27, ఫిబ్రవరి 2025, గురువారం

సమస్య - 5047

28-2-2025 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తరువున వెలుగొందుచుండెఁ దారలు గనుమా”
(లేదా...)
“తరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్”

36 కామెంట్‌లు:

  1. చిరుతడు పుట్టిన దినమని
    నిరతిని వేడుక ఘనముగ నెరపుట కొరకై
    యిరవున నలంకరించిన
    తరువున వెలుగొందుచుండెఁ దారలు గనుమా

    రిప్లయితొలగించండి
  2. కందం
    తిరుమల వాసుని సేవకు
    ధరణికి దిగివచ్చెననఁగఁ దారాపతియే
    మురిసిన వర్ణాటుని చి
    త్తరువున వెలుగొందుచుండెఁ దారలు గనుమా!

    చంపకమాల
    తిరుమల శ్రీనివాసునకు దివ్యరథమ్ముల సేవలెంచుచున్
    ధరణికిఁ జేరవచ్చెఁ గడఁ జంద్రుఁడటంచును భక్తియుక్తుఁడై
    మెరయఁగ తీర్చఁగన్ బ్రతిభ మిన్నగ జూపుచు వర్ణిదైన చి
    త్తరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్!

    రిప్లయితొలగించండి
  3. హరిపదమునందు తారలు
    మెరయుచు కాంతులను జిమ్మ మేదినిపైనన్
    చిరు విద్యుద్దీపములై
    తరువున వెలుగొందుచుండెఁ దారలు గనుమా

    రిప్లయితొలగించండి
  4. స్థిరమగు కాలపు వృక్షము
    భరమగుపత్రములురాల్చివరలెను మోడై,
    వరుసగనడ్డముఁదొలగగ
    తరువున వెలుగొందుచుండెఁ దారలు గనుమా
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  5. కరము ప్రసిద్ధ చిత్రములు క్రన్నన
    గీసిన చిత్రకారునిన్
    తరచుగ గొప్ప వాడనియు తథ్యము
    వల్కుచు నుండిరెల్లరున్
    అరయ మనోహరంబుగ గడద్భుత
    రీతిగ నుండెగాంచ చి
    త్తరువున వెల్గుచుండెనవె తారలు
    మాలికలౌచు వింతగన్.

    రిప్లయితొలగించండి
  6. కం॥ తరగని వెన్నెల నిండిన
    తరుణముఁ దారల యునికియు ధత్రము నందున్
    మరుగున పడు వేళ విరిసి
    తరువున వెలుగొందుచుండెఁ దారలు గనుమా

    చం॥ తరగని పండు వెన్నెలను తారలు నింగిని గోచరించకన్
    మరుగున దాగినట్లు కను మధ్య ఘృతాచిని ముగ్ధ రూపతన్
    విరులటు దీప కాంతులను విచ్చిన శోభలు నించు కొనఁగన్
    దరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్

    ఘృతాచి రాత్రి ధత్రము ఆకాశము

    తారలు అమావాస్య రోజున దివ్యంగాను పౌర్ణిమ రోజున ఉండీ లేనట్లుగా కనపడుతుంటాయండి. సముద్రము మధ్యలో ఇది మరీ అద్భుతంగా ఉంటుందండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చం॥ తరగని పండు వెన్నెలను తారలు నింగిని గోచరించకన్
      మరుగున దాగినట్లు కను మధ్య ఘృతాచిని ముగ్ధ రూపతన్
      విరులటు దీప కాంతులను విచ్చిన శోభలు నిండి యొప్పఁగన్
      దరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్

      శ్రీ కంది శంకరయ్యగారు దోషము సూచించిన పిమ్మట సవరించిన వృత్తము (3వ పాదము చివరి పదమునందలి గణభంగము దిద్దిన పిదప)

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. కరి వరదుని కళ్యాణము
    నిరుపమ రీతిగను జరుప నేరుపు మీరన్
    విరిసిన విధ్యుద్ది వ్వె లు
    తరువున వెలుగొందు చుండె తారలు గనుమా

    రిప్లయితొలగించండి
  8. హరిపదమందు తారకలు హర్షముఁ గూర్చుచు వెల్గుచుండగా
    నిరవుగ దీపమాలికల నింపుగఁ బేర్చిరి మంటపమ్మునన్
    మెరయుచు దీపముల్ మినుకుమిన్కని పెండిలి సంబరమ్మునన్
    తరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్

    రిప్లయితొలగించండి
  9. చెరువుకు సమీపమునగల
    తరువున వెలుగొందుచుండెఁ దారలు గనుమా
    మరిమరి మిణుగురు పుర్వుల్
    మెరయుచు తలపించు చుండె మేఘపథమునే

    విరిసిన పూలకే తగిన వెల్గుల నద్దెడు తోరణంబులన్
    జెరువు సమీపమందు గల చెట్టున గాంచితి రాత్రి వేళలో
    మెరుపులతోడమిణ్గురులు మేలగు దృశ్యము నేర్చి కూర్చగా
    తరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్

    రిప్లయితొలగించండి
  10. కరణము నింటన జరిగెడు
    పరిణయము నిశీథివేళ, వరుసగ విద్యుత్
    మెరుపులచట కల్పించగ
    తరువున వెలుగొందుచుండెఁ దారలు గనుమా

    రిప్లయితొలగించండి
  11. ఇరులను పంచమావసికి త్రిమ్మర గా విరజాజి తోటలో
    విరులవి విచ్చి శోభలను పెంపును చేసె విహార వేళలో
    తరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్”
    మరువము తోడ కట్టినటు మైమరపించెను పూల వాసనల్

    రిప్లయితొలగించండి
  12. విరియగ సంజె కాంతులటు వేకువ జామున పల్లె సీమలో
    తెరలగ లేత మంచు తెర, దీర్చె నవాకృతి ధాత్రి జూడుమా
    కురిసిన మంచు బిందువులు కొమ్మల నాకుల పూల రేకులన్
    తరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్

    రిప్లయితొలగించండి
  13. రావణుడు ఇంద్రజిత్తు జనన సమయమున నక్షత్ర గ్రహ సముదాయాన్ని నిర్దేశించుట:-

    వరమున గర్వమొందగ దివంబును గెల్చెను రావణుండు!కా
    వరమునఁ కోరెనిట్లు గ్రహ వర్గము రిక్కలు చక్కనుండగన్
    పురుడగు వేళకున్ సుతుడు పూర్ణ బలమ్మున జన్మనొందను
    త్తరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్!!

    రిప్లయితొలగించండి
  14. చిరుతడు జన్మ నొందెనని జేయ దలంచిరి
    వేడ్కతోడుతన్
    నిరతిని జుపి యెల్లరును నేర్పుగ దానినొనర్చ
    నెంచగన్
    ఇరవున మాత యందముగ నెంతగనో శ్రమనొంది
    చేయగన్
    తరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్”

    రిప్లయితొలగించండి
  15. కం:శరదిందు కాంతి కలువగ
    గురుతరమౌ కాంతు లొలికి కుసుమయుతములౌ
    ధరణిన్ గల కనకాంబర
    తరువున, వెలుగొందుచుండెఁ దారలు గనుమా”
    (శరత్చంద్రకాంతిని కూడా కలుపుకొని ఆ కాంతులని కనకాంబరం తరువు పై ఒలుకుతూ తారలు ప్రకాశిస్తున్నాయి.)

    రిప్లయితొలగించండి
  16. చం:పురమున చిత్రవిద్యలకు బోషణ నీయ బ్రదర్శనమ్ము న
    చ్చెరు వొనరింప జేసి, రట చెన్నుగ నొక్కని చిత్ర మెంతొ సుం
    దరముగ నుండె జక్కని విధమ్ముగ వర్ణము లున్న యట్టి చి
    త్తరువున వెల్గుచుండె నవె తారలు మాలికలౌచు వింతగన్”

    రిప్లయితొలగించండి
  17. పరమానందము సేకురు
    నరయఁగ నిసిలో సఖ మనసార వెలసి యం
    బరమున రవి చంద్రుల యం
    తరువున వెలుఁగొందుచుండెఁ దారలు గనుమా

    [అంతరువు = తారతమ్యము]


    సురుచిర శారదాగమము శోభ లొసంగును బాండురాంబు దో
    త్కరములు చంద్రికా ధవళ కాంతులు నింగిని నాక్రమింపఁగాఁ
    గర మరుదైన కుట్మల నికాయము రమ్య తరమ్ముగా నభ
    స్తరువున వెల్గుచుండె నవె తారలు మాలిక లౌచు వింతగన్

    రిప్లయితొలగించండి
  18. సమస్య:
    తరువున వెల్గుచుండెనవె తారలు మాలికలౌచు వింతగన్!!

    బిరబిర పర్వులన్ జనిరి పిల్వగ కృష్ణుడు వెన్నెలాటకై
    చరచర చెచ్చరన్ జనగ చంద్రుడు దానుగ తోచె వెల్గులన్
    మరిమరి కోరిరే జతగ మాధవుడాడగ కేళి నవ్వనిన్
    తరువున వెల్గుచుండెనవె తారలు మాలికలౌచు వింతగన్!!
    దరికిని చేర నొక్కొకరి దాపుల నెయ్యముఁజూపి యాడగన్

    రిప్లయితొలగించండి