భారతము నాంధ్ర భాషలో వ్రాసివారు ప్రాజ్ఞులైన ముగ్గురు కవివర్యులిచట తెనుగున బరిపుష్టంబైన దివ్యరచన వ్యాస కృతము గా దందురు భారతమును
వ్యాసుడు పల్కగా వినుచు వ్రాసెను భారతమున్ గణేశుడే! వ్రాసిరి భారతమ్మునిటఁ బ్రాజ్ఞులు ముగ్గురు తెన్గు భాషలో ప్రాసల రమ్యతన్ దెనుగు భాషను వ్రాసిన గ్రంథరాజమే వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్
ఉ:వ్యాసుడు వ్రాసె భారతము పంచమవేదపు దృష్టి తోడ నా వ్యాసకృతమ్మునే తెలుగు భాషకు దెచ్చుచు కావ్య రోచులన్ భాసము గా కవిత్రయము వ్రాసెను,కావ్యపు దృష్టి శ్రేష్ఠ మా వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్”
తేటగీతి
రిప్లయితొలగించండిసర్వవేద సమ్మిలితమ్ము నుర్విజనుల
వ్రాత మార్చెడు దివ్యంపు గీత గలుఁగఁ
గృష్ణమూర్తి సత్కృప లేక కేవలమ్ము
వ్యాసకృతము గాదందురు భారతమును
ఉత్పలమాల
ధీసచివుండు గోపకుల తేజము శౌరి జగద్గురుండుగన్
వాసిగ వేద సారమును బంచగ గీతగ మానవాళికిన్
న్యాసము సేసి వ్రాసెనన నంబుజలోచనునండలేనిదే
వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్!
పంచ పాండవులు తనకు పౌత్రులనుచు
రిప్లయితొలగించండినెరిగి గూడ వారి వెతల నెటుల వ్రాయ
గలిగెనా యని కొందరు కవులడపడి
వ్యాసకృతము గాదందురు భారతమును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కవులడపడి' ?
🙏
తొలగించండిఅపుడు = సందేహపడు
అడపడు = సందేహపడు
తొలగించండి
రిప్లయితొలగించండిబాదరాయణుని కృతియా పరమ పావ
నమగు రామాయణము తెలుపుమది, లోక
మందు జయసంహితగ దేనినందు రనగ
వ్యాసకృతము గాదందురు, భారతమును
వ్రాసెన బాదరాయణుడు? రాముడరణ్యము నందు నుండగా
మోసముచేసి రావణుడు మోహముచే చెఱ బట్టె నంచునా
వాసిగడించినట్టి సతి పావని గాథను గాంచి చెప్పిరే
వ్యాసకృతమ్ము గాదనుచు, భారతమున్ గణియింత్రు పండితుల్.
భారతము నాంధ్ర భాషలో వ్రాసివారు
రిప్లయితొలగించండిప్రాజ్ఞులైన ముగ్గురు కవివర్యులిచట
తెనుగున బరిపుష్టంబైన దివ్యరచన
వ్యాస కృతము గా దందురు భారతమును
వ్యాసుడు పల్కగా వినుచు వ్రాసెను భారతమున్ గణేశుడే!
వ్రాసిరి భారతమ్మునిటఁ బ్రాజ్ఞులు ముగ్గురు తెన్గు భాషలో
ప్రాసల రమ్యతన్ దెనుగు భాషను వ్రాసిన గ్రంథరాజమే
వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:వ్యాసుడు వ్రాసె భారతము పంచమవేదపు దృష్టి తోడ నా
రిప్లయితొలగించండివ్యాసకృతమ్మునే తెలుగు భాషకు దెచ్చుచు కావ్య రోచులన్
భాసము గా కవిత్రయము వ్రాసెను,కావ్యపు దృష్టి శ్రేష్ఠ మా
వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్”
అనువ దించిరి తెలుగున
రిప్లయితొలగించండిననుచు నుండ
సంస్కృత o బున నున్నట్టి చక్క నైన
గొప్ప గ్రంథము లభియింప కొందరి లను
వ్యాస కృతము గాదందురు భారతంబు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ తెలుఁగు చలనచిత్రములును దేట పరచ
రిప్లయితొలగించండితెలుఁగు భారతముఁ పఠించి వెలుఁగుఁ గనుచుఁ
దెలిసికొనిన గీర్వాణము తెలియని ప్రజ
వ్యాసకృతము గాదందురు భారతమును
ఉ॥ వ్రాసిరి యాంధ్రభారతము వాసిగ మార్పులు కూర్పులెన్నియో
దోసిటఁ బట్టి భవ్యముగఁ దోషము నొందుచు మెచ్చ దక్షులున్
ధ్యాసగ నాంధ్రభారతపు తావిని తన్మయులౌచు మూర్కొనన్
వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిహరియె వ్యాసుని చిత్తమందధిగమించి
రిప్లయితొలగించండిపార్వతీపుత్రు దంతమ్ము పర్వులెత్త
ప్రకటితమ్మాయె నీభువిన్ భారతమ్ము
వ్యాసకృతము గాదందురు భారతమును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి)తే.గీ:జైమినియె భారతము వ్రాయ చదువరేల?
రిప్లయితొలగించండిజయ మనెడు చరిత్రమును వ్యాసముని వ్రాసె
ననుచు కొందరు వచియింతు రవ్విధమున
వ్యాసకృతము గాదందురు భారతమును
భాసముగా నఖర్వమగు భారతమున్ వెలయింప నుర్విలో
రిప్లయితొలగించండివ్యాసుని గూర్చె మాధవుఁడు, వ్రాయసగానిగ శ్రీగణేశునిన్
వ్రాసినవాడు భారతము వ్యాసుడనందగ దివ్విధంబుగన్
వ్యాసకృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాట్సప్ సమూహంలో సమీక్షించిన పూరణలను ఇక్కడ సమీక్షించడం లేదు. గమనించగలరు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభరత వర్ష చరిత్రను భారత మని
తొలగించండిపరిగణింప నాధునికులు పంత మూని
యెఱుగ కున్నఁ బురాణము లింత యేని
వ్యాస కృతము గాదందురు భారతమును
ధీ సముఁ డీ ఋషీంద్రునకు దేవ జగమ్మున నైన నుండునే
వ్రాసిననుం బురాణములు పన్నుగఁ బెక్కులు తృప్తి నందఁడే
వ్యాస మహర్షి కన్యునకు నారయ శక్యమె వ్రాయ నిట్టు ల
వ్యాస కృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్
దాశరథిచరిత్రమ్మది ధరణి యందు
రిప్లయితొలగించండివ్యాస కృతము కాదందురు, భారతమును
వ్యాసభగవానుడు తెలుప వాసిగాను
వారణాస్యుడు రచియించె భక్తితోడ