21, డిసెంబర్ 2024, శనివారం

సమస్య - 4979

22-12-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్”
(లేదా...)
“శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్”

12 కామెంట్‌లు:

  1. కందం
    వస్త్రాపహరణకుఁ బెనఁగి
    నిస్త్రాణగ కౌరవాళి నిధనముమదిలో
    నా స్త్రీ రణమున కోరన్
    శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      నిస్త్రాణంబున కౌరవాళి సభలో నిర్వేదనన్ గ్రుంగుచున్
      వస్త్రాలూడ్చిన కౌరవాధములకై వాంఛించి గిట్టింపహో!
      యా స్త్రీమూర్తి రణంబునన్ నిలచి దుష్టాత్ముల్ మరించంగనే
      శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్!

      తొలగించండి
  2. అస్త్రంబులిచే మలచిన
    నా స్త్రీ శిల్పంబుల గన నద్భుత మనుచున్
    శాస్త్రియె వచించె నిట్టుల
    శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్.


    నిస్త్రాణుండతగాడు పామరుడిలన్ నేర్వంగ లేదయ్యె నే
    శాస్త్రమ్ముల్ కడు పేదయై చెలగు పంచాణుండు తా దీక్షతో
    నా స్త్రీ శిల్పములెన్నొ చెక్కెనులియే యస్త్రంబుగా గాంచ నా
    శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్.

    రిప్లయితొలగించండి
  3. వస్త్రాన్నంబులధ్యాసలేక చదువన్ వైద్యంబునాసక్తితోన్
    శాస్త్రీయంబుగ విన్నదానికిఁ దగన్ సాక్ష్యంబులన్ జూచుచున్
    నిస్త్రింశంబునఁ గోసి జంతుచయమున్ నేర్వంగసూక్షమ్ములన్
    శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  4. శ స్త్ర ము తగిలిన తనువది
    ని స్త్రా ణ o బై నశించు నిక్కం బగు చున్
    శ స్త్ర ము బాధ లిడనెటు ల
    శ స్త్రా చ్చి న్నాo గ రాశి సంబర ము నిడున్?

    రిప్లయితొలగించండి
  5. ఆ న్త్రీ వస్త్రము లాగగ
    విస్తృతముగ పాండుసుతులు వేదన నొందన్
    అస్త్రముల బూన , కౌరవ
    శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్

    రిప్లయితొలగించండి
  6. శాస్త్రీయ విద్యలు నెరిగి
    శస్త్ర్రాస్త్రములన్ విడిచిన సంగ్రామములో
    వస్త్రాలే పేలికలై
    శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్

    శాస్త్రీయంబగు విద్యనేర్చె నతడే సంగ్రామ సం రంభియై
    శస్త్రాస్త్రంబుల తోడ సాగె నటకున్ సంస్పోటమేసల్పగా
    వస్త్రాలైనవి పేలికల్ కుదురుగా ప్రత్యర్థులన్ జూడగా
    శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  7. అస్త్రము స్థపతికిఁ నులి యా
    యస్త్రముతో ఱాయి దొలిచి హరువుగ జెక్కెన్
    దా స్త్రీ శిల్పము, కనుఁగొన
    శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్

    రిప్లయితొలగించండి
  8. అస్త్రంబుల్గొని యాలమందు రిపులన్ హల్లోలముం బొందగన్
    నిస్త్రాణంబు నొనర్చి భీకరముగా నిర్జించునా యోధునిన్
    శస్త్రాస్త్రంబుల సల్పు సంగరమునన్ శస్తంబుగా నయ్యెడన్
    శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  9. కం॥ దస్త్రము వ్రాసి చరించఁగ
    నిస్త్రాణముఁ జేయ దేశ నెమ్మది ప్రగతిన్
    వస్త్రములనూడ్చి త్రుంచఁగ
    శస్త్రఛిన్నాంగ రాశి సంబరము నిడెన్

    శా॥ దస్త్రమ్ముల్ రచియించి దుష్టులు భయోత్పాదమ్ముతో దేశమున్
    నిస్త్రాణమ్మును జేయ వర్తిలనటుల్ నిత్యమ్ము హేయమ్ముగా
    నస్త్రమ్ముల్ గొని సైన్య సంచయము సంహారమ్ముఁ గావించఁగన్
    శస్త్రఛిన్న శరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్

    రిప్లయితొలగించండి