26, డిసెంబర్ 2024, గురువారం

సమస్య - 4984

27-12-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చప్పటులు రేగెఁ గనరాదు సంతసమ్ము”
(లేదా...)
“హర్షధ్వానములెన్నొ రేఁగె సభలో నానందమే మృగ్యమౌ”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

18 కామెంట్‌లు:

  1. నవ్యకవితాత్మ నాందిగా నవకమొప్ప
    కవితచదివెనునవకవి కలత కలిగె
    శ్రోతలంతంతదెలిసిరి రోత నంత
    చప్పటులురేఁగెకనరాదు సంతసమ్ము

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    కోరి యవధాన మెంచంగ గురువుముందు
    చిందె పద్యముల్ గురుపాద సేవ కొరకు
    గురువు రాడన శిష్యుఁడున్ గుముల, సభను
    చప్పటులు రేగెఁ, గనరాదు సంతసమ్ము!

    శార్దూలవిక్రీడితము
    శీర్షమ్మున్ దగవంచి మ్రొక్కి గురునిన్ జేయన్వధానమ్మునే
    వర్షమ్మై గురుపాదసేవకొరకై పద్యాంబుజాల్ జారఁన్,
    మర్షమ్మెల్ల నశించి రాడుగురుడన్ మాటల్ వినన్ జట్టుకున్,
    హర్షధ్వానములెన్నొ రేఁగె సభలో, నానందమే మృగ్యమౌ!

    రిప్లయితొలగించండి

  3. అది విశాదాంత నాటక మందువలన
    ప్రేక్షకుల మనమున నిండె వేదన చట
    కౌశలపు నటుల నటన గాంచి నంత
    చప్పటులు రేగెఁ , గనరాదు సంతసమ్ము.


    వర్షాభావము పెచ్చరిల్లనట తీవ్రంబౌ యెడాటమ్ముతో
    కర్షుండ్రెల్లరు లాత్మహత్యలను దుఃఖాంతంపు నాటమ్మునే
    హర్షింపంగనులేని ప్రేక్షకులు జాయాజీవు దాఖ్యమ్ముకై
    హర్షధ్వానములెన్నొ రేఁగె , సభలో నానందమే మృగ్యమౌ.

    రిప్లయితొలగించండి

  4. నేత మరణించ , సదమును నిర్వహించి
    యతని చరితము తెలుపిరి , యాలకించ
    చప్పటులు రేగెఁ , గనరాదు సంతసమ్ము
    యచటి వారి ముఖములందు నార్తినొంద

    రిప్లయితొలగించండి
  5. వర్షాంతంబున నొజ్జ ఛాత్రతతికిన్ బద్యార్భటిన్ దెల్పి, యా
    కర్షింపంగ, వధానమొక్కటిబడిన్ గావింపగాన్, జెప్పగన్
    శీర్షఃకంపనపద్యముల్ క్షణమునన్ శ్రేష్టావధానీంద్రుడున్
    హర్షధ్వానములెన్నొ రేఁగె సభలో నానందమే మృగ్యమౌ

    ( కాన్వెంట్ లో ఉపాధ్యాయుడు అవధానము ఏర్పాటుచేసినాడు (ఏడది చివరలో) క్షణములో అవధాని పద్యములు చెప్పటం ఆశ్చర్యముగా ఉండి చప్పట్లు కొట్టినారు, కానీ పద్యార్థములు తెలియవు కాబట్టి ఆనందములేదు)

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. గొప్ప రచనలు సల్పిన కోవిదుండు
      చెప్పఁ దలపెట్టె తనదైన చిత్రకథను
      చప్పున నిలిచి విద్యుత్తు సభఁముగింప
      చప్పటులు రేగెఁ గనరాదు సంతసమ్ము

      తొలగించండి
    2. వర్షాకాలపు కొల్వుకూటమునఁ దా వాక్రుచ్చి విద్వాంసు డా
      కర్షించెన్ సభనే భళీయని జనుల్ కావ్యంబు నేమెచ్చగా
      హర్షధ్వానములెన్నొ రేఁగె; సభలో నానందమే మృగ్యమౌ
      వర్షాయానము సంభవించె నపుడే వాతూలమే జోడిగా

      తొలగించండి
  7. సారవంతము లేనట్టి చచ్చు కవిత
    వినగ లేకను శ్రోతలు విసుగు జెంది
    చాలు ఛాలంచు తెలుప గ b సవ్వడి గను
    చప్ప టులు రేగె గన రాదు సంత సంబు

    రిప్లయితొలగించండి
  8. ఆర్షేయుండని తాను గాన కళలో నాహ్వానమేజేయగన్
    వర్షేజంబు తెఱంగునన్ బెకబెకల్ పాడంగ నిర్ఘాతముల్
    వర్షాశ్మంబులు రాలె చావె మురళిన్ వాయించు రీతిన్ సఖా
    హర్ష! ధ్వానములెన్నొ రేఁగె సభలో నానందమే మృగ్యమౌ!!


    వర్షేజంబు = కప్ప
    వర్ష + అశ్మంబులు = వర్షాశ్మంబులు = వడగల్లు

    రిప్లయితొలగించండి
  9. వర్షాభావము కర్షకాళి బ్రతుకుల్ వ్యస్తంబుగా జేయగన్
    మర్షంబెల్ల నశించగా ప్రభుత సమ్మానంబు గావింప యా
    కర్షంబున్ ఘటియించి కర్షకులకున్ కాన్కల్ పచారించగన్
    హర్షధ్వానములెన్నొ రేఁగె సభలో నానందమే మృగ్యమౌ

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:మద్యమునకును,కూలికై మంత్రి వర్యు
    నెన్నికల సభ నున్నట్టి యెల్ల జనుల
    చప్పటుల గొట్టుడన చాల చప్పగానె
    చప్పటులు రేగెఁ గనరాదు సంతసమ్ము

    రిప్లయితొలగించండి
  11. వర్షారంభపు చైత్రమాసమదిగోవాసంతమేపాటిదో
    ఈర్షాద్వేషములన్నివేళలనగానెన్నేనిదోషంబులై
    హర్షింపన్దగకారణంబుఁగనినాస్వాదింపలేమన్నరో
    హర్షధ్వానములెన్నొ రేఁగె సభలో నానందమే మృగ్యమౌ
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  12. వర్షములు లేక నిడుములు పడుచునుండ
    ప్రభుత చేయూత నీయగ రైతులకును
    సభను ప్రకటించ నార్ధిక సాయమపుఁడు
    చప్పటులు రేగెఁ గనరాదు సంతసమ్ము

    రిప్లయితొలగించండి
  13. శా:హర్ష మ్మిచ్చు సమస్య లేక,సరసమ్మౌ నాశువున్ లేక, సం
    ఘర్షన్ దత్తపదమ్ము లీక యె వధానంబుండెగా ధారణా
    వర్షమ్మైనను లేదు సన్నచినుకే ప్రాప్తించె ,మర్యాద కై
    హర్షధ్వానములెన్నొ రేఁగె సభలో నానందమే మృగ్యమౌ”
    (అవధానం బాగుండక పోయినా మర్యాదకి హర్షధ్వానాలు చేసారు కానీ ఆనందం లేదు.)

    రిప్లయితొలగించండి
  14. శా:హర్షమ్మొల్కెడు కావ్యగానముల,బౌద్ధాధ్యాత్మతత్త్వమ్ములన్
    వర్షమ్మట్టుల గ్రుమ్మరించు సభలో "స్వర్గస్తుడైనాడు శ్రీ
    హర్షుం" డన్ పెను వార్త రాగ "నకటా హర్షప్రభో!"యంచు బల్
    హర్షధ్వానములెన్నొ రేఁగె సభలో నానందమే మృగ్యమౌ”
    (శ్రీహర్షుడు మహాచక్రవర్తి.బౌద్ధుడు.మహాకవి.కవిపోషకుడు కూడా.ఆయన మృతి చెందగా ఆ సభలో ",హర్షా" అనేధ్వనులు చెలరేగాయి.ఆనందమే లేదు.)

    రిప్లయితొలగించండి
  15. మిత్ర శత్రు పక్షమ్ములు మీఱి వాద
    నలు సలుపుచుండ నుప్పొంగఁ జలము పగలు
    కుడి యెడమ లందుఁ జెలరేఁగఁ గులుకు వగలు
    చప్పటులు రేగెఁ గనరాదు సంతసమ్ము


    తర్షంబాత్మ జనింపఁగా జయమునుం దథ్యంబుగాఁ బొంద నా
    మర్షం బుద్భవ మయ్యె నోటమియె సంప్రాప్తింప విన్నంత నా
    ధర్షం బత్తఱిఁ బిక్కటిల్ల ఘన సంత్రాసమ్ముతో వారికిన్
    హర్షధ్వానము లెన్నొ రేఁగె సభలో నానందమే మృగ్యమౌ

    రిప్లయితొలగించండి
  16. తర్షమ్మున్ గొని నూతనమ్మయిన చిత్రమ్మంచు నాపేక్షతో
    వర్షమ్మట్లుగ చేర పుష్ప సినిమా ప్రారంభమౌ వేళలో
    గర్షమ్మున్నభిమాని చావుకత, విఖ్యాతంపు తత్ గెల్పుచే
    హర్షధ్వానములెన్నొ రేఁగె సభలో, నానందమే మృగ్యమౌ

    రిప్లయితొలగించండి