22, డిసెంబర్ 2024, ఆదివారం

సమస్య - 4980

23-12-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము”
(లేదా...)
“కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్”

9 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఇంద్ర పీఠాన సగమంది యింపుమీరఁ
    ద్ర్యక్షు సమయుజ్జి క్రీడియై ధన్యతఁగని
    యుగ్ర సమరాన నోటమి నుక్కఁడగుగఁ
    గర్ణుఁడు, ద్రిలోకవిజయుఁడై కాంచె యశము!

    ఉత్పలమాల
    అర్ణవమంత శౌర్యమున నందియునింద్రుని యర్ధపీఠమున్
    శీర్ణకళాధరున్ కదనసీమనునుజ్జిగనిల్చి క్రీడి, సం
    పూర్ణ కృపాకటాక్షములఁ బ్రోవఁగ కృష్ణుడు నొందనోటమిన్
    గర్ణుఁడు, మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్!

    రిప్లయితొలగించండి
  2. వినయముగ దాపునకు వచ్చి వితరణముగ
    నిమ్మనగనె యెందులకని యెంచకుండ
    నురవుగనె వేరుదలచక నొసగుటందు
    కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము

    రిప్లయితొలగించండి
  3. సూర్యు పుత్రుడు లోకము చుట్టగలఁడు
    ధర్మరాజుకుభ్రాతగా ధరణి యందు
    ఇంద్రుమెప్పించెదాతయైనేర్పుతోడ
    కర్ణుడుత్రిలోకవిజయుడై కాంచెయశము

    రిప్లయితొలగించండి
  4. గొప్ప దాత గాగ కవచ కుండల ముల
    మారు పలుకక నొసగియు మాన్యు డ య్యె
    దైవ గణములు మెచ్చ గా దాన మందు
    కర్ణుడు ద్రి లోక విజయు డై కాంచె యశము

    రిప్లయితొలగించండి

  5. అంగరాజుపై యభిమాన మధికమవగ
    రాత్రి శయనించు వేళ రారాజు గాంచె
    స్వప్నమొక్కటి యందున సంగతకుడు
    కర్ణుఁడు ద్రిలోకవిజయుఁడై కాంచె యశము.


    స్వర్ణపలంగుపై చెలులు జల్లెడ చేకొని యూపుచుండగా
    జర్ణుని కామవల్లభపు చల్లనికాంతిని స్నానమాడుచున్
    పూర్ణిమ నాటి నక్తమున మూర్ఖ సుయోధను స్వప్నమందునన్
    కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్.

    రిప్లయితొలగించండి

  6. యుద్ధానికి ముందు కర్ణునితో శ్రీకృష్ణుడు:
    వర్ణచతుర్ధజాతుడను పల్కులసత్యము, గొంతిపట్టి! దుః
    ఖార్ణవ మీదుటల్ సరి, సుభాంబుధి తేలుమ చేరిధర్మజున్,
    బూర్ణజయంబు నందు మని, భూజను లెల్లరు పాడ నిత్తరిన్:
    “కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్”

    రిప్లయితొలగించండి
  7. సహజ కవచ కుండలములఁ స్వర్గపతికి
    నర్పణమిడి కీర్తి గడించె నంగరాజు
    కర్ణుఁడు; ద్రిలోకవిజయుఁడై కాంచె యశము
    బల్లిదుండగు బలి చక్రవర్తి భువిని

    వర్ణవివక్ష చేతఁ దలవంపుల పాలయె సూత పుత్రుడే
    నిర్ణయముల్ విపత్తులను నిశ్చయపర్చగ క్రుంగిపోయెనా
    కర్ణుఁడు మూడులోకములఁ గాంచె యశమ్ము; జయమ్ము నందుటన్
    వర్ణువు హర్షయిత్నువట భండన మందున గాంచకుండినన్

    రిప్లయితొలగించండి