తే.గీ:వచ్చి హేమంత మెల్లరన్ వణక జేసి యచటి చలిమంట గాన నీయకను రగులు నగ్ని, హిమమును వెదజల్లె నాకసమున నినుని మాయమ్ము జేయుచు ఘనతరముగ (మంచు వల్ల అక్కడ చలిమంటలో ఉన్న నిప్పు,ఆకాశం లో సూర్యుడు కూడా కనబడటం లేదు.)
నేను శాస్త్ర విద్యార్థినండి cause & effect ప్రకారమండి. 1. పైనయున్న కణములతో నీటి బిందువులు కలసి మేఘములేర్పడడము (హిమము) 2. చాలవరకు వేసవిలోనే వడగండ్లు కూడ పడతాయండి 3. బెంగళూరులో ఏప్రిల్ మాసము ద్వితియార్ధంనుండి ఇలా వేసవిలో వానలు రోజు విడచి రోజు పడాలి. ఈమధ్య గతి తప్పుతోంది. 4. నిజానికి రైతులు కోరుకొనే ఆరుద్ర కార్తిలోని వాన కూడ వేసవి వానే నండి. ముఖ నుండి దక్షిణాదిలో గట్టిగా వానలు కురవాలి.
మండు వేసవి దండిగనెండ గాసె
రిప్లయితొలగించండినుక్కపోఁతకు నుక్కిరిబిక్కిరాయె
కుండపోఁతగ వర్షము కురిసినంత
నగ్ని హిమమును వెదజల్లె నాకసమున
తేటగీతి
రిప్లయితొలగించండిఎండదేవర తాపము మెండు కాగ
భూమిపైనీరు మాయమై పూల వోలె
శీతల హిమవర్షము పడ చిత్ర మయిన
అగ్ని హిమమును వెదజల్లె నాకసమున
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
యుద్ధభూమినికృష్ణుడుయోధు భీష్ము
రిప్లయితొలగించండిజూచిచెలరేగుసమయానశోభనందె
తాపమణగిన మనసునతాతమ్రొక్కె
అగ్ని హిమమును వెదజల్లే నాకసమున
తేటగీతి
రిప్లయితొలగించండిరావణుండు సంధింపంగ రణమునందు
మింటికెగసె యాగ్నేయాస్త్రమె! వెను వెంట
రాముని వరుణాస్త్రమ్మె చల్లార్ప నారి
యగ్ని, హిమమును వెదజల్లె నాకసమున!
చంపకమాల
రణమున రామునిన్ నిలుప రావణుఁడుద్ధతిఁ గూర్చినంతటన్
గణకణ నిప్పులన్ చెరగి ఘాతుకమెంచగ నగ్గితూపునే
యనితర సాధ్యమైన వరుణాస్త్రము రాముడు వేయ నార్పి య
య్యనలమునుండి లేచి హిమ మంబరమెల్లనుఁ గ్రప్పె వింతగన్!
ఇనుడుదయించె వేసవిని హెచ్చుగ నెండను గ్రుమ్మరించుచున్
రిప్లయితొలగించండిజనతకు నుక్కపోఁతయొక శాపముగా పరిణామ మొందెనే
చినుకులు జల్లులై కురిసి చిత్తడి నింపగ భూతలంబునన్
యనలమునుండి లేచి హిమ మంబరమెల్లనుఁ గ్రప్పె వింతగన్
కలియుగమునందు వింతలు గలుగుచుండు
రిప్లయితొలగించండిమంచిచెడ్డలు పొదిగొని మసలుచుండు
నగ్ని హిమమును వెదజల్లె నాకసమున
యనుచు తెలుప నమ్మనగును యనుమ పడక
కర్ణ విజయుల సమరాన గాన వచ్చె
రిప్లయితొలగించండినొక్క రాగ్నే యము ను వేయ నొకరు దాని
వారు ణా స్త్ర ము చేతను భ గ్న పరుప
నగ్ని హిమమును వెద జల్లె నాక సమున
రిప్లయితొలగించండిహత్యలును మాన భంగమ్ము లధికముగను
చేసినట్టి నేత నుడులు వాసిగాను
జనుల నమ్మించి వంచించె కనగ నచట
నగ్ని హిమమును వెదజల్లె నాకసమున
అనృజుడు మంత్రిగా వెలగ నద్భుత రీతి సమీకరించుచున్
జనుల వచించెనచ్చట బజారి ప్రజాళికి క్షేమకారినే
నను గెలిపించు మంచనిన నమ్మిరి లోకులు వింతగన్ గనన్
అనలమునుండి లేచి హిమ మంబరమెల్లనుఁ గ్రప్పె వింతగన్.
చేసిన పరిపాలన కనఁ మోసమాయె
రిప్లయితొలగించండిజనుల కోపాగ్ని వెల్లువై తనరుచుండ
విజయమందిన ప్రతివాది సుజనుడనగ
నగ్ని హిమమును వెదజల్లె నాకసమున
వినయము చూపిగెల్చి తన విచ్చికముల్ పొరిచూపెనాతడే
జనులు గ్రహించి ఛీ యనిరి సంస్కృతమైన తమిస్రమగ్నియై
నిను గెలిపించమంచు స్థిర నిశ్చయులైతమ వోటువేయగా
ననలమునుండి లేచి హిమ మంబరమెల్లనుఁ గ్రప్పె వింతగన్
ఘనతర పాండవేయులను కానకునంపిన కౌరవేంద్రునిన్
రిప్లయితొలగించండిదునెమెదనంచు హస్తినను దున్నగ హాలుడు వెళ్ళె క్రోధియై
ప్రణతులు సేయ మెచ్చె బలరాముడు సన్నుతి గేయ లోలుడై
యనలమునుండి లేచి హిమ మంబరమెల్లనుఁ గ్రప్పె వింతగన్!!
హాలుడు = బలరాముడు
తే.గీ:వచ్చి హేమంత మెల్లరన్ వణక జేసి
రిప్లయితొలగించండియచటి చలిమంట గాన నీయకను రగులు
నగ్ని, హిమమును వెదజల్లె నాకసమున
నినుని మాయమ్ము జేయుచు ఘనతరముగ
(మంచు వల్ల అక్కడ చలిమంటలో ఉన్న నిప్పు,ఆకాశం లో సూర్యుడు కూడా కనబడటం లేదు.)
తే॥ చండకరుఁడు గ్రీష్మమునందు మండి యగ్ని
రిప్లయితొలగించండిపరఁగఁ జేయ ధరణి యందు భంభమెగసి
నీటి బిందువులఁ గలసి నిలచినంత
నగ్ని హిమమును వెదజల్లె నాకసమున
చం॥ అనువుగ గ్రీష్మమందు నినుఁడధ్వమునందు మహోగ్రుఁడై యటుల్
చనఁగను నిప్పురాజుకొని సాగఁగ ధూమము పైకి చేరఁగా
నొనరుగ నీటిబిందువుల నొప్పుచుఁ గూర్చుచు మేఘమాలయై
యనలమునుండి లేచి హిమమంబరమెల్లనుఁ గ్రప్పె వింతగన్
భంభము ధూమము అధ్వము ఆకాశము నిఘంటువు సహాయమండి
నేను శాస్త్ర విద్యార్థినండి cause & effect ప్రకారమండి.
1. పైనయున్న కణములతో నీటి బిందువులు కలసి మేఘములేర్పడడము (హిమము)
2. చాలవరకు వేసవిలోనే వడగండ్లు కూడ పడతాయండి
3. బెంగళూరులో ఏప్రిల్ మాసము ద్వితియార్ధంనుండి ఇలా వేసవిలో వానలు రోజు విడచి రోజు పడాలి. ఈమధ్య గతి తప్పుతోంది.
4. నిజానికి రైతులు కోరుకొనే ఆరుద్ర కార్తిలోని వాన కూడ వేసవి వానే నండి. ముఖ నుండి దక్షిణాదిలో గట్టిగా వానలు కురవాలి.
పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు
చం:తన చలి బాధ బాపుకొన దక్కిన యా చలిమంట గాగి చి
రిప్లయితొలగించండివ్వున పని జూచుకొందు నని పోవుచు నొక్కడు వెచ్చ నైన యా
అనలమునుండి లేచి," హిమ మంబరమెల్లనుఁ గ్రప్పె వింతగన్"
పనులును తప్ప వయ్యె నని బాధగ బల్కె ముఖమ్ము మాడ్చుకన్.
సంతసింప నుర్వి జను లనంతముగను
రిప్లయితొలగించండిజక్క నుదయించి నభమునఁ జంద్రుఁ డడరి
యినుఁడు గనఁబశ్చిమాద్రి నింకెక్క డున్న
దగ్ని హిమమును వెదచల్లె నాకసమున
కని విని నేర నట్టి విధిఁ గ్రమ్మఁగ మేఘము లబ్బురమ్ముగాఁ
జినుకులు పెర్గి వే కురియఁ జెన్నుగ నత్తఱి వర్ష పాత మం
దనిలము వేగ చల్లఁబడ నంతట మిక్కిలి దూర మెంతొ కా
ననలము నుండి లేచి హిమ మంబర మెల్లనుఁ గ్రప్పె వింతగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
భాస్కరుడు గ్రీష్మ మందున ప్రబలుచుండి
పగలు మధ్యాహ్న సమయాన సెగలు గ్రక్కు
నగ్ని, హిమమును వెదజల్లె నాకసమున
మార్గశీర్షపు మాసాన మంచు కురిసి.