(1)ఆ.వె:ధనికునైన, పేద తనపు బాధితు నైన స్వకుల జాతు నైన పరుని నైన భేద దృష్టి తోడ వీక్షించ కెన్నడు శిక్ష నొసఁగువాఁడె క్షేమకరుఁడు” (2)ఉ:"శిక్షణ బొంది వేదమును,శిష్యులు కొందరు దక్క బ్రేమ తో శిక్షణ నిచ్చుటే ఋషులు చెప్పిన ధర్మ మటంచు నెంచి యా శిక్షణ విప్రధర్మ" మని, శ్రీ యొక యింత లభించ దృప్తుడై శిక్ష నొసంగువాఁడె కద క్షేమకరుండయి పూజ్యుఁడౌ భువిన్ (వేదాధ్యయనము,అధ్యాపనము విప్రధర్మం.దాన్ని ఋషిధర్మం గా భావించి సొమ్ము ఎంత దక్కినా తృప్తి చెందే విప్రుడు పూజనీయుడు.)
ఆ.వె:"కక్ష దీర్చుకొనుటె శిక్షకు లక్ష్యమా? శిక్ష సాత్వికునిగ జేయ వలయు" ననెడు న్యాయశాస్త్ర మవని యొప్పిన నాడు శిక్ష నొసఁగువాఁడె క్షేమకరుఁడు” (శిక్ష అనేది కేవలం కక్ష తీర్చుకోవటం కాక పరివర్తన తెచ్చేది గా ఉండాలనేది ఒక ఆదర్శసిద్ధాంతం.అది అమలు కావటం ప్రస్తుతానికి కష్టమే.)
ఆటవెలది
రిప్లయితొలగించండిపాపపుణ్యములను పరికించి నిత్యమ్ము
పాలనంబునొసఁగు ప్రభువె ప్రభువు!
దుష్టశక్తులెగయ దునిమెడు రీతిగ
శిక్ష నొసఁగువాఁడె క్షేమకరుఁడు
ఉత్పలమాల
దక్షతఁ గల్గుచున్ ప్రజల దైన్యము బాపిన పాలనార్హుడౌ
యక్షయ కీర్తినిన్ బడయు నందరు మెచ్చుచు మేలుమేలనన్
వీక్షణఁ జేయుచున్ దురిత పీడను ద్రుంచగ నిర్దయాత్ముడై
శిక్ష నొసంగువాఁడె కద క్షేమకరుండయి పూజ్యుఁడౌ భువిన్!
తొలగించండిసవరించిన ఆటవెలది:
ఆటవెలది
పాపపుణ్యములను పరికించి నిత్యమ్ము
పాలనంబునొసఁగు ప్రభువె ప్రభువు!
దుష్టశక్తులెగయ దునిమెడు రీతిగ
శిక్ష నొసఁగువాఁడె క్షేమమొసఁగు
చెడ్డ చింతనలను జేయు వానికి దగు
రిప్లయితొలగించండిశిక్ష నొసఁగువాఁడె క్షేమకరుఁడు
సంఘమునకు , దాని సర్వవిధంబుల
వృద్ధి చెందుచుండి వెలయుకొరకు
త్ర్యక్షుడె భూమిపై గురువు ధర్మము నేర్పును శిష్యకోటికిన్
రిప్లయితొలగించండిమోక్షమునొందు మార్గమును బోధనఁ జేయును మానవాళికిన్
దక్షత తోడ ఛాత్రులకుఁ దాలిమిఁ జూపుచు విద్యలన్నిటన్
శిక్ష నొసంగువాఁడె కద క్షేమకరుండయి పూజ్యుఁడౌ భువిన్!!
చీడ పురుగు వోలె చేటు గూర్చ గ నెంచ
రిప్లయితొలగించండివెదికి ప ట్టి వాని భీక రముగ
దండ నమ్ము జేసి ధరణి ని కాపాడ
శిక్ష నొసగు వాడె క్షేమ కరుడు
రిప్లయితొలగించండిధాత్రిలోన తాను ధర్మమ్ము నిలుపగ
దీక్షబూనినట్టి దేవదేవు
డతడు, దుష్టులగని యాకతాయిల కెప్డు
శిక్ష నొసఁగువాఁడె క్షేమకరుఁడు.
దక్షుడు భారమెంచకను ధర్మము నెప్పుడు ధాత్రి నిల్పెడిన్
దీక్షవహించి పల్మరులు ధృత్విని యంద వతార మెత్తుచున్
రక్షణజేయ శిష్టులను రాక్షసజాతికి నెల్ల వేళలన్
శిక్ష నొసంగువాఁడె కద క్షేమకరుండయి పూజ్యుఁడౌ భువిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదక్షతతోడ నాశ్రితుల తట్టములన్ దొలగించ నిష్ఠతో
రిప్లయితొలగించండిరక్షణ భారముంగొని నిరంతర సేవల నందజేయుచున్
వీక్షణఁ జేయు దీక్షఁగొను పెంపరి దుష్టజనాళికిన్ సదా
శిక్ష నొసంగువాఁడె కద క్షేమకరుండయి పూజ్యుఁడౌ భువిన్
తప్పుజేయువాడు తప్పక విధిగాను
రిప్లయితొలగించండిశిక్ష నొసఁగువాఁడె; క్షేమకరుఁడు
న్యాయమందునిలిచి నలుగురి కోసమై
ధర్మమార్గమెపుడు తలచువాడు
రక్షణలేక స్త్రీలు నగరమ్మున బాధలనొందకుండగాన్
రిప్లయితొలగించండిదీక్షను బూనిచేర్చి సుదతీతతి నొక్కట స్పూర్తినిచ్చి దు
ర్లక్షణశీలురన్ దునుము లక్ష్యముఁ గైకొన, స్వీయరక్షకై
శిక్ష నొసంగువాఁడె కద క్షేమకరుండయి పూజ్యుఁడౌ భువిన్
శిష్టజనుల కెప్డు శ్రేయమ్ము గూర్చను
రిప్లయితొలగించండిదుష్ట శిక్షణమునకిష్టపడును
దురితములను సలుపు దుష్టాత్ములనుబట్టి
శిక్ష నొసఁగువాఁడె క్షేమకరుఁడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి(1)ఆ.వె:ధనికునైన, పేద తనపు బాధితు నైన
రిప్లయితొలగించండిస్వకుల జాతు నైన పరుని నైన
భేద దృష్టి తోడ వీక్షించ కెన్నడు
శిక్ష నొసఁగువాఁడె క్షేమకరుఁడు”
(2)ఉ:"శిక్షణ బొంది వేదమును,శిష్యులు కొందరు దక్క బ్రేమ తో
శిక్షణ నిచ్చుటే ఋషులు చెప్పిన ధర్మ మటంచు నెంచి యా
శిక్షణ విప్రధర్మ" మని, శ్రీ యొక యింత లభించ దృప్తుడై
శిక్ష నొసంగువాఁడె కద క్షేమకరుండయి పూజ్యుఁడౌ భువిన్
(వేదాధ్యయనము,అధ్యాపనము విప్రధర్మం.దాన్ని ఋషిధర్మం గా భావించి సొమ్ము ఎంత దక్కినా తృప్తి చెందే విప్రుడు పూజనీయుడు.)
ఆ.వె:"కక్ష దీర్చుకొనుటె శిక్షకు లక్ష్యమా?
రిప్లయితొలగించండిశిక్ష సాత్వికునిగ జేయ వలయు"
ననెడు న్యాయశాస్త్ర మవని యొప్పిన నాడు
శిక్ష నొసఁగువాఁడె క్షేమకరుఁడు”
(శిక్ష అనేది కేవలం కక్ష తీర్చుకోవటం కాక పరివర్తన తెచ్చేది గా ఉండాలనేది ఒక ఆదర్శసిద్ధాంతం.అది అమలు కావటం ప్రస్తుతానికి కష్టమే.)
రిప్లయితొలగించండిఅక్షయమైన విద్యలను
నాప్తినొసంగి నిరంతరమ్ముగన్
దక్షతబెంచు నాతడు ప్ర
దానము జేయును శాస్త్రసారమున్
రక్షణగోరి శిష్యులకు,
లక్ష్యము నెంచగనిచ్చు జ్ఞానమున్,
శిక్షనొసంగువాడె కద!
క్షేమకరుండయి పూజ్యుడౌభువిన్!
దక్షత తోడ బోధన నితాంతము జేయుచు చిత్తశుద్ధి, ప్ర
రిప్లయితొలగించండిత్యక్ష పరాత్పరుండయి, సదా యభివృద్ధికి బాటవేయుచున్
దీక్షను కల్గచేయుచును, తీర్చుచు శంకల శిష్య కోటికిన్
శిక్ష నొసంగువాఁడె కద క్షేమ మొసంగుచు పూజ్యుఁడౌ భువిన్
విత్త మందు సతము వీడి దురాశను
రిప్లయితొలగించండిక్షిప్రము దయతో సుఖప్రదంపు
జీవనమ్ము కొఱకు శిష్యోత్కరమునకు
శిక్ష నొసఁగు వాఁడె క్షేమకరుఁడు
సక్షమ రాజ ధర్మమును జారు తరమ్ముగ నిల్పి నిష్ఠ నే
పక్షము నూన కుండక యపార బలమ్మున సంతతమ్మునున్
రక్షణ మీయఁ బౌరులకు రమ్య తరమ్ముగ దుష్ట కోటికిన్
శిక్ష నొసంగు వాఁడె కద క్షేమ కరుం డయి పూజ్యుఁడౌ భువిన్
తెలియ చెప్ప వలెను తీరుగా బుద్ధిని
రిప్లయితొలగించండిచిన్నతనము నందు చేయ తప్పు
మంచి మాట వినక మారాము చేసిన
*“శిక్ష నొసఁగువాఁడె క్షేమకరుఁడు”*
అక్షరమాల నేర్పుచును నందరి లోపల బుద్ధిమంతుడై
నక్షయ మౌయశంబునిల నందగ కోరెఢియొజ్జఛాత్రుడున్
కక్షను గుండెలందునిడి కాని పనుల్వడి చేయదిద్దుచున్
శిక్షణొసంగు వాడె కద క్షేమకరుండయి పూజ్యుడౌ భువిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
జ్ఞానమంద జేయ ఛాత్రుల కొక్కింత
దీక్ష తోడ గురువు దిశను చూపు
దురలవాట్లు నేర్చు దుష్ట వర్తనులకు
శిక్ష నొసగు వాడె క్షేమకరుడు.