18, ఫిబ్రవరి 2025, మంగళవారం

సమస్య - 5038

19-2-2025 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆకసమునఁ బూచెఁ గోయు మమ్మ జలజముల్”
(లేదా...)
“ఆకసమందుఁ దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ”

26 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      లోకము లేలెడు లక్ష్మికి
      నాకరములనంగ ప్రీతి నర్చించుటకై
      చేకురె సూర్యోదయమై
      ఆకసమునఁ, బూచెఁ గోయు మమ్మ జలజముల్

      ఉత్పలమాల
      లోకము లేలు నా కమలలోచన లక్ష్మికి ప్రీతిపాత్రమౌ
      నాకరముల్ ప్రసన్నమన నర్చన జేతుము భక్తియుక్తమై,
      వేకువదాటి ప్రాగ్దిశను వేడుకఁ జేయగ వెల్గె భానుడ
      య్యాకసమందుఁ, దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ!

      తొలగించండి
  2. మా కది మేలొనర్చెడివె మౌళి నివాసులు కొల్చుకోవగన్
    ఆ కమలాప్త శోణిమలు అంబుధి కొప్పున కాంతులీనినన్
    ఆకృపచేజనించనగు అంబుజమున్ రమఁ వీక్షసేతుమే
    ఆకసమందుఁ దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ”

    రిప్లయితొలగించండి
  3. ఆకలి రాజ్యమునందున
    చేకొనెతానింద్రజాలచిత్తపువృత్తిన్,
    నీకునునాకనిబలుకుచు
    "నాకసమునఁ బూచెఁ గోయు మమ్మ జలజముల్"
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  4. రాకుండుదయించెను గను
    మాకసమునఁ ,బూచెఁ గోయుమమ్మ జలజముల్
    వ్రేఁకగ సరస్సు నందున,
    శ్రీకరునకు పూజ సేయ సిరులు బడయగన్

    రిప్లయితొలగించండి
  5. చీకటి క్రమ్మగా మిగుల చింతను బొందె సరోజ సంఘముల్
    తాకగ రావు ప్రేమికుని తాప మయూఖ కరమ్ములింకనా
    వేకువ వచ్చుదాక యని విహ్వలమయ్యెను! పద్మ బాంధవుం
    డాకసమందుఁ దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ!!

    రిప్లయితొలగించండి
  6. చీకటి తొల్గిపోవునిక శ్రీహరి పూజకు
    పూలు దేవలెన్
    మేకొను తూర్పు దిక్కునను మేదిని
    బ్రోచెడు కర్మసాక్షియున్
    లోకుల నుద్ధరించ మన లోకము
    వచ్చెను జూడు మల్లదే
    యాకసమందు దోచె, వికచాంబు
    రుహంబులు గోయవే చెలీ!

    రిప్లయితొలగించండి
  7. నాకము గద నీకౌగిలి
    లోకుల సడి గానరాని లోకము మనదే
    నీకన్నుల కలలందున
    నాకసమునఁ బూచెఁ గోయు మమ్మ జలజముల్

    నాకము ప్రాప్తమయ్యెఁగద నాకును నీకును శోభనమ్ముతో
    లోకులు కానరారుగద లోకము తోచెను స్వప్నసీమగా
    మైకము తోడ నెమ్మనము మంజుల గీతములాలపించగా
    నాకసమందుఁ దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ

    రిప్లయితొలగించండి
  8. శ్రీకరముగ నద్రి పొడిచె
    నాకసమునఁ ; బూచెఁ గోయు మమ్మ జలజముల్
    మా కూటము దాఫున గల
    యా కోవెలలోని యజుని యజ్జన నుంచన్

    రిప్లయితొలగించండి
  9. తా కోరెనిలా ప్రభువుయు
    ఆకసమునఁ బూచెఁ గోయు మమ్మ! జలజముల్
    చేకురి దెచ్చిన ముందుగ
    రాకొమరుడు పొంద మనువు రాజ కొమరితన్

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. చీకటి మాసె జూడుమటు చిత్రరథుండరుదెంచె తూర్పునన్
      ప్రాకటమై నభాంగణము భాసిల భవ్య మయూఖ దీప్తి ప
      ద్మాకరమందదే గనుము తత్ప్రతిబింబ నికాశమెన్నగా
      నాకసమందుఁ దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ

      తొలగించండి
  11. ప్రాకట ముగ బుట్టె నినుడు
    నాక స మున :: గోయు మమ్మ జలజముల్
    చేకొని శాంకరి పూజలు
    మేకొని యొ నరింప జరుగు మేలగు శుభ ముల్

    రిప్లయితొలగించండి
  12. -
    పేకాటలోన దక్కెను
    మా కందంబగు జిలేబి మాదిరి సున్నా !
    ఓ కైపదమ్ము చట్టం
    చా కసమునఁ బూచెఁ గోయు మమ్మ జలజముల్


    రిప్లయితొలగించండి
  13. వేకువజామునన్ గగన వీవధమందున నాల్గు దిక్కులన్
    చీకటులెల్ల పర్వులిడ జిష్ణువు వెల్గులు నింపి తూర్పునం
    దాకసమందుఁ దోఁచె, వికచాంబురుహంబులు గోయవే చెలీ
    వ్రేఁకగ బూచె కూమమున, వేగమె పంకజనాభు గొల్వగన్

    రిప్లయితొలగించండి
  14. కం:నాకందవు పున్నాగము
    లాకసమునఁ బూచెఁ, గోయు మమ్మ జలజముల్
    నీ కందు చుండ కొలనున
    నా కమలములున్న జాలు నర్చన జేయన్.
    (పున్నాగ పుష్పాలు బాగా ఎత్తులో ఉంది అందవు.కమలాలు కోసుకో అని.)

    రిప్లయితొలగించండి
  15. ఉ:ఈ కొలనిన్ గనుంగొనగ నెంతయు నింపుగ దోచె,దానిలో
    నే కలుషమ్ము లేక రవియే కనుపించెను,స్వచ్ఛరీతి లో
    నాకస మందుఁ దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ
    ఈ కమలమ్ము లిచ్చుటయె యీశ్వరికిన్ దగు బూజ యయ్యెడిన్
    (స్వచ్చ మైన ఆ కొలని లో ఆకాశమే కనిపిస్తోంది.ఆ స్వచ్ఛజలం లో ఉన్న కమలాలని కోసి ఈశ్వరికి సమర్పించు.)

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. ఉ.మా

      రాకకు వేచివేచి భళి రాతిరి వేకువ యాతడే కలన్
      నాకును గల్గు పీడ యట నాథుకు గల్గున నేనెఱుంగనే
      వేకువ తాపమేమొ నిశి వేదన నింపెనె, యోర్వ జాలనే
      ఆకసమందు దోచె వికచాంబురుహంబులు గోయవే చెలీ"

      (దుష్యంతుని రాకకై వేచిన శకుంతల మనోవేదన)

      తొలగించండి
  17. నాక తలావృత సుర నీ
    రాకరము విమల తరమ్ము నత్యంచిత మ
    స్తోకము మందాకినిలో
    నాకసమునఁ బూచెఁ గోయు మమ్మ జలజముల్


    ఆకస మబ్ధి గాఁగ నసితాంబుద మింపుగ శైవలమ్ము గా
    వీఁక వెలుంగు వెన్నెలయె ఫేనము గా నుఱుముల్ రవమ్ము గాఁ
    బ్రాకటరీతి వెల్గుచును రాతిరి సుందర తార లెల్ల నా
    యాకస మందుఁ దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ

    రిప్లయితొలగించండి
  18. వేకువ నరుదెంచె రవియు
    *నాకసమునఁ, బూచెఁ గోయు మమ్మ జలజముల్*
    నేకమనంబున కొలిచెద
    నాకంజాక్షుని చరణములానందముతో.

    చీకటి ద్రోలగా మదిని చింతన చేయుచు కర్మసాక్షితా
    *నాకసమందుఁ, దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ!*
    చేకొనిభక్తితోడనట శ్రీకరుడౌమురమర్ధనున్ వడి
    న్నేకమనంబుతోడమనమిమ్ముగ కొల్వగ వచ్చుమాధవున్



    రిప్లయితొలగించండి
  19. శ్రీకరుడుజెప్పె గరుడికి
    ఆకసమునఁ బూచెఁ గోయు మమ్మ! జలజముల్
    శ్రీ కరమునందున నొదగ
    వేకువ జామున ధగధగ వేయి ప్రభలతో

    రిప్లయితొలగించండి
  20. పోకిరి వాడిట్లనెనట
    యాకసమునఁ బూచెఁ గోయు మమ్మ జలజముల్
    కాకలు దీరిన యాయమ
    వేకువనే లేచి శుచిని వెదుకన్ దొడగెన్

    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వేకువ నుదయించె నినుడు
    నాకసమున;బూచెఁ గోయుమమ్మ జలజముల్
    శ్రీకంఠుని పాదములకు
    ప్రాకటముగ పూజ సేయ పరితోషముతో.

    రిప్లయితొలగించండి