25, ఫిబ్రవరి 2025, మంగళవారం

సమస్య - 5045

26-2-2025 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్”
(లేదా...)
“పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుదార్తి దీరఁగన్”

30 కామెంట్‌లు:

  1. బాలుడు క్రీడలాడ చరవాణిని కోరగ నివ్వకుండినన్
    పాలను త్రాగనంచు పెను పంతము బట్టెను మొండి వాడుగన్
    కాలము సాగినంతట వికారము గల్గెను కుక్షిలోన! కో
    పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుధార్తి దీరఁగన్!!

    రిప్లయితొలగించండి
  2. కందం
    గోలన్ జేసెడి బాలుడు
    వేళకు చన్గుడుప తల్లి ప్రేమగ నొడిలో
    లాలింప నూఱడిలి కో
    పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్

    ఉత్పలమాల
    గోలను జేయు బాలునకు కూరిమి జూపుచు జోలపాటలన్
    వేళకుఁ దీర్చ నాకలిని ప్రేమగ చేకొని ముద్దుమాటలన్
    లాలన జేసి చన్గుడుప రాగముమీరగ వేగ నాపసో
    పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుధార్తి దీరఁగన్!

    రిప్లయితొలగించండి
  3. చాలునికపైన పేయము
    గ్రోల ననిన గూ డ నొసగ కోపము బడియున్
    శాలిని యెదుటన దన మురి
    పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్

    రిప్లయితొలగించండి
  4. బాలకు నొడిలో జేరిచి
    లాలనఁజేయు జనయిత్రి రహి పెంపారన్
    పాలను గుడుపఁగ తన కో
    పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్

    రిప్లయితొలగించండి
  5. కాలము మారి తాపనపు గాడ్పులు వీచెను వెంకటాద్రి లో
    వీలుగ క్షుత్తుఁ దీర్చగను పెట్టిరి యాలయ ప్రాంగణంబునన్
    పాలను వంటకంబునట పంచగ భక్తుడు వేడ్మి తాళకన్
    పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుదార్తి దీరఁగన్”

    రిప్లయితొలగించండి
  6. బాలుడు పెంకెవాని వలె పంతముఁ బూని యకారణంబుగన్
    పాలను గ్రోలనంచు తన పట్టును వీడక నేడ్చుచుండినన్
    లాలనఁ జేసి తల్లి యనురాగఁపు పల్కుల నూరడింపఁగో
    పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుధార్తి దీరఁగన్

    రిప్లయితొలగించండి
  7. మేలపు మాట కేల మితిమీరిన కోప మభోజనంబయో
    చాలిక నల్క వీడుమని చాన నయంబున జేర్చనక్కునన్
    జాలపు లాలనంబు కెద ఝల్లన మెల్లన వల్లభుండు కో
    పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుదార్తి దీరఁగన్

    రిప్లయితొలగించండి
  8. గోలకు కారణ మని గో
    పాలుని దూఱిన యశోద వానిని నెమ్మిన్
    లాలించిన పిమ్మట కో
    పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్

    పాలకు క్రేపులన్ విడిచి వైభవమున్ గనె బాల కృష్ణుడే
    బాలలఁగూడి దోచెనట పల్వురి యింటను వెన్నమీగడల్
    తూలగ నల్కబూని తలి దువ్విన పిమ్మట తానె కోపతా
    పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుధార్తి దీరఁగన్

    రిప్లయితొలగించండి
  9. బాలుం డేడ్చు చు నుండగ
    పాలి చ్చు ట జా ప్య మైన బాలుం డలి గె న్
    లాలించి వేడు కొన కో
    పాల ను విడి యత డు క్షీర పానమొ న ర్చె న్

    రిప్లయితొలగించండి
  10. కం॥ ప్రేలుచు జగడములఁ గనగఁ
    జాలని సతి హెచ్చరించ సరసముఁ బడయన్
    మేలని కోపాలను తా
    పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్

    ఉ॥ ప్రేలుచు కందళమ్ములను బ్రేమను గాంచకఁ జేయుచుండఁగన్
    గోలకు భార్య రోయుచును గ్రోధము నొందుటఁ జూసి వెంటనే
    బేల తనమ్ముఁ బొంది తన పెండ్లము కోరిన రీతిఁ గోప తా
    పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుధార్తి దీరఁగన్

    మరోక పూరణ అండి

    ఉ॥ చాలును కందళమ్మని సత్యను వేడఁగ నల్కమానఁగన్
    మాలిమిఁ గాంతువేల యనె మన్నన రుక్మిణికిచ్చుచున్ సదా
    గోలను జేయకే సఖియ కోరికఁ దీర్తుననంగఁ గోప తా
    పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుధార్తి దీరఁగన్

    కందళము కలహము

    రిప్లయితొలగించండి
  11. కం:ఆ లేమ మొదటి రాత్రిని
    పాలు మిఠాయిలను వెట్ట పడి పడి తినుచున్
    మేలమ్ముల,ముద్దుల,మురి
    పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్”
    (వాడికి సరసం తెలియదు.మొదటి రాత్రి పాలు,స్వీట్లు పెడితే ఏ సరసం లేకండా ఊరికే తినటం,పాలు తాగటం మాత్రమే చేసాడు.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:మేలగు విద్య గల్గియును,మీరక సంస్కృతి ,పెండ్లి యందు మం
    త్రాలను బల్కు విప్రునకు దక్షిణ తోడుత నీయ భక్ష్యముల్
    పాలను, రుచ్యమై బరగు పాయసమున్, పులిహోర,లడ్డు,ల
    ప్పాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుధార్తి దీరఁగన్”
    (అతనికి భక్ష్యాలు,పాలు ఇవ్వగా బ్రాహ్మణకులాచారం ప్రకారం రుచికర మైన ఆ భక్ష్యాలు వదలి పాలు మాత్రమే తాగాడు.)

    రిప్లయితొలగించండి
  13. కేలం దొలిరేయిఁ బడతి
    పాలితమన్మథుఁడగు దన భర్తకుఁ బాత్రన్
    లోలాక్షి యై యొసఁగ మురి
    పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్

    సాలపుఁ జెక్కలఁ గోయుౘు
    ఫాలమ్మునఁ జెమట నొందు పతికై నీరున్
    బాలును సతి దెచ్చిన రం
    పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్

    రిప్లయితొలగించండి
  14. జాలి గలవాఁడు కావున
    నాలము లేల నని యెంచి యవి యెల్లరకుం
    జాల వని తలంచి యెడఁదఁ
    బాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్

    [క్షీరము = నీళ్లు]


    చాలిన యంత యుండఁగను క్షామము లేక యొకింత కుండలన్
    మేలొన రింప నెల్లరకు మిక్కిలి మక్కువ సంతరింపఁగా
    బాలుర కింక నారులకుఁ బా లొనరింపఁగ వేఱు వేఱుగాఁ
    బాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుదార్తి దీరఁగన్

    రిప్లయితొలగించండి
  15. తైలముఁ వ్రాయగ నుదుటన
    ఫాలముఁగడు తెల్లనగుచు బాలుడు మెఱయన్
    గోలను జేయకఁదనుగో
    పాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్”

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    బాలుండేడ్చుచు నుండగ
    మాలిమితో దరికి చేరి మాతయు నోర్మిన్
    లాలనమున్ జూపగ కో
    పాలను విడి యతడు క్షీరపాన మొనర్చెన్.

    రిప్లయితొలగించండి
  17. గోలను జేసి ముద్దు హరి కోరెను వెన్నయు ప్రీతి నీయగన్
    పాలన సేయ భక్తులను పావన మూర్తిగ నిల్చె కొండపై
    కాలము తీరు మార్చ భువి కల్కిగ ధర్మముకై సుధాబ్ధిలో
    పాలను వీడి, క్షీరమును బానము చేసె, క్షుధార్తి దీరగన్

    రిప్లయితొలగించండి


  18. మాలిమితోదరిచేరుచు
    బాలుండాడంగనుచరవాణిని,నొసగన్
    లాలించిమిఠాయిని కో
    *పాలను విడి యతడు క్షీరపాన మొనర్చెన్*
    [

    కేలున వెన్నముద్ద గొన కేకలు వైచుచు చూసి నంతనే
    బేలగ చూచుచున్ నిలిచె వెన్నుడు తల్లియు కట్ట రోటికిన్
    చాలిక చేష్టలున్ యనుచు చక్కగ చెంతను చేరిచెప్పకో
    పాలను వీడి క్షీరమును బానము చేసె క్షుధార్తి తీరగన్

    రిప్లయితొలగించండి