4, డిసెంబర్ 2024, బుధవారం

సమస్య - 4962

5-12-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానం బనెడు విద్య యాంగ్లేయులదే”
(లేదా...)
“అవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే”

5 కామెంట్‌లు:


  1. వివరుణుడాతం డాగ్లే
    య విధేయుడు పల్కె హాలహలి మత్తున తా
    కవనపు క్రీడగ పొగడెడి
    యవధానం బనెడు విద్య యాంగ్లేయులదే.


    భువినాంగ్లేయులె మేటిప్రాజ్ఞులని సంబోధించు పెచ్చారి యా
    సవమున్ గ్రోలి నసత్యముల్ పలికెనే సమ్మోదికుల్ కోరగా
    కవనక్రీడగ పండితోత్తములు వక్కాణించు చున్ మెచ్చె డా
    యవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే.

    రిప్లయితొలగించండి
  2. రవిక్రుంకని పాలనమున
    వివిధ సమస్య లొకపరిగ పెనగుచు నుండన్
    నవలీలగ సరి జేసిరి ,
    యవధానం బనెడు విద్య యాంగ్లేయులదే

    రిప్లయితొలగించండి
  3. వివరింపగ నాంధ్రులదే
    యవధానం బనెడు విద్య; యాంగ్లేయులదే
    వ్యవధానమనుచు తెలిపిరి
    కవనము లందున పలువురు కమనీయముగా

    అవలోకించుచు గౌరవించిరిగదా యాంగ్లేయులే తెల్గునే
    లవలేశంబగు శంకలేదు విబుధుల్ ప్రాచీనులందించిరే
    యవధానంబను విద్య నాంధ్రులకు; నా యాంగ్లేయులే నేర్పిరే
    వివరింపందగు శబ్దకోశ విలువన్ విస్పష్టమౌరీతినిన్

    రిప్లయితొలగించండి
  4. అవమానంబె చరిత్రయంచు మరి విద్యాసంస్థలం జేరి పా
    ఠవముం జూపిరి యెర్ర రంగుల సిరా టంకారమే చేసి గౌ
    రవమే చూపని వాడు పుస్తకములన్ వ్రాయంగ నిట్లుండదే
    యవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే!!

    రిప్లయితొలగించండి