28-12-2024 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఎలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా”(లేదా...)“ఎలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే”
కందంతలచిరి కరిగారామునిమెలకువఁగొన కుంభకర్ణు మించగ తరమే?సులువుగ సింహము, వీడుచునెలుకం, దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా?చంపకమాలతలచిరి రామునిన్ గరిగఁ దానొక మానవమాత్రుడే సుమా!మెలకువఁ గాంచ యుద్ధమున మించఁగ లేరన కుంభకర్ణునిన్సులువుగ సింహమున్ జెలఁగి జోరుగ నోటను బెట్టి, వీడుచున్ఎలుకను, మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే?
రావణాసురుని భావనగా...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
బలవంతుడనను గర్వితుడలవోకగ తెలమెకముల నాహారముగాతలచుచు దొరికిన వీడుచునెలుకం , దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా.బలయుతు డైననేమి శలభమ్ముల నైనను వీడడయ్యె నాకలియది బాధపెట్టిన మఖద్విషుడాతడు క్రూరుడౌచు కుందిలమున తా చరించుతరి దీప్తము గాంచిన చిలు వీడి తానెలుకను , మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే.
చెలిమరి యింటన బొమ్మలకొలువున చిటిగజము, పెద్ద కుహనము లుండన్వలపున నచ్చట తియ్యనిఎలుకం దినువాఁ డ , తనికి నేనుఁగు గొప్పా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అలయక తలపడుచుండునుబలిమిని కంఠీరవమును పట్టును తానేతలమున దుంపలు కాయలునెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పాజలమున శ్వేతవాహనముఁ జంపెడు మానవుడాతడందురేబలిమిని రిక్తహస్తముల పట్టును తానిట కోడె సిం హమున్దలచినఁ గొండనైన తన తాడనతో నుసి చేయు ధీరుడే!ఎలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే[ఎలుక = చెవి ఆకు]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
పలుకగ స్తుతిపాఠములు వందలు జంబుకమొండు పిల్లికిన్ "గెలిచద వీవు సింహమును, గీడును చెందును నీవు గొట్టగాఁబులి, సరి నీవె రాజపదమున్ గొన" నంచుఁ , జరించ నమ్మి చిట్టెలుకను మ్రింగువాఁ, డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే?
*స్తోత్రపాఠములు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యుల 'బిడాల మోక్షము' కావ్యాన్ని గుర్తుకు తెచ్చారు.
తెలిపె నట తారు మారుగతెలిసిన సామెత నొకండు దెలియక నొకచో కలవర పడి రట నె ట్టుల నెలుకo దిను వా డ తనికి నే నుగు గొప్పా?
కం:ఎలుకల,నేనుగు రూపమ్ముల బిస్కెట్లిచ్చి దుఃఖ మును మాన్ పగ నవ్వుల నతని తల్లి యిట్లనె ఎలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా”
చం:"తలపక జాలి యేనుగుల దంతములన్ గొన జంపు నెట్లొ!" యంచల గజహంతకున్ దలచి యచ్చెరు వొందెద రేల తిండిలోతలపక నెట్టి ఏహ్యతను దారుణ రీతిగ బాల్యమందునేఎలుకను మ్రింగువాఁ, డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే”(చిన్నప్పుడే ఎలుకని తినేసే వాడు కాబట్టి దంతాల కోసం ఏనుగుని చంపటం ఆశ్చర్యమా?వీరప్పన్ లాంటి వాడు.)
పలువురు పోవు మార్గమును బట్టుటకొప్పఁడు పార్షదుండు యింపలరగ స్తోత్రపాఠముల బల్కునధీశుని మెప్పునొందగన్తెలివిడి లేమిచే బొగడఁ దెల్పెను నేత గుణమ్ము నివ్విధిన్ఎలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే
కం:తెలియక ఏనుగు లక్ష్మణుపలుకులకే వంక వెట్టె పండితుడగునే?తెలుగే నేర్వడు,పందినినెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా?"( ఎవడో ఏనుగు లక్ష్మణ కవిని విమర్శిస్తే ఆ కవి యొక్క అభిమాని ఇలా స్పందించాడు.)
తొలుతగ తమ్ముల బెట్టుచు బలముగ పత్నిని సహితము పాచికలందున్ తలచగ ధర్మజు డయ్యేన్ ఎలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా”
బలవంతుఁడు మేధావియు నిలలో నరుఁ డెన్నఁ డైన నే భేదమ్ముం దలఁపండు చిన్న పెద్దల నెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా కలవర మంద దెన్నఁడును గాపుర ముండు గృహమ్ము లందు నాకఁలి కలుగంగ దాని కెలుకల్ దగు నోగిర మౌను మెక్కఁగాఁ బులుల కులంపుఁ బిల్లి పలు పోకల జిత్తులమారి కాంచఁ జిట్టెలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు, గొప్ప యనంగ నొప్పునే [ఏనుఁగు = పెద్దది; ఎలుక పిల్లికిఁ బెద్ద గొప్ప కాదని భావము]
తెలియని తనమున మొఱకుడుపలుకగతన నేతనుకడు బలవంతునిగాతెలుపును తానివ్విధమునయెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా
కందం
రిప్లయితొలగించండితలచిరి కరిగారాముని
మెలకువఁగొన కుంభకర్ణు మించగ తరమే?
సులువుగ సింహము, వీడుచు
నెలుకం, దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా?
చంపకమాల
తలచిరి రామునిన్ గరిగఁ దానొక మానవమాత్రుడే సుమా!
మెలకువఁ గాంచ యుద్ధమున మించఁగ లేరన కుంభకర్ణునిన్
సులువుగ సింహమున్ జెలఁగి జోరుగ నోటను బెట్టి, వీడుచున్
ఎలుకను, మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే?
రావణాసురుని భావనగా...
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిబలవంతుడనను గర్వితు
డలవోకగ తెలమెకముల నాహారముగా
తలచుచు దొరికిన వీడుచు
నెలుకం , దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా.
బలయుతు డైననేమి శలభమ్ముల నైనను వీడడయ్యె నా
కలియది బాధపెట్టిన మఖద్విషుడాతడు క్రూరుడౌచు కుం
దిలమున తా చరించుతరి దీప్తము గాంచిన చిలు వీడి తా
నెలుకను , మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే.
చెలిమరి యింటన బొమ్మల
రిప్లయితొలగించండికొలువున చిటిగజము, పెద్ద కుహనము లుండన్
వలపున నచ్చట తియ్యని
ఎలుకం దినువాఁ డ , తనికి నేనుఁగు గొప్పా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅలయక తలపడుచుండును
రిప్లయితొలగించండిబలిమిని కంఠీరవమును పట్టును తానే
తలమున దుంపలు కాయలు
నెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా
జలమున శ్వేతవాహనముఁ జంపెడు మానవుడాతడందురే
బలిమిని రిక్తహస్తముల పట్టును తానిట కోడె సిం హమున్
దలచినఁ గొండనైన తన తాడనతో నుసి చేయు ధీరుడే!
ఎలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే
[ఎలుక = చెవి ఆకు]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిపలుకగ స్తుతిపాఠములు వందలు జంబుకమొండు పిల్లికిన్
రిప్లయితొలగించండి"గెలిచద వీవు సింహమును, గీడును చెందును నీవు గొట్టగాఁ
బులి, సరి నీవె రాజపదమున్ గొన" నంచుఁ , జరించ నమ్మి చి
ట్టెలుకను మ్రింగువాఁ, డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే?
*స్తోత్రపాఠములు
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినల్లాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యుల 'బిడాల మోక్షము' కావ్యాన్ని గుర్తుకు తెచ్చారు.
తెలిపె నట తారు మారుగ
రిప్లయితొలగించండితెలిసిన సామెత నొకండు దెలియక నొకచో
కలవర పడి రట నె ట్టుల
నెలుకo దిను వా డ తనికి నే నుగు గొప్పా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:ఎలుకల,నేనుగు రూప
రిప్లయితొలగించండిమ్ముల బిస్కెట్లిచ్చి దుఃఖ మును మాన్ పగ న
వ్వుల నతని తల్లి యిట్లనె
ఎలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా”
చం:"తలపక జాలి యేనుగుల దంతములన్ గొన జంపు నెట్లొ!" యం
రిప్లయితొలగించండిచల గజహంతకున్ దలచి యచ్చెరు వొందెద రేల తిండిలో
తలపక నెట్టి ఏహ్యతను దారుణ రీతిగ బాల్యమందునే
ఎలుకను మ్రింగువాఁ, డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే”
(చిన్నప్పుడే ఎలుకని తినేసే వాడు కాబట్టి దంతాల కోసం ఏనుగుని చంపటం ఆశ్చర్యమా?వీరప్పన్ లాంటి వాడు.)
పలువురు పోవు మార్గమును బట్టుటకొప్పఁడు పార్షదుండు యిం
రిప్లయితొలగించండిపలరగ స్తోత్రపాఠముల బల్కునధీశుని మెప్పునొందగన్
తెలివిడి లేమిచే బొగడఁ దెల్పెను నేత గుణమ్ము నివ్విధిన్
ఎలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే
కం:తెలియక ఏనుగు లక్ష్మణు
రిప్లయితొలగించండిపలుకులకే వంక వెట్టె పండితుడగునే?
తెలుగే నేర్వడు,పందిని
నెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా?"
( ఎవడో ఏనుగు లక్ష్మణ కవిని విమర్శిస్తే ఆ కవి యొక్క అభిమాని ఇలా స్పందించాడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితొలుతగ తమ్ముల బెట్టుచు
రిప్లయితొలగించండిబలముగ పత్నిని సహితము పాచికలందున్
తలచగ ధర్మజు డయ్యేన్
ఎలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా”
బలవంతుఁడు మేధావియు
రిప్లయితొలగించండినిలలో నరుఁ డెన్నఁ డైన నే భేదమ్ముం
దలఁపండు చిన్న పెద్దల
నెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా
కలవర మంద దెన్నఁడును గాపుర ముండు గృహమ్ము లందు నా
కఁలి కలుగంగ దాని కెలుకల్ దగు నోగిర మౌను మెక్కఁగాఁ
బులుల కులంపుఁ బిల్లి పలు పోకల జిత్తులమారి కాంచఁ జి
ట్టెలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు, గొప్ప యనంగ నొప్పునే
[ఏనుఁగు = పెద్దది; ఎలుక పిల్లికిఁ బెద్ద గొప్ప కాదని భావము]
తెలియని తనమున మొఱకుడు
రిప్లయితొలగించండిపలుకగతన నేతనుకడు బలవంతునిగా
తెలుపును తానివ్విధమున
యెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా