తే.గీ: పెద్దనార్యుడు సభ లోన వెలుగు చుండ పెద్దరికమును కాదని పేరు గనిన యన్యు లెవరైన మాదె యా యర్హత యని గండపెండెరముం దాల్పఁ గలరె కవులు?" (రాయల సభ లోని కవులు ఇలా అంటారు.తమ కవిత్వం తక్కువ కనుక ఆయనకి తొడగాలి అనరు.ఆయన పెద్దాయన కాబట్టి ఆయనకి తొడగండి అంటారు.అలా తమ గౌరవం భంగం కాకుండా ఆయనని గౌరవిస్తారు.)
చం:తలపక స్వంతమౌ ప్రతిభ,తక్కిన వారలవౌ సమర్థతల్, తలవక దాని నిచ్చెడు వదాన్యుల ప్రజ్ఞను, దక్కె చాలు లే తలచని భాగ్య మంచు తమ దర్పము జూపుచు లుబ్ధతన్ మదిన్ దలఁపరు గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్ (ఎవడో గండపెండెరం తొడుగుతా నన్నా తాను దానికి అర్హుణ్నా? కాదా? ఇతర కవుల గొప్పదనా లేమిటి,అసలు ఇచ్చే వాడి విజ్ఞత ఎంత? అనేవి చూడకండా దొరికిందే చాలు అని సత్కవులు గ్రహించరు.ఈ రోజుల్లో అనేకుల బిరుదులు చూస్తే అవి ఇచ్చే వాళ్ల అర్హత,పొందే వాళ్ల అర్హత రెండూ ప్రశ్నార్థకాలే.)
సాహితీ సభయందున జక్కనైన
రిప్లయితొలగించండికావ్యములను నుడివినట్టి కవులనెంచి
సత్కరించుట దెలియని సభికులుండ
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికవనమందు రసజ్ఞత కానరాక
రిప్లయితొలగించండినేర్పుతో గూడుపదముల కూర్పు లేక
హృద్యమగురీతి సలుపక పద్యరచన
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిప్రాత మనవుడె రసపిపాస మరచి
యాధునికునిగ మారెనీ యవని నేడు
నాదరించరైరి కవిత్వమన్న కాన
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు.
తలపుల లోన భావన విధానము మారుచు యంత్రమట్లుగా
పలువిధ కార్యభారముల బంధిగ మారిన వారి డెందమున్
విలువయె శూన్యమయ్యెను కవిత్వములన్న నటంచు నెంచుచున్
తలఁపరు గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్.
మృదుమధురభావ యుక్తమై మెండుమీఱు
రిప్లయితొలగించండికావ్య సృష్టికై నిరతము కడలుకొనుచు
గుండెలను తాకు రచనలు కూర్చకున్న
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు
విలువగు మేటిపద్యములు పెక్కువలై కనవచ్చురీతినిన్
విలిఖనమేగదా మదిని పెంపగు కోరిక కావ్యసృష్టితో
చెలగెడు కావ్యకర్తకుఁ విశిష్టతపై తమ దృష్టినుంచినన్
దలఁపరు గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండితలపున పద్యభావ రుచి తన్మయ మూర్తులు స్వప్రకాశులై
రిప్లయితొలగించండితలచినఁ దల్చు నూతన సుధారసపూర్ణ కృతుల్ సృజింపగన్
వలచి సుకీర్తి కాంత కవి పాదముఁ జేరునుఁ గాని తానుగన్
తలఁపరు గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమూరు రాయర గండడు కోరి పలుక
రిప్లయితొలగించండిముద్దుగన్ గండపెండరమున్ గొనుమని
పెద్దన యచటనుండగ పిలుపు లేక
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపలువురు మెచ్చురీతి పదబంధములన్ గుదికూర్చి సత్కవుల్
రిప్లయితొలగించండిచెలువములొల్కు కావ్యముల జెన్నుగఁ వ్రాయఁగ నట్టి కైతలన్
విలువనెరింగి పండితులు పెక్కురు మెచ్చెదరట్లుకానిచో
తలఁపరు గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్
తేటగీతి
రిప్లయితొలగించండిపండగ కవనంపు సిరులు వాణి కరుణఁ
పటిమ గుర్తించి లోకమె పాడు నుతుల
చూచువారల గొప్పకు సొంత నిధుల
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు?
చంపకమాల
పులకలు రేపు పద్యఝరి ముచ్చట గొల్పుచు రెడ్డిరాజులన్
విలసిత సాహితీ ప్రభల వేడ్కగనెన్ కవిసార్వభౌముడై
శిలగొనె వీపుపై తుదను శిస్తును గట్టక! కాని కాలమై
తలఁపరు గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్! !
కవుల పాండితీ గరిమయు ఘనత నెరిగి
రిప్లయితొలగించండిసల్పు సాహితీ సంస్థ లు సభల యందు
తగిన సత్కార మొ నరించు ::తమకు తాము
గండ పెండరము ను దాల్చ గలరె కవులు?
తే.గీ: పెద్దనార్యుడు సభ లోన వెలుగు చుండ
రిప్లయితొలగించండిపెద్దరికమును కాదని పేరు గనిన
యన్యు లెవరైన మాదె యా యర్హత యని
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు?"
(రాయల సభ లోని కవులు ఇలా అంటారు.తమ కవిత్వం తక్కువ కనుక ఆయనకి తొడగాలి అనరు.ఆయన పెద్దాయన కాబట్టి ఆయనకి తొడగండి అంటారు.అలా తమ గౌరవం భంగం కాకుండా ఆయనని గౌరవిస్తారు.)
తే॥ సరస సలలిత మాధురి పరఁగ బుధులు
రిప్లయితొలగించండిపరవశించి కొండాడుచు మరులుకొనఁగ
దగు ననుచు నర్హతను గనిఁ దలఁపు వారు
గండపెండరముం దాల్పఁ గలరె కవులు
చం॥ సలలిత మాధురీ మహిమ సర్వుల మన్ననలొంద మోదమౌ
విలసిత కావ్య భావమటు వేద్యమటంచు జనాళి మెచ్చినన్
వెలయద కీర్తి యంచు నిజ ప్రీతిని తుష్టినిఁ బొందు వారలై
తలఁపరు గండపెండరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్
చం:తలపక స్వంతమౌ ప్రతిభ,తక్కిన వారలవౌ సమర్థతల్,
రిప్లయితొలగించండితలవక దాని నిచ్చెడు వదాన్యుల ప్రజ్ఞను, దక్కె చాలు లే
తలచని భాగ్య మంచు తమ దర్పము జూపుచు లుబ్ధతన్ మదిన్
దలఁపరు గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్
(ఎవడో గండపెండెరం తొడుగుతా నన్నా తాను దానికి అర్హుణ్నా? కాదా? ఇతర కవుల గొప్పదనా లేమిటి,అసలు ఇచ్చే వాడి విజ్ఞత ఎంత? అనేవి చూడకండా దొరికిందే చాలు అని సత్కవులు గ్రహించరు.ఈ రోజుల్లో అనేకుల బిరుదులు చూస్తే అవి ఇచ్చే వాళ్ల అర్హత,పొందే వాళ్ల అర్హత రెండూ ప్రశ్నార్థకాలే.)
ఆంధ్ర కవితా పితామహు నల్లసాని
రిప్లయితొలగించండిపెద్దనను మదిఁ దలపోసి విశ్వ మందు
సాటి యంచుఁ బండితు లెల్ల సమ్మతింప
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు
పిలిచి యొసంగ నియ్యకొని వే ధరియింపఁ దలంతు రెవ్వ రే
నిల వెలఁ బోసి కొం టరుదె యెన్నఁడు నెందును నైన గొప్ప వీ
రులకు నొసంగు భూషణము లో వరియింతురె యంచు నెంచుచుం
దలఁపరు గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిండు సభలోన రాయలు నెమ్మనమున
రిప్లయితొలగించండికవులఁగాంచుచు నిట్లనెఁగణనఁగాంచు
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు
రండి తొడుగుదు మీకునే రమ్యముగను
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మున్ను గండపెండెరమును పొందినట్టి
కవులు గలరు,నేడు కవితల్ ఘనముగాను
వ్రాసి సన్మానములు పొందు వారె గాని
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు?