2, డిసెంబర్ 2024, సోమవారం

సమస్య - 4960

3-12-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నన్నయ గార మ్మొలుకగ నాట్యముఁ జేసెన్”
(లేదా...)
“నన్నయ గార మొల్కు గతి నాట్యముఁ జేసె జనమ్ము మెచ్చఁగన్”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. కందం
    మున్ను 'తెనుఁగు' భారతమున
    సన్నుతులందంగ శబ్దశాసనుడగుచున్
    తిన్నగ ఆదికవియనగ
    నన్నయ గారమ్మొలుకఁగ 'నాట్యముఁ జేసెన్'

    ఉత్పలమాల
    మున్ను 'తెనుంగు' భారతముఁ బూనఁగ నాదికవీశుడెంచుచున్
    సన్నుత శబ్దశాసనుడు సర్వులు మెచ్చుకవిత్వ మాధురుల్
    తిన్నగ దీర్చుచున్ మిగుల తేనియ తీపిని రంగరించుచున్
    నన్నయ గార మొల్కు గతి నాట్యముఁ జేసె జనమ్ము మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  2. కన్నియమేనక నేర్పున
    వన్నెలచిన్నెల నిన్ను వైనముతోడన్
    ఎన్నికనుమయూరివిధా
    నన్నయగారమ్మొలుకనాట్యముచేసెన్

    రిప్లయితొలగించండి

  3. *(మీనన్ అను నర్తకుడు చేసిన నృత్యం గురించి)*

    అన్నయ్య పుత్రుడాతం
    డెన్నడు చేయని విధమున నిప్పుడిచోటన్
    గన్నుల విందగు విధి మీ
    నన్నయగారమ్మొలుకగ నాట్యముఁ జేసెన్.


    మిన్నును ముట్టె చర్చరులు మీనను చూపిన నేర్పుగాంచి యా
    యన్నుల మిన్నలున్ పొగడిరాతని నృత్య ప్రదర్శనమ్ము నే
    నెన్నడు గాంచనైతి నిట యింతటియద్భుత యారటుండ, మీ
    నన్నయగార మొల్కుగతి నాట్యముఁ జేసె జనమ్ము మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  4. వన్నెల చిన్నెల చిన్నది
    వెన్నెలయే విరిసినట్లు ప్రేంఖను సలుపన్
    కన్నియకున్ మిన్నగ దా
    నన్నయ గారమ్మొలుకగ నాట్యముఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  5. చెన్నగు తెలుగు ప దమ్ముల
    నెంపిక నొనరించి చేయు నింపగు రచనన్
    వన్నెల చిన్నెల సొగసున
    నన్నయ గా ర మ్మొ లు కగ నాట్యము జేసె న్

    రిప్లయితొలగించండి
  6. వేటగాడు సిమాలో శ్రీదేవి:

    వన్నెలు చిన్నెలింపుగను వాటమెఱింగియు వర్షమందునన్
    పిన్నగ నాకు చాటుగనుఁ బిందెగఁ గొమ్మల చాటు పువ్వుగన్
    చెన్నుగ భామయే చలన చిత్రమునందున వేటగాడులో
    నన్నయగారమొల్కు గతి నాట్యముఁ జేసె జనమ్ము మెచ్చఁగన్!!

    రిప్లయితొలగించండి
  7. కన్నులు చెదిరే నాట్యము
    కన్నియ తాఁ జేసిచూపె కన్నులయెదుటన్
    కన్నెకు సంకట మెదురై
    నన్నయ గారమ్మొలుకగ నాట్యముఁ జేసెన్

    కన్నుల ముందటన్ గనిన కార్యమపూర్వము నిశ్చయంబుగా
    కన్నెకు సంకటంబనగ కాలికి మిక్కిలి పెద్ద గాయమై
    నన్నయగారమొల్కు గతి నాట్యముఁ జేసె జనమ్ము మెచ్చఁగన్
    మన్ననలే లభించెనట మానిని సల్పిన నాట్యరీతికిన్

    రిప్లయితొలగించండి
  8. అన్ను యొకతె యబ్బురముగ
    నన్నయ యను నామము దన నందను కొసగన్
    పొన్నా రి యామె కోడలు
    నన్నయ గార మ్మొలుకగ నాట్యముఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  9. అన్నయు సోదరీమణియు నాభిజనమ్ముగ నాట్యకారులే
    కన్నియ నాట్యమందు నయగారము జూపుచు వన్నె చిన్నెలన్
    మిన్నగ మేళవించి తన మేని హొయల్ ప్రకటించుచుండగా
    నన్నయ గార మొల్కు గతి నాట్యముఁ జేసె జనమ్ము మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  10. 1)కం:అన్నయ్య బిడ్డ బడిలో
    నిన్నటి వేడుకల గురువు నేర్పిన రీతిన్
    మొన్ననె నేర్చిన పదమై
    న, న్నయ గార మ్మొలుకగ నాట్యముఁ జేసెన్”
    (2)ఉ:కన్నడు వెన్న మెక్కుటను,కాంచు యశోదకు వింత జూపుటన్,
    వెన్నను దొంగిలించుటయు,వేల్పుల రేనిని ధిక్కరించుటన్,
    క్రన్నన గోప భామినుల కౌగిట జిక్కుట చిన్న బిడ్డ యై
    న , న్నయ గార మొల్కు గతి నాట్యము జేసె జనమ్ము మెచ్చగన్

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. కం॥ ఎన్నిన భాషా కింకణ
      మిన్నగు రవమునఁ బదములు మేటిగ నొప్పన్
      సన్నుతిఁ గను పద్యములను
      నన్నయ గారమ్మొలకఁగ నాట్యముఁ జేసెన్

      ఉ॥ ఎన్నుచు భాష శుద్ధముగ నెంతయొ మాధురి చిమ్ము రీతిగన్
      వన్నియఁ గాంచఁగన్ దెలుఁగు భారత కావ్యముఁ దానె యాద్యుఁడై
      మిన్నగ పద్య కింకణులు మేటిగ రావము సేయఁ దుష్టితోన్
      నన్నయ గారమొల్కుగతి నాట్యముఁ జేసె జనమ్ము మెచ్చఁగన్

      తొలగించండి
  12. అన్నుల మిన్నయె చెన్నుగఁ
    దన్ను బొగడఁగ జను లెల్లఁ దమకము తోడం
    గ్రన్నఁ బరాజితుఁ జేయఁగ
    నన్నయ! గార మ్మొలుకఁగ నాట్యముఁ జేసెన్

    [నన్ను + అయ]


    కన్నుల పండువౌ నటులఁ గాంచన భూషిత సుందరాంగియే
    పన్నుగఁ జూపి నాట్య వర భంగిమ లెల్ల మనోహరమ్ముగా
    నన్నలినాక్షి మంటపము నందునె నాట్య మయూరి వోలెఁ దా
    నన్నయ! గార మొల్కు గతి నాట్యముఁ జేసె జనమ్ము మెచ్చఁగన్

    [తాను + అన్ను+ అయ = తా నన్నయ; అన్ను = స్త్రీ]

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    చిన్నది నాట్యము నేరిచి
    యున్నతముగ మొదటిసారి యొక
    నగరమునన్
    మిన్నంటిన వేదికపై
    న న్నయగార మ్మొలుకగ నాట్యముఁ జేసెన్.

    రిప్లయితొలగించండి