండి
  12. (1)కం:రణ మయ్యెను మునసబుతో,
    గణపతి విడి పూజ వోలె కార్య మ్మగునే?
    గణికల బావయె యైన క
    రణమే నెయ్యమునుఁ గట్టు రజ్జువగుఁ గదా!
    ( మునసబ్ తో నాకు తగవు వచ్చింది.వినాయకుణ్ని వదిలి పూజ చేస్తే ఎలా విఘ్నా లొస్తాయో అలా వస్తాయి.మాకు మళ్లీ మైత్రి చెయ్యా లంటే కరణం తోనే అవుతుంది.ఆ కరణం ఊళ్లో బోగం వాళ్లందరికీ బావే కానీ అతన్ని పట్టుకోక తప్పదు.ఇది గ్రామ రాజకీయం.)
    (2)శా:రణముల్ నీకును నాకు సౌఖ్య మిడునే? రా బావ!నీ బిడ్డ శ్రా
    వణిన్ కోడలి గా గ్రహింతు మన వౌ పంతమ్ము లీ పెండ్లి తో
    క్షణకాలమ్మున భస్మమౌ,ముదము తో కట్టించు నా పెండ్లి తో
    రణమే నెయ్యపు రజ్జువౌను సుఖసామ్రాజ్యాధిపత్యం బిడున్”
    (బావా!మనం సంబంధం కలుపుకుందాం.ఆ పెండ్లి తోరణమే మన స్నేహబంధం అవుతుంది.)

    రిప్లయితొలగించండి
  13. గుణ దోషమ్ముల నింపుగ
    గుణముల నెన్ని తలఁపక యగుణముల స్వీ యా
    గణితానురాగ గుణ ము
    ద్రణమే నెయ్యమునుఁ గట్టు రజ్జు వగుఁ గదా


    తృణ మైనన్ మద మూన కుండ మదిలో దీపింప సంతృప్తి స
    ద్గుణ వారాశి యనంగ భాసిలుచు సంతోషమ్మునం దేలుచున్
    మణియై మానవు లందు వర్తిలుచుఁ గామక్రోధ మాత్సర్య వా
    రణమే నెయ్యపు రజ్జు వౌను సుఖ సామ్రాజ్యాధిపత్యం బిడున్

    రిప్లయితొలగించండి
  14. క్షణకాలంబునురెప్పవాల్చరుగదాకందర్పదర్పాహతుల్
    గొనగావాసుకిమంధరంబులనగాఁగూర్మంబునాల‌ంబమై
    పనిగావారలఁదోడుకోసమనిశ్రీవార్థింమధింపన్సుతో
    రణమేనెయ్యపు రజ్జువౌనుసుఖసామ్రాజ్యాధిపత్యం బిడున్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  15. క్షణమున్ వ్యర్థము చేయకుండగను తా కార్యమ్ములన్ చేయుచున్
    గుణపూర్ణుండగురామచంద్రునెద లోగూడంబుగాకొల్చుచున్
    తృణమున్ కోరక నన్యులన్ సతము తాతృప్తుండునౌరాముపా
    రణమే నెయ్యపు రజ్జువౌను సుఖ సామ్రాజ్యాధి పత్యం బిడున్


    అణువణువుననాసక్తియు
    కణకణముననిండినంత కవులిచ్చోటన్
    క్షణమునచేసెడుయీపూ
    *“రణమే నెయ్యమునుఁగట్టు రజ్జువగుఁ గదా”*

    రిప్లయితొలగించండి