తే.గీ:అర్జునధ్వజమున నున్న హనుమ గాంచి కనుల యర మోడ్పు తోడ బ్రార్థన సలిపిరి పాండవులు, వారధినిఁ గట్టు వానరు లఁట” వారి కనుక లందు దృశ్యమై వరలి రంట. (అర్జునుని జెండా పై కపి రాజు ఉన్నా పాండవు లందరూ నమస్కరించారు.వారి అరమోడ్పు కళ్లలో రామాయణం లోని వానర సేన అంతా కనిపించింది.)
విగ్రహమునందు గెలిచిరి వీరులైన
రిప్లయితొలగించండిపాండవులు ; వారధినిఁ గట్టు వానరులఁట
రామ దండు , కడలి దాటి లంకజేరి
మానిని కుజను విడిపించు మనసుతోడ
వేరనుమావమేల? నిలవైరముజూపక ధర్మ బద్ధులై
రిప్లయితొలగించండిమేరనునిల్చిరేగదర, మిన్నువిఱింగిన, మాటదప్పకన్
వారలు పంచపాండవులు, వారథిగట్టినవానరుల్గదా
చేరికచిత్రమైగనగ సింథువుదాటగరామునాజ్ఞతో
ధర్మరక్షణ జేయంగ ధరణినందు
రిప్లయితొలగించండిఉద్భవించును పరమాత్మ యుగయుగమున
అట్టి దైవము కృష్ణ,రామాంజనేయ
పాండవులు ;వారధినిఁ గట్టు వానరులఁట
మహాకుంభమేళ (ప్రయాగ) తీరము నుండి నా ప్రయత్నము:
రిప్లయితొలగించండితేటగీతి
ధార్తరాష్ట్రులు మూర్ఖంపు కర్తలగుచు
పెంచి పోషింప నుప్పొంగి వికృతమౌచు
ప్రబలి విస్తరిల్లు నధర్మ వనధి పైన
పాండవులు వారధిని గట్టువానరులట
ఉత్పలమాల
ధారుణి ధార్తరాష్ట్రులు నధర్మ పరాయణులక్రమంబులన్
దీరుచ పొంగుచున్ వనధి తీరుగనంతట విస్తరిల్లఁగన్
నీరజనేత్రుడే దరిని నిల్వగ ధర్మపు తీరమేగగన్
వారలు పంచపాండవులు వారధిఁ గట్టిన వానరుల్ గదా!
కౌరవుల గూల్చువారలు కదనమందు
రిప్లయితొలగించండిపాండవులు, వారధినిఁ గట్టు వానరులఁట
రామకార్యము నెరపఁగ లంకజేరి
ధర్మమును రక్ష చేయఁగ ధరణియందు
వారలమేయ విక్రములు వారిది ధర్మపథంబు నిచ్చలున్
రిప్లయితొలగించండివారలు పంచపాండవులు, వారధిఁ గట్టిన వానరుల్ గదా
ధీరులు రామచంద్రుని విధేయులు, వార్ధినిదాటి లంకకున్
జేరిరి రావణాసురుని జీల్చఁగ నాహవమందు రాముడే
రిప్లయితొలగించండిఇంతి ద్రుపదరాజసుతకు నేవురు పతు
లెవ్వరంట? శ్రీ రామున కెవ్వరంట
సాగరమ్మును దాటగా సాయపడిరి?
పాండవులు , వారధినిఁ గట్టు వానరులఁట.
కౌరవ వీరులన్ దునిమి కాటికి నంపిన వారలెవ్వరో?
పోరితమాడ రాముడు సముద్రము దాటుచు దుష్ట రావణున్
పేరడచన్ సహాయపడు వీరులెవారలో తెల్పుమంటినే
వారలు పంచపాండవులు , వారధిఁ గట్టిన వానరుల్ గదా.
ధీరులు శక్తిమంతులును ధీమసమొప్పెడి యుద్ధవీరులున్
రిప్లయితొలగించండిమారణ హోమమైన రణమందునఁ గౌరవులన్ జయించిరే
వారలు పంచపాండవులు; వారధిఁ గట్టిన వానరుల్ గదా
కోరిన రామచంద్రునికి కొండొక బాసటగా చెలంగిరే
పాండురాజుకు పుత్రులు భండనమున
తొలగించండికౌరవులను గెల్చి యశము గాంచినారు
పాండవులు; వారధినిఁ గట్టు వానరులఁట
రామబంటులై నిల్చిరి రణము నందు
ధర్మ మేనాడు వీడని దైవ సములు
రిప్లయితొలగించండిపాండవులు :: వారధి గట్టు వానరు లట
రామ డండు గ మారియు లంక జేరి
సంగ రమ్మున పోరా డి సాయ పడిరి
మారుతి నీలుడున్ నలుడు మైందుడు తారుడు యుద్ధమందునన్
రిప్లయితొలగించండిధీరులు బుద్ధిమంతులు సుధీర్ఘ సుదర్శన మూర్తిమంతులై
చేరిరి లంకకున్ నడచి సీతను రామునిఁ జేర్చ! కాదులే
వారలు పంచపాండవులు! వారధిఁ గట్టిన వానరుల్ గదా!!
తే.గీ:అర్జునధ్వజమున నున్న హనుమ గాంచి
రిప్లయితొలగించండికనుల యర మోడ్పు తోడ బ్రార్థన సలిపిరి
పాండవులు, వారధినిఁ గట్టు వానరు లఁట”
వారి కనుక లందు దృశ్యమై వరలి రంట.
(అర్జునుని జెండా పై కపి రాజు ఉన్నా పాండవు లందరూ నమస్కరించారు.వారి అరమోడ్పు కళ్లలో రామాయణం లోని వానర సేన అంతా కనిపించింది.)
ఉ:తీరుగ కన్న బిడ్డలకు దేవళముల్,బలు శిల్ప సంపదల్
రిప్లయితొలగించండికూరిమి తోడ జూపు తరి కూతులు ముద్దుగ బల్కి రిట్టులన్
"వీరలు దేవదానవులు,విష్ణువు మోహిని యయ్యె నిచ్చటన్
వారలు పంచపాండవులు, వారధిఁ గట్టిన వానరుల్ గదా”
దేవ సంచయ సంజాత దైవ కార్య
రిప్లయితొలగించండికార ణోద్భవు లైన నగచరు లిట్టి
పగిది నింపుగ నేరిన వార లఖిల
పాండవులు వారధినిఁ గట్టు వానరు లఁట
శూరవరేణ్యు లేవురును సుందర రూపులు ధర్మ తత్పరుల్
నేరుదు రెల్లఁ బాండవులు నీరజ నాభు దయారసమ్మునన్
నీరజ బంధు సూను వృత నిర్భయ సైనికు లిట్టు లన్న వా
ర్వారలు పంచపాండవులు వారధిఁ గట్టిన వానరుల్ గదా
ద్వాపరయుగమునజనించి భక్తితోడ
రిప్లయితొలగించండిశౌరి నిభజించి పడసిరి జయము పంచ
*"పాండవులు వారధినిఁ గట్టు వానరులఁట”*
జయము కూర్చిరి శ్రీరామ చంద్రునకట
ధారుణి వీడి కానలకు తల్లిని గూడుచరణ్యవాసమున్
తీరుగ సల్పి ద్రోవదిని దేవిగచేకొని నట్టి వీరులే
*“వారలు పంచపాండవులు వారధిఁ గట్టిన వానరుల్ గదా”*
శ్రీ రఘునాథు పాదముల సేవను చేయుచు ధన్యులైరటన్