19, ఫిబ్రవరి 2025, బుధవారం

సమస్య - 5039

20-2-2025 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండువెన్నెలఁ గను మమావాస్య నాఁడు”
(లేదా...)
“అమవసనాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండువెన్నెలన్”

32 కామెంట్‌లు:

  1. చంపకమాల
    తమమున వెల్గులన్ బఱచు తారల బోలు టపాసులన్ గనన్
    భ్రమలవి గల్గవే గగనవాహినిఁ గౌముది నిండినట్లుగన్
    గుమిలెడు లోకులున్ నరకు క్రూరత బాయఁగ జేయఁ గృష్ణుడే
    యమవసనాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండువెన్నెలన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి
      నరకుడస్తమించెననెడు మురియు మాట
      లోకులెరుఁగఁ గృష్ణుఁడొనర్చ, నాకసమున
      వెల్గుల పటాసులుఁ జెలఁగ వేడ్క మీర
      పండువెన్నెలఁ గను మమావాస్య నాఁడు!

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  2. పండుగదిన రేతిరి వేళ ప్రజలు వదలె
    దివెల నుంచిన జువ్వలు దివము పైకి
    దివ్వెల వెలుగు కవిసిన తీరు వలన
    పండువెన్నెలఁ గను మమావాస్య నాఁడు

    రిప్లయితొలగించండి
  3. ప్రియుని రాకకై వేసటఁ రేబవళ్ళు
    ఘడియ యుగముగ నిన్నాళ్ళు గడపినాను
    నేటికరుదెంచె నారాజు నీలవేణి!
    పండువెన్నెలఁ గను మమావాస్య నాఁడు

    రిప్లయితొలగించండి
  4. తమసగుణంబునెన్న నది దౌష్ట్య మహాంధక దుఃఖకారకం
    బమవసనాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండువెన్నెలన్
    విమల విశిష్ట భావనల వెల్గెడు సాత్విక మానసంబులన్
    శమము ననుగ్రహించునన శర్వుడు పూర్ణశుభాంశుడయ్యెడన్

    రిప్లయితొలగించండి
  5. విమలము గాగ దేహమిక వీడు కఫంబును వాక్కులంది వ
    చ్చు మదికి జ్ఞానమబ్బునని చూర్ణముగా చనుబాల గల్పి ని
    త్యము సరి యుగ్గుగా, పెరుగ దార్ఢ్యము పెట్టెను శైశవంబులో
    నమ వస నాఁటి రాత్రి చెలియా! కనుఁగొమ్మదె పండువెన్నెలన్!!


    శైశవంబులోన్ + అమ = శైశవంబులోనమ
    అమ = అమ్మ
    కను + కొమ్ము + అదె = కనుగొమ్మదె
    ( ఓ చెలియా! నా శైశవంబులో మా అమ్మ నా దేహ దార్ఢ్యము పెరగటం కోసము, కఫము రాకుండ ఉండటం కోసము, మాటలు త్వరగా రావటం కోసము, తెలివి తేటలు పెరగటం కోసము రోజూ తన చనుబాలతో వసను కలిపి ఉగ్గుగా అప్పడు ప్రతి రాత్రి పెట్టేది. ఈ పండు వెన్నెలలో చూడు, ఈ వస కొమ్ము అదే!!)

    రిప్లయితొలగించండి
  6. పూర్ణమైన చక్కని యనుభూతి కొరకు
    నిండు పున్నమి రాతిరి నింగిలోని
    పండువెన్నెలఁ గను; మమావాస్య నాఁడు
    సత్పధమ్మున గనరాదు చంద్రకాంతి

    తిమిరపు గహ్వరమ్ము గద తెల్లముగావిట కౌముదీ ప్రభల్
    సమయమిదే కనుంగొనగ చంద్రుని చల్లని వెల్గు నింగిలో
    నమవస కాదుకాదనెద నాగగనమ్మును చూడు కాదుగా
    అమవసనాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండువెన్నెలన్

    రిప్లయితొలగించండి
  7. తే॥ పట్టణమ్ముల నమవస పౌర్ణిమ యను
    భేదమంతరించె చెలియా వెలుఁగుఁ జిమ్మ
    దీప కాంతులు విద్యుత్తు ప్రాపు వలన
    బండు వెన్నెలఁ గనుమమావాస్య నాఁడు

    చం॥ ప్రమిదలు వాడు కాలమునఁ బద్ధతితోడను గ్రమ్మె చీకటుల్
    సమముగ ప్రొద్దుగూకఁగను జక్కగ నేఁడిటు దీపకాంతులన్
    దమమును ద్రుంచఁ గల్గఁగను ధన్యతనొందుచుఁ బట్టణమ్ములో
    నమవసనాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండు వెన్నలన్

    రిప్లయితొలగించండి
  8. శంకరా భరణమునందు శంకరయ్య
    గారి నవధాన మందున ఖ్యాతి కవుల
    సంగమమున పృచ్ఛకులతో సదము నెపుడు
    పండువెన్నెలఁ గను మమావాస్య నాఁడు
    గాని,పున్నమే నే కాల మైన గాని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *గారి యవధాన... ఖ్యాత కవుల... పున్నమే యేకాలమైన...* అనండి.

      తొలగించండి
  9. వలపు పొంగిన చెలికాడు పడుచు జేరి
    మదిని మెదిలేటి భావంపు మాధు రులను
    పంచు కొనువేళ నామె తో పలికె ని ట్లు
    ' పండు వెన్నెల గను మమా వాస్య నాడు "

    రిప్లయితొలగించండి
  10. కమలదళాక్షిరో వినుము గాంచితి నా విభునిన్ని నాళ్ళకున్
    భ్రమలు తొలంగిపోయినవి ప్రాకటమయ్యెను ప్రేమ నాపయిన్
    తిమిరముఁ బారదోలి నవదీప్తులు నింపుచు నెమ్మనంబునం
    దమవసనాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండువెన్నెలన్

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:మంచి చెడు లేవి యెంచక మసలు రీతి
    బిడ్దలకు కుతర్కమ్ము నేర్పితివి ,బుజ్జి
    పండు వెన్నెలఁ గను మమావాస్య నాఁడు”
    మగని కడ కేగుచుండె నో మగడ!కనుము.
    (వెన్నెల అనేది అమ్మాయి పేరు.బుజ్జి పండు అని తల్లి ముద్దుగా అంది.ఓ మగడా! నువ్వు పిల్లల్ని మంచి చెడు చూడని హేతువాదులు గా పెంచావు.అది అమావాస్య నాడే అత్తారింటికి పోతా నంటోంది.)

    రిప్లయితొలగించండి
  12. తిమిరము రాసలీలలకు దివ్యముహూర్తపు ప్రాంతమంచునున్
    యమున తరంగిణీ దరికి యామిని వేళల గోపకాంతలున్
    తమికొని కూడిరెల్లరట తామసమందక నెల్లఱేనితో
    అమవసనాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండువెన్నెలన్

    రిప్లయితొలగించండి
  13. చం:"అమృతము నిచ్చు,వెల్గు నిడు,నద్భుత సత్యము నిచ్చు భారత
    మ్మమిత శుభప్రదాత్రి" యని యాశగ నన్ను గ్రహించి నీదు దే
    శము విడి వచ్చినా
    వు కద!చక్కని దివ్వెల పర్వ మిద్దియే
    అమవసనాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండువెన్నెలన్”
    (అసతో మా సద్గమయ,తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అనే దేశం కోసం నన్ను వివాహం చేసుకొన్నావు.ఈ దీపావళి చూడు.అమావాస్య నాడు వెన్నెల వస్తోంది అని తనను వివాహ మాడిన విదేశీ వనిత తో భర్త అంటున్నట్లు.విదేశీ వనితే ఎందుకు? అంటే స్వదేశీ భార్య ఐతే వీడు చెప్పే అవసరం లేదు కనుక.)

    రిప్లయితొలగించండి
  14. సమరము జేసికృష్ణుడు కుసాల్వుని
    జంపె ప్రజాళి గావగా
    నమిత ముదంబుతో నరకు నంతము
    గాంచియు దేశవాసులున్
    కుమతుడు సచ్చెనంచు శత కోటుల
    దివ్వెలు పెట్టి రంతటన్
    అమవసనాటి రాత్రి, చెలియా గనుగొ
    మ్మదె పండు వెన్నెలన్.

    రిప్లయితొలగించండి
  15. వారి జాయత లోచన చారు తరము
    రాతి రెల్ల విద్యుద్దీప రాశి వెలుఁగు
    చుండ నుద్యాన వన మందు మండితముగఁ
    బండువెన్నెలఁ గను మమావాస్య నాఁడు


    అమరె ధరాతలమ్మున మహాద్భుత దృశ్యము సూచుచుండఁ గాం
    త ముఖము చంద్ర బింబ మయి తద్ద వెలుంగుచు నుండ నమ్మరో
    సముచిత రీతి సుందరి కచమ్ముల కెన్నఁగ సాటి రాఁగ నా
    యమవస నాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండు వెన్నెలన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    జరుప నరక సంహారము సత్యభామ
    జనులు బాధలు తొలగిన సంబరమున
    దివ్వెలను వెలిగించగ దేశమెల్ల
    పండు వెన్నెల గను మమావాస్య నాడు.

    రిప్లయితొలగించండి

  17. జనుల పీడించు నరకుని శౌరి చంప
    నంతు లేని సంబరమున నవని యెల్గ
    దీప కాంతుల తోడను తేజరిల్ల
    పండువెన్నెలగనుమమావాస్యనాడు

    మమతను పంచనెంచుచును మానినులెల్లరు వేచి యుండగా
    యమునయు కౌతుకమ్ముననుయాశగ శౌరిని గాంచుకోర్కెతో
    తమియునుబూనియుండగనుతాండవ కృష్ణుడు నేగుదెంచగన్
    *యమవసనాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండువెన్నెలన్*

    రిప్లయితొలగించండి