17, డిసెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4975

18-12-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హర శంకర యనుచు భార్య నాశ్లేషించెన్”
(లేదా...)
“హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో”
(మిస్సన్న గారికి ధన్యవాదాలతో...)

19 కామెంట్‌లు:

  1. కందం
    పరిణయమాడిన పార్వతి
    మొర విని హరుఁడు మరుని, రతి పొందఁగఁ జూడన్
    దరిఁజేరి యనంగుడు హర
    హర శంకర! యనుచు భార్య నాశ్లేషించెన్!


    చంపకమాల
    పరిణయ మాడి పార్వతి, కృపామయ! బూడిద జేసితే మరున్
    బరుషము లాడు లోకము సనాతన! వేగమె ప్రోవమంచనన్
    మొరవిని జీవితంబొసఁగ మ్రొక్కి యనంగుడు సాంబ!పాప సం
    హర! హర! శంకరా! యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో!

    రిప్లయితొలగించండి

  2. ఉరగమ్ము కాటు వేయగ
    సరియగు సాయమ్మె యంది స్వస్థత కూడన్
    మరువను పరమేశా! హే
    హర శంకర యనుచు భార్య నాశ్లేషించెన్.


    ఉరగము కాటువేయ సతి యూపిరి వీడెడి పాళమందునన్
    సరియగు వైద్యమందగనె స్వస్థత చేకుర సంతసమ్మునన్
    ధరణిని నీవె సత్యమని దాసుని బ్రోచితి వంచు భక్తితో
    హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో.

    రిప్లయితొలగించండి
  3. తరుణిమ నందున శ్వశరుడు
    నెరియగు తనయనిడి పెం డ్లి నెరవేర్చుటచే
    మురిపమున బ్రహ్మ చర్యపు
    హర శంకర యనుచు భార్య నాశ్లేషించెన్

    శంకర = సుఖమును గలుగఁజేయువాఁడు

    రిప్లయితొలగించండి
  4. 'హర శంకర' యనునంశము
    పరికించుచునున్న కవిని బడుకకు చేరన్
    సరసిజనేత్ర పిలువగా
    హర శంకర యనుచు భార్య నాశ్లేషించెన్

    నిరతము పూరణమ్ములను నెచ్చెలినిన్ దగఁ మెచ్చు బుద్ధుడే
    'హరహర శంకరా' యనెడు యంశమునే పరికించు వేళలో
    సరసిజనేత్ర పిల్చెనట సత్కవి చిత్తము సంభ్రమించగా
    హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో

    రిప్లయితొలగించండి
  5. భార్య యొక్క పార్థివ దేహమును జూచి భర్త తన కొడుకులైన "హర" "శంకర్" ల తో పలుకుతున్న మాటలు:-

    వరముగ పెండ్లియాడె నను, వన్నెలు నింపెను జీవితమ్మునన్
    మురియగ మిమ్ము బిడ్డలుగ మోసి కనెన్, సెలవంచు నేడు తాన్
    మరలగ రాని లోకమున మన్ననఁ బొందగ వెళ్ళె నా వ్యధా
    హర! హర! శంకరా! యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో!!

    రిప్లయితొలగించండి
  6. సొరిదిగ సతి యస్వస్థత
    పెరుగఁగ పతి భక్తితోడ పింగళు వేడెన్
    దరుణికి స్వస్థత చేకుర
    హర! శంకర! యనుచు భార్య నాశ్లేషించెన్

    రిప్లయితొలగించండి
  7. నిరుపమ భక్తితత్పరత నిర్మల చిత్తముతోడ నీశునిన్
    నిరతముగొల్చు భక్తవరునిక్కపుటాలికి వ్యాధికల్గ నోం
    హరయని యీశునింగొలువ నంకిలిబాపఁగ సంతసంబునన్
    హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో

    రిప్లయితొలగించండి
  8. కం:చిరుబురు లాడుచు తన సతి
    పరకాంతల ప్రేమ లోన పడితి వనగ న
    చ్చెరువున నిదెట్టిదగు నూ
    హర ! శంకర! యనుచు భార్య నాశ్లేషించెన్

    రిప్లయితొలగించండి
  9. కం॥ వరముల నొసఁగు సరసముగ
    హరుఁడని సంతునుఁ బడయఁగ ననిశము వేడున్
    వరపుత్రునిఁ గన మనమున
    హర శంకర యనుచు భార్య నాశ్లేషించెన్

    చం॥ పరిణయమాడి వత్సరములావిధి నెన్నియొ సంతునొందకన్
    బరఁగఁగ శంకరా యనుచుఁ బ్రార్థనఁ జేయుచు సర్వ వేళలన్
    వరమును గోరు సంతుఁ గను భాగ్యముఁ బొందుటకై మనస్సులో
    హర హర శంకరాయనుచు నాలినిఁ గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో

    రిప్లయితొలగించండి
  10. మరలుగ సంతును బెంచుచు
    తిరముగ సంసార మందు దివ్వెగ వెలుగన్
    కర మను రాగ మున మగడు
    హర! శంకర! యనుచు భార్య నా శ్లే షించెన్

    రిప్లయితొలగించండి
  11. చం:త్వర బడి భార్య నిందలిడ "భార్యలు పెక్కురు నీ" కటంచు "నె
    వ్వరు మది పాడు జేసి ?"రని "పాపపు మార్గము నాది కా"దటం
    చరమర లేని భర్త హృదయమ్మున గుందుచు "నీకు బట్టెనా
    హర హర ! శంక !రా"యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో”

    రిప్లయితొలగించండి
  12. వాట్సప్ సమూహంలో సమీక్షించిన పద్యాలను ఇక్కడ సమీక్షించడం లేదు. గమనించగలరు.

    రిప్లయితొలగించండి