9-12-2024 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె”(లేదా...)“శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్”
తేటగీతిమూడురంగుల జెండాను ముదము గనుడునడుమన నశోకచక్రమ్ము నాదు దృష్టిశాంతనవునిపై సంధించు చక్రి కరఁపుశస్త్రమే! శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె!!ఉత్పలమాలవస్త్రము మూడు వర్ణముల భారతజాతి పతాకమై గనన్వస్త్రము నందశోక స్మృతిఁ బంచెడు చక్రము నాదు దృష్టిలోనస్త్రము పట్టనన్ హరియె నాపగ సూనుని నాప నెత్తెడున్శస్త్రమె! శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్!!
ఆంగ్ల పాలన నెదిరించి యన్య దేశవస్త్రముల బహిష్కరణకై వాడిన యతి యుక్త దూది వడక నుపయోగపడినశస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె
పూర్వ మనిని సైనికులు కపోతములకుకంఠమందునణ్వాస్త్రము గట్టి వదలశత్రుమూకల దునిమిన సారసమనుశస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనెశాస్త్రమెఱంగునట్టి యపసర్వులు పార్వపు కంఠమందు న ణ్వాస్త్రము గట్టి దానిని విపక్షుల యాయతనమ్ము పైకి నోయస్త్రము వోలె దొమ్మి తరి యంపి వినాశము జేసిరైరి యా శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్.
బాపు భారతి దాస్యముఁ బాపుకొరకుశాంత్యహింసల బూనెను శస్త్రమట్లురక్తపాతము లేనట్టి రణము నందుశస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనెఅస్త్రముఁ బూనలేదు తనయాయుధముల్గన శాంత్యహింసలేవస్త్రము మేనిపైన మన బాపు ధరించినదుత్తరీయమేశస్త్రము రాట్నమై భరతజాతికి దెచ్చె స్వతంత్ర దీప్తి యాశస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శాంతియుతమైన దీక్షయే శస్త్రమనుచునస్త్ర సన్యాసులై నిరాహారులైరిగాంధి చూపిన మార్గమే గమనమనగ శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనెఅస్త్రములన్ ద్యజించిరిట నభ్యవహార్యము వీడుదీక్షతోవస్త్రబహిష్కృతమ్మె మన భారత పౌరుల శస్త్రమాయెగాశాస్త్రమహింసయేననుచు సాత్వికులైజనులుద్యమించగాశస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్
ఆంగ్ల దొరలను దరు మంగ నాయుధ ముగ శాంతి సమరము సాగించి జయము నందె గాంధి గారి య హింస యే ఘన తరంపు శష్ట్ర మే శాంతి చిహ్నమై సన్నుతి గ నె
శాస్త్రి కుమార్తె నామమది శాంతి, పరీక్షకు పాఠశాలలోదస్త్రము నివ్వగా నడిగెఁ దండ్రిని "రైతుల లాంఛనమ్మునున్"శాస్త్రమెఱుంగు తండ్రి యనె "సాధనమయ్యది లాంగలమ్ముగాశస్త్రమె శాంతి! చిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్"!!లాంగలము = నాగలి
తే.గీ:పెట్టుబడి శ్రమజీవుల పొట్ట గొట్టవారి కండ యయ్యెను సామ్యవాద మొకటెసుత్తి తో జత గూడిన కత్తి యనెడుశస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె”(కత్తి-సుత్తి)
తే॥ ఉగ్రవాదముఁ బెంచెడి యగ్రజులకుబుద్ధి గరప శాంతికి విఘ్నముఁ గను జనులపీఁచమడఁచ వేరు విధము విధియుఁ గనకశస్త్రమే శాంతి చిహ్నమై సన్నుతిఁ గనె ఉ॥ అస్త్రముఁ బూని శాంతినిట నంతముఁ జేయ నశాంతి సృష్టికిన్దస్త్రము వ్రాసి నిత్యమటు తత్పరులై చను దుష్టమూకలన్శస్త్రము వీడి కూల్చుటయు సాధ్యమె యెంచఁగ దేశరక్షకైశస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్
ఉ:వస్త్రములన్ విదేశ పరిపాలక వర్తకమెల్ల బాపగావస్త్రము నేయు దారమును భారత వాసులె జేయుడంచు నేయస్త్రము లేక రాట్నముల నందు డటంచు వచించ గాంధి యాశస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్
భండ నాంత రోపద్రవ ఖండి తాంగ వీర వీక్షణ ఫలితము భరత భూమి శూర వరలోక గణ్యు నశోకు వీత శస్త్రమే శాంతి చిహ్నమై సన్నుతిఁ గనె అస్త్ర విహీను సన్నుత మహాత్ము నిజేక కటిస్థ శుద్ధ సద్వస్త్రుని భవ్య గాంధి కుల వర్యు దురాక్రమ ణారి వర్గ భృచ్ఛస్త్ర విఘాత లాఘవము సత్య వరాగ్రహ సిద్ధ సుప్రభా శస్త్రమె శాంతి చిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్
దుష్ట జనములు దేశాన విస్తరించి దేశ సంపద నంతయుఁ దోచుకొనగ భరత మాతను రక్షింప ప్రముఖ మైనశస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.తెల్లవారిని తరుమగ దీక్ష తోడసత్యమే యాయుధమ్ముగ సాగి గాంధియెట్టి శస్త్రము లేక నహింస యనెడుశస్త్రమే శాంతి చిహ్నమై సన్నుతిఁ గనె.
తేటగీతి
రిప్లయితొలగించండిమూడురంగుల జెండాను ముదము గనుడు
నడుమన నశోకచక్రమ్ము నాదు దృష్టి
శాంతనవునిపై సంధించు చక్రి కరఁపు
శస్త్రమే! శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె!!
ఉత్పలమాల
వస్త్రము మూడు వర్ణముల భారతజాతి పతాకమై గనన్
వస్త్రము నందశోక స్మృతిఁ బంచెడు చక్రము నాదు దృష్టిలో
నస్త్రము పట్టనన్ హరియె నాపగ సూనుని నాప నెత్తెడున్
శస్త్రమె! శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్!!
ఆంగ్ల పాలన నెదిరించి యన్య దేశ
రిప్లయితొలగించండివస్త్రముల బహిష్కరణకై వాడిన యతి
యుక్త దూది వడక నుపయోగపడిన
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె
రిప్లయితొలగించండిపూర్వ మనిని సైనికులు కపోతములకు
కంఠమందునణ్వాస్త్రము గట్టి వదల
శత్రుమూకల దునిమిన సారసమను
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె
శాస్త్రమెఱంగునట్టి యపసర్వులు పార్వపు కంఠమందు న
ణ్వాస్త్రము గట్టి దానిని విపక్షుల యాయతనమ్ము పైకి నో
యస్త్రము వోలె దొమ్మి తరి యంపి వినాశము జేసిరైరి యా
శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్.
బాపు భారతి దాస్యముఁ బాపుకొరకు
రిప్లయితొలగించండిశాంత్యహింసల బూనెను శస్త్రమట్లు
రక్తపాతము లేనట్టి రణము నందు
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె
అస్త్రముఁ బూనలేదు తనయాయుధముల్గన శాంత్యహింసలే
వస్త్రము మేనిపైన మన బాపు ధరించినదుత్తరీయమే
శస్త్రము రాట్నమై భరతజాతికి దెచ్చె స్వతంత్ర దీప్తి యా
శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశాంతియుతమైన దీక్షయే శస్త్రమనుచు
రిప్లయితొలగించండినస్త్ర సన్యాసులై నిరాహారులైరి
గాంధి చూపిన మార్గమే గమనమనగ
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె
అస్త్రములన్ ద్యజించిరిట నభ్యవహార్యము వీడుదీక్షతో
వస్త్రబహిష్కృతమ్మె మన భారత పౌరుల శస్త్రమాయెగా
శాస్త్రమహింసయేననుచు సాత్వికులైజనులుద్యమించగా
శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్
ఆంగ్ల దొరలను దరు మంగ నాయుధ ముగ
రిప్లయితొలగించండిశాంతి సమరము సాగించి జయము నందె
గాంధి గారి య హింస యే ఘన తరంపు
శష్ట్ర మే శాంతి చిహ్నమై సన్నుతి గ నె
శాస్త్రి కుమార్తె నామమది శాంతి, పరీక్షకు పాఠశాలలో
రిప్లయితొలగించండిదస్త్రము నివ్వగా నడిగెఁ దండ్రిని "రైతుల లాంఛనమ్మునున్"
శాస్త్రమెఱుంగు తండ్రి యనె "సాధనమయ్యది లాంగలమ్ముగా
శస్త్రమె శాంతి! చిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్"!!
లాంగలము = నాగలి
తే.గీ:పెట్టుబడి శ్రమజీవుల పొట్ట గొట్ట
రిప్లయితొలగించండివారి కండ యయ్యెను సామ్యవాద మొకటె
సుత్తి తో జత గూడిన కత్తి యనెడు
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె”
(కత్తి-సుత్తి)
తే॥ ఉగ్రవాదముఁ బెంచెడి యగ్రజులకు
రిప్లయితొలగించండిబుద్ధి గరప శాంతికి విఘ్నముఁ గను జనుల
పీఁచమడఁచ వేరు విధము విధియుఁ గనక
శస్త్రమే శాంతి చిహ్నమై సన్నుతిఁ గనె
ఉ॥ అస్త్రముఁ బూని శాంతినిట నంతముఁ జేయ నశాంతి సృష్టికిన్
దస్త్రము వ్రాసి నిత్యమటు తత్పరులై చను దుష్టమూకలన్
శస్త్రము వీడి కూల్చుటయు సాధ్యమె యెంచఁగ దేశరక్షకై
శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్
ఉ:వస్త్రములన్ విదేశ పరిపాలక వర్తకమెల్ల బాపగా
రిప్లయితొలగించండివస్త్రము నేయు దారమును భారత వాసులె జేయుడంచు నే
యస్త్రము లేక రాట్నముల నందు డటంచు వచించ గాంధి యా
శస్త్రమె శాంతిచిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్
భండ నాంత రోపద్రవ ఖండి తాంగ
రిప్లయితొలగించండివీర వీక్షణ ఫలితము భరత భూమి
శూర వరలోక గణ్యు నశోకు వీత
శస్త్రమే శాంతి చిహ్నమై సన్నుతిఁ గనె
అస్త్ర విహీను సన్నుత మహాత్ము నిజేక కటిస్థ శుద్ధ స
ద్వస్త్రుని భవ్య గాంధి కుల వర్యు దురాక్రమ ణారి వర్గ భృ
చ్ఛస్త్ర విఘాత లాఘవము సత్య వరాగ్రహ సిద్ధ సుప్రభా
శస్త్రమె శాంతి చిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్
దుష్ట జనములు దేశాన విస్తరించి
రిప్లయితొలగించండిదేశ సంపద నంతయుఁ దోచుకొనగ
భరత మాతను రక్షింప ప్రముఖ మైన
శస్త్రమే శాంతిచిహ్నమై సన్నుతిఁ గనె
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తెల్లవారిని తరుమగ దీక్ష తోడ
సత్యమే యాయుధమ్ముగ సాగి గాంధి
యెట్టి శస్త్రము లేక నహింస యనెడు
శస్త్రమే శాంతి చిహ్నమై సన్నుతిఁ గనె.